Oct 22, 2018

యుద్ధప్రాతిపదికన తుపాను సహాయక చర్యలు

Ø జాతీయ విపత్తుగా ప్రకటించమని కేంద్రాన్ని కోరిన సీఎం
Ø  ప్రభుత్వ సిబ్బంది పనితీరుకు ప్రశంసలు
Ø  విరివిగా విరాళాలు ఇస్తున్న దాతలు
Ø ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం


                  
రాష్ట్ర ప్రభుత్వంముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యుద్ధప్రాతిపదికన తిత్లీ తుపాను సహాయక చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. మంత్రులుప్రజాప్రతినిధులు,అధికారులుప్రభుత్వ సిబ్బంది దసరా పండుగను కూడా జరుపుకోకుండా నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ తుపాను ఉత్తరాంధ్రను వణికించిముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఇంతటి బీభత్సం ఎన్నడూలేదు. ఈ విధ్వంసం చీకటి అధ్యాయాన్ని మిగిల్చింది. జిల్లాలో ప్రాణ నష్టంతోపాటు ఆస్తులుపంటపొలాలకు భారీ నష్టం జరిగింది. జిల్లాలోని నదులన్నింటినీ వరద ముంచెత్తింది. కొన్ని గ్రామాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలతోపాటు భారీ వృక్షాలు సైతం కుప్పకూలాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయిపంట పొలాలు తుడిచిపెట్టుకుపోయి జిల్లా ప్రజల జీవితాలు తల్లకిందలయ్యాయి. అనేక గ్రామాల ప్రజలు తింటానికి తిండిలేకతాగడానిక నీరులేక అల్లాడిపోయారు. ఈ పరిస్థితులలో సీఎం చంద్రబాబుఇతర మంత్రులు అక్కడే మకాంవేసి ఆ జిల్లా ప్రజలకు అన్నివిధాల అండగా ఉన్నారు. ప్రతి రోజూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూటెలికాన్షరెన్సులు నిర్వహిస్తూ సహాయక చర్యలు చురుకుగా జరిగేందుకు దోహదపడ్డారు. ఈ తుఫాను వల్ల రూ.3,435.29 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.  2.25 లక్షల కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగింది.  49,112ఇళ్లు దెబ్బతిన్నాయి. 1.65లక్షల హెక్టార్లలో వ్యవసాయం,17,109హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌శాఖకు రూ.505కోట్లురోడ్లురహదారులుభవనాల శాఖ పరిధిలో రూ.406 కోట్లుపంచాయతీరాజ్‌గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.140 కోట్లువ్యవసాయ రంగానికి రూ.802 కోట్లుఉద్యానశాఖ పరిధిలో వెయ్యి కోట్లుపశు సంవర్ధక శాఖకు రూ.50 కోట్లుమత్స్యశాఖ పరిధిలో రూ.50 కోట్లుగ్రామీణ నీటి సరఫరాకు రూ.100 కోట్లు,సాగునీటి శాఖలో రూ.100 కోట్లుఇళ్లు దెబ్బతినడం ద్వారా రూ.220 కోట్లుపౌరసరఫరాల శాఖకు రూ.50 కోట్లువైద్య,ఆరోగ్యశాఖకు రూ.కోటిపట్టణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.9 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి, తక్షణం రూ.1200 కోట్ల సాయం అందించాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు.
 సహాయక చర్యలపై ప్రజల సంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది.  విద్యుత్ సరఫరా పనుల్లో 10 వేల మంది పనిచేస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి  200 మంది చొప్పున 12జిల్లాల నుంచి సిబ్బంది వచ్చి పని చేస్తున్నారు. మొత్తం 1,802గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, 1,369 గ్రామాలకు విద్యుత్ ఇచ్చారు. మిగిలిన 433 గ్రామాలకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్దరించే పనిలో సిబ్బంది ఉన్నారు. వ్యవసాయంపశుసంవర్థకఉద్యానవన,మత్స్య విభాగాలలో జరిగిన నష్టాలను దాదాపు అంచనా వేశారు. గతంలో ఎన్నడూ ఇవ్వనంత త్వరగా పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వ యంత్రాంతం కృషి చేస్తోంది. ఈ నెలాఖరుకే బాధితుల బ్యాంకు ఖాతాలలో  నష్ట పరిహారం  జమ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  ఆర్టీసి బస్ సర్వీసులన్నీ పునరుద్దరించారు. టెలికం కనెక్టివిటీ 99.7 శాతం పూర్తయ్యింది. 1,329 పాఠశాలల్లో 1,59,000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. 47వేల గుడ్లు పంపిణీ చేశాం.  రోజుల్లో 8.47లక్షల మందికి భోజనాలు అందజేశారు. కార్డులతో సంబంధంలేకుండా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.  విద్యుత్ సరఫరా కోసం 232 జనరేటర్లు పనిచేస్తున్నాయి. 184 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని రవాణా చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సురక్షితమైన నీరు అందించడానికి ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు బాగా ఉపయోగ పడుతున్నాయి. 11,700 మంది శానిటరీ సిబ్బంది బ్లీచింగ్క్లోరినేషన్,ఫాగింగ్ పనులు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 248 ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.700 మంది రోగులకు చికిత్స అందించారు. ముఖ్యంగా అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు.  జిల్లాలోని పాఠశాలలన్నింటిలోని విద్యార్థులకు వైద్య పరిక్షలు చేయడానికి ఏర్పాటు చేశారు.  చెట్ల తొలగింపునకు క్రేన్లను,  1,000 విద్యుత్ రంపాలను తెప్పించారు. రోడ్లపైనపొలాల్లో చెట్ల తొలగింపు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 34 ఫైర్ సర్వీసెస్ బృందాలు, 24ఎస్ డిఆర్ ఎఫ్ బృందాలు ఈ పనుల్లో నిమగ్నమయ్యాయి. పొలాలలో కూలిపోయిన చెట్లను తొలగించే పనులను  గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసింది.  ప్రస్తుతానికి చాలా వరకు సమస్యలు ఒక కొలిక్కి వచ్చాయి.

 మానవతా దృక్పదంతో దాతలు అనేకమంది ముందుకు వస్తున్నారు. కోట్ల రూపాయల విరాళాలు అందజేస్తున్నారు. స్మార్ట్ ఏపి ఫౌండేషన్సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇస్తున్నారు. దీనిని దృష్టిలోపెట్టుకుని  ప్రభుత్వం తుపాను బాధితుల కోసం విరాళాల సేకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది.apcmrf.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి ఆన్ లైన్ లో దాతలు  విరాళం చెల్లించిన వెంటనే దాతల పేరుతో సీఎం సంతకమున్న ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. దేశ విదేశాల నుంచి ప్రజలు నేరుగా విరాళాలు పంపేందుకు వీలుగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొందరు గ్రామాలను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.  తిత్లీ ఉద్దానం రికనస్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్ (తూర్పు)కు స్పందన బాగా వుంది. ప్రభుత్వ సిబ్బంది దసరా ఉత్సవాలు కూడా చేసుకోకుండాకుటుంబసభ్యులకు దూరంగా పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. వారి స్ఫూర్తిని దెబ్బతీసేలా గొడవలు చేయవద్దనిసహాయ చర్యలకు ఆటంకాలు కల్పించవద్దనిచేతనైతే తలా ఓ చేయివేసి సహాయక చర్యల్లో  భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Oct 19, 2018


కాలేయ వ్యాధుల నియంత్రణకు విస్తృత ప్రచారం
అధికారులను ఆదేశించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
                   
            సచివాలయం, అక్టోబర్ 19: వైరస్ వల్ల వచ్చే కాలేయ సంబంధిత వ్యాధుల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టి, ప్రజలకు అవగాహన కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ వైరల్ కాలేయ సంబంధిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్.వి.హెచ్.సీ.పీ-నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం) రాష్ట్రంలో అమలుపై తమ శాఖ అధికారులతో ఆమె చర్చించారు. ఈ రకమైన వ్యాధులను 2030 నాటికి దేశంలో నియంత్రించవలసిన అవసరాన్ని కేంద్రప్రభుత్వం గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. త్రాగునీరు, ఆహారం ద్వారా హెపటైటిస్ ఏ వైరస్(హెచ్ఏవి), ఇ వైరస్ వ్యాపిస్తుంది. హెపటైటిస్ బి, సి వైరస్ లు హెచ్ఐవీ మాదిరిగా రక్తం, రక్తం సంబంధిత ద్రవాలు, స్త్రీ-పురుషులు కలవడం ద్వారా, తల్లి నుంచి బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంది. బి, సి వైరస్ ల వల్ల మానవ శరీరంలో అత్యంత శక్తివంతమైన లివర్ శక్తి కోల్పోయి సెర్రోసిస్ గా మారుతుంది. ఆ తరువాత క్రమంగా క్యాన్సర్ కు దారి తీస్తుంది. ఈ వైరస్ లు సోకిన వారిలో 96 శాతం మంది మృతి చెందే ప్రమాదం ఉంది. అందువల్ల రాష్ట్రంలో ఈ వైరస్ ల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పూనం మాలకొండయ్య నిర్ణయించారు. వైద్య ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, స్వచ్ఛభారత్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆమె చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వ్యాధి నిర్థారణ కేంద్రాలను అభివృద్ధిపరచాలన్నారు. కర్నూలు, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలలోని మెడికల్ కాలేజీలలో చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. విస్తృతమైన ప్రచారం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి నవంబర్ 1 లోపల ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. హెచ్.బి. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకురావలని చెప్పారు. పుట్టిన ప్రతిబిడ్డకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. అవసరమైనవారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్సకు చర్యలు చేపట్టాలని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు విధిగా పరీక్షలు చేయించాలన్నారు. ఆటో డిజబుల్ సిరంజిలను విస్తృతంగా వాడుకలోకి తీసుకురావాలన్నారు. పారిశుద్ధ్యం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాల గురించి ప్రచారం చేయాలని చెప్పారు. గ్రామాలలో త్రాగునీటిని పరీక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం అమలులో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవాలన్నారు. ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న పంజాబ్ రాష్ట్రంలో నియంత్రణకు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయమని పూనం ఆదేశించారు.  
               రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేయడం, సాధించవలసిన లక్ష్యాలను, రాష్ట్ర నోడల్ కేంద్రం ఏర్పాటు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్స్ సీల అభివృద్ధి, మొడల్ చికిత్సా కేంద్రాలు, అందుబాటులో ఉండవలసిన సిబ్బంది, జిల్లా డయాగ్నస్టిక్ కేంద్రాలు, మందులు, డిస్పోజబుల్ సిరంజిలు తదితర అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ బాబ్జీ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Oct 17, 2018



చేనేతకు ప్రభుత్వం చేయూత

v నేత విరామ భృతి ఇవ్వడానికి నిర్ణయం
v 23,353 మందికి రూ.110 కోట్ల రుణ మాఫీ
v గుర్తింపు కార్డులు ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ
v 25 వేల మందికి అదనంగా పించన్
v 1,18,622 మందికి గుర్తింపు కార్డులు
v 87,677 మందికి వృద్ధాప్య పెన్షన్
v 55,500 మందికి వడ్డీ సబ్సిడీ
v త్వరలో చేనేత కార్పోరేషన్ ఏర్పాటుచేసే అవకాశం
     

రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.   వ్యవసాయం రంగం తరువాత అత్యధిక మంది ఆధారపడేది చేనేత పరిశ్రమే. దేశంలో 2.5 కోట్ల మంది, రాష్ట్రంలో 11 లక్షల మంది ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ  ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాకాలంలో గుంటలలో నీరు చేరి వృత్తి కొనసాగించలేని దయనీయ స్థితి వారిది. పనిలేకపోతే తిండి ఉండదు. అప్పులపాలై, ఆ అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వర్షాకాలంలో వృత్తి కోల్పోతున్న తమకు నేత విరామ భృతి ఇవ్వాలని చేనేత కార్మికులు ఎంతోకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు పరిస్థితిని అర్ధం చేసుకొని వర్షాకాలంలో రెండు నెలల పాటు చేనేత కార్మిక కుటుంబానికి నెలకు రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అక్టోబర్ 5వ తేదీన  జరిగిన మంత్రి మండలి సమావేశం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్రంలో 90,765 చేనేత కుటుంబాలు ప్రయోజనం చేకూరుతుంది. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో వారి జనాభా 2,18,029గా వుంది. అదేవిధంగా ఆప్కో(ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్) వ్యాపారాభివృద్ధికి వీలుగా రూ.150 కోట్ల మార్జిన్ మనీ సహాయం మంజూరుకు ప్రభుత్వం గ్యారంటీగా వుండేందుకు కూడా మంత్రిమండలి అంగీకరించింది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2014-15  నుండి 2017-18 వరకు 4 ఏళ్లలో చేనేత జౌళి శాఖ ద్వారా వారి సంక్షేమానికి ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. చేనేత కార్మికుల రుణ మాఫీ పథకం  క్రింద  23,353 మందికి రూ.110 కోట్ల రుణాలు  మాఫీ చేసింది.  వృద్దాప్య పించను రూ.200 నుండి రూ.1000 కు పెంచింది.  ఈ పథకం  ద్వారా  25వేల మంది చేనేత కార్మికులకు అదనంగా పించన్ మంజూరు చేశారు. పెన్షన్ పొందేవారి వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించారు. మొత్తం 87,677  మందికి వృద్ధాప్య పెన్షన్ అందజేస్తున్నారు. ఇంకా 10,583 మంది పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది.  బ్లాక్ లెవల్ చేనేత క్లస్టర్ల క్రింద  33,446 మంది చేనేత కార్మికులు రు.15.80 కోట్ల మేర లబ్ది పొందారు. వడ్డీ సబ్సిడీ/పావలా వడ్డీ పథకం ద్వారా 55,500 మంది చేనేత కార్మికులకు రు.16.86 కోట్ల మేర లబ్ది చేకూరింది. నేత కార్మికుల ఆర్ధిక సహాయ పథకం  క్రింద  23,582 మందికి రు.26.62 కోట్లు అందజేశారు. మరమగ్గాల కార్మికులకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ పథకం  క్రింద  42,592 మంది చేనేత కార్మికులకు  రు.17.59 కోట్లు మంజూరు చేశారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ(ఎన్ హెచ్ డీసీ), ఆప్కో నుంచి  హ్యంక్ యారన్, డైస్ కెమికల్స్ వంటి ముడి సరకుల కొనుగోలుపై 20 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ఈ పథకం క్రింద 66,900 మంది చేనేత కార్మికులకు రు.20.08 కోట్లు విడుదల చేశారు. సహకార చేనేత కార్మికుల పొదుపు నిధి క్రింద 18,091 చేనేత కార్మికులు రు.6.38 కోట్ల మేర లబ్ది పొందారు. మైక్రో యూనిట్స్  డెవలప్ మెంట్  అండ్  ఫైనాన్సు ఏజెన్సీ(ఎమ్ యుడిఆర్  - ముద్ర) పథకం క్రింద 10,209 మంది నేత కార్మికుల కోసం బ్యాంకుల ద్వారా  రు.52.27 కోట్లు మంజూరు చేశారు. దేశంలో చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సహకార సంఘాల ద్వారా 1,18,622 మందికి, ఇతరులకు 1,44,950 మందికి చేనేత, జౌళి శాఖ  కార్డులు అందజేశారు.

               చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడానికి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత కులాలు, ఆ వర్గాల యువత, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని,   ప్రభుత్వం చేనేత పైనాన్స్ కార్పోరేషన్ లేక చేనేత ఆర్థిక మండలి ఏర్పాటుచేయాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి  విధివిధానాలు రూపొందించడానికి చేనేత, జౌళి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక బడ్జెట్ తో కార్పోరేషన్ ఏర్పాటైతే  చేనేత  వృత్తి చేసుకోవడానికి ఆర్ధిక సహకారం, వడ్డీలేని రుణాలు, రాయితీతో కూడిన రుణాలు,  చేనేత కార్మికుల ఆడపిల్లల వివాహ వంటి కార్యక్రమాలకు నగదు ప్రోత్సాహం, పిల్లల చదువులకు ఆర్ధిక సహకారం, చేనేత బజారులు ఏర్పాటుకు సహకారం,  చేనేత పింఛనులు, వ్యాపార విస్తరణ, ఆప్కోకు రివాల్వింగ్ ఫండ్, నేత కార్మికులకు ఆరోగ్య భద్రత, వృత్తి భద్రత, బీమా భద్రత, మరణించిన కార్మికులనికి దహన సంస్కారాలకు కూడా సహాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్పోరేషన్ కు ఏడాదికి రూ.1000 కోట్ల వరకు  నిధులు కేటాయించే అవకాశం ఉంది. అయితే రెండు వేల కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్, చేనేత కులాల నాయకులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు.  రాష్ట్రంలో దాదాపు 19 చేనేత కులాలు ఉన్నాయి.  రాష్ట్ర జనాభాలో  13 శాతం మంది వారు ఉన్నారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాడే చరకా(చక్రం)ని కనిపెట్టిన శాస్త్రజ్ఞులు వీరు. రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల్లో ఈ కులాల నుంచి ఒక్కరు కూడా లేరు.  చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.  ఈ పరిస్థితులలో చేనేత కులాలను కలపడానికి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 35 చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు-ఓటములు నిర్ణయించగల స్థితిలో చేనేత కులాల వారు ఉన్నారు.

-      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
 S.Nagarjuna Rao,
Senior Journalist,
5-500/B/9, 5th Line,
Anjaneya Colony,
MANGALAGIRI-522503


Oct 15, 2018

చేనేతకు ప్రభుత్వం చేయూత

v నేత విరామ భృతి ఇవ్వడానికి నిర్ణయం

v 23,353 మందికి రూ.110 కోట్ల రుణ మాఫీ

v గుర్తింపు కార్డులు ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ

v 25 వేల మందికి అదనంగా పించన్

v 1,18,622 మందికి గుర్తింపు కార్డులు

v 87,677 మందికి వృద్ధాప్య పెన్షన్

v 55,500 మందికి వడ్డీ సబ్సిడీ

v త్వరలో చేనేత కార్పోరేషన్ ఏర్పాటుచేసే అవకాశం

 

      రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయం రంగం తరువాత అత్యధిక మంది ఆధారపడేది చేనేత పరిశ్రమేదేశంలో 2.5 కోట్ల మందిరాష్ట్రంలో 11 లక్షల మంది ప్రత్యక్షంగా గానీపరోక్షంగా గానీ  ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారువర్షాకాలంలో గుంటలలో నీరు చేరి వృత్తి కొనసాగించలేని దయనీయ స్థితి వారిదిపనిలేకపోతే తిండి ఉండదుఅప్పులపాలైఆ అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారువర్షాకాలంలో వృత్తి కోల్పోతున్న తమకు నేత విరామ భృతి ఇవ్వాలని చేనేత కార్మికులు ఎంతోకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకొని వర్షాకాలంలో రెండు నెలల పాటు చేనేత కార్మిక కుటుంబానికి నెలకు రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారుఅక్టోబర్ 5వ తేదీన  జరిగిన మంత్రి మండలి సమావేశం ఆ మేరకు నిర్ణయం తీసుకుందిదీని వల్ల రాష్ట్రంలో 90,765 చేనేత కుటుంబాలు ప్రయోజనం చేకూరుతుందిప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో వారి జనాభా 2,18,029గా వుంది. అదేవిధంగా ఆప్కో(ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్) వ్యాపారాభివృద్ధికి వీలుగా రూ.150 కోట్ల మార్జిన్ మనీ సహాయం మంజూరుకు ప్రభుత్వం గ్యారంటీగా వుండేందుకు కూడా మంత్రిమండలి అంగీకరించిందిరాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2014-15  నుండి 2017-18 వరకు ఏళ్లలో చేనేత జౌళి శాఖ ద్వారా వారి సంక్షేమానికి ప్రభుత్వం వివిధ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందిచేనేత కార్మికుల రుణ మాఫీ పథకం  క్రింద  23,353 మందికి రూ.110 కోట్ల రుణాలు  మాఫీ చేసింది.  వృద్దాప్య పించను రూ.200 నుండి రూ.1000 కు పెంచింది.  ఈ పథకం  ద్వారా  25వేల మంది చేనేత కార్మికులకు అదనంగా పించన్ మంజూరు చేశారు. పెన్షన్ పొందేవారి వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించారుమొత్తం 87,677  మందికి వృద్ధాప్య పెన్షన్ అందజేస్తున్నారుఇంకా 10,583 మంది పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది.  బ్లాక్ లెవల్ చేనేత క్లస్టర్ల క్రింద  33,446 మంది చేనేత కార్మికులు రు.15.80 కోట్ల మేర లబ్ది పొందారువడ్డీ సబ్సిడీ/పావలా వడ్డీ పథకం ద్వారా 55,500 మంది చేనేత కార్మికులకు రు.16.86 కోట్ల మేర లబ్ది చేకూరిందినేత కార్మికుల ఆర్ధిక సహాయ పథకం  క్రింద  23,582 మందికి రు.26.62 కోట్లు అందజేశారుమరమగ్గాల కార్మికులకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ పథకం  క్రింద  42,592 మంది చేనేత కార్మికులకు  రు.17.59 కోట్లు మంజూరు చేశారుజాతీయ చేనేత అభివృద్ధి సంస్థ(ఎన్ హెచ్ డీసీ), ఆప్కో నుంచి  హ్యంక్ యారన్, డైస్ కెమికల్స్ వంటి ముడి సరకుల కొనుగోలుపై 20 శాతం సబ్సిడీ ఇస్తున్నారుఈ పథకం క్రింద 66,900 మంది చేనేత కార్మికులకు రు.20.08 కోట్లు విడుదల చేశారుసహకార చేనేత కార్మికుల పొదుపు నిధి క్రింద 18,091 చేనేత కార్మికులు రు.6.38 కోట్ల మేర లబ్ది పొందారు. మైక్రో యూనిట్స్  డెవలప్ మెంట్  అండ్  ఫైనాన్సు ఏజెన్సీ(ఎమ్ యుడిఆర్  ఎముద్రపథకం క్రింద 10,209 మంది నేత కార్మికుల కోసం బ్యాంకుల ద్వారా  రు.52.27 కోట్లు మంజూరు చేశారుదేశంలో చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచిందిసహకార సంఘాల ద్వారా 1,18,622 మందికిఇతరులకు 1,44,950 మందికి చేనేతజౌళి శాఖ  కార్డులు అందజేశారు.

 


చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడానికి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందిచేనేత కులాలు, ఆ వర్గాల యువత, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని,   ప్రభుత్వం చేనేత పైనాన్స్ కార్పోరేషన్ లేక చేనేత ఆర్థిక మండలి ఏర్పాటుచేయాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి  విధివిధానాలు రూపొందించడానికి చేనేతజౌళి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారుప్రత్యేక బడ్జెట్ తో కార్పోరేషన్ ఏర్పాటైతే  చేనేత  వృత్తి చేసుకోవడానికి ఆర్ధిక సహకారంవడ్డీలేని రుణాలురాయితీతో కూడిన రుణాలు చేనేత కార్మికుల ఆడపిల్లల వివాహ వంటి కార్యక్రమాలకు నగదు ప్రోత్సాహంపిల్లల చదువులకు ఆర్ధిక సహకారంచేనేత బజారులు ఏర్పాటుకు సహకారం,  చేనేత పింఛనులువ్యాపార విస్తరణఆప్కోకు రివాల్వింగ్ ఫండ్నేత కార్మికులకు ఆరోగ్య భద్రతవృత్తి భద్రతబీమా భద్రతమరణించిన కార్మికులనికి దహన సంస్కారాలకు కూడా సహాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్పోరేషన్ కు ఏడాదికి రూ.1000 కోట్ల వరకు  నిధులు కేటాయించే అవకాశం ఉందిఅయితే రెండు వేల కోట్ల రూపాయలతో చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్, చేనేత కులాల నాయకులు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు.  రాష్ట్రంలో దాదాపు 19 చేనేత కులాలు ఉన్నాయి రాష్ట్ర జనాభాలో  13 శాతం మంది వారు ఉన్నారుక్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాడే చరకా(చక్రం)ని కనిపెట్టిన శాస్త్రజ్ఞులు వీరురాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల్లో ఈ కులాల నుంచి ఒక్కరు కూడా లేరు.  చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడంనాయకత్వం లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితులలో చేనేత కులాలను కలపడానికి వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తీవ్రంగా కృషి చేస్తోందిరాష్ట్రంలోని దాదాపు 35 చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు-ఓటములు నిర్ణయించగల స్థితిలో చేనేత కులాల వారు ఉన్నారు.

 

-      శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్- 9440222914