Aug 16, 2018


రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత
వైద్య,ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ శాఖ
 ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
          సచివాలయం, ఆగస్ట్ 16: ప్రభుత్వం రోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య,ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంస్తులోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం ‘రోగి భద్రత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వైద్య రంగానికి చెందిన  దేశంలోని పలువురు ప్రముఖులు ప్రసంగించిన ఈ సదస్సులో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, క్వాలిటీ మేనేజర్లు పాల్గొన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రోగి ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి క్షేమంగా తిరిగి పంపించే వరకు చేయవలసిన పనుల చెక్ లిస్ట్ సూపరింటెండెంట్ల వద్ద, డాక్టర్ల వద్ద ఉండాలన్నారు. రోగి పేరు, వయసు వివరాలు తెలుసుకున్న తరువాత వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, మందుల వాడకం, తిరిగి పంపించేటప్పుడు వారు తీసుకోవలసి జాగ్రత్తలు కుటుంబ సభ్యులకు చెప్పడం వంటివి ఆ చెక్ లిస్ట్ లో ఉండాలన్నారు. అలాగే ఆస్పత్రి పరిసరాలు, రోగులు ఉండే రూమ్ లు, టాయిలెట్స్ శుభ్రత వంటి విషయాలలో జాగ్రత్త వహించాలని చెప్పారు. ఆస్పత్రి నిర్వహణ, ఆస్పత్రి ఫైర్ సేఫ్టీ తదితర అంశాలపై ప్రతినెలాఖరుకు నివేదిక రూపొందించాలని చెప్పారు. ఏడాది మొత్తం డాక్టర్లు ఎంత బాగా విధులు నిర్వహించినా, ఒక్కో ఒకచోట ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల  ఏదైనా పొరపాటు జరిగితే దానికి మీడియావారు ఎక్కువ ప్రచారం ఇస్తారని చెప్పారు. అందువల్ల పొరపాటు సంఘటనలు అసలు జరుగకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ప్రజారోగ్యానికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైద్య రంగానికి పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. వైద్య విద్యార్థులు, అంగన్ వాడీ వర్కర్లు తరచూ గ్రామాలకు, పాఠశాలలకు వెళ్లి ప్రజలకు, విద్యార్థులకు శుభ్రత గురించి ముఖ్యంగా ఏదైనా ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం గురించి తెలియజేయాలన్నారు.
రోగి భద్రతా చర్యల్లో భాగంగా ఏపీ ఈఆర్ ఎక్స్ యాప్ ను ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నట్లు పూనం మాలకొండయ్య చెప్పారు. ప్రస్తుతం దీని ద్వారా యాంటిబయాటిక్స్, టీబీ మందుల వాడకాన్ని నియంత్రచ నున్నట్లు  తెలిపారు. ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని, యాక్టివేట్ చేయడం, వినియోగించే విధానం తెలిపారు. దీనిని వినియోగించడానికి డాక్టర్లకు మూడు నెలల సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత తప్పనిసరి అన్నారు. ఇందులో వైద్యులు, రాష్ట్రంలోని ఫార్మసిస్టులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు.  ఈ యాప్ వైద్యులకు, రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్ రోగి పేరు, సెల్ నెంబర్,  వయసు, వ్యాధి, మందుల పేర్లు, ఎంత మోతాదులో, ఎంతకాలం వాడలో వంటి వివరాలు యాప్ లో నమోదు చేయడం ద్వారా వారికి ఒక కోడ్ ఇస్తారని, ఆ కోడ్ ద్వారా రాష్ట్రంలోని ఏ ఫార్మసిస్ట్ వద్దనైనా మందులు కొనుగోలు చేయవచ్చున్ననారు. డాక్టర్ మందులు రాసిన వెంటనే రోగి సెల్ కు మెసేజ్ వెళుతుందన్నారు.  మందు జనరిక్ పేరుతో పాటు, బ్రాండ్ పేరు రాసే అవకాశం కూడా డాక్టర్ కు ఉంటుందని చెప్పారు. ఫార్మసిస్ట్ ఆన్ లైన్ లో రోగి కోడ్  ఎంటర్ చేయగానే డాక్టర్ రాసిన మందుల వివరాలు కనిపిస్తాయని చెప్పారు. రోగుల భద్రతకు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పూనం మాలకొండయ్య చెప్పారు.

ఏడీ సిరంజిలు ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం
             దేశంలో ఏడీ(ఆటో డిజేబుల్) సిరంజి ద్వారా ఒక ఇంజక్షన్ ఒక సిరంజి పాలసీని ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వాన్ని హెచ్ఎండీ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ హరీంద్ర సింగ్ రత్తి ప్రశంసించారు. ఇంజక్షన్ల ఉపయోగంలో అత్యంత భద్రత పాఠించే రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. అంటువ్యాధులు సోకకుండా  ఇంజక్షన్లు చేయడంలో అత్యంత ఉత్తమైన పద్దుతులు గురించి ఏపీలోని హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వనున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
        వైద్య రంగానికి చెందిన పలువురు నిపుణులు మాట్లాడుతూ రోగుల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, శుభ్రత, వ్యర్థాలు ముఖ్యంగా బయోమెడికల్ వ్యర్థాల తరలింపు, ఆస్పత్రులలో వాష్ ఏరియాలు, నీటి లభ్యత, టాయిలెట్స్ శుభ్రత, చేతులు, పెన్నులు, మొబైల్స్ వంటి వాటి ద్వారా అంటువ్యాధులు సోకడం, ఆస్పత్రులలో అంటువ్యాధి నిరోధక కమిటీలు, యాంటిబయాటిక్స్ వాడకం, దుర్వినియోగం, అతిగా వాడకం,  ప్రిస్క్రిప్షన్ రాసే పద్దతి, జనరిక్ మెడిసిన్, బ్రాండెడ్ మెడిసిన ఆప్షన్, ఇంక్షన్లు చేయడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆస్పత్రి పరిసరాల్లో వాయిస్ పొల్యూషన్, వీల్ చైర్లు, బెడ్లు, బెడ్ షీట్లు, మందుల ఉత్పత్తి దగ్గర నుంచి రోగికి చేరేవరకు మధ్యలో ఉన్న అన్ని దశలు, ఆస్పత్రి సిబ్బంది, లేబరేటరీలు, వ్యర్థాలు పడవేసే పసుపుపచ్చ, ఎరుపు, తెలుపు, బ్లూ రంగుల డస్ట్ బిన్ లు, రోగి సేఫ్టీ కమిటీలు ఏర్పాటు, శిక్షణ, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ స్పష్టత, వైద్యుల పొరపాట్లు, ప్రసూతి మరణాలు, వైద్యం లోపం వల్ల మరణాలు తదితర అన్ని అంశాల గురించి విరించారు. చర్చించారు. ఈ సదస్సులో ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్) సీనియర్ డైరెక్టర్ డాక్టర్ గాయత్రి, ఏఎంటీజడ్(ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ లిమిటెడ్) సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ,  సీనియర్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి, దక్ష్మా హెల్త్ సీఈఓ డాక్టర్ రత్నా దేవి, యునిసిఫ్ ప్రతినిధి డాక్టర్ సంజయ్ ఉపాధ్యాయ, ఎహెచ్ పీఐ (అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా సలహాదారు డాక్టర్ కెకె కల్రా, విశాఖపట్నం కెజీహెచ్ ఓబిజీ(ఆప్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ) శాఖాధిపతి డాక్టర్ పద్మావతి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ వినయ్  తదితరులు ప్రసంగించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...