Oct 11, 2018


నేడు సమాచార కమిషనర్ల ప్రమాణస్వీకారం
                
             సచివాలయం, అక్టోబర్ 11: సచివాలయం 1వ బ్లాక్ లోని గ్రీవెన్స్ హాల్ లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ముగ్గురు రాష్ట్ర సమాచార కమిషనర్లు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారిచేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ ప్రమాణం చేయిస్తారని పేర్కొన్నారు. ఎం.రవి కుమార్ ఐఎఫ్ఎస్(రిటైర్డ్), బివి రమణ కుమార్ ఐపీఎస్(రిటైర్డ్), కట్టా జనార్ధన రావులను ప్రభుత్వం సమాచార కమిషనర్లుగా నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ ఇన్ ఛార్జిగా ఎం.రవి కుమార్ ఐఎఫ్ఎస్(రిటైర్డ్) వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...