Jan 3, 2018

ఫిబ్రవరి 15 లోపల మత్స్యకారులందరికీ బయోమెట్రిక్ కార్డులు


సముద్రతీర ప్రాంత రక్షణ కమిటీ సమావేశంలో సీఎస్
      
  సచివాలయం, జనవరి3: సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులందరికీ ఫిబ్రవరి 15వ తేదీ లోపల  బయోమెట్రిక్ కార్డులు ఇవ్వాలని మత్స్య శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జరిగిన  సముద్రతీర ప్రాంత రాష్ట్ర స్థాయి రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నమోదు చేసిన మత్స్య కారుల వివరాలు, వారి సెల్ నెంబర్లను సముద్రతీర ప్రాంత రక్షణ పోలీసులకు అందజేయమని చెప్పారు. జిల్లా స్థాయిలో జిల్లా తరువాత జిల్లాలో మత్స్యకారులతో సమావేశాలు నిర్వహించమని ఆదేశించారు.  నోటిఫైడ్ ఫిష్ ల్యాండింగ్ పాయింట్స్, బోట్స్ కలర్ కోడింగ్, ఫైబర్ బోట్స్బోట్స్ నిర్వహణ, వాటి మరమ్మతులు, మచిలీపట్నం పాత పోర్ట్ ప్రాంతంలో తీర ప్రాంత పోలీస్ శిక్షణ కేంద్రంకు భూమి కేటాయింపు, ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు, తీరప్రాంత రక్షణ పోలీస్ ప్రధాన కార్యాలయ నిర్మాణం, రాష్ట్ర మేరీటైం బోర్డు, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, జట్టీలు, జట్టీల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులు తదితర అంశాలను చర్చించారు.
రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీర ప్రాంతంలో 9 జిల్లాలు, 64 మండలాలు, మొత్తం 21 తీరప్రాంత రక్షణ పోలీస్ స్టేషన్లు ఉన్నట్లు, వాటిలో ఒక్క స్టేషన్ కు మాత్రమే సొంత భవనంలేదని, 19 స్టేషన్లకు కాంపౌండ్ వాల్స్ నిర్మించివలసి ఉందని అధికారులు వివరించారు. పోలీస్ స్టేషన్ల పరిధిని నిర్ణయించవలసి ఉందని చెప్పారుఏపీ మెరైన్ బోర్డు బిల్-2017ని కేంద్రానికి పంపినట్లు తెలిపారు. హోం శాఖ గత నవంబర్ లో రూపొందించిన జీఓ ప్రకారం జిల్లా స్థాయి తీరప్రాంత రక్షణ  కమిటీలను జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తారన్నారు. తీర ప్రాంత రక్షణ పథకం ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వం 7 జట్టీల నిర్మాణానికి రూ.3.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో  350 నోటిఫైడ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉన్నాట్లు తెలిపారు. బోట్ లకు కలర్ కోట్ ఉంటే ఏరియల్ సర్వే తేలికవుతుందని చెప్పారు. మొత్తం 33,275 బోట్లలో 32,931 బోట్లకు సంబంధించి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు తెలిపారు.  ఈ సమావేశంలో డీజీపీ ఎం.మాలకొండయ్య, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, విశాఖ పోర్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణ బాబు, కోస్ట్ గార్డ్ కమాండెంట్ ఎస్.ఎస్.సింగ్, ఫిషరీస్ శాఖ డైరెక్టర్ కె.ప్రవీణ్, కెప్టెన్ కె.శ్రీధర్మ, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సుధ కోకా, డాక్టర్ బాలకృష్ణన్, కె.గణేశన్, ఏబీవీ శాయి శ్రీనివాస రావు, ఏఎస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...