Aug 20, 2018

సచివాలయంలో సద్భావన దినోత్సవ ప్రతిజ్ఞ 
           సచివాలయం, ఆగస్ట్ 20: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం  సచివాలయంలో సద్భావన దినోత్సవం నిర్వహించారు. 1వ బ్లాక్ లో ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి సాధారణ పరిపాలన సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. సిబ్బంది నిలబడి ‘‘కులం, ప్రాంతం, మతం లేదా భాషతో సంబంధం లేకుండా భారత ప్రజలందరి భావోద్వేగ ఏకత్వం మరియు సామరస్యం కోసం కృషి చేస్తామని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక, హింసకు పాల్పడకుండా చర్చలు మరియు రాజ్యాంగపరమైన మార్గాల ద్వారా మాలో ఉన్న అన్ని విభేదాలను పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.’’ అని ప్రతిజ్ఞ చేశారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...