Jun 14, 2019

14.06.2019 అసెంబ్లీ మీడియా పాయింట్



మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ

గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి రాబోయ 5 సంవత్సరాల లో ప్రభుత్వం ఏమి చేస్తుందో చెప్పారు..
జగన్ గారు ఎన్నిక హామీ మేరకు గవర్నర్ గారు ప్రసంగం లో ప్రస్తావించారు..
ఎన్నికల ప్రణాళికలు ఒక పవిత్ర గ్రంధం ఖురాన్ ,బైబిల్ భగవద్గీత
అభివృద్ధి ,సంక్షేమం ,అవినీతి రహిత పాలన అందిస్తాం..
జ్యూడిషియల్ కమిటీ ఏర్పాటు చేసి దేశానికే ఆదర్శం గా ఏపీ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది .
నవరత్న ల కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ క్రింద 1000 దాటిన ఖర్చులు ప్రభుత్వం బరిస్తుంది.
కిడ్నే బాధితులు లకు 10 వేలు ప్రకటించింది..
జగన్ గారు కుటుంబ పెద్దగా పేద ప్రజలకు అండగా ఉంటారు..
విద్యార్థులు కు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తారు..
అమ్మఒడి కార్యక్రమంలో బిడ్డ ను బడికి పంపిన తల్లి కి 15 ఇస్తాము
బీసీ గర్జన ద్వారా చెప్పిన విధం గా 50 శాతం నామినేటెడ్ పదవులు బడుగు బలహీన వర్గాలు కు ఇస్తాము..
రైతాంగం కోసం 3000 కోట్ల తో ధరల స్థిరీకరణ నిది ని ఏర్పాటు చేస్తాం..
మెట్ట ప్రాంత రైతులు కోసం బోర్లు వేయడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక రిగ్గు ను అందుబాటులో ఉంచుతాం.
9000 కోట్లు  భారం అయినను ఉద్యోగులు కు 27% IR పెంచాం.. ఆశావర్కర్లు ,పారిశుద్ధ్య కార్మికుల కు వేతనాలు పెంచాం..
పేద మహిళలు కు ఆసరాగా నాలుగు దఫాలు గా ఏడాది కి 75 వేలు అందిస్తాం...

వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ అప్పలరాజు ,పలాస ..
గవర్నర్ ప్రసంగం లో ప్రభుత్వం పాలన గురించి స్పష్టంగా చెప్పారు..
2018 -19 గవర్నర్ ప్రసంగం 52 పేజీలు ఉంటే ..ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం లో 15 పేజీలు మాత్రమే ఉంది..
రెండు పేజీల మేనిఫెస్టో , నవరత్నాల తో jagan ప్రజలు ను చైతన్య వంతం చేశారు..
చంద్రబాబు ఎప్పుడు జాతీయ స్థాయి ని మించి రాష్ట్రం అభివృద్ధి చెందింది అని చెపుతూ  చారిత్రాత్మక తప్పిదం చేశారు...
2018-19 లో దేశంలో వృద్ధి రేటు 6.5% ఉంటే ,రాష్ట్రంలో11.6% ఉన్నట్లు చెప్పారు...దీనివలన  ఏపీ ఇంత అభివృద్ధి చెందితే ప్రత్యేక హోదా ఎందుకు అని కేంద్రం ఆలోచన చేసింది...
ప్రజలు చాలా వివేక వంతం గా స్పష్టంగా ఏకగ్రీవ తీర్పు ఇచ్చారు..
నవయువకుడు అయిన జగన్15 రోజుల్లో ప్రభుత్వం ను పరుగులు పెట్టిస్తున్నారు..
నా నియోజకవర్గం పలాస ప్రాంతంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు10 వేలు పెన్షన్ ఇవ్వడం సంతోషం...

వైసీపీ ఎమ్మెల్యేలు వరప్రసాద్ ,TJR సుధాకర్ బాబు, మెరుగ నాగార్జున...
జగన్ పాలన చూస్తుంటే దళితులు sc, st, బీసీ,లు ఇక ఆత్మాభిమానం తో బతక వచ్చన్న భరోసా వచ్చింది..
గ్రామీణ ప్రాంతాలకు చెందిన తమకు ఆనందం గా ఉంది..
అమ్మవడి పథకం ద్వారా సామాజిక మార్పు వస్తుంది ,పేద కుటుంబాలు బాగు పడతాయి..
అభివృద్ధి అంశాలలో వైస్సార్ ఒక అడుగు వేస్తే జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తున్నారు..
విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ నిర్మాణ వ్యయం కేంద్రమే భరిస్తుంది అయితే అవినీతకి  పాల్పడటం కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టి జాప్యం చేసి 16 వేలు కోట్ల ప్రాజెక్టు ను 52 వేలు కోట్లు కు పెంచారు..
జగన్ గారు ప్రత్యేక హోదా తప్పనిసరిగా తెస్తారు...
గత సీఎం లు ఆర్టీసీ ని అంటుకోవడానికే బయపడితే ,జగన్ గారు దానిని ప్రభుత్వం లో విలీనం చేయనున్నారు...
ప్రతి పౌరుడు జగన్ ప్రభుత్వం కు మద్దతు పలకవల్సిన అవసరం ఉంది..
ఇప్పుడు రాష్ట్రం అంతటా జగన్ పరిపాలన గురించే చర్చ జరుగుతోంది....
ఆడంబరాలకు స్వస్తి పలికారు... మాకు పెట్టె భోజనాలు లో కూడా మార్పు తెచ్చారు.

రాపాక వరదప్రసాదరావు, ఎమ్మెల్యే, జనసేన :
      గవర్నర్ ప్రసంగం వినడానికి చాలా బాగుంది.
      సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది.
      సీఎం జగన్ పై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు.
      జగన్ ను నమ్మి ఓట్లేసి అత్యధిక సీట్లు కట్టబెట్టారు.
      మంచి చేస్తారనే ఆశ ప్రజల్లో ఉంది.
      నవరత్నాలు సహా అన్ని హామీలూ అమలు చేస్తే జగన్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.
      హామీలు అమలు చేయకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
      రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు.
      నిధు ఎలా సమకూర్చుతారో చూడాల్సి ఉంది.
      46 ఏళ్ల యువకుడు జగన్ చాలా స్పీడుగా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా అంతే స్పీడ్ గా పరిగెత్తాల్సి ఉంది. అప్పుడే ప్రజలు గుర్తిసారు.
      నిన్న జరిగిన స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఆయనకు అందరూ శుభాకాంక్షలు తెలిపాల్సిందిపోయి, వాగ్వాదాలకు దిగారు.
      పేదలకు మేలు జరగాలంటే వాగ్వాదాలు కాకుండా ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి.
      ప్రతిపక్షాల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
      సభను కోట్లాది మంది ప్రజలు వీక్షిస్తుంటారు. వాళ్లు తెలివి తక్కువ వాళ్లు కాదు. మేధావులు.
      మా ఎమ్మెల్యే...మా సమస్యలు గురించి మాట్లాడుతున్నాడా..లేదా? అని టీవీల్లో సభా కార్యక్రమాలను వీక్షిస్తుంటారు.
      ఇలా కీచులాడుకుంటుంటే ప్రజలు సహించరు.
      అధికార, ప్రతిపక్షాలు గందరగోళాన్ని ఆపి....ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకమైన చర్చ జరపాలి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...