Jun 13, 2019


 బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్
మంత్రి బొత్స సత్యనారాయణ


          సచివాలయం, జూన్ 13: బీసీ గర్జన సభలో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మున్సిపల్,  పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స  సత్యనారాయణ చెప్పారు. అందులో భాగంగానే తమ్మినేని సీతారామ్ కు శాసనసభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. మంత్రివర్గ కూర్పులోనే కాకుండా స్పీకర్ ఎంపికలో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ  బలహీన వర్గాలవారికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. శాసనసభ స్పీకర్ ఎంపికలో ఆయన చూపిన చొరవ, తీసుకున్న నిర్ణయానికి బలహీనవర్గాల తరపున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  స్పీకర్ కు  ధన్యవాదాల తీర్మానం సందర్భంగా సభలో అందరూ హుందాగా ప్రవర్తించారన్నారు.

          ఫిరాయింపులకు అవకాశం లేకుండా శాసనసభ  రాజ్యాంగ బద్దంగా,  చట్ట బద్దంగా,  సంప్రదాయబద్దంగా జరగాలని సీఎం కోరుకోవడం  చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోందని చెప్పారు. శాసనసభ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో కాకుండా ప్రజాస్వామ్యానికి  విలువనిస్తూ,  రాజ్యాంగంపై విశ్వసనీయత నిలిపే విధంగా నడుస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు.  ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని హర్షిస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...