Jan 5, 2018

సచివాలయ స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులు


           సచివాలయం, జనవరి 5: సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2017 విజేతలకు  సచివాలయం 3వ బ్లాక్ లోని సంఘం కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, టూరిజం శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలు బహుమతులు అందజేశారు. క్రికెట్, రన్నింగ్, షెటిల్ తదితర పోటీలలో పురుష, మహిళా విజేతలకు ప్రధమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ నూతన రాష్ట్రంలో మొదటి సారిగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల క్రీడా పోటీలను విజయవంతం చేసినందుకు  అభినందనలు తెలిపారు. మరో అధికారి ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ విన్నర్స్ గా, రన్నర్స్ గా నిలవడం కంటే పాల్గొనడం ముఖ్యమన్నారు. క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటున్న  మహిళా ఉద్యోగులను ఆయన అభినందించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీ కృష్ణ మాట్లాడుతూ వయసుతో సంబంధంలేకుండా ఉద్యోగులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ పోటీలలో పాల్గొన్నారన్నారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ స్పిమ్మింగ్-2016లో కాంస్య పతకం సాధించిన కె. వెంకట్రావు, సౌత్ ఏషియన్ వెటరన్ టేబుల్ టెన్నీస్ లో రజత పతకం సాధించిన బి.సుజాతలను సభకు పరిచయం చేశారు. నూతన రాష్ట్రంలో తొలి స్పోర్ట్స్ మీట్ విజయవంతం కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
        సంఘం క్రీడల విభాగం జాయింట్ సెక్రటరీ ఎన్ ఎస్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో, విజయవాడ ఐజీఎం స్టేడియంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు 4 రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో ఉద్యోగులు దాదాపు 700 మంది వరకు పాల్గొన్నట్లు తెలిపారు. సచివాలయం 6 బ్లాకుల్లోని మహిళ, పురుష ఉద్యోగులను 4 గ్రుపులుగా, 31 టీమ్స్ గా విభజించి మొత్తం 61 ఈవెంట్లలో పోటీలు నిర్వహించినట్లు వివరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...