సచివాలయం, జూలై 26: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా రామ సుబ్బారెడ్డి,
ఎన్ఎండీ ఫరూక్ శాసన మండలి సమావేశ మందిరంలో బుధవారం
ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఇన్ చార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం
వారిద్దరిచేత ప్రమాణం చేయించారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డి,
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఫరూక్ లు గవర్నర్
కోటాలో మండలి సభ్యులుగా నియమితులైన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో విద్యుత్ శక్తి శాఖ
మంత్రి కిమిడి కళా వెంకట్రావు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ ఇరిగేషన్ కార్పోరేషన్
డైరెక్టర్ పురుషోత్తమ రెడ్డి, ఏపీ శాసనసభ స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు, పూర్వ కార్యదర్శి కె.సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?
దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment