Jun 13, 2019


దేశం మనకిచ్చిన గొప్ప వరం సంస్కృతి
మంత్రి అవంతి శ్రీనివాస్
            సచివాలయం, జూన్ 13: దేశం మనకిచ్చిన గొప్ప వరం సంస్కృతి, సంప్రదాయాలని, వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో గురువారం ఉదయం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు, పురావస్తు,మ్యూజియంలు, పర్యాటక రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తొలుత కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రికి వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ అండ్ మాన్యుమెంట్స్  కార్పోరేషన్ లిమిటెడ్  ఫైల్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్, పురావస్తు శాఖ,  మ్యూజియంల కమిషనర్ డాక్టర్ జీ.వాణిమోహన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...