గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీలో పెనుమాక, ఉండవల్లి, పాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం, మల్లెంపూడి, చిర్రావూరు గ్రామాలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 6న జీవో 97ను జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన కళ్లెం రాజశేఖర్‌రెడ్డితో పాటు మరికొందరు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ల్యాండ్‌పూలింగ్ కింద ఇప్పటికే తాము ఎంతో విలువైన భూమిని కోల్పోయామని, ఆ భూమికి బదులుగా ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదని పిటిషనర్లు వాపోయారు. ఆ ప్లాట్ల కోసం తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఉగాదినాడు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అయితే, తాడేపల్లి మండల పరిధిలో పంపిణీకి భూమి లభించకపోవడంతో తమ గ్రామాలను ఆ మండలంలో విలీనం చేశారని తెలిపారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలు సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాజధాని పరిధిలోనివని, అందువల్ల వాటిని డీనోటిఫై చేయకుండా మున్సిపాలిటీలో కలపలేరని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?
దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
No comments:
Post a Comment