మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని మున్నంగి గోపిరెడ్డి వీధిలోని నగర ప్రముఖులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు నివాసంలోని భాగంగా నిర్మించిన ‘స్వేచ్ఛ బుద్ధ విహార’ ప్రాంగణంలో 2570వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహాన్ని మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణార్జునరావు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెరుమాళ్లు మాట్లాడుతూ, స్వేచ్చ బుద్ధ విహార ప్రాంగణాన్ని బౌద్ద కార్యక్రమాలతో పాటు ఇతర అన్ని అభ్యుదయ, మానవీయ , సాహితీ, కళ, సంఘ సేవా కార్యక్రమాలకు ఉచితంగా వాడుకోవచ్చని ప్రకటించారు. మంగళగిరి నగరంలో 200 గజాల స్థలంలో బుద్ధుని పేరుతో ఇటువంటి ప్రాంగణం నిర్మించి, ఉచితంగా వాడుకునే అవకాశం కల్పించినందుకు పెరుమాళ్లుని సభకు హాజరైనవారందరూ అభినందించారు. కృష్ణార్జునరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత 25 ఏళ్లుగా బుద్ధపూర్ణిమ వేడుకలు వివిధ ప్రాంతాలలో నిర్వహించామని, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రాంగణంలో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. బుద్ధుడు బోధించిన పంచ శీల.. ఏ జీవికి హాని చేయకూడదు, మత్తు పదార్ధాలకు బానిస కాకూడదు, అనైతిక లైంగిక ప్రవర్తన మంచిదికాదని, అసత్యాన్ని పలకకూడదని, దొంగతనం చేయకూడదన్న విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా మంగళగిరి బుద్ధ విహార పాతికేళ్ల ప్రయాణాన్ని తెలియజేస్తూ కృష్ణార్జున రావు రాసిన ‘ఆయన శ్వాస దమ్మపదం’ పుస్తకాన్ని ప్రముఖ వ్యక్తి వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ఆవిష్కరించారు.
పెరుమాళ్లు- వెంకట లక్ష్మిల పెళ్లి రోజు కావడంతో నగర ప్రముఖులు ఆ దంపతులను శాలువలు, పూల మాలలతో సన్మానించారు. అలాగే, ముఖ్య అతిథిగా హాజరైన మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమితులైన సందర్భంగా అభినందిస్తూ, ఆయన అభిమానులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ప్రముఖ అభ్యుద కవి, మంగళగిరి మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షత వహించిన సభలో తాటిపాముల వెంకటలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయగా, మంగళగిరి మునిసిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు, ప్రముఖ కవి డాక్టర్ రావి రంగారావు, నగర ప్రముఖులు నన్నపనేని నాగేశ్వరరావు, పొట్లాబత్తుని లక్ష్మణరావు, మురుగుడు లక్ష్మీనారాయణ, గంజి రవి, జంగాల సాంబశివరావు, ప్రగడ రాజశేఖర్, మెడిటేషన్ శిక్షకులు ఆకురాతి శంకరరావు, ప్రముఖ న్యాయవాది ఎస్.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
May 6, 2026
స్వేచ్ఛ బుద్ధ విహార ప్రాంగణంలో బుద్ధ విగ్రహం ఆవిష్కరణ
Subscribe to:
Posts (Atom)
స్వేచ్ఛ బుద్ధ విహార ప్రాంగణంలో బుద్ధ విగ్రహం ఆవిష్కరణ
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని మున్నంగి గోపిరెడ్డి వీధిలోని నగర ప్రముఖులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు నివాసంలోని భాగంగా నిర్మించిన ...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...

