Nov 26, 2017

సర్వోత్కృష్ఠమైన భారత రాజ్యాంగం

                                      

 నేడు రాజ్యాంగ దినోత్సవం

       ఈ రోజు సర్వోత్కృష్ఠమైన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు.
1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. బ్రిటీషు కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది. యావత్‌ భారత ప్రజలు రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకోవడానికి రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్‌ 26న   రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని 2015లో  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  రాజ్యాంగాన్ని ఆమోదించి 68 ఏళ్లు పూర్తి అయింది. 150 ఏళ్లకు పైగా భారత దేశం బ్రిటీష్ వారి పాలనలో ఉంది. ఆ నాడు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేని దయనీయమైన స్థితిలో భారతీయులు ఉన్నారు. పరాయి పాలనను అంతమొందించాలన్నదే ఆ నాటి భారతీయుల అందరి లక్ష్యం. అందరి లక్ష్యం బ్రిటీష్ వారిని తరిమికొట్టి స్వాతంత్ర్యం సాధించుకోవాలన్నదే అయినప్పటికి వేరువేరు పోరాట మార్గాలను ఎన్నుకున్నారు. చివరకు లక్షల మంది త్యాగధనుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది.  స్వరాజ్యం సాధించింది 1947లో అయినప్పటికీ పూర్తి స్థాయి రాజ్యాంగం కోసం మరో మూడేళ్ల పాటు ఆగవలసి వచ్చింది. అప్పటి వరకు కింగ్‌ జార్జిఫైవ్‌ సారథ్యంలో ప్రభుత్వం కొనసాగింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి  దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖులు 284 మందితో రాజ్యాంగ నిర్మాణ సభ లేక రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేశారు. అందులో 15 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరంతా  పరోక్ష ఎన్నిక ద్వారా రాష్ట్ర శాసనసభలు,  భారత్ సంస్థానాల నుండి ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనకు డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది. ప్రజాస్వామ్య యుగంలో రాజ్యాంగానికి విశిష్టస్థానం ఉంది. రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులతోపాటు వారికి రక్షణ, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని జాతులు, తెగలు, ఆదీవాసీలు, దళితులు, అణగారిన, పీడనకుగురైన వర్గాలు, అనేక మతాలు,  భాషలు, విభిన్న సంస్కృతులు మన దేశంలో ఉన్నాయి. వీటికి తోడు ఇక్కడ వేల కులాలు, లింగ వివక్ష, అంటరానితనం వంటి వికృత అంశాలు ఉన్నాయి. అందువల్ల భారత రాజ్యాంగ రచన సంక్లిష్టతతో కూడుకున్నది.
         రాజ్యాంగం అంటే  కేవలం ప్రభుత్వ వ్యవస్థ, దాని విధివిధానాలు, శాసన సభల రూపకల్పనే కాదు కోట్లాది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను ప్రతిబింభించేదిగా ఉండాలన్నది ప్రధాన లక్ష్యం. వీటన్నిటితోపాటు భవిష్యత్ ని  దృష్టిలోపెట్టుకొని భావితరాలకు కూడా సమన్యాయం అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్  మూడేళ్ల కాలం అవిశ్రాంతంగా శ్రమించారు..  ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే అత్యుత్తమమైన అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకుంది.
రాజ్యాంగం ప్రవేశికలోనే పౌరులకు సంబంధించిన ప్రాథమిక హక్కులు, సమన్యాయం, సమానాత్వం, సౌభ్రాత్రుత్వం వంటివాటితోపాటు  సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు.  అక్కడే దీని విశిష్టత అర్ధమవుతుంది. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలతో కూడినదని  అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది న్యాయనిపుణుల మన్ననలు పొందింది. రాజ్యాంగం దేశ ప్రజలకు అనేక హక్కులు కల్పించింది. ప్రజలు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే స్వేచ్ఛను ప్రసాదించింది.
          తన సారధ్యం రూపొందించిన రాజ్యాంగ తుది ప్రతిని 1949 నవంబర్ 25న డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు అందజేశారు. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ  ఆమోదించిన రాజ్యాంగంపై 284 మంది సభ్యులు 1950 జనవరి 24న సంతకాలు చేశారు. 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆ రోజునే మూడు సింహాలను జాతీయ చిహ్నంగా ఆమోదించారు. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయింది. అయితే అదే సభ 1952లో  మొదటి సాధారణ ఎన్నికలలు జరిగి కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు  తాత్కాలిక పార్లమెంట్ గా కొనసాగింది. ఆ రోజుల్లో రాజ్యంగం తయారు చేయడానికి కోటి రూపాయలు ఖర్చు అయింది. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగమంగా దీనికి గుర్తింపు లభించింది. దీని ప్రతులు అందమైన చేతిరాతతో హిందీ, ఇంగ్లీషులో ఉంటాయి. 5 అనుబంధాలు, 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 448 ఆర్టికల్స్ తో దీనిని రూపొందించారు. తప్పనిసరిగా అందులో పేర్కొన్న ప్రకారమే మన దేశంలో పాలన జరగాలి. ప్రతి ఒక్కరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం ద్వారానే అధికారం స్వీకరిస్తారు. రాజ్యాంగం పేరిట విధులు నిర్వహిస్తారు. ఆ విధంగా రాజ్యాంగానికి  ఎంతటి ఔన్నత్యం ఉందో మనం అర్ధం చేసుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారం దేశానికి రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతి, రాష్ట్రాల్లో రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్‌లు ఉంటారు. దేశాన్ని పరిపాలించడానికి కేంద్రంలో ప్రధాన మంత్రి, మంత్రి మండలి, రాష్ట్రాల్లో  ముఖ్యమంత్రులు, మంత్రి మండళ్లు ఉంటాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా పరిధిలు కూడా నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. భారత దేశం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం రాజ్యాంగానికి లోబడి సవరణ చేసుకొనే అవకాశం కూడా కల్పించారు. ఇప్పటి వరకు 101 రాజ్యాంగ సవరణలు చేశారు. ప్రస్తుతం దేశమంతటా చర్చనీయాంశమైన జీఎస్ టీ చట్టమే చివరి రాజ్యాంగ సవరణ.

భారత రాజ్యాంగం విశిష్టతలు

·       భారత రాజ్యంగ రూపకల్పనకు అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రధాన వ్యక్తి డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్.
·       రాజ్యాంగ నిర్మాణ సభలో 284 మంది సభ్యులున్నారు. వారిలో  15 మంది మహిళలు.
·       దీని రచనకు రాజ్యాంగ సభకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది.
·       దీనిని రూపొందించడానికి ఆ రోజుల్లో కోటి రూపాయలు వ్యయం అయింది.
·         రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయడానికి పట్టింది.
·         దీనిని టైపు చేయలేదు. ప్రింట్ చేయలేదు. హిందీ, ఇంగ్లీషు భాషలలో రాత ప్రతి ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం.
·        దీనిని పార్లమెంట్ లైబ్రరీలో ప్రత్యేకంగా భద్రపరిచారు.
·        1949 నవంబర్ 26న రాజ్యాంగ నిర్మాణ సభలో దీనిని ఆమోదించారు. 1950 జనవరి 24న మొత్తం 284 మంది సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు చేశారు.
·        1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
·       ఇందులో 5 అనుబంధాలు, 12 షెడ్యూల్స్, 25 భాగాలు, 448 ఆర్టికల్స్ ఉన్నాయి.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


Nov 24, 2017

26న రాజ్యాంగ దినోత్సవం


సచివాలయం, నవంబర్ 24: ఈ నెల 26న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించి, రాజ్యాంగం మొదటి పేజీలోని ప్రవేశికను చదవాలని ప్రభుత్వం కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఒక ప్రకటనలో కోరారు. అంతే కాకుండా ఆ రోజున తప్పనిసరిగా మాక్ పార్లమెంట్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అందించిన సమాచారం మేరకు ఆ రోజు సెలవు రోజు ఆదివారం అయినందున ఆ మరుసటి రోజు సోమవారం  తగిన ప్రాధాన్యత ఇచ్చి రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలన్నారు. ఆ రోజు రాజ్యాంగ ప్రవేశిక చదవడంతోపాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, శాఖల బాధ్యులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
   
1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.  నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అయినందున ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నాం. భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటి ప్రవేశిక 'భారత ప్రజలమైన మేము' అనే మాటలతో ప్రారంభమై భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమని పేర్కొన్నారు. పౌరులకు సంబంధించిన న్యాయం, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాత్రం గురించి ప్రస్తావించారు.



Nov 22, 2017

ఇబ్బందులు అదిగమించి 2019కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి


ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    సచివాలయంనవంబర్ 22: అన్ని రకాల ఇబ్బందులు అదిగమించి పోలవరం ప్రాజెక్ట్ ని 2019 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారుశాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట కోసం సేకరించిన భూములకు చెల్లించవలసిన నష్టపరిహారం ఎకరానికి రూ.1.50 లక్షలు కాగాఇప్పడు రూ. 10 నుంచి రూ.13 లక్షలకు పెరిందన్నారుదాంతో ప్రాజెక్ట్ వ్యయం పెరిగినట్లు చెప్పారుఈ ప్రాజెక్ట్ విషయమై సీఎం ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులుఅధికారులతో మాట్లాడుతున్నారనిచత్తిస్ గఢ్ఒరిస్సా రాష్ట్రాల నుంచి అడ్డంకులు కూడా ఉన్నాయని చెప్పారురాజధాని లేని సమయంలో ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి శాసనసభనుసచివాలయంను నిర్మించుకొన్నామనిసచివాలయ ఉద్యోగులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ  ఇక్కడికి వస్తున్నారన్నారుపట్టిసీమ ద్వారా గోదావరి నీరు రావడం వల్ల రూ.15వేల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ దిగుబడులు వచ్చినట్లు వివరించారు.
రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి ఆస్తుల పంపిణీ జరగలేదనికేంద్రం నుంచి కూడా నిధులు రావలసి ఉందని అన్నారువిభన చట్టంలో హామీల అమలులకు సీఎం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారుఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి అప్పులు చేసినావాటిని సద్వినియోగం చేస్తున్నామనిఅందువల్లే రాష్ట్ర జీడీపీతలసరి ఆదాయం పెరుగుతుందన్నారు.
సినిమా పరిశ్రమకు సంబంధించి నంది అవార్డుల అంశం వివాదస్పదం కావడం దురదృష్టం అన్నారుతాను కూడా సినిమా రంగం నుంచే వచ్చాననితాను నిర్మాతనని చెప్పారుఈ విషయంలో కుల ప్రస్తావన తీసుకురావడం భావ్యం కాదనివిధానాల ఆధారంగా అవార్డుల ప్రకటిస్తారని బుచ్చయ్య చౌదరి అన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై ఏపీ దృష్టి


నదులు అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుదే!


ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల

           సచివాలయం, నవంబర్ 22: దేశంలో నదులు అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఉదయం ఆమె మాట్లాడారు. పట్టిసీమ ద్వారా అందిన గోదావరి నీటితో కృష్ణా ఆయకట్టుతోపాటు రాయలసీమకు కూడా సాగు నీరు అదనంగా అందించినట్లు తెలిపారు.  గ్రామీణాభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటే లభించే లాభాల గురించి ఈ రోజు సభలో చర్చిస్తారన్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ పై కూడా చర్చ జరుగుతుందని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండి భావితరాల భవిష్యత్ కు సహకరించడంలేదని యామినీ బాల అన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌరవించాలి


అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు

      సచివాలయం, నవంబర్ 21: ప్రతి ఒక్కరూ వ్యవస్థను గౌవించిన రోజునే సమాజం ముందుకు వెళుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు   అన్నారు.
శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడారు. స్పీకర్ వ్యవస్థపై ప్రతిపక్షం వారు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావుకు ఆ ప్రాంతంలో మంచి పలుకుబడి ఉందని అందువల్లే ఆయనను ప్రజలు మళ్లీ మళ్లీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. శాసనసభ అనేది ప్రజా దేవాలయం అని, ప్రజా సమస్యల పరిష్కారం ఆ వేదికను ఉపయోగించుకోవాలని అన్నారు. అన్ని సమస్యల పరిష్కారం కోసం చర్చలు కొనసాగుతున్నట్లు ప్రశ్నోత్తరాలకు, సభా సమయానికి ఇబ్బందిలేకుండా సజావుగా కొనసాగుతున్నట్లు ఆనంద రావు చెప్పారు.

Nov 21, 2017

ప్రతిపక్షం లేకున్నా సమాధానాలు రాబడుతున్నాం



ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల

           సచివాలయం, నవంబర్ 21: శాసనసభ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యులు హాజరుకాకపోయినా నియోజకవర్గం వారీగా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు చర్చించి సమాధానాలు రాబడుతున్నామని ప్రభుత్వ విప్ డాక్టర్ యామినీ బాల అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆమె మాట్లాడారు. శాసనసభ సమావేశాలు సజావుగా కొనసాగుతున్నట్లు చెప్పారు. సభాపతి అందరికీ అవకాశం ఇస్తున్నారన్నారు.  సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి హామీ పొందుతున్నామన్నారు. మంత్రి లోకేష్ బాబు సభలో చక్కగా మాట్లాడినట్లు చెప్పారు.  గత 30 రోజులుగా తాము ప్రతి గ్రామం సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పేదలను అన్ని అంశాల్లో ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనిదేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజ్ ద్వారా బహుళ జాతి సంస్థల పెట్టుబడులు వస్తున్నట్లు తెలిపారుప్రజా రాజధాని అమరావతి మహానగరం మహా అద్భుతంగా నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా చురుకుగా సాగుతున్నట్లు యామిని తెలిపారు.