మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ‘మన మంగళగిరి 2.0’లో మంగళగిరి చరిత్రను సమగ్రంగా రాసినట్లు రచయిత గోవర్థన్ మంగళవారం స్థానిక జర్నలిస్టులకు వివరించారు. స్థానిక విలేకరులకు ఆయన ఈ పుస్తకాన్ని అందజేశారు. మంగళగిరి చరిత్ర అధ్యయనంలో దిట్ట అయిన గోవర్థన్ గతంలో కూడా ‘మన మంగళగిరి’ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈసారి 546 పేజీలతో, మంగళగిరిలోని అన్ని రంగాల సమగ్ర సమాచారంతో దీనిని తీసుకువచ్చారు. ఈ పుస్తకంలోని సమాచార సేకరణ కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వానపల్లి బ్రహ్మనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ కొలికపూడి రూఫస్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు
నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని 1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment