Feb 25, 2020

రాజధానిలో రైతు అరెస్టు


25.02.2020: 
v తుళ్లూరులో రైతుల ధర్నాను చిత్రీకరిస్తున్న కానిస్టేబుల్‌పై దాడిచేసిన కేసులో ఆలూరి వెంకటేశ్వరరావు అనే రైతును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 20వ తేదీన తుళ్లూరులో జరిగిన రైతుల ధర్నాను కానిస్టేబుల్‌ నాగూర్‌వలి డ్రోన్‌ ద్వారా చిత్రీకరించారు. ఆయనపై ఆలూరి వెంకటేశ్వరరావు దాడి చేశారని కేసు పెట్టారు.
v నా భర్త ఆచూకీ చెప్పండి: వెంకటేశ్వరరావు భార్య సరోజినీదేవి
మంగళవారం తెల్లవారుజామున పోలీసులు వచ్చి మా ఇంట్లో సోదా చేశారు. వెం కటేశ్వరరావు ఎక్కడని ఆరా తీసారు. లేరనడంతో వెళ్లిపోయారు. కొద్దిసేపటికే నా భర్త ను పోలీసులు తీసుకువెళ్లినట్టు స్థానికులు నాకు చెప్పారు. నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారు? ఆయన ఆచూకీ చెప్పండి.

No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...