Jun 13, 2019


రాష్ట్ర ప్రతిష్ట పెరిగేలా పని చేస్తా
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

          సచివాలయం, జూన్ 13: రాష్ట్ర ప్రతిష్ట పెరిగేలా పని చేస్తానని గనులు, భూగర్భ వనరులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్  పెద్దిరెడ్డిగారి రామచంద్రా రెడ్డి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో గురువారం ఉదయం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి పేరు నిలిపే విధంగా వ్యవహరిస్తానన్నారు. తొలుత కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రికి వేద పండితులు బ్లాక్ ద్వారం వద్ద వేద మంత్రాలతో స్వాగతం పలికారు. మొదటి అంతస్తులోని మంత్రి ఛాంబర్ లోనికి  తీసుకువెళ్లి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మైనింగ్ లీజ్ రెన్యూవల్ కు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ, ఎంపీలు మిధున్ రెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి,  ఎం. నవాజ్ బాషా, పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఎన్.వెంకయ్య గౌడ్, బియ్యపు మధుసూధన రెడ్డి, గనుల శాఖ కార్యదర్శి ఐ.శ్రీనివాస శ్రీనరేష్, సంబంధిత శాఖల అధికారులు, రాయలసీమ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...