రాజధాని కోసం భూ సమీకరణ కింద తమ భూముల్ని స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఒప్పందం ప్రకారం తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాల్సి ఉందని, అయితే ఇప్పటి వరకు అది కార్యాచరణ దాల్చనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాజధానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 7 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదిస్తూ.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యకార్యక్రమాలను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. తమ వద్ద తీసుకున్న భూమిని ప్రభుత్వం ఇతరులకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టిందని, దీనిని అడ్డుకోవాలన్నారు. సీఆర్‌డీఏ తరఫున న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి గడువు కావాలని కోరగా న్యాయమూర్తి.. విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.
Subscribe to:
Post Comments (Atom)
ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?
దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment