Jun 13, 2019

13.06.2019 అసెంబ్లీ మీడియా పాయింట్



మంత్రి బొత్స సత్యనారాయణ
శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం గారిని ఎన్నుకోవడం లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న  నిర్ణయం, చొరవ, బీసీ గర్జనలో చెప్పిన ప్రకారం బడుగుబలహీన వర్గాలను మంచి అవకాశాలు ఇచ్చారు.
మంత్రివర్గ కూర్పులోనే కాకుండా స్పీకర్ ఎంపికలో కూడా బలహీన వర్గాలవారికి ప్రాధాన్యం ఇచ్చారు.
అందుకు బడుగుబలహీన వర్గాల తరుపున ముఖ్యమంత్రి గారుకి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ఈరోజు స్పీకర్ గారి ధన్యవాదాల తీర్మానం కార్యక్రమంలో చిన్న చిన్న సంఘటనలు మినహా ఈరోజు సభలో అందరూ హుందాగా ప్రవర్తించారు.
ఫిరాయింపులకు అవకాశం లేకుండా రాజ్యాంగ బద్దంగా, చట్ట బద్దంగా, సంప్రదాయబద్దంగా జరగాలని కోరుకోవడం ముఖ్యమంత్రి గారికి  ప్రజాస్వామ్యం పై ఉన్న విలువలు తెలియచేస్తుంది.
శాసనసభ అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో కాకుండా ప్రజాస్వామ్యానికి  విలువనిస్తూ, రాజ్యాంగం పట్ల విశ్వసనీయత నిలిపే విధంగా సభ నడుస్తుంది అణా నమ్మకం ఏర్పడినది.
ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని హర్షిస్తున్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...