Jan 28, 2018

ఏపీలో ఇన్నోవేషన్ వ్యాలీ


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
               సచివాలయం, జనవరి 27: టెక్నాలజీలో, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ)లో ముందున్న ఏపీలో ఇన్నోవేషన్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా సచివాలయం 1వ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఇన్నోకేషన్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కూడా సహకరిస్తుందన్నారు. దావోస్ పర్యటన విజయవంతంగా జరిగినట్లు తెలిపారు. ప్రపంచంలోని మేథావులు, పారిశ్రామికవేత్తలను ఒక వేదికపైకి తీసుకువచ్చే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు  ఇదన్నారు. తాను ఇప్పటి వరకు 14 సార్లు ఈ సదస్సుకు వెళ్లానని చెప్పారు. 20 ఏళ్ల తరువాత భారత ప్రధాని ఈ సదస్సుకు హాజరయ్యారన్నారు. ప్లీనరీలో మాట్లాడిన తొలి భాతర ప్రధాని నరేంద్ర మోదీ అని తెలిపారు.  4వ పారిశ్రామిక విప్లవం, టెక్నాలజీ, వ్యాపారం, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించి కొత్తకొత్త అంశాలను తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.  భారత్ అత్యంత శక్తివంతమైన దేశం, ఇక్కడ అవకాశాలు ఎక్కువ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో స్ట్రాంగ్, ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవారు అధికంగా ఉండటంతోపాటు అతి పెద్ద మార్కెట్ కలిగి ఉందని అందువల్ల ప్రపంచం మొత్తం భాతర్ వైపు చూస్తోందని చెప్పారు. ఈ పర్యటనలో రెండు ఎంఓయులు జరిగినట్లు, 25 ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్నట్లు వివరించారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించి 50 సంస్థలు మెడ్‌టెక్ ఇన్నోవేషన్‌ సెంటర్‌ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఆసక్తి వ్యక్తీకరణ లేఖలు) ఇచ్చినట్లు తెలిపారు. దావోస్ లో భారత్, ఆంధ్రప్రదేశ్ ఆకర్షణీయంగా నిలిచాయని, తాము ముఖ్యమైన అన్ని అంశాల్లో పాల్గొన్నామని చెప్పారు.
యుపీఎల్ లిమిటెడ్ కంపెనీ గ్లోబల్ సీఈవో జై షరోఫ్ తో సమావేశమైనట్లు తెలిపారు. వర్షం పడకపోయినా సాగు నీటికి ఉపకరించే ఒక ఉత్పత్తిని యూపీఎల్ సంస్థ రూపొందించినట్లు తెలిపారు.  భూమిలోని నీటిని గ్రహించి క్షామం ఏర్పడిన సందర్భంలో నెమ్మదిగా నీటిని విడుదల చేసే ఉత్పత్తి ఇదని, దీనిని మన రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి వారిని ఏపీకి ఆహ్వానించినట్లు చెప్పారు

            రాష్ట్ర విభజన నేపధ్యంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని, పెట్టుబడులు రాబట్టడానికి, పరిశ్రలమ ఏర్పాటుకు ఎంతో కృషి చేయడంతోపాటు కష్టం, తెలివితేటలు, అధికారులు, ఉద్యోగుల నిబద్దతతో పనిచేయడం వల్ల రెండంకెల వృద్ధి రేటు సాధించామని, వ్యవసాయ రంగంలో అద్వితీయమైన వృద్ధి రేటు సాధించామన్నారు. వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించగలిగితే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.  పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ బెంచ్ మార్క్ తీసుకున్నట్లు తెలిపారు.  ఒక్క కాల్ తో ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అయ్యే విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయోగంగా పేర్కొన్నారు. ప్రజల సంతృప్తి పెరిగిందన్నారు. పనులు త్వరగా అవడం, వారి ఫిర్యాదులు పరిష్కారం అవుతుంటనే సంతృప్తి స్ధాయి పెంరుగుతుందని చెప్పారు.  ప్రస్తుతుం 30 శాఖలను అనుసందానం చేశామని, త్వరలో అన్ని శాఖలను ఇందులోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రతి రోజూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నామన్నారు. సాంకేతిక అభివృద్ధితో స్కాలర్ షిప్ లు, పెన్షన్లలో దుర్వినియోగం తగ్గందని, గతంలో దెయ్యాలు కూడా పెన్షన్ తీసుకునేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. భూధార్ తో భూమి సమస్యలు కూడా పరిష్కారమవుతాయని చెప్పారు. అంతర్జాతీయ సమితి పర్యావరణ సంస్థ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. లక్షా 35 వేల ఎకరాల్లో ఈ రకమైన సాగుచేస్తున్నట్లు చెప్పారు. కాలుష్యం లేకుండా, పెస్టిసైడ్స్ తగ్గిస్తూ. భూసారం పెంచుకుంటూ, తక్కువ ఖర్చు, ఆరోగ్యాన్ని రక్షించుకునేవిధంగా 2027 నాటికి రాష్ట్రంలో గ్రీన్ అగ్రికల్చర్ ని అభివృద్ధి చేస్తామన్నారు.
            రాష్ట్రంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం ద్వారా దేశంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆటోమొబైల్ రంగంలో 3.7 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. అనంతపురానికి  కియా మోటార్స్ రావడం, దక్షిణ కొరియా టౌన్ షిప్ ఏర్పడటంతో అక్కడి వాతావరణం మారిపోయిందన్నారు. బెంగళూరు విమానాశ్రయం మనకి ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. హుద్ హుద్ తుపాను తరువాత విశాఖ పట్నం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ఇక్కడ విమాన ప్రయాణికుల సంఖ్య పెరింగిదని చెప్పారు. ఈజీ టు బిజినెస్ లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచామని, 21 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నామనిపరిశ్రమల స్థాపన విషయంలో అధికారులు పారిశ్రామికవేత్తల వెంటపడుతున్నారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిన పనులకు సంబంధించి నాబార్డ్ ద్వారా నిధులు ఇప్పించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి కాంక్రిట్ పని కూడా ప్రారంభమవుతుందన్నారు. నదులు అనుసంధానం ద్వారా రాష్ట్రమంతటా సాగు, త్రాగు నీరు అందిస్తామని చెప్పారు. పట్టిసీమ ద్వారా నీరందించడంతో ఈ ఏడాది అధిక వ్యవసాయ దిగుబడులు వచ్చాయని, రూ.2500 నుంచి రూ.3000 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం లభించినట్లు చంద్రబాబు  చెప్పారు.
ప్రకృతితో మమేకం కండి: చంద్రబాబు
             ప్రజలందరూ ప్రకృతితో మమేకం కావాలని, ప్రకృతిని ఆరాదించి, ప్రేమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాంప్రదాయాలు పాటిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ, దానిపట్ల చైతన్యం తీసుకురావాలన్నారు. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుందన్నారు. ఏరువాక పవిత్రమైన కార్యక్రమం అని, అందరికీ తిండిపెట్టే రైతన్నకు సంఘీభావం తెలుపుతూ దానిని పండుగలాగా జరుపుకున్నామని గుర్తు చేశారు. సంపదకు మూలం నీరని అందువల్ల జలసిరికి హారతి ప్రారంభించామన్నారు. పుష్కరాలకు అఖండ హారతి పట్టామన్నారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవం నిర్వహించి పండుగ వాతావరణంలో చెట్లకు పూజలు చేశామన్నారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు స్పూర్తిగా అమ్మకు వందనం పేరుతో తల్లిని గౌరవించడం, అభిమానించడం, ప్రేమించడం, ఆరాధించడం వంటివి పిల్లలకు అలవాటు చేస్తున్నామన్నారు. అలాగే రేపు ఉదయం 7 గంటలకు విజయవాడలో సూర్య ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో అదే సమయానికి పవిత్రమైన మనసు, పరిశుభ్రతతో సూర్య నమస్కారాలు చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సూర్య నమస్కారాల వల్ల మానసికంగా, శారీరకంగా లాభం చూకూరుతుందని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది రథసప్తమి రోజున గానీ లేక ఆ తరువాత వచ్చే మొదటి ఆదివారం (సూర్యుని ఇష్టమైన రోజు) గానీ  ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారుకుల మత రహితంగా అందరికీ ఆరాధ్య దైవం సూర్యుడని, ఎటువంటి పక్షపాతం లేకుండా అందరి సుఖసంతోషాలకు కారణం అయన అన్నారు. సూర్య కిరణాల ఆధారంగా ఎంతో శాస్త్రీయంగా అరవిల్లిలో దేవాలయం నిర్మించారని చెప్పారు. ఆధ్యాత్మికంగానే కాకుండా విజ్ఞానపరంగా కూడా సూర్యుడుకి ప్రాముఖ్యత ఉందన్నారు. అందరికీ డీ విటమిన్ అందిస్తారని, చైతన్య స్పూర్తి అని, క్రమశిక్షణకు నిదర్శనం అని తెలిపారు. అలుపెరుగని సూర్యుడు జస్టిస్ చక్రవర్తిలాగా అందరికీ ఒకటే న్యాయం అందిస్తారన్నారు. అత్యంత శక్తి కేంద్రమైన సూర్యకిరణాల నుంచి వచ్చే శక్తిని 60 నిమిషాలు సేవ్ చేయగలిగితే ఉచిత విద్యుత్ అందించడంతోపాటు కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. సూర్యుడనేది వాస్తవం అని అందువల్లే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఖరారు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ పెరిగిందని చంద్రబాబు చెప్పారు. ఈ సమావేశంలో సమాచార, పౌరసంబంధాల కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...