Jul 27, 2017

4.16 లక్షల మంది కాపులకు లబ్ది


కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ
సచివాలయం, జూలై 26: గతంలో ఏ ప్రభుత్వం చేకూర్చనివిధంగా 4.16 లక్షల మంది కాపులకు తమ ప్రభుత్వం లబ్ది చేకూర్చిందని కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (కాపు కార్పోరేషన్) చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానం, రైతులకు రుణ మాఫీ వంటి కార్యక్రమాల వల్ల అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం కాపు కార్పోరేషన్ కు రూ.2500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కార్పోరేషన్ ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ నాలుగు కులాలకు చెందినవారు లక్షల మంది వ్యక్తిగతంగా లబ్దిపొందినట్లు చెప్పారుస్వయం ఉపాధి, విదేశీ విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ద్వారా ఉపాధి, పోటీ పరీక్షలకు శిక్షణ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయం, మహిళలకు ఉపాధి శిక్షణ వంటి వాటి వల్ల కాపులకు ప్రయోజన చేకూరినట్లు వివరించారు.
కాపులకు చట్టబద్దంగా రిజర్వేషన్ కల్పించడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజునాథన్ కమిషన్ ను నియమించినట్లు ఆయన తెలిపారు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరంలేదన్నారుకాపులు, బీసీలు తమ ప్రభుత్వానికి రెండు కళ్లని చెప్పారు. ఈ ఏడాది చివరికి కాపులకు రిజర్వేషన్ లభిస్తుందన్నది తన అభిప్రాయం అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ కు ఎవరూ తట్టుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు చంద్రబాబు పాలనను రామరాజ్యంగా భావిస్తున్నరని చెప్పారు. ప్రతిపక్షంవారు మంచిపనులకు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం మంచిదన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికే ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబుని యాగి చేయడం కోసమే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారుకాపుల కోసం పని చేసేవారైతే మంజునాథన్ కమిటీ ముందు హాజరై కాపు సమస్యలు వివరించి ఉంటే బాగుండేదన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...