Feb 16, 2020

అమరావతి ఉద్యమానికి సహకారం! - తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం



v ప్రభుత్వం రైతులను నట్టేట్లో ముంచిపోవటం కరెక్టు కాదు.  రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి మా సహకారం ఉంటుంది. అయితే, మాది పక్క రాష్ట్రం అయినందున.. అమరావతికి దీర్ఘకాలికంగా లాభించే విధంగా మాట్లాడాలి. అప్పుడే.. రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటాలకు ఫలితం ఉంటుంది.
v ఓ వివాహ వేడుక కోసం ఆదివారం తెనాలి వెళ్తున్న ప్రొఫెసర్‌ కోదండరాంను రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఓ హోటల్‌లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
v పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే రాజధానికి భూములు ఇచ్చామని, అయితే, వ్యక్తి మీద ఉన్న కోపాన్ని వ్యవస్థ మీద చూపుతూ తమ బతుకుల్ని అగాధంలోకి నెడుతున్నారని వైసీపీ ప్రభుత్వ తీరుపై రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. 61 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని, 40 మందికి  పైగా రైతులు, రైతుల కూలీలు చనిపోయినా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...