Oct 15, 2018


అమరావతిలో మోడరన్ మిలటరీ స్టేషన్

సీఎస్ పునీఠతో చర్చించిన మేజర్ జనరల్ శ్రీనివాసరావు
                
           సచివాలయం, అక్టోబర్ 15: అమరావతిలో ఆంధ్ర సబ్ ఏరియా కమాండ్ రాష్ట్ర కేంద్ర కార్యాలయం మోడరన్ మిలటరీ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ  విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠతో ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాస రావు చర్చించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంస్తులోని సీఎస్ చాంబర్ లో సోమవారం సాయంత్రం  మేజర్ జనరల్ సీఎస్ ను కలిశారు.  అమరావతిలో మోడరన్ మిలటరీ స్టేషన్ ఏర్పాటు, దాని విధి విధానాలు, ఎక్స్ సర్వీస్ మెన్ సమస్యలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మిలటరీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం, ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి అమరావతిలో పది ఎకరాల భూమి కేటాయించాలని మేజర్ జనరల్ శ్రీనివాస రావు సీఎస్ పునీఠని కోరారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...