Jul 15, 2026

పుట్టా శ్రీనివాస్ కు ఘన నివాళి


మంగళగిరి:  మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షతన జరిగిన పుట్టా శ్రీనివాస్ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కేవలం పాత్రికేయునిగా మాత్రమే కాక నిబద్దత గల సామాజిక కార్యకర్తగా పుట్టా శ్రీనివాస్ అందించిన సేవలను స్మరించారు. అనారోగ్యం బారిన పడి చిన్న వయసులోనే మరణించడం శ్రీను  కుటుంబ సభ్యులకు మాత్రమే కాక మంగళగిరికి తీరని లోటని పేర్కొన్నారు.

ప్రత్యేకించి శ్రీ వేంకటేశ్వర యోగా సేవ కేంద్రంలో బోధనాచార్యునిగానూ, రేకా చంద్రశేఖర్  అధ్యక్షులుగా వ్యవహరించిన " వేమన సాహిత్య వేదిక " కార్యదర్శిగా పుట్టా శ్రీనివాస్  అందించిన సేవలను స్మరించారు. ఈ సందర్బంగా పుట్టా శ్రీనివాస్ స్మృతి చిహ్నంగా...త్వరలో "  పుట్టా శ్రీనివాసరావు స్మరణలో " పుస్తకాన్ని రేకా చంద్రశేఖర్  వెలువరిస్తున్నట్లు మానవతా వేదిక  కన్వీనర్  గోలి మధు తెలిపారు.


ఈ సభలో మంగళగిరి బుద్దవిహార వ్యవస్థాపకులు రేకా కృష్ణార్జున రావు, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణ రావు, బుద్దభూమి వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య, ధ్యానరత్న ఆకురాతి శంకరరావు, స్నేహ మహిళామండలి అధ్యక్షురాలు వల్లభనేని వాణి, వేంకటేశ్వర యోగసేవా కేంద్ర ఆచార్యులు మండ్రు శ్రీనివాస్ కుమార్, ఎస్ ఎల్ ఎం చైతన్య బాధ్యులు శిందే బాలకృష్ణ, సీనియర్ పాత్రికేయులు శిరందాసు నాగార్జున, ప్రముఖ కళాకారులు అల్లక తాతరావు, సందుపట్ల భూపతి, బంధుమిత్రులు పాల్గొని ఘననివాళులు అర్పించడంతో సంస్మరణ సభ విజయవంతం అయింది.


No comments:

Post a Comment

పుట్టా శ్రీనివాస్ కు ఘన నివాళి

మంగళగిరి:  మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షతన జరిగిన పుట్టా శ్రీనివాస్ సంస్మరణ సభలో పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బ...