Jan 9, 2018

అసెంబ్లీ కమిటీ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వండి

ప్రజాపద్దుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రనాథ్
       సచివాలయం, జనవరి 9: అసెంబ్లీ కమిటీ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యేవిధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) అధ్యక్షుడు రాజేంద్రనాథ్ కోరారు. శాసనసభ ప్రాంగణలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి శాసనసభ అమనుమతి తీసుకోవాలని, ప్రభుత్వ వ్యయాన్ని ఈ కమిటీ సమీక్షిస్తుందని, అందువల్ల ఈ కమిటీ అత్యంత బాధ్యతగా వ్యవహరించవలసి ఉందని చెప్పారు. యూరోపియన్ దేశాలలో ఈ కమిటీలను అత్యంత బాధ్యతాయుతమైనవిగా భావిస్తురన్నారు.  ప్రభుత్వం ఖర్చు చేసేదంతా ప్రజల సొమ్మని, జాగ్రత్తగా ఖర్చు చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. తలసరి అప్ఫు పెరగకుండా చూడాలన్నారు.  పదేళ్ల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ కమిటీ సమీక్షించినట్లు తెలిపారు. ఈ కమిటీలో సభ్యులందరూ తగిన అర్హత కలిగినవారేనని ఆదిమూలం సురేష్ డాక్టరేట్ అని, కొండపల్లి అప్పలనాయుడు డాక్టర్ అని పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ఇంజనీర్ అని, మిగిలిన పీజీవిఆర్ నాయుడు, బికె పార్థసారధి, యరపతనేని శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజు), బీడా రవిచంద్ర, షరీఫ్ మొహ్మద్ అహ్మద్, పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుభవజ్ఞులని వివరించారు.  నిన్న ఆర్థిక శాఖ, ఈ రోజు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల పనితీరుని సమీక్షించినట్లు రాజేంద్రనాథ్ చెప్పారు. ఆయనతోపాటు సభ్యుడు ఆదిమూలం సురేష్ కూడా హాజరయ్యారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...