Jun 8, 2019


నిరాడంబరంగా మంత్రి మండలి ప్రమాణస్వీకారం
25 మంది మంత్రుల ప్రమాణస్వీకారం

          సచివాలయం, జూన్ 8: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.  సచివాలయం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన శనివారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్  25 మంది చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఉదయం 11.49 నిమిషాలకు ప్రారంభమైన ప్రమాణస్వీకారోత్సవం మధ్యాహ్నం 12.40 వరకు జరిగింది. ముందుగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి వేదికపై ఆసీనులయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం గవర్నర్ అనుమతితో ఒక్కొక్కరిని ఆహ్వానించగా గవర్నర్ వారిచేత పదవీ ప్రమాణస్వీకారం, రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ధర్మాన కృష్ణ దాస్, తరువాత వరుసగా బొత్సా సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, ముత్తంశెట్టి శ్రీనివాస రావు(అవంతి శ్రీనివాస్), కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), చెరుకువాడ శ్రీరంగనాథ్, తానేటి వనిత, కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని), పేర్ని వెంకటరామయ్య(నాని), వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణారావు, బాలినేని శ్రీనివాసరెడ్డి(వాసు), ఆదిమూలపు సురేష్, పోలుబోయిన అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణ స్వామి, బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరామ్, ఎస్.బి.అంజద్ బాషా, మలగొండ్ల శంకర నారాయణ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రికి అభివాదం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు అందరూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆదిమూలం సురేష్, మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా, మిగిలినవారు తెలుగులో చేశారు. వారంతా ప్రమాణస్వీకారం చేసే సమయంలో  ఆయా నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు.
ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, సాదారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  మంత్రుల కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, సచివాలయ సిబ్బంది, రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల జాబితా
1.ధర్మాన కృష్ణ దాస్
2.బొత్సా సత్యనారాయణ
3. పాముల పుష్ప శ్రీవాణి
4.ముత్తంశెట్టి శ్రీనివాస రావు(అవంతి శ్రీనివాస్)
5.కురసాల కన్నబాబు
6.పిల్లి సుభాష్ చంద్రబోస్
7.పినిపే విశ్వరూప్
8.ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)
9.చెరుకువాడ శ్రీరంగనాథ్
10.తానేటి వనిత
11.కొడాలి శ్రీవెంకటేశ్వర రావు(నాని)
12.పేర్ని వెంకటరామయ్య(నాని)
13.వెల్లంపల్లి శ్రీనివాసరావు
14.మేకతోటి సుచరిత
15.మోపిదేవి వెంకటరమణారావు
16.బాలినేని శ్రీనివాసరెడ్డి(వాసు)
17.ఆదిమూలపు సురేష్
18.పోలుబోయిన అనిల్ కుమార్
19.మేకపాటి గౌతమ్ రెడ్డి
20.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
21.కె.నారాయణ స్వామి
22.బుగ్గన రాజేంద్రనాథ్
23.గుమ్మనూరు జయరామ్
24.ఎస్.బి.అంజద్ బాషా
25.మలగొండ్ల శంకర నారాయణ

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...