Oct 22, 2018

యుద్ధప్రాతిపదికన తుపాను సహాయక చర్యలు

Ø జాతీయ విపత్తుగా ప్రకటించమని కేంద్రాన్ని కోరిన సీఎం
Ø  ప్రభుత్వ సిబ్బంది పనితీరుకు ప్రశంసలు
Ø  విరివిగా విరాళాలు ఇస్తున్న దాతలు
Ø ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం


                  
రాష్ట్ర ప్రభుత్వంముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధప్రాతిపదికన తిత్లీ తుపాను సహాయక చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. మంత్రులుప్రజాప్రతినిధులు,అధికారులుప్రభుత్వ సిబ్బంది దసరా పండుగను కూడా జరుపుకోకుండా నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ తుపాను ఉత్తరాంధ్రను వణికించిముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఇంతటి బీభత్సం ఎన్నడూలేదు. ఈ విధ్వంసం చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది. జిల్లాలో ప్రాణ నష్టంతోపాటు ఆస్తులుపంటపొలాలకు భారీ నష్టం జరిగింది. జిల్లాలోని నదులన్నింటినీ వరద ముంచెత్తింది. కొన్ని గ్రామాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలతోపాటు భారీ వృక్షాలు సైతం కుప్పకూలాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయిపంట పొలాలు తుడిచిపెట్టుకుపోయి జిల్లా ప్రజల జీవితాలు తల్లకిందలయ్యాయి. అనేక గ్రామాల ప్రజలు తింటానికి తిండిలేకతాగడానిక నీరులేక అల్లాడిపోయారు. ఈ పరిస్థితులలో సీఎం చంద్రబాబుఇతర మంత్రులు అక్కడే మకాంవేసి ఆ జిల్లా ప్రజలకు అన్నివిధాల అండగా ఉన్నారు. ప్రతి రోజూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూటెలికాన్షరెన్సులు నిర్వహిస్తూ సహాయక చర్యలు చురుకుగా జరిగేందుకు దోహదపడ్డారు. ఈ తుఫాను వల్ల రూ.3,435.29 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.  2.25 లక్షల కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగింది.  49,112ఇళ్లు దెబ్బతిన్నాయి. 1.65లక్షల హెక్టార్లలో వ్యవసాయం,17,109హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌శాఖకు రూ.505కోట్లురోడ్లురహదారులుభవనాల శాఖ పరిధిలో రూ.406 కోట్లుపంచాయతీరాజ్‌గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.140 కోట్లువ్యవసాయ రంగానికి రూ.802 కోట్లుఉద్యానశాఖ పరిధిలో వెయ్యి కోట్లుపశు సంవర్ధక శాఖకు రూ.50 కోట్లుమత్స్యశాఖ పరిధిలో రూ.50 కోట్లుగ్రామీణ నీటి సరఫరాకు రూ.100 కోట్లు,సాగునీటి శాఖలో రూ.100 కోట్లుఇళ్లు దెబ్బతినడం ద్వారా రూ.220 కోట్లుపౌరసరఫరాల శాఖకు రూ.50 కోట్లువైద్య,ఆరోగ్యశాఖకు రూ.కోటిపట్టణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.9 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి, తక్షణం రూ.1200 కోట్ల సాయం అందించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.
 సహాయక చర్యలపై ప్రజల సంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది.  విద్యుత్ సరఫరా పనుల్లో 10 వేల మంది పనిచేస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి  200 మంది చొప్పున 12జిల్లాల నుంచి సిబ్బంది వచ్చి పని చేస్తున్నారు. మొత్తం 1,802గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, 1,369 గ్రామాలకు విద్యుత్ ఇచ్చారు. మిగిలిన 433 గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్దరించే పనిలో సిబ్బంది ఉన్నారు. వ్యవసాయంపశుసంవర్థకఉద్యానవన,మత్స్య విభాగాలలో జరిగిన నష్టాలను దాదాపు అంచనా వేశారు. గతంలో ఎన్నడూ ఇవ్వనంత త్వరగా పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వ యంత్రాంతం కృషి చేస్తోంది. ఈ నెలాఖరుకే బాధితుల బ్యాంకు ఖాతాలలో  నష్ట పరిహారం  జమ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  ఆర్టీసి బస్ సర్వీసులన్నీ పునరుద్దరించారు. టెలికం కనెక్టివిటీ 99.7 శాతం పూర్తయ్యింది. 1,329 పాఠశాలల్లో 1,59,000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. 47వేల గుడ్లు పంపిణీ చేశాం.  రోజుల్లో 8.47లక్షల మందికి భోజనాలు అందజేశారు. కార్డులతో సంబంధంలేకుండా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.  విద్యుత్ సరఫరా కోసం 232 జనరేటర్లు పనిచేస్తున్నాయి. 184 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని రవాణా చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సురక్షితమైన నీరు అందించడానికి ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు బాగా ఉపయోగ పడుతున్నాయి. 11,700 మంది శానిటరీ సిబ్బంది బ్లీచింగ్క్లోరినేషన్,ఫాగింగ్ పనులు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 248 ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.700 మంది రోగులకు చికిత్స అందించారు. ముఖ్యంగా అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు.  జిల్లాలోని పాఠశాలలన్నింటిలోని విద్యార్థులకు వైద్య పరిక్షలు చేయడానికి ఏర్పాటు చేశారు.  చెట్ల తొలగింపునకు క్రేన్లను,  1,000 విద్యుత్ రంపాలను తెప్పించారు. రోడ్లపైనపొలాల్లో చెట్ల తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 34 ఫైర్ సర్వీసెస్ బృందాలు, 24ఎస్ డిఆర్ ఎఫ్ బృందాలు ఈ పనుల్లో నిమగ్నమయ్యాయి. పొలాలలో కూలిపోయిన చెట్లను తొలగించే పనులను  గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసింది.  ప్రస్తుతానికి చాలా వరకు సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయి.

 మానవతా దృక్పదంతో దాతలు అనేకమంది ముందుకు వస్తున్నారు. కోట్ల రూపాయల విరాళాలు అందజేస్తున్నారు. స్మార్ట్ ఏపి ఫౌండేషన్సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇస్తున్నారు. దీనిని దృష్టిలోపెట్టుకుని  ప్రభుత్వం తుపాను బాధితుల కోసం విరాళాల సేకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.apcmrf.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి ఆన్ లైన్ లో దాతలు  విరాళం చెల్లించిన వెంటనే దాతల పేరుతో సీఎం సంతకమున్న ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. దేశ విదేశాల నుంచి ప్రజలు నేరుగా విరాళాలు పంపేందుకు వీలుగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొందరు గ్రామాలను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.  తిత్లీ ఉద్దానం రికనస్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్ (తూర్పు)కు స్పందన బాగా వుంది. ప్రభుత్వ సిబ్బంది దసరా ఉత్సవాలు కూడా చేసుకోకుండాకుటుంబసభ్యులకు దూరంగా పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. వారి స్ఫూర్తిని దెబ్బతీసేలా గొడవలు చేయవద్దనిసహాయ చర్యలకు ఆటంకాలు కల్పించవద్దనిచేతనైతే తలా ఓ చేయివేసి సహాయక చర్యల్లో  భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...