Oct 3, 2018


ఎంవీవీఎస్ మూర్తి మృతికి మండలి చైర్మన్ ఫరూక్ సంతాపం
              
సచివాలయం, అక్టోబర్ 3: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శాసన మండలి సభ్యులు ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం వార్త తెలిసి శాసనమండలి చైర్మన్  ఎన్ఎండీ ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మూర్తి మంచి విద్యా వేత్త అని, గీతం సంస్థను స్థాపించి ఎంతో మందికి నాణ్యమైన ఉన్నత విద్యను అందించారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాసన మండలిలో ఆయన ప్రజా సమస్యలపైన, ప్రభుత్వ పథకాల  అమలులో లోపాలపై ప్రశ్నలు సంధించేవారని తెలిపారు. ఆ విధంగా ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేశారన్నారు. ఆయన అకాల మృతి విశాఖ వాసులకు, గీతం విద్యా సంస్థలకు, ఏపీ శాసన మండలికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ విషాద ఘటన నుంచి సాధ్యమైనంత త్వరగా కోలుకునే శక్తిని కుటుంబ సభ్యులకు  ప్రసాదించమని దేవుని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నట్లు ఫరూక్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...