Aug 13, 2018


ఆర్థిక వృద్ధికి నూతన పాలసీలు

ప్రణాళికా శాఖ అధికారులకు మంత్రి యనమల ఆదేశాలు
             సచివాలయం, ఆగస్ట్ 13: ఆర్థిక వృద్ధికి నూతల పాలసీలు రూపొందించాలని ప్రణాళికా శాఖ అధికారులను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో సోమవారం ఉదయం ఆయన ప్రణాళికా శాఖ అధికారులతో రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిరేటుపై సమీక్షించారు. స్థిరమైన వృద్ధి రేటు సాధించడం కోసం మీ సూచనలు, సలహాలతో  డెయిరీ, తయారీ రంగాలకు ప్రత్యేక పాలసీలు రూపొందించమని ఆదేశించారు. ఆ తరువాత వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చూపించి ఆమోదం పొందుదామన్నారు.  స్థిరమైన రెండంకెల వృద్ధి రేటుని కొనసాగించడానికి, ఇంకా పెంచడానికి శాఖలవారీగా సమావేశాలు నిర్వహించమని చెప్పారు. అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలను గుర్తించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వమన్నారు. వృద్ధి రేటు పెరగడానికి అవకాశం ఉన్న శాఖలకు కావలసిన నిధులు సమకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రంగాల వారీగా మొదటి త్రైమాసిక  వృద్ధిరేటుని సమీక్షించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా జిల్లాలో పెరిగిన ఆయకట్టుని సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటలు పండించే ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, వరద ముప్పు ఉన్న మండలాల గురించి అధికారులతో మంత్రి యనమల చర్చించారు. ఈ సమావేశంలో ప్రణాళిక శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, ఆర్థిక, గణాంక విభాగం డైరెక్టర్ ఎన్.యోగేశ్వర శాస్త్రి,  సలహాదారు డాక్టర్ డి.దక్షిణామూర్తి, డిప్యూటీ డైరెక్టర్ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...