Jul 10, 2017

కేటాయించిన నిధులు ఖర్చుచేయని సంక్షేమ శాఖలు


ఆర్థిక మంత్రి యనమల ఆగ్రహం
Ø గృహ నిర్మాణాలు వేగవంతం
Ø అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాల అమలు
Ø పెన్షన్ విధానంలో స్కాలర్ షిప్ లు
Ø అంగన్ వాడీ నిధులు మంజూరులో జాప్యం వద్దు         
సచివాలయం, జూలై 10: వివిధ సంక్షేమ శాఖలకు ప్రభుత్వం  కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయడంలేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ,ఎస్సీ,బీసీ, కాపు, బ్రాహ్మణ కార్పోరేషన్, గృహనిర్మాణం తదితర  సంక్షేమ శాఖల పనితీరు పర్యవేక్షణ, సమీక్షించడానికి నియమించిన మంత్రి మండలి ఉపసంఘం సచివాలయం 2వ బ్లాక్ లో సోమవారం ఉదయం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సంబంధింత ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ కేటాయించిన నిధులను ఆయా శాఖలు త్వరితగతిన ఖర్చుచేయాలన్నారు. నిధులను పూర్తిగా ఎందుకు ఖర్చు చేయలేదో వివరణ ఇవ్వాలని, పథకాల అమలులో ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని చెప్పారుప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకొని పథకాలు ప్రకటించి నిధులు విడుదల చేస్తామని, వాటిని సరైన రీతిలో అమలు చేయవలసిన బాధ్యత మీదేనన్నారు. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పారు.   ప్రతి నెల లబ్దిదారులకు ప్రభుత్వం  పెన్షన్ మంజూరు చేస్తున్న  విధానంలో స్కాలర్ షిప్ లు కూడా మంజూరు చేయాలన్నారు. విద్యార్థుల దరకాస్తులను పరిశీలించి జాప్యంలేకుండా స్కాలర్ షిప్ లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు 26వేల కోట్ల రూపాయలకుపైగా కేటాయించామని, ఆ పథకాలను సక్రమంగా అమలు చేసి ఫలితాలను లబ్దిదారులకు చేర్చాలని కోరారు


త్వరలో అన్ని పథకాల నిధులు లబ్దిదారులకు ఆన్ లైన్ లోనే చేరిపోతాయని, ఆ పనులు చురుకుగా జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. జ్ఞానభూమి పథకం పరిధిలో ప్రభుత్వ సంక్షేమ శాఖలకు, కాలేజీలను అనుసంధానం చేసే ప్రకియ కొనసాగుతోందని తెలిపారు. 16 లక్షల స్కాలర్ షిప్ దరకాస్తులను పరిశీలించడానికి ఎక్కువ సమయం పడుతుందని, అందువల్ల ఇక నుంచి ఆధార్ నెంబర్ ఆధారంగా కాలేజీలో స్థాయిలోనే పరిశీలించి స్కాలర్ షిప్ లను త్వరగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నవంబర్ నుంచి కొత్త పథకాల గృహనిర్మాణాలు చురుకుగా జరుగుతాయని అధికారులు తెలిపారు.  ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, లోకేష్ బాబు, నక్కా ఆనందబాబు హాజరయ్యారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...