Jul 20, 2017

దేశంలోనే మోడల్ గ్రామంగా చల్లపల్లి


స్వచ్చాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీఎల్ వెంకట్రావు

సచివాలయం, జూలై 19: కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామాన్ని దేశంలోనే మోడల్ గ్రామంగా తీర్చిదిద్దారని స్వచ్చాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీఎల్ వెంకట్రావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. చల్లపల్లిని పట్టణాలకు ధీటుగా అన్ని విధాలా మోడల్ గ్రామంగా రూపొందించడంలో డాక్టర్ డి. రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతుల పాత్ర కీలకంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రకటించిన రోజు 2014 అక్టోబరు 2 నుంచి చల్లపల్లిలో ఆయన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన మనకోసం మనం ట్రస్ట్ఏర్పాటు చేసి తన సొంత డబ్బుతోపాటు స్నేహితులు, ఇతరు వద్ద నుంచి నిధులు సేకరిస్తూ ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారుగ్రామంలో అండర్ గ్రౌడ్ డ్రైనేజీని అభివృద్ధి చేయడంతోపాటు ఆ డ్రైనేజీపైన మొక్కలు పెంచడం, రోడ్ల పక్కన మొక్కలు నాటి, ట్రీగార్డ్స్ ఏర్పాటు చేసి వాటిని సంరక్షించడం, పార్కుని దత్తత తీసుకొని అత్యాధునికమైన టాయిలెట్స్ ఏర్పాటు చేయడం,డంప్ యార్డ్ ని, స్మశానవాటికను, బస్టాండ్ ను శుభ్రం చేయడం వంటి అనేక పనులు చేస్తున్నట్లు వివరించారు. ఆగస్ట్ 7వ తేదీ నాటికి ఆయన ఈ కార్యక్రమాలు చేపట్టి వెయ్యి రోజులు పూర్తి అవుతుందని, ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చల్లపల్లి గ్రామాన్ని సందర్శించి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారని చెప్పారు.
 డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ సేవలను గుర్తించి సీఎం ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర మిషన్ రాష్ట స్థాయి సభ్యునిగా నియమించినట్లు తెలిపారు. ఈ మిషన్ లో తను కాకుండా  అనధికార సభ్యులు ఎవరూ లేరని, ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు వెంకట్రావు చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...