Jun 11, 2019


ఇసుక తవ్వకాలు, రవాణాపై 15 రోజుల నిషేధం
గనులు, భూగర్భ వనరులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

Ø మైనింగ్ స్మగ్లింగ్ నిషేధానికి చర్యలు
Ø నిషేధాన్ని అతిక్రమిస్తే పీడీ యాక్ట్ ప్రయోగం
Ø ఇసుక రవాణా జరిగితే జిల్లా అధికారులే బాధ్యులు
Ø 15 రోజుల తరువాత నూతన ఇసుక పాలసీ

           సచివాలయం, జూన్ 11: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై 15 రోజులు నిషేధం విధించినట్లు గనులు, భూగర్భ వనరులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. సచివాలయం 2వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం 15 రోజులలో నూతన మైనింగ్ పాలసీని తీసుకువస్తుందన్నారు. అప్పటి వరకు కాస్త ఓపికపట్టాలన్నారు.   రాష్ట్రంలో అక్రమ మైనింగ్, ఇసుక స్మగ్లింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆదాయంలో 20 నుంచి 25 శాతం మైనింగ్ ద్వారానే వస్తుందని చెప్పారు. మైనింగ్ లో అక్రమాలు అన్నీ అరికట్టి ప్రభుత్వం ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నూతన పాలసీని రూపొందించే వరకు ఎక్కడైనా ఇసుక తవ్వకాలు జరిగినా, రవాణా జరిగినా ఆయా జిల్లా అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించి ఎవరైనా తవ్వకాలు జరిపితే పీడీ యాక్ట్ ప్రయోగించి వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. మన అధికారులు ఇతర రాష్ట్రాలలోని మైనింగ్ పాలసీలను అధ్యయనం చేస్తున్నారని, ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగకరమైన ఉత్తమ పాలసీని రూపొందిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి ఐ.శ్రీనివాస శ్రీనరేష్ కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...