Oct 5, 2018


మంత్రిమండలి సమావేశం-05.10.2018

             సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులో శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు తెలిపారు.
మంత్రి మండలి ముఖ్య నిర్ణయాలు:
v రాష్ట్రంలో ఇళ్లు పండగ
         2019-2020 సంవత్సరానికి  ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద నరేగా నిధులతో 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం.
         ఎస్‌సీ, ఎస్టీలకు ఒక్కో ఇంటికి రూ.2 లక్షల చొప్పున, మిగిలిన వర్గాలకు రూ. లక్షన్నర చొప్పున యూనిట్ కాస్ట్ నిర్ణయం.
         అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కింద ఉన్న గ్రామీణ ప్రాంతాలలో PMAY ఎన్టీఆర్ అర్బన్ పథకాల కింద యూనిట్ కాస్ట్ రూ.2.5 లక్షలతో 35,822 ఇళ్ల  మంజూరు.
v కరవు మండలాలు:
         రాష్ట్రంలో తాజా కరవు పరిస్థితులను అధ్యయనం చేసి కొత్తగా కరవు మండలాలను చేర్చే అంశంపై చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయం.
v చేనేత కుటుంబాలకు వర్షాకాలంలో నెలకు రూ.2వేలు చొప్పున రెండు నెలల పాటు సాయం:
         వర్షాకాలంలో రెండు నెలల పాటు నెలకు రూ.2 వేల చొప్పున చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని మంత్రిమండలి నిర్ణయం. దీని వల్ల రాష్ట్రంలో 90,765 చేనేత కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో వీరి జనాభా 2,18,029గా వుంది.
         ఆప్కో వ్యాపారాభివృద్ధికి వీలుగా రూ.150 కోట్ల మార్జిన్ మనీ సహాయం మంజూరుకు ప్రభుత్వం గ్యారంటీగా వుండేందుకు మంత్రిమండలి అంగీకారం. దీనిలో ఎన్టీడీసీ ఆప్కోకి రూ.30 కోట్ల సబ్సిడీ ఉంటుంది.
v చక్కెర కర్మాగారాలు:
         రాష్ట్రంలోని కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీల పనితీరును పరిశీలించిన తర్వాతే ప్రభుత్వ సాయం అందించే విషయాన్ని పరిశీలించాలని మంత్రిమండలి నిర్ణయం. మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తరువాత తగిన నిర్ణయం తీసుకుంటారు.
v ఇండస్ర్టియల్ టౌన్‌షిప్‌లు:
         రాష్ట్రంలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందో, ఎక్కడ ఎంత అవసరం ఉందో పరిశీలించాలని మంత్రిమండలి అభిప్రాయపడింది.
         హౌసింగ్, పరిశ్రమల శాఖల అధికారులు, పరిశ్రమల యజమానులు సమావేశమై ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.
v వైరల్ ఫీవర్లపై చర్చ : 
         రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు, స్వైన్ ఫ్లూ, డెంగీ నియంత్రణ చర్యలు ఏం తీసుకున్నారు, ఏమైనా మరణాలు నమోదయ్యాయా.. అనే అంశాలపై మంత్రిమండలిలో చర్చ.
         25 వేల స్థాయి వరకు ప్లేట్‌లెట్లు పడిపోయినా ప్రమాదం లేదు, కానీ 40 వేల ప్లేట్లు ఉన్నా ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాధిగ్రస్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లాలి.
         ప్లేట్‌లెట్లు పడిపోయాయని రోగులతో అనవసరంగా ఖర్చు చేయిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ ఉండాలి. వైరల్ ఫీవర్లు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయనే దానిపై అధ్యయనం జరగాలి. శానిటేషన్, దోమల నియంత్రణ, మురుగునీటి పారుదల వ్యవస్థ, మంచినీటి సరఫరాపై దృష్టిపెట్టాలి
v ఆర్టీసీకి రుణం :
         రూ. 500 కోట్ల రుణాన్ని 8.25% వడ్డీ కింద పొందేందుకు ఏపీఎస్ఆర్టీసీకి అనుమతి మంజూరుచేసిన మంత్రిమండలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రుణం పొందేందుకు ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం హామీగా వ్యవహరించనుంది.
v CRDAకు రుణం :
         CRDAకు రూ. 10 వేల కోట్లు రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీగా ఉండాలని మంత్రిమండలి నిర్ణయం. వాణిజ్య బ్యాంకుల నుంచి ఈ రూ. 10 వేల కోట్లు పొందేందుకు సీఆర్‌డీఏకు వీలు కలుగుతుంది.
v గండికోట రిజర్వాయర్ పునరావాసం :
         గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణంతో కొండాపురం మండలం, కొండాపురం గ్రామంలో నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం కింద రూ. 146.295 కోట్లు మంజూరు. మంజూరైన మొత్తంలో మిగిలిన సొమ్ము  రూ. 52.68 కోట్ల వినియోగానికి మంత్రిమండలి ఆమోదం.
v సాగునీటి కాల్వలపై విద్యుత్ ప్లాంట్లు :
         రాష్ట్రంలోని అన్ని సాగునీటి కాలువలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లను పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసి అదే విద్యుత్‌ను ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకునేలా కార్యచరణ చేపట్టాలని మంత్రిమండలి సూచన. జల వనరుల శాఖ తమకు కావాల్సిన విద్యుత్‌ను తామే ఉత్పత్తి చేసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశం.
         HNSS ప్రాజెక్టు ఫేజ్ 1 స్టేజ్ 1లో ఎలక్ట్రో మెకానికల్ ప్యాకేజ్‌కు సంబంధించిన 7.07 అడిషనల్ పవర్ అవసరాల నిమిత్తం అదనపు వ్యయం రూ.18.47 కోట్లను SLSC, IBM జాయింటు కమిటీ సిఫారసుల మేరకు పరిపాలనపరమైన మంజూరు చేస్తూ మంత్రిమండలి తీర్మానం.
         HNSS ప్రాజెక్టు ఫేజ్ 2 కింద చేపట్టిన కొన్ని పనులను టెండర్ విధానంలో కొత్త ఏజెన్సీలకు అప్పగిస్తూ ఛీఫ్ ఇంజనీర్ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ మంత్రిమండలి నిర్ణయం.
v ఉద్యోగులకు బస్ పాసుల కొనసాగింపు:
         ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న బస్ పాస్ సదుపాయం కొనసాగింపునకు మంత్రిమండలి నిర్ణయించింది. 
         ప్రస్తుతం రూ.14860-39540 (ఆర్.పి.ఎస్ 2010) పే స్కేలు పొందుతున్న ఉద్యోగులకు ఇస్తున్న బస్ పాస్ సదుపాయాన్ని ఇకపై రూ.28940-78910 (ఆర్.పి.ఎస్) పేస్కేలు ప్రకారం వేతనం పొందుతున్న ఉద్యోగులకు కూడా బస్ పాస్ సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర.

v నియామకాలు :
         సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 12 జూ

v నియర్ కళాశాలల్లో  192 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం. కొత్తగా ఏర్పాటు చేసిన 12 జూనియర్ కళాశాలలకు సంబంధించి పోస్టుల అప్‌గ్రెడేషన్, కొత్తగా టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి. మిగిలిన సర్వీసులు ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వాలి.
         సీసీఎల్ఏ, స్పెషల్ సీఎస్ దగ్గర 90 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం. దీంట్లో తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారు 18 పోస్టులు వున్నాయి. కింది స్థాయిలో మిగిలిన పోస్టులను అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీచేయాలని నిర్ణయం.
         విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో ముఖ్యమైన పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం. తిరుపతి నమూనాలో అవుట్ సోర్సింగ్ నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం.
         కర్నూలు, అనంతపురం పరధిలో వేకెన్సీ రిజర్వులో ఉన్న 5 ఇన్‌స్పెక్టర్ పోస్టులను రద్దు చేసి 4 ఇన్ స్పెక్టర్ సూపర్ న్యుమరీ పోస్టుల మంజూరు.
         అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఖాళీగా ఉన్న 5 సీనియర్ అసిస్టెంట్ పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో 3 పోస్టుల మంజూరు. పోలీస్ డిపార్టుమెంట్లో ఇకపై జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్ల వ్యవస్థకు ప్రాధాన్యం తగ్గించి కంప్యూటరీకరణకు తగ్గట్టుగా పోస్టులు ఉండాలని సూచన.
         హోం విభాగంలో  ఖాళీగా ఉన్న 103 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను రద్దు చేసి కొత్తగా 58 పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం.
         సాధారణ పరిపాలన విభాగంలో ప్రస్తుతం బయోమెట్రిక్ అటెండెన్స్ నోడల్ అథారిటీ కోసం ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి మంత్రిమండలి ఆమోదం. ఇదే సమయంలో ఖాళీగా ఉన్న 15 కార్యాలయ సహాయకుల పోస్టులు, 15 చౌకీదారు పోస్టులను రద్దు ప్రతిపాదనకు మంత్రిమండలి  ఆమోదం.
         విశాఖ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఒక లైబ్రేరియన్ పోస్టు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం.
         విజయవాడలో షేక్‌రాజా మున్సిపల్ హాస్పటల్‌లో 13 పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం. మిగిలిన పోస్టులు అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం. నర్సింగ్ సేవలు ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సూచన.
         డా. వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రీసెర్చ్ సెంటరులో (చిత్తూరు) పరిధిలో 5 సైంటిస్టు పోస్టులను  మంజూరు చేసిన  మంత్రిమండలి.   సీనియర్ సైంటిస్ట్ (ఉద్యాన విభాగం),  సైంటిస్ట్ (ప్లాంట్ బ్రీడింగ్), సైంటిస్ట్-ప్లాంట్ పాథాలజీ, సైంటిస్ట్ (ఎంటమాలజీ), సైంటిస్ట్ (ఫిజియాలజీ) పోస్టులను మంజూరుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం.
         అనంతపురం డా. వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిసెర్చ్ సెంటరులో 6 అదనపు తాత్కాలిక పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం. రెగ్యులర్ ప్రాతిపదిక మీద సైంటిస్టు (ప్లాంట్ బ్రీడింగ్)-1, సైంటిస్టు (ఎంటమాలజీ)-1, సైంటిస్టు (ప్లాంగ్ ఫిజియాలజీ)-1, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్-1 పోస్టుల మంజూరుకు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఒక ఆఫీసు అసిస్టెంట్ పోస్టు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం.
         తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డాక్టర్ పోస్టులు 3, నర్సింగ్ స్టాఫ్ 5 చొప్పున మొత్తం 8పోస్టుల మంజూరు. మిగిలిన 7 పోస్టులు సర్వీస్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం.
         MPEO పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోని ఐటీడీఏల కోసం అదనంగా ఈ పోస్టుల భర్తీ.
         TTD ఆధ్వర్యంలోని BIRD హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్‌లో 4 థియేటర్ అసిస్టెంటు పోస్టుల కల్పన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. 
         TTD అక్కౌంట్స్ విభాగంలో 3 సూపరింటెండెంట్ పోస్టులు కల్పించే టీటీడీ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర.
         శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల గిరిజన మండలాల్లో 371 మంది అడిషనల్ మల్టీపర్పస్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (MPEOs) నియామక ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
v భూ కేటాయింపులు:
         తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో ప్రముఖ విద్యా, వైద్య సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహకంగా మార్కెట్ ధర కన్నా తక్కువకు భూమి ఇవ్వాలని భావించిన మంత్రిమండలి. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి నగరాలు ఎడ్యుకేషన్ హబ్‌లుగా తయారవ్వాలని, దీనికోసం కార్యచరణ ప్రత్యేకంగా రూపొందించాలని ముఖ్యమంత్రి సూచన. ఎంత అవసరమో అంతే భూమి ఇవ్వాలి, అవసరానికి మించి ఇవ్వకూడదని మంత్రిమండలి నిర్ణయం.
         ట్రైమాగ్ అలాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కడప జిల్లాలోని కొప్పర్తిలో 100 ఎకరాలు భూమిని ఒక్కో ఎకరం రూ. 15,98,565 చొప్పున కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయం.
         మెగ్నీషియం ఇంగాట్స్, అలాయ్స్, ఫెర్రో సిలికాన్ పరిశ్రమ ఏర్పాటు కోసం భూమి కేటాయింపు.

         ప్రకాశం జిల్లా కనిగిరిలోని మాగుంట రాఘవ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న మహిళా జూనియర్ కళాశాలకు 30 సంవత్సరాల నామమాత్రపు లీజుకు కనిగిరి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ భూమిని ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం. 919.58 చదరపు గజాల స్థలాన్ని మార్కెట్ విలువలో ఏడాది రూ. లక్షకే లీజు మొత్తంగా చెల్లించే ప్రాతిపదికన 30 సంవత్సరాల పాటు కేటాయింపు.

         అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో  రైల్వే సైడింగ్ లో-ట్రక్ టెర్మినల్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా 56.18 ఎకరాల కేటాయింపు.
         పొట్టి శ్రీరాములు జిల్లా అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక సాల్ట్ వర్కర్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీకి 5.64 ఎకరాల ఉప్పు పర్ర (పోరంబోకు) భూమి 25 ఏళ్ల పాటు లీజు. ఏడాదికి ఎకరాకు రూ.3,864 అద్దె ప్రాతిపదికన కేటాయింపు.
         పొట్టి శ్రీరాములు జిల్లా అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామంలో 12.39 ఎకరాల ఉప్పుపర్ర భూమి (పోరంబోకు) మనుదీప్ సాల్ట్ వర్కర్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కు 25 ఏళ్ల పాటు లీజు. ఏడాదికి ఎకరాకు రూ.3,864 అద్దె ప్రాతిపదికన కేటాయింపు.
         పొట్టి శ్రీరాములు జిల్లా అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామం.. 38.28  ఎకరాల ఉప్పుపర్ర భూమి (పోరంబోకు) గంగాభవాని సాల్ట్ వర్కర్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు 25 ఏళ్ల పాటు లీజు. ఏడాదికి ఎకరాకు రూ.3,864 అద్దె ప్రాతిపదికన కేటాయింపు.
         పొట్టి శ్రీరాములు జిల్లా అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామం.. 43.99  ఎకరాల ఉప్పుపర్ర భూమి (పోరంబోకు) శ్రీ వీరబ్రహ్మేంద్ర సాల్ట్ వర్కర్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కు 25 ఏళ్ల పాటు లీజు. ఏడాదికి ఎకరాకు రూ.3,864 అద్దె ప్రాతిపదికన కేటాయింపు.
         గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామంలో 207.07 ఎకరాల భూమి MSME Industrial పార్కు ఏర్పాటుకు ఉచితంగా కేటాయింపు.
         చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మమందూరు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు  21.15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు.
         చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సాతుగ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ట్రియల్ పార్క్ కోసం కేటాయింపు.
         మచిలీపట్నం  పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు మచిలీపట్నం మండలంలో 7072.96 ఎకరాల ప్రభుత్వ భూమిని ముందస్తుగా మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి అప్పగించేందుకు మంత్రివర్గం నిర్ణయం. ‌
         అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుంతకల్లు గ్రామంలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద టిడ్కోకు 40.89 ఎకరాల అప్పగింత. మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ.14,00,000 చెల్లించే షరతుపై ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
         విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో ఇండస్ట్రియల్ టెక్నాలజీ పార్కు నిర్మాణానికి షరతులకు లోబడి ఉచితంగా 1340.50 ఎకరాల కేటాయింపు.
v అయిదుగురు ఖైదీలు విడుదలకు ఆమోదం :
         మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని కారాగారాల్లో  సత్ప్రవర్తన కలిగిన ఐదుగురు ఖైదీల విడుదలకు మంత్రిమండలి ఆమోదం.
v ఐసీడీఎస్ :
         ఐసీడీఎస్ పథకంలో భాగంగా టేక్ హోమ్ రేషన్లో భాగంగా  రెడీ టు ఈట్ ఫుడ్ (RTE)  తయారీకి గాను ఒక కర్మాగారం ఏర్పాటు.  టాటా ట్రస్టుకు అనుబంధంగా ఉన్న ఇండియన్ న్యూట్రిషన్ ఇనీషియేటివ్ (TINI)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ఒప్పందం  కుదుర్చుకునేందుకు W.D.C.W ప్రత్యేక కమిషనర్‌కు అనుమతిస్తూ మంత్రిమండలి ఆమోదం.
         రాష్ట్రంలోని 13 జిల్లాలలో జాతీయ పోషకాహార మిషన్ ఆధ్వర్యంలో మేకిట్ హ్యాపెన్కార్యక్రమం అమలుకు ఇండియన్ న్యూట్రిషన్ ఇనీషియేటివ్ (TINI)తో కలసి పనిచేసేందుకు టాటాట్రస్టుతో ఒప్పందానికి W.D.C.W ప్రత్యేక కమిషనర్‌కు అనుమతిస్తూ మంత్రిమండలి ఆమోదం.
v ఆదరణ II :
         ఆదరణ-2 పథకం కింద వెనుకబడిన వర్గాలకు అధునాతన వృత్తి పరికరాల కొనుగోలులో కేటలాగ్ బేసిస్ రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్, పారలల్ రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ అనుసరించాలన్న ప్రతిపాదన ర్యాటిఫికేషనుకు కేబినెట్ ఆమోదం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...