Jan 17, 2018

సాగరమాల పనులు వేగవంతం


అధికారులకు సీఎస్ ఆదేశం
        సచివాలయం, జనవరి 17: సాగరమాల పథకంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి దినేష్ కుమారం సంబంధింత అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో కోస్టల్ ఎకనామిక్ యూనిట్(సీఈయు), కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్, సాగరమాల ప్రాజెక్ట్ పనుల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్, కృష్ణపట్నం పవర్ కార్పోరేషన్, కినేట పవర్ లిమిటెడ్, కోస్టల్ ఆంధ్రా పవర్ లిమిటెడ్, ఏపీ పోర్ట్ డెవలప్ మెంట్ కు కేటాయించిన భూముల అంశం చర్చించారు. పోర్టుల ఆధునికీకరణ, పోర్టులు - రోడ్ల అనుసంధాన ప్రాజెక్టులు, పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రాజెర్టులు, తీర ప్రాంత అభివృద్ధి, కాకినాడ  పోర్ట్ మౌలిక సదుపాయలు, గాజువాక-గంగవరం 4 లైన్ల రోడ్ 6 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) చేపట్టిన పనులుగంగవరం పోర్ట్ అనుసంధానంగా ఉన్న బైస్ రోడ్ అభివృద్ధిశ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు నుంచి నెల్లూరు నగరానికి ఉన్న 24 కిలోమీటర్ల రోడ్  అభివృద్ధి, కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పారిశ్రామిక క్లస్టర్ కు 5 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం, ఉద్యోగ అవకాశాలు, జట్టీల నిర్మాణం, తీరంలో పర్యాటక అభివృద్ధి తదితర పనుల పురోభివృద్ధిని క్షుణ్ణంగా సమీక్షించారు. అధికారులు చెప్పిన కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూసించారు. నెల్లూరు-కృష్ణపట్నం రోడ్డుకు సంబంధించిన సమస్యను ఎన్ హెచ్ఏఐ, ఆర్ అండ్ బీ, కన్సల్టెన్సీ వారు కూర్చొని ఈ నెలాఖరు లోపల పరిష్కరించుకోవలసిందిగా సూచించారు. కొంత మంది అధికారులకు కొన్ని పనులను ఈ నెలాఖరులోపల, మరి కొన్ని పనులను ఫిబ్రవరి నెలాఖరులోపల పూర్తి చేయాలని అదేశించారు. కోస్టల్ ఎకనామిక్ జోన్(సీఈజడ్) మాస్టర్ ప్లాన్ పరిశీలించారు. టింబర్ ప్రాసెసింగ్ జోన్ అంశాన్ని అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పరిశీలించమని ఆదేశించారు. అలాగే విశాఖ, కృష్ణపట్నంలలో పర్యాటక అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు గురించి చర్చించారు. ప్రతి నెల సాగరమాల ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తామని, సమావేశానికి సంబంధిత ప్రాజెక్ట్ పై పూర్తి అవగాహన ఉన్న అధికారులు మాత్రమే రావాలని సీఎస్ చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, పోర్ట్స్ డైరెక్టర్ కోయ ప్రవీణ్, నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు,  గంగవరం పోర్ట్ డైరెక్టర్ డీటీ నాయక్, ఎన్ హెచ్ఏఐ, రైల్వే, నీటిపారుదల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...