Apr 10, 2023

గోలి మధు ‘సంఘర్షణ’ పుస్తక సమీక్ష


గోలి మధు కలానికి పదును, దూకుడు కూడా ఎక్కువే. ఆయన కవిత్వంలో   అక్షర, పద విన్యాసాలు కనిపిస్తాయి. పదాలలో  ఎంత పొదుపో, భావాలలో  విస్తృతి అంత ఎక్కువ. ఈ  విషయంలో   ఉపాధ్యాయురాలైన ఆయన అమ్మ గారి  ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అభ్యుదయ కవిగా పేరు గడించిన గోలి మధు ప్రగతిశీల కవిత్వం  రాయడంలో దిట్ట. భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021), గమనం(2021) వంటి కవితా సంకలనాలు అందించారు. పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో 2020లో వచ్చిన ఆయన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి 2021లో రెండవ ముద్రణకు నోచుకుందంటే ఆయన కవిత్వంలో ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు.  అదే ఆవేశంతో, పదునెక్కిన ఆలోచనలతో తనలో తను ఘర్షణ పడి 47 లఘు, 38 మినీ మొత్తం 


85 కవితలతో ‘సంఘర్షణ’ అనే కవితా సంపుటి తెచ్చారు. సమాజంలోని రుగ్మతలను సరిదిద్దాలన్న మధు ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిందే ప్రగతిశీల కవిత్వం పేరుతో రాసిన ఈ ‘సంఘర్షణ’. 2020 నుంచి  2023 జనవరి వరకు రాసిన కవితలు ఇందులో ఉన్నాయి. 


అభ్యుదయ సాహితీవనంలో విరబూసిన ఎర్ర గులాబీ గోలి మధు. ఆయన  ఉవ్వెత్తున లేచే కెరటం. ఓ మెరుపు. మధు భాషా - భావం రెండూ పదునైనవే. అతి సాధారణ పదాలలో అద్భుతమైన భావం పలికించగల కవి మధు. ఉద్ధండులైన సాహితీవేత్తలను కూడా ఆశ్చర్యపరిచేవిధంగా కవిత్వం రాయగలిగిన స్రష్ట మధు. ఆయన కవిత్వంలోని సారాన్ని ఎవరికి వారు ఆస్వాదించవలసిందే.  మచ్చుకు ఓ కవితలోని రెండు లైన్లు...‘‘అక్షరానికి ఆవేశం చల్లారింది.అందుకే.. ప్రశ్నించడం మానేసింది.’’అన్నారు. ఇందులో నుంచి ఎన్ని అర్థాలు స్ఫురిస్తాయో ఆలోచించండి. ప్రశ్నించడం మానేసినా, ఆలోచించడం మానకూడదు. ‘‘అక్షరానికి పక్షపాతం ఆవహించింది, అందుకే పక్షవాతంతో కులమతాల చిచ్చులకు ఆజ్యమైంది’’ అని స్పష్టం చేశారు. మరోచోట ‘‘పీడితులే నా కలానికి ఆరాధ్యులు.దేశం గుండెఘోష నా సిరా.పీడకులపైనే నా కలం దాడి.దేశం గుండెల్లో, పీడితుల ఎదలో రగిలే జ్వాల ఈ సంఘర్షణ. అడుగడుగునా అంధకారం ఆవరిస్తే, అక్షరం దీపమై అడుగులు మొదలుపెట్టాలి’’ అంటాడు మధు. ఆ అడుగులే ఈ ‘సంఘర్షణ’. సంఘర్షణ అనేక రూపాలలో, అనేక అర్థాలలో ఉంటుంది. 

అక్షరాలు అరుణ వర్ణం కోల్పోయాయని, అవి తల్లక్రిందులవడంతో దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య భారతదేశ సంపదంతా ప్రైవేటీకరణపేరుతో కార్పోరేట్ల కబంధ హస్తాల్లో ఒదిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ తెలిసిన నడుస్తున్న చరిత్ర ఇది. ‘‘సంక్షోభంలోకి దేశం దిగజారుతున్నా  పాలన మారనందుకు చోద్యంగా ఉంది’’అని ఆందోళన వ్యక్తం చేశారు. గగ్గోలు పెట్టారు. ‘‘చైతన్య రహితమైన సంఘాన్ని చూస్తే భయమేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం ఎంత చైతన్యహీనంగా తయారైందో స్పష్టంగా చెప్పారు. 

‘‘గుండ్రని నా అక్షరం దొర్లుతూ వెళితే, 

పీడితుల పాదాలు తాకే పూల చెండు!

దూసుకెళితే పీడకులపై దాడిచేసే ఫిరంగి గుండు!’’

సమాజంలో ఉన్న అన్ని అంశాలపై ఆయన కవితలు రాశారు. రాస్తున్నారు. రాస్తారు. వాటిలో రైతుల వెతలు తప్పక ఉంటాయి. రైతు ప్రాధాన్యతను మధు అంతగా గుర్తించారు.  రైతంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ,అభిమానం. దేశ వెన్నెముక వెన్ను విరుస్తూ 700 మంది రైతుల బలిదానాలకు

కంట తడి చూపలేని అంధ దేశభక్తుడిని అని తనను తాను తిట్టుకున్నాడు. అదే సంఘర్షణ.బోధన విషయానికి వస్తే, ‘‘ లోకం పోకడ నేర్పక, మనసుకు జ్ఞానం ఇంకక, బట్టీపట్టే ర్యాంకుల పంటలే అగుపిస్తాయిక్కడ!’’ అని నేటి చదువుల తీరును ఎండగట్టారు. చిన్నప్పటి నుంచి పెట్టుకునే నుదుట బొట్టును ఆయన రాలిపోగానే తుడిచేస్తారెందుకు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారున్నారా? ‘‘వాడెవడో మనువంట-మగడు మరణించాక-మగువకు మనుగడ ఎందుకంటూ మరణశాసనం రాశాడు’’ అని మండిపడ్డాడు. సమాజంలో మహిళల స్థానం, వారి ఆక్రోశం, ఆలోచన, ఆశలను చక్కగా, స్పష్టంగా తెలిపారు.పెరుగుతున్న నిత్యావసర వస్తువుల విషయంలో ‘‘గడపదాటి గద్దించండి, స్త్రీ శక్తితో అధికారానికి అసలు అర్ధం చెప్పండి’’అని మహిళలకు పిలుపునిచ్చాడు.  

చేవ చచ్చి, చైతన్యం లోపించి నీరుగారిపోతున్న పోరాటాలకు సరికొత్త ఒరవడి అద్దిన ఉద్యమరైతుని శ్లాఘించారు. అధికార మదాంధుల వెన్నులో వణుకు పుట్టించిన దేశం వెన్నెముకగా ఉద్యమ రైతుని పోల్చి సలాం చేశారు.75 ఏళ్లుగా నాయకులు ఇచ్చే స్థితిలోనే ఉన్నారని, ప్రజలు మాత్రం పుచ్చుకుంటూ ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని నేటి రాజకీయాలు, ఆ రాజకీయాల్లో ఓటర్ల తీరును చక్కగా వర్ణించారు.

పుస్తకం మొత్తం చదివితే కవి ఎవరెవరితో, ఏ రకమైన ఆలోచనలతో, సామాజిక పరిస్థితులతో, తనలోని తనతో....ఎన్నివిధాల సంఘర్షణ పడ్డాడో తెలుస్తుంది. ఎంత అంతర్మథనం పడ్డాడో అర్థమవుతుంది.  ఆ సంఘర్షణలో నుంచి మెరుపులు వచ్చాయి. ఉవ్వెత్తున పడిలేచే  కెరటాలొచ్చాయి. ఆవేశం, ఆక్రోశం వచ్చాయి. కొత్తకొత్త ఆలోచనలు వచ్చాయి. కొత్త కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. అలా ఈ  ‘సంఘర్షణ’ కవిత్వం పుట్టుకొచ్చింది. 

సమీక్షకులు: శిరందాసు నాగార్జున రావు, 

సీనియర్ జర్నలిస్టు.9440222914


సంఘర్షణ (కవితా సంపుటి)

కవి : గోలి మధు - 9989186883

పేజీలు : 110

వెల : రూ.80

తొలి ముద్రణ : ఫిబ్రవరి, 2023

ముద్రణ : యు.ఎస్.ఆర్. పబ్లికేషన్స్, నులకపేట, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా

ప్రతులకు : రేకా క‌ృష్ణారావు

ఎన్సీసీ రోడ్డు, మంగళగిరి- 522503

సెల్ నెం.:9848199098



అడ్రెస్:

S.Nagarjuna Rao,

203,Satyasai Nilayam

Ippatam Road

Beside Chamundeswari Temple

MANGALAGIRI -522503



 





Jan 24, 2023

ఆందోళన కలిగిస్తున్న టెక్ ఉద్యోగుల తొలగింపు

పోరాటాల వేదికగా  సామాజిక మాధ్యమం

ప్రైవేట్ రంగంలోని మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్‌లు గత కొన్ని నెలలుగా భారీ స్థాయిలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో వేలాది మంది భారతీయ యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోంది. ఈ తొలగింపుల ప్రక్రియ ఇప్పట్లో ఆగేలాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి కంపెనీలు లక్షా 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. 2023 వచ్చిన తరువాత ఈ నెల 16వ తేదీ వరకు రోజుకు 1600 మందిని తొలగించినట్లు అంచనా.  ఆర్థిక వ్యవస్థపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా లాంటి పెద్ద టెక్‌ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించాయి. సిస్కో సంస్థ గత డిసెంబరులో 4 వేల మందిని తొలగించింది. అమెజాన్ 18 వేల మందిని, మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 12 వేల మందిని తొలగించేందుకు సిద్ధమయ్యాయి. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ ఇంజ‌నీరింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌, ప్రొడ‌క్ట్ డిజైన్‌ స‌హా ప‌లు విభాగాల్లో ఉద్యోగుల‌ను తొల‌గించిన‌ట్టు పలు నివేదికలు వెల్ల‌డిస్తున్నాయి.   ఈ తొలగింపుల కారణంగా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

అయితే, ఈ ఉద్యోగులు గతంలో మాదిరి కాకుండా దీనిపై పోరాడేందుకు సమాయత్తమవుతున్నారు. అత్యధిక మందిని తొలగిస్తుండటంతో వారు కూడా ఉద్యమాల బాట పట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.   ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది యువతీ-యువకులు తమ మేనేజ్‌మెంట్లతో ఏ విధంగా వ్యవహరించాలో,  దేశంలోని కార్మిక చట్టాలు, కార్మిక హక్కులపై చర్చిస్తున్నారు. గతంలో వామపక్షాలకు చెందిన ట్రేడ్ యూనియన్లు ఇటువంటి ఉద్యమాలలో కార్మికులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో కీలక భూమికను పోషించాయి. శరవేగంగా పెరిగిన సాఫ్ట్ వేర్ రంగంలో వారు చొచ్చుకుపోలేకపోయారు. అంతేకాకుండా, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అత్యధికంగా ప్యాకేజీలు, సౌకర్యాలు, ఆరోగ్య బీమాలు ... వంటివి ఉండటంతో వారు కూడా ట్రేడ్ యూనియన్లను పట్టించుకోలేదు. అంత అవసరం కూడా వారికి రాలేదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత అనేక మార్పులు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం, ఉద్యోగులను తొలగించడం వంటివి కొనసాగుతున్నాయి. దాంతో ఉద్యోగులు ఆందోళనల బాట పట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారికి ఇప్పటి వరకు కార్మిక, ఉద్యోగ ఉద్యమాలతో సంబంధంలేదు. లక్షల్లో ఉద్యోగులను తొలగించడంతో ఒక్కసారిగా వాటి అవసరం ఏర్పడింది.  తొలగింపుల పరంపరతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలోని వారి సహచరుల వలె తమ అసంతృప్తిని తెలిపేందుకు ఇంటర్నెట్ లను ఆశ్రయిస్తున్నారు.

ఆన్ లైన్ నెట్‌వర్క్‌ లను తయారుచేసుకుంటూ యాజమాన్యాలపై తమ పోరాటాన్ని ఎక్కుపెడుతున్నారు. ఉద్యోగాల తొలగింపుపై సహోద్యోగులను కూడగట్టి వారి హక్కులను కాపాడుకునేందుకు, పాత్రికేయులకు సమాచారాన్ని అందిచేందుకు వాట్సాప్, స్లాక్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోతే తొలగించేవారు.  కానీ,  నేడు పనితీరుతో సంబంధం లేకుండా పరిస్థితుల ప్రభావం వల్ల ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణం అయిపోయింది. ఈ పరిణామాలను చూస్తుంటే ఉద్యోగం నుంచి తొలగించడం ఆమోదించిన వ్యాపార పద్ధతిగా మారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.  ట్రేడ్ యూనియన్‌లు మునుపటిలా శక్తివంతంగా లేవు. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులకు సామాజిక మాధ్యమాలే తమ పోరాటాలకు వేదికగా మారుతున్నాయి. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు సామాజిక మాధ్యమాలు ఎంతవరకు ఉపయోగపడుతాయో లేదో తెలియదు గాని ఉద్యోగులను ఐక్యం చేయడంలో, నిరసనలకు ఊపందించడంలో మాత్రం అవి కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.  దేశంలో లక్షలాది మంది కార్మికులు నేటికీ ట్రేడ్ యూనియన్లలో ఉన్నప్పటికీ, మొత్తంగా ట్రేడ్ యూనియన్ల ఉద్యమం సంవత్సరాలుగా బలహీనపడిందనే చెప్పాలి.

 పెరుగుతున్న ప్రైవేట్ రంగ ఉద్యోగాలు, కొత్త కార్మిక సంస్కరణలు, కాంట్రాక్టు పనుల పెరుగుదలతో సహా అనేక ఇతర అంశాలు ట్రేడ్ యూనియన్ల అస్తిత్వాన్ని రోజురోజుకు తగ్గించేశాయి. యాజమాన్యాలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడంలో సామాజిక మాధ్యమాలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో, ఉద్యోగుల పోరాటాల్లో సైతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో సాంప్రదాయకంగా యాజమాన్యాలకు-ఉద్యోగులకు మధ్యవర్తిత్వ వహించే యూనియన్ల అవసరాన్ని సామాజిక మాద్యమాలు తగ్గించేశాయి. రేషనలైజేషన్ పేరుతో 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తామని బైజూస్ అక్టోబరులో ప్రకటించిన తర్వాత ఉద్యోగులు మీడియా ముందుకు వచ్చి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఉద్వాసనకు గురైన ట్విట్టర్ ఉద్యోగులు తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులు తమ బాధలను చెప్పుకోవడానికి, తమ హక్కుల పోరాటం కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.

 తిరువనంతపురంలో తమను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపిస్తూ 140 మంది బైజూస్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కేరళ మంత్రిని కలిసి తమ ఉద్వాసనపై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తిరువనంతపురంలో తమ కార్యకలాపాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు  బైజూస్ ప్రకటించింది. ఆ రకంగా సామాజిక మాద్యమాలు ఉద్యమాలకు ఫలవంతమైన వేదికగా తయారయ్యాయి. ముందుముందు టెక్ ఉద్యోగులు తన బాధలను, నిరసన గళాన్ని వినిపించడానికి సామాజిక మాద్యమాలే వేదకలవుతాయి. అందులో సందేహంలేదు.


- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914
- గుమ్మడి ప్రభాకర్, రాజకీయ, సామాజిక విశ్లేషకులు - 9441278295



Dec 17, 2022

నేను తాకానని.. రిజిస్టర్‌ను శుద్ధి చేశారు!

 కేంద్రసాహిత్య అకాడమీ అవార్ద్  గ్రహీత, పద్మ శ్రీ  కొలకలూరి ఇనాక్‌.

పెనుతుపాన్లకి మహావృక్షాలు కూలొచ్చేమో కానీ గడ్డిపోచకేమీ కాదు. జీవితంలో తుపానులాంటి పరిణామాలనీ అలాగే దాటొచ్చారు కొలకలూరి ఇనాక్‌. గడ్డిపోచలాగే పెనుగాలులకి తలొంచి తప్పించుకుని స్నేహానికి చేయిచాచారు. కూకటివేళ్లతోసహా తనని పెకలించాలనుకున్న చేతుల్ని ఆర్తిగా హత్తుకున్నారు! తనని తక్కువ కులస్థుణ్ణి చేసి ఏడిపించేవాళ్లు... ఓ చారిత్రక పరిణామం చేతిలో పావులు మాత్రమేనని నమ్మారు. ఆ నమ్మకాన్నే కన్నీటి సిరాతో కథలుగా చెప్పారు! ఆ సిరా వెనక ఏముందో ఇలా చెప్పుకొచ్చారు... 

మట్టిలో ఆడుకుంటున్నవాణ్ణల్లా రెక్కలు పట్టుకుని తీసుకొచ్చి మరీ నన్ను ఆ కొత్త వ్యక్తి ముందు నిలబెట్టారు. ఆయన్ని చూపించి ‘దండం దొరా... అని చెప్పరా!’ అన్నాడు మానాన్న. దండం ఎలా పెట్టాలో కూడా చూపించాడు. ఆ వచ్చిన వ్యక్తి వెళ్లిపోయాక నాన్న ‘ఆయన మన స్వామి. ఆయన పొలంలో మనం జీతగాళ్లం. దొర వచ్చినప్పుడు మంచంపైన కూర్చోకూడదు. ఎదుటపడ్డా పక్కకు జరగాలి. ఆయన్ని ముట్టుకోకూడదు. దూరంగా నిల్చునే మాట్లాడాలి!’ అని చెప్పాడు. ఊహ తెలిసి నేను నేర్చుకున్న మొదటి ‘సామాజిక’ పాఠం అదే. వయసు పెరిగేకొద్దీ ఇంకొన్ని నియమాలనీ నేర్చుకున్నా. మా ఊరి చివర్న మా పల్లె ఉంటే... మరో చివర చింతతోపు ఉండేది. ఆ తోపులోనే ఆడుకుంటూ ఉండేవాళ్లం. అక్కడి నుంచి ఊరి ప్రెసిడెంటుగారుండే వీధి మార్గంలో వస్తే పది అడుగుల్లో మా ఇళ్లకు చేరుకోవచ్చు. కానీ ఆ వీధిలోకి నేను అడుగుపెట్టకూడదని చెప్పారు. నడిస్తే ఒళ్లు చీరేస్తారని భయపెట్టారు. ఓరోజు ఆటల్లో పడి మరచిపోయి అటువైపుగా వెళ్లిపోయా! వెళితే అక్కడే కూర్చుని ఉన్నారు ప్రెసిడెంటు. ‘ఎవడ్రా...’ అన్నాడు

గుడ్లురుముతూ. ఆయన అనుచరులు నా రెక్కలు లాగి పట్టుకుని ‘ఊరిచివర బుడ్డోడండీ!’ అన్నారు. ‘ఇంకొక్కసారి ఇలా వస్తే కొంకలిరగ్గొడతా!’ అన్నాడు. వాళ్లు గట్టిగా పట్టుకోవడంతో రెక్కలు బాగా నొప్పి పుట్టి ఏడుస్తూ ఇంటికెళ్లాను. అలా ఊర్లోకి వెళ్లడం నాకు తెలియకుండా చేసినదైతే... తెలిసి చేసిన ‘అపచారం’ ఇంకొకటుంది. మా ఊర్లో వీధి పాఠశాలని ‘సత్రం బడి’ అనేవారు. అక్కడి అయ్యోరు దీర్ఘాలు తీస్తూ ‘క కాకి దీర్ఘమిస్తే కా...’ అని చెబుతుంటే వినడం సరదాగా ఉండేది. ఓసారి రహస్యంగా బడి చివర్న నిల్చుని వింటూ ఆయన కంటపడ్డా. ‘నువ్వెందుకు వచ్చావురా...!’ అంటూ కొట్టబోతే పరుగెత్తి వచ్చేశాను. అప్పట్నుంచీ రోజూ అలా చాటుగా పాఠాలు వినడం, ఆయన కొట్టబోతే పరుగెత్తుకు రావడం ఓ ఆటలా అనిపించేది. అప్పట్లో సరదాగానే ఉన్నా దాని వెనకున్న విషాదం, వివక్ష తర్వాత్తర్వాతే అర్థమయ్యాయి!

పేరు అలా వచ్చింది... 

అప్పుడే మా ఊరికి కొత్తగా ఏబీఎం క్రైస్తవ బడి వస్తే, నన్ను అందులో చేర్చారు.  అక్కడ చేర్చేటప్పుడు నా పేరేమిటో ఎవరికీ తెలియలేదు! నాకు ‘ఇనాక్‌’ అనే పేరుని గుంటూరు నుంచి వచ్చిన క్రైస్తవ మిషనరీ ఎవరో పెట్టారు. కానీ అది నోరు తిరక్క నూకలయ్యా, ఎకోనా అనే పిలుస్తుండేవారు. నన్ను బడిలో చేర్చడానికొచ్చిన అయ్యవారు ఆ రెండు పేర్లకి దగ్గరగా ఉన్న బైబిల్‌ పదం ‘ఇనాక్‌’ అన్నదే నా పేరై ఉంటుందని ఊహించి అటెండెన్స్‌లో రాశారు. నాకూ పదో తరగతి దాకా ఆ పేరు స్పెల్లింగ్‌ సరిగ్గా రాయడం రాదు! అలా చేరిన నేను మూడో తరగతిలోనే బడి మానేయాల్సి వచ్చింది. మా రైతు దగ్గర నాన్నతోపాటూ జీతగాడిగా చేరాల్సి వచ్చింది. ఆ రోజు నుంచీ పశువుల్ని కాసుకురావడం, పేడ తీయటం, వాటిని కడగడం, కుడితి పెట్టడం ఇవే నా పనులయ్యాయి. అలాగే సాగితే నా జీవితం ఏమయ్యుండేదో తెలియదు కానీ... మా పల్లెకొచ్చిన దేవదాస్‌ మాస్టారు నా గీత మార్చాడు. నాలాగా జీతాలకెళుతున్న పిల్లలకి సాయంత్రంపూట ఆయనే పాఠాలు చెప్పేవాడు. నా చేత ఎంట్రన్స్‌ రాయించి నేరుగా ఫస్ట్‌ఫారమ్‌లో చేర్చేశాడు. జీతగాడిగా ఉండిపోవాల్సిన నా జీవితంలో చదువుల దీపం వెలిగించింది ఆయనే. కానీ మూడేళ్లకి మళ్లీ ఆ దీపం కొడిగట్టే పరిస్థితొచ్చింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. అమ్మ ఆ బాధతో మంచానపడడంతో... పట్టించుకునేవాళ్లు లేక నేనూ, మా చెల్లెలూ, తమ్ముడూ దిక్కులేనివాళ్లమైపోయాం.

గట్టి మనిషే... 

మా అమ్మవాళ్లు 14 మంది సంతానం. తనే చివరిపిల్ల కావడంతో కాస్త గారాబంగానే పెంచారు. తల్లిని కోల్పోయి సవతి తల్లి ఆగడాలు భరించలేక ఇల్లొదిలి... మేనమామల పంచన చేరిన నాన్నని అమ్మమ్మవాళ్లు ఇల్లరికం తెచ్చుకున్నారు. ఏ ఆస్తీలేకుండా అనాథగా వచ్చినవాడు కాబట్టి... ఆయన్నీ, ఆయనకు పుట్టిన సంతానమైన మమ్మల్నీ మా బంధువులందరూ చిన్నచూపు చూసేవాళ్లు. ‘అలగావోడు’ అనే పిలిచేవాళ్లు నన్ను. ఓ రకంగా మేం అగ్రకులాల వాళ్ల నుంచే కాకుండా మావాళ్ల నుంచీ తీవ్రమైన వివక్ష ఎదుర్కొనేవాళ్లం. నాన్న అవన్నీ పట్టించుకోడు. వేకువన మా ‘ఆసామి’ 

పొలానికెళ్లి... రోజంతా కష్టపడటం తప్ప ఆయనకేమీ పట్టదు. కానీ అమ్మ అలాకాదు. తిరగబడేది. తిట్టేదీ కొట్టేదీ కూడా. ఒకస్థాయిలో బంధువుల నుంచి దూరంగా ఉండాలనుకుని పల్లెకి దూరంగా సర్కారువాళ్లు చూపిన స్థలంలో ఇల్లుకట్టించింది. నాన్న జీతానికి పోతే వచ్చే వడ్లకి తోడు పశువుల్ని పెంచి పాలమ్మీ, కోళ్లని పెంచీ డబ్బు పోగేసేది. ఆ డబ్బుతోనే ఎకరం పొలం కొంది! అలా అమ్మవల్ల తొలిసారి నాన్న జీవితంలో ఆస్తిపరుడయ్యాడు. కానీ అది జరిగిన ఏడాదిన్నరకే అనారోగ్యంతో చనిపోయాడు. ధైర్యంగా ఉండాల్సిన అమ్మ కుంగిపోయింది. పశువులూ, కోళ్లన్నింటినీ అమ్మి, పొలం కౌలుకిచ్చి ఇంట్లోనే కూర్చుండిపోయింది. నేను చదువు మానేసే పరిస్థితిలో పడ్డాను. కానీ మా అదృష్టం బావుందేమో సర్కారు ఎస్సీ హాస్టళ్లని తెరిచింది. మా మేష్టార్లతో మాట్లాడి తమ్ముణ్ణీ, చెల్లెల్నీ చేర్చాను. నేనూ హాస్టల్లో చేరాను. పదో తరగతి గట్టెక్కాను.

‘పులుల బోను’లోకి... 

టెన్త్‌దాకా క్రైస్తవ స్కూలు, ఇంటర్‌లో గుంటూరు ఏసీ కాలేజీలో చదవడం వల్ల నేనెక్కడా పెద్దగా వివక్షను ఎదుర్కోలేదు... మా ఊరి నుంచి గుంటూరుకి వెళ్లే రైల్లో తప్ప. రైల్లో సీటుదొరికిందికదాని కూర్చుంటే మా గ్రామంలోని అగ్రకులస్థులు ఒప్పుకునేవారు కాదు. నాకన్నా చిన్నపిల్లలైనా సరే నన్ను ‘రేయ్‌ లేచి... అటుపోయి నిల్చో!’ అనేవారు. నోరుమూసుకుని వెళ్లేవాణ్ణి. వాళ్ల కంటపడటం ఎందుకని రైలెక్కగానే మరుగుదొడ్డి పక్కనున్న ఖాళీ స్థలంలోకెళ్లి నిల్చునేవాణ్ణి. కంపే... కానీ ఏం చేస్తాను! వీటన్నింటికీ పరాకాష్ట అనిపించే అనుభవాలు వాల్తేరు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎదురయ్యాయి. అది నాకో పులిబోనులాగే అనిపించింది. బీఏ ఆనర్స్‌ క్లాసులోకి వెళ్లిన తొలిరోజే మొదటి బెంచీలో కూర్చున్నా. మిగతా విద్యార్థులొచ్చి ‘ఇంకెప్పుడూ ఇక్కడ కూర్చోకు. వెనక బెంచీలో కూర్చో పో..!’ అని కసురుకున్నారు. రోజూ మాస్టారు రాకముందే నా సహాధ్యాయి ఒకడు చాక్‌పీస్‌, డస్టర్‌, అటెండెన్స్‌ రిజిస్టర్‌ తెచ్చేవాడు. ఓసారి అతను రాకపోతే నేను వెళ్లి తెచ్చా. అది తెలుసుకుని మాస్టారు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ఆ రోజంతా ఆయన ఆ మూడింటినీ తాకకుండానే పాఠం చెప్పాడు! తర్వాతి రోజు అటెండెన్స్‌పైన ఉన్న షీటు తీయించి పసుపు నీళ్లు చల్లి... శుద్ధిచేశాకే ముట్టుకున్నారు. మూడేళ్లూ అలాగే గడిచాయి. నన్ను శత్రువులా చూసే కొందరు విద్యార్థులు ఆనర్స్‌ చివరి పరీక్ష రాయనీయకుండా చేయడానికి... మా అమ్మ చనిపోయినట్టు టెలిగ్రాము కూడా ఇప్పించారు! అది బోగస్‌ టెలిగ్రామ్‌ అని చివరి నిమిషంలో తెలుసుకుని ఆగిపోయా. మూడేళ్లపాటు ఇలాంటివెన్నో జరిగాయి. ఒకస్థాయిలో నా లోలోపలి మనిషి తిరగబడమనేవాడు. పిడికిలి బిగించి కొట్టమనేవాడు. కానీ ఏదో తెలియని ఫీలింగ్‌ నన్ను ఆపేది. దాన్ని పిరికితనమని మొదట్లో అనుకునేవాణ్ని. హింసవైపు మొగ్గని హృదయ సంస్కారమని తర్వాతెప్పుడో అర్థమైంది.

అది ఆగలేదు... 

బీఏ ఆనర్స్‌ తర్వాత గుంటూరు కాలేజీలో లెక్చరర్‌గా చేరాను. తర్వాత అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో పనిచేశాను. లెక్చరర్‌ను అయినా కులవివక్ష వేధింపులు మాత్రం అలాగే ఉండేవి. ఉస్మానియాలో నేను పీహెచ్‌డీ చేయడానికీ పదేళ్లు అడ్డుపడ్డారు. లెక్చరర్లని అడిగితే హెచ్‌ఓడీని అడగమనేవారు. ఆయన్ని అడిగితే ‘వాళ్లు చేర్చుకుంటానంటే నాదేముంది, నోటిఫికేషన్‌ రానీయ్‌’ అనేవారు. కానీ నోటిఫికేషన్‌ వచ్చిన ప్రతిసారీ నాకు మొండిచేయే ఎదురైంది. చివరికి, ఎస్వీ వర్సిటీ వీసీ జీఎస్‌ రెడ్డి దయతలచి అనుమతిచ్చారు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అదే యూనివర్సిటీకి వీసీగా చేశాను. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీకి డీన్‌గా రిటైరయ్యాను. ఇన్ని సాధించినా అడుగడుగునా ఏదో రూపంలో వివక్ష తప్పలేదు.

వీసీగా ఉన్నప్పుడు కొందరు స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకులు అందరి ముందూ కులం పేరుతోనే తిట్టారు! సాహితీ లోకం కూడా ఇందుకు అతీతం కాదు. అయితే అందుకు నేనెప్పుడూ కుంగిపోలేదు. చరిత్ర, సామాజిక పరిణామాలేవీ తెలియనివాళ్ల అజ్ఞానాన్నే ప్రేమగా ప్రశ్నిస్తూ సాహిత్య సృజనకి పూనుకున్నాను. ఆ ప్రేమని నాలో పరిపూర్ణంగా నింపిన వ్యక్తి నా భార్య భాగీరథి.

అంతటి విషాదం... 

నేను జీవితంలో నిలదొక్కుకోవాలని అమ్మ కలలుకంటే... నేను గొప్ప వ్యక్తినవుతానని నమ్మి, నన్నూ నమ్మించింది నా భార్యే. 

గుంటూరులో లెక్చరర్‌గా ఉన్నప్పుడు మహిళా స్త్రీ శిశుసంక్షేమశాఖ కోసం లెక్చరివ్వడానికి వెళ్లినప్పుడు ఆమె నాకు పరిచయమైంది. ఆమె అక్కడ అధికారిగా చేస్తుండేది. మొదటి రోజే మొదలైన స్నేహం... ఐదునెలలు తిరక్కుండానే పెళ్లిదాకా వచ్చింది. నేను వెళ్లి వాళ్ల నాన్నతో మాట్లాడాను. కులాలు వేరుకావడంతో ఆయన ఒప్పుకోలేదు. ‘నువ్వు ఈ పెళ్లితో గడపదాటితే జన్మలో నీ మొహం చూడం’ అన్నాడు కూతురితో. అయినా ఆమె నా వెంటే వచ్చింది. మా పెళ్లి మా అమ్మకీ ఇష్టం లేదు. అనంతపురంలోనే కాపురం పెట్టాం. ఇద్దరం ఉన్నతోద్యోగులం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు లేవు కానీ... తన తొలి ప్రసవం అప్పుడు అటు వాళ్లమ్మకానీ, ఇటు మా అమ్మకానీ రాలేదు! బిడ్డపుట్టాక పలకరించేందుకైనా తన తల్లి రాకపోతే... లోలోపల ఎంతగా కుమిలిపోయిందో తెలియదుకానీ నాతో ఎప్పుడూ చెప్పుకోలేదు. అడిగితే ‘నువ్వు నా తల్లికన్నా ప్రేమగా చూస్తున్నావ్‌... అంతకంటే ఏం కావాలి!’ అనేది. వాళ్ళ అమ్మని తర్వాతెప్పుడూ తను చూడనేలేదు. ఆమె చనిపోయిన నెలరోజులకికానీ ఆ విషయం మాకు తెలియనివ్వలేదు! ఓ కూతురిగా ఆమెకి అంతకంటే పెద్ద విషాదం ఏముంటుంది?! ఆ బాధని గుండెల్లో దాచుకునే నాకూ, పిల్లలకీ ప్రేమ పంచింది.  ఆ ప్రేమని నా కలంలో సిరాగా మిగిల్చి... పదేళ్లకిందట హృద్రోగంతో కనుమూసింది!

Dec 8, 2022

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పోరాటాల వేదికగా సామాజిక మాధ్యమాలు

గత కొన్ని నెలలుగా ప్రైవేట్ రంగంలోని మల్టీ నేషనల్ టెక్నాలజీ కంపెనీలుస్టార్టప్‌లు భారీ స్థాయిలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో వేలాది మంది భారతీయ యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోంది. అయితే, వీరు గతంలో మాదిరి కాకుండా దీనిపై పోరాడేందుకు సమాయత్తమవుతున్నారు. అత్యధిక మందిని తొలగిస్తుండటంతో వారు కూడా ఉద్యమాల బాట పట్టక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.   ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది యువతీ-యువకులు తమ మేనేజ్‌మెంట్లతో ఏ విధంగా వ్యవహరించాలో,  దేశంలోని కార్మిక చట్టాలుకార్మిక హక్కులపై చర్చిస్తున్నారు. గతంలో వామపక్షాలకు చెందిన ట్రేడ్ యూనియన్లు ఇటువంటి ఉద్యమాలలో కార్మికులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో కీలక భూమికను పోషించాయి. శరవేగంగా పెరిగిన సాఫ్ట్ వేర్ రంగంలో వారు చొచ్చుకుపోలేకపోయారు. అంతేకాకుండా, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అత్యధికంగా పేకేజీలు, సౌకర్యాలు, ఆరోగ్య బీమాలు ... వంటివి ఉండటంతో వారు కూడా ట్రేడ్ యూనియన్లను పట్టించుకోలేదు. అంత అవసరం కూడా వారికి రాలేదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత అనేక మార్పులు వస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం, ఉద్యోగులను తొలగించడం వంటి కొనసాగుతున్నాయి. దాంతో ఉద్యోగులు ఆందోళన చెందవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారికి ఇప్పటి వరకు కార్మిక, ఉద్యోగ ఉద్యమాలతో సంబంధంలేదు. ఒక్కసారిగా వాటి అవసరం ఏర్పడింది.  ఎడ్టెక్బైజూస్ లాంటి సంస్థలు వందలాది ఉద్యోగులకు  ఉద్వాసన పలికాయి. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సగం కంటే ఎక్కువ మంది సిబ్బందిని తొలగించింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థయైన మెటా 87వేల మంది ఉద్యోగులను తొలగించింది. అంటేఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతంగా ఉంది.

తొలగింపుల పరంపరతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలోని వారి సహచరుల వలె తమ అసంతృప్తిని తెలిపేందుకు ఇంటర్నెట్ లను ఆశ్రయిస్తున్నారు. ఆన్ లైన్ నెట్‌వర్క్‌ లను తయారుచేసుకుంటూ యాజమాన్యాలపై తమ పోరాటాన్ని ఎక్కుపెడుతున్నారు. ఉద్యోగాల తొలగింపుపై సహోద్యోగులను కూడగట్టి వారి హక్కులను కాపాడుకునేందుకుపాత్రికేయులకు సమాచారాన్ని అందిచేందుకు వాట్సాప్స్లాక్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరు సరిగా లేకపోతే తొలగించేవారు.  కానీ,  నేడు పనితీరుతో సంబంధం లేకుండా ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణం అయిపోయింది. ఈ పరిణామాలను చూస్తుంటే ఉద్యోగం నుంచి తొలగించడం ఆమోదించిన వ్యాపార పద్ధతిగా మారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు.  

ట్రేడ్ యూనియన్‌లు మునుపటిలా శక్తివంతంగా లేవు. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులకు సామాజిక మాధ్యమాలే తమ పోరాటాలకు వేదికగా మారుతున్నాయి. ఉధ్వాసనకు గురైన ఉద్యోగులకు సామాజిక మాధ్యమాలు ఎంతవరకు ఉపయోగపడుతాయో లేదో తెలియదు గాని ఉద్యోగులను ఐక్యం చేయడంలోనిరసనలకు ఊపందించడంలో మాత్రం అవి కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.  దేశంలో లక్షలాది మంది కార్మికులు నేటికీ ట్రేడ్ యూనియన్లలో ఉన్నప్పటికీమొత్తంగా ట్రేడ్ యూనియన్ల ఉద్యమం సంవత్సరాలుగా బలహీనపడిందనే చెప్పాలి.  పెరుగుతున్న ప్రైవేట్ రంగ ఉద్యోగాలుకొత్త కార్మిక సంస్కరణలుకాంట్రాక్టు పనుల పెరుగుదలతో సహా అనేక ఇతర అంశాలు ట్రేడ్ యూనియన్ల అస్తిత్వాన్ని రోజురోజుకు తగ్గించేశాయి. యాజమాన్యాలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడంలో సామాజిక మాధ్యమాలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో ఉద్యోగుల పోరాటాల్లో సైతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో సాంప్రదాయకంగా యాజమాన్యాలకు-ఉద్యోగులకు మధ్యవర్తిత్వ వహించే యూనియన్ల అవసరాన్ని సామాజిక మాద్యమాలు తగ్గించేశాయి. రేషనలైజేషన్ పేరుతో 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తామని బైజూస్ అక్టోబరులో ప్రకటించిన తర్వాత ఉద్యోగులు మీడియా ముందుకు వచ్చి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఉద్వాసనకు గురైన ట్విట్టర్ ఉద్యోగులు తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులు తమ బాధలను చెప్పుకోవడానికితమ హక్కుల పోరాటం కోసం ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.

 

 తిరువనంతపురంలో తమను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపిస్తూ 140 మంది బైజూస్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కేరళ మంత్రిని కలిసి తమ ఉద్వాసనపై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తిరువనంతపురంలో తమ కార్యకలాపాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు  బైజూస్ ప్రకటించింది. ఆ రకంగా సామాజిక మాద్యమాలు ఉద్యమాలకు ఫలవంతమైన వేదికగా తయారయ్యాయి.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

-     గుమ్మడి ప్రభాకర్, రాజకీయ, సామాజిక విశ్లేషకులు -9441278295 

Nov 25, 2022

మెగాస్టార్ చిరంజీవికి మరో జాతీయ పురస్కారం

https://www.youtube.com/watch?v=3AyEmOCZ3Ag

మెగాస్టార్ చిరంజీవి  స్వయంకృషికి  మరో జాతీయ  అవార్డు లభించింది. తన  డిస్కో డ్యాన్సులు, ఫైట్స్ తో  తెలుగు సినిమా గతిని మార్చిన సుప్రీం హీరో   గాంగ్ లీడర్ మెగాస్టార్. తెలుగు సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవిని  చిత్ర రంగానికి  చేసి సేవలకు గుర్తింపుగా  ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ద ఇయర్ - 2022 అవార్డుకు  ఎంపిక చేసినట్లు  కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రకటించారు.  గోవాలో నవంబరు 20 ఆదివారం జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇంతకుముందు ఈ అవార్డుని వహీదా రెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, హేమ మాలిని,  అమితాబ్‌ బచ్చన్‌  అందుకున్నారు. సోషల్ మీడియా ట్విటర్  వేదికగా చిరంజీవి స్పందించారు. ఇలాంటి గౌరవంతో సత్కరించినందుకు మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌‌కి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  అభిమానుల ప్రేమ వల్లే తనకు ఈ అవార్డు అభించిందని, వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి పోషించే వైవిధ్యమైన పాత్రలు, అద్భుతమైన ఆయన స్వభావం తరతరాలుగా సినీ ప్రేమికులను ఆయన వైపు ఆకర్షించేలా చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. చిరంజీవిగారిని ఎప్పటికీ మర్చిపోలేం అని ట్విటర్ లో పేర్కొన్నారు. సన్నివేశానికి  తగిన  నటన,  ఎటువంటి భావాన్నయినా ఇట్టే పలికించే కళ్ళు, హీరో, విలన్, విలన్ ఛాయలున్న హీరో,   భావోద్వేగం, హాస్యం, రౌద్రం, గాంభీర్యం, రొమాన్స్ ...  ఏది కావాలంటే   ప్రదర్శించే పరిపూర్ణ నటుడు చిరంజీవి.  

1978లో పునాదిరాళ్లుతో తన సినిమా నటజీవితం మొదలుపెట్టిన కొణిదెల శివశంకర ప్రసాద్ మనవూరి పాండవులు సినిమాతో   ప్రత్యేకతను చాటుకున్నారు.   న్యాయం కావాలి,  ఖైదీ వంటి చిత్రాలతో   వరస హిట్లతో  తెలుగు సినిమా దూకుడును కూడా పెంచారు. ఎంత ఎదిగినా ఎక్కడ వదిగి ఉండడం తెలిసిన, వీటన్నిటినీ మించి అబ్బురపరిచే వ్యక్తిత్వం కలిగిన  మంచి మనిషి.  మగధీరుడు, మగమహారాజు,  హిట్లర్, మాస్టర్ వంటి హిట్లతో    విజేతగా నిలిచి  153 సినిమాల అద్భుత ప్రస్థానంతో తెలుగు సినిమా  ప్రయాణాన్ని మార్చారు.   1988లో స్వయంకృషి చిత్రానికి ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉత్తమ నటుడి అవార్డు,  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నాడు.1988లో చిరంజీవి సహ-నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రానికి జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి, 2002లో  2003లో సినిమా అవార్డులు,  ఫిల్మిఫేర్ సౌత్ఇండియా అవార్డులు 1983లో, 1986లో,1993లో, 1994లో, 2000లో, 2003లో,2005లో   ఉత్తమ నటుడు అవార్డులు, 2007లో స్పెషల్ అవార్డ్, 2011లో  లైఫ్ టైమ్ అచ్చివ్ మెంట్ అవార్డు అందుకున్నారు.  1988లో, 1992లో, 2003లో    ఉత్తమ నటుడుగా ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు అందుకున్నారు.  1998లో నేషనల్ ఫిల్మ్ నర్గీస్ దత్ అవార్డు అందుకున్నారు. 

2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.  2006లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం  పద్మభూషణ్‌, 2016లో రఘుపతి వెంకయ్య పురస్కారం, 2014లో సీమా అవార్డు అందుకున్నారు. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీకి సంబంధించి 2014లో అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు అందుకున్నారు. 2020లో జీ సినిమా ఉత్తమనటుడు అవార్డు అందుకున్నారు.  ఐబీఎన్  లైవ్  2013లో   భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా  చిరంజీవిని పేర్కొంది.  ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ద ఇయర్ - 2022 అవార్డు చిరంజీవి  45 ఏళ్ల  కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవం. అలుపెరుగని గమనంలో అధిరోహించిన మరో

చారిత్రక శిఖరం.

Nov 17, 2022

జీవని వృద్ధాశ్రమం


2022 నవంబరు 1న కడప దగ్గర 11వ బెటాలియన్  సమీపంలో  జీవని వృద్ధాశ్రమం ప్రారంభించారు.ఇక్కడ వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది .
వృద్ధాశ్రమంలో సింగల్ రూమ్ ఒక్కరే ఉండుటకు ఎనిమిది వేల రూపాయలు, డబల్ రూ మ్అంటే ఇద్దరు ఉండుటకు 12000  రూపాయలు  ఛార్జ్ చేస్తారు.  ఒక్క మెడిసిన్ తప్ప అన్ని రకాల జాగ్రత్తలు ఇక్కడ తీసుకుంటారు. ప్రస్తుతం నడవగలిగి డైనింగ్ హాల్ వరకు వచ్చి  భోం చేయగలిగిన వారిని మాత్రమే రెకమెండ్ చేయండి.

వివరాలకు..

T v subbareddy,

C/o Dr P. Sanjeevamma

8309036768.

Nov 10, 2022

భారత రాజ్యాంగ సమాచారం

ఆర్టికల్స్, వాటి శీర్షికలు



ఆర్టికల్ 1 - యూనియన్ పేరు మరియు భూభాగం

ఆర్టికల్ 2 - కొత్త రాష్ట్రాల ప్రవేశం లేదా స్థాపన

ఆర్టికల్ 3 - రాష్ట్రం యొక్క సృష్టి మరియు సరిహద్దులు లేదా పేర్ల మార్పు

ఆర్టికల్ 4 - మొదటి షెడ్యూల్డ్ మరియు నాల్గవ షెడ్యూల్స్కు సవరణలు మరియు రెండు మరియు మూడు కింద చేసిన శాసనాలు

ఆర్టికల్ 5 - రాజ్యాంగం ప్రారంభంలో పౌరులు

ఆర్టికల్ 6 - పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్న కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు

ఆర్టికల్ 7 - భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లేవారికి కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు

ఆర్టికల్ 8 - భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తుల పౌరసత్వ హక్కులు

ఆర్టికల్ 9 - స్వచ్ఛందంగా విదేశీ రాష్ట్ర పౌరసత్వం తీసుకుంటే భారత పౌరుడు కాదు

ఆర్టికల్ 10 - పౌరసత్వ హక్కుల నిలకడ

ఆర్టికల్ 11 - పౌరసత్వం కోసం చట్టాన్ని పార్లమెంట్ నియంత్రిస్తుంది

ఆర్టికల్ 12 - రాష్ట్ర నిర్వచనం

ఆర్టికల్ 13 - ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే లేదా అవమానించే చట్టాలు

ఆర్టికల్ 14 - చట్టం ముందు సమానత్వం

ఆర్టికల్ 15 - మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం

ఆర్టికల్ 16 - ప్రజా ప్రణాళికలో అవకాశాల సమానత్వం

ఆర్టికల్ 17 - అంటరానితనం యొక్క ముగింపు

ఆర్టికల్ 18 - శీర్షికల ముగింపు

ఆర్టికల్ 19 - వాక్ స్వేచ్ఛ

ఆర్టికల్ 20 - నేరాల శిక్షకు సంబంధించి రక్షణ.


ఆర్టికల్ 21 - జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ

ఆర్టికల్ 21 ఎ - 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్య హక్కు

ఆర్టికల్ 22 - కొన్ని సందర్భాల్లో అరెస్ట్ నుండి రక్షణ

ఆర్టికల్ 23 - మానవ అక్రమ రవాణా మరియు పిల్లల ఆశ్రమం

ఆర్టికల్ 24 - కర్మాగారాల్లో పిల్లలకు ఉపాధిని నిషేధించడం

ఆర్టికల్ 25 - మనస్సాక్షికి స్వేచ్ఛ మరియు ప్రవర్తన మరియు మతం యొక్క ప్రచారం

ఆర్టికల్ 26 - మతపరమైన వ్యవహారాల నిర్వహణకు స్వేచ్ఛ

ఆర్టికల్ 29 - మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ

ఆర్టికల్ 30 - విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి మైనారిటీ విభాగాల హక్కు

ఆర్టికల్ 31 - ఆస్తి హక్కు (44 వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించబడింది.)

ఆర్టికల్ 32 - హక్కుల అమలుకు నివారణలు

ఆర్టికల్ 36 - రాష్ట్ర నిర్వచనం

ఆర్టికల్ 38 - ప్రజా సంక్షేమం ప్రోత్సాహానికి రాష్ట్రం సామాజిక వ్యవస్థను రూపొందిస్తుంది.

ఆర్టికల్ 39 - స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం

ఆర్టికల్ 39 ఎ - సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం

ఆర్టికల్ 40 - గ్రామ పంచాయతీల సంస్థ

ఆర్టికల్ 41 - పని విద్య మరియు ప్రజల సహాయం పొందే హక్కు

ఆర్టికల్ 43 - కర్మ కార్లకు జీవనాధార వేతనాల ప్రయత్నం

ఆర్టికల్ 43 ఎ - పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం

ఆర్టికల్ 44 - పౌరులకు ఏకరీతి సివిల్ కోడ్

ఆర్టికల్ 45 - 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్య కోసం రాష్ట్ర కేటాయింపు

ఆర్టికల్ 48 - వ్యవసాయ మరియు పశుసంవర్ధక సంస్థ

ఆర్టికల్ 48 ఎ - పర్యావరణం, అడవులు మరియు వన్యప్రాణుల రక్షణ

ఆర్టికల్ 49- జాతీయ స్మారక స్థలాలు మరియు వస్తువుల రక్షణ

ఆర్టికల్ 50 - ఎగ్జిక్యూటివ్ నుండి న్యాయవ్యవస్థ యొక్క వ్యక్తీకరణ

ఆర్టికల్ 51 - అంతర్జాతీయ శాంతి మరియు భద్రత

ఆర్టికల్ 51 ఎ - ప్రాథమిక విధులు

ఆర్టికల్ 52 - భారత రాష్ట్రపతి

ఆర్టికల్ 53 - యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్

ఆర్టికల్ 54 - రాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్ 55 - రాష్ట్రపతి ఎన్నిక విధానం

ఆర్టికల్ 56 - రాష్ట్రపతి పదవీకాలం

ఆర్టికల్ 57 - తిరిగి ఎన్నికలకు అర్హత

ఆర్టికల్ 58 - అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం

ఆర్టికల్ 59 - రాష్ట్రపతి నిబంధనలు

ఆర్టికల్ 60 - రాష్ట్రపతి ప్రమాణం

ఆర్టికల్ 61 - రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన విధానం

ఆర్టికల్ 62 - అధ్యక్ష పదవిలో ఒక వ్యక్తిని నింపడానికి ఎన్నికల సమయం మరియు విధానం

ఆర్టికల్ 63 - భారత ఉపాధ్యక్షుడు

ఆర్టికల్ 64 - ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్-అఫిషియో చైర్మన్

ఆర్టికల్ 65 - రాష్ట్రపతి పదవి ఖాళీపై ఉపరాష్ట్రపతి పని

ఆర్టికల్ 66 - ఉపరాష్ట్రపతి ఎన్నిక

ఆర్టికల్ 67 - ఉపరాష్ట్రపతి పదవీకాలం

ఆర్టికల్ 68 - ఉపాధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి ఎన్నికలు

ఆర్టికల్ 69 - ఉపరాష్ట్రపతి ప్రమాణం

ఆర్టికల్ 70 - ఇతర ఆకస్మిక పరిస్థితులలో రాష్ట్రపతి విధులను నిర్వర్తించడం

ఆర్టికల్ 71. - అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుల ఎన్నికలకు సంబంధించిన విషయాలు

ఆర్టికల్ 72 - క్షమాపణ యొక్క శక్తి


ఆర్టికల్ 73 - యూనియన్ యొక్క కార్యనిర్వాహక శక్తిని విస్తరించడం

ఆర్టికల్ 74 - రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి

ఆర్టికల్ 75 - మంత్రులకు సంబంధించిన నిబంధనలు

ఆర్టికల్ 76 - అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా

ఆర్టికల్ 77 - భారత ప్రభుత్వ వ్యాపారం యొక్క ప్రవర్తన

ఆర్టికల్ 78 - రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ప్రధానమంత్రి విధి

ఆర్టికల్ 79 - పార్లమెంట్ రాజ్యాంగం

ఆర్టికల్ 80 - రాజ్యసభ నిర్మాణం


ఆర్టికల్ 81 - లోక్సభ నిర్మాణం

ఆర్టికల్ 83 - పార్లమెంట్ ఉభయ కాలం

ఆర్టికల్ 84 - పార్లమెంటు సభ్యులకు అర్హత

ఆర్టికల్ 85 - పార్లమెంట్ ప్రోగ్రెషన్ మరియు రద్దు యొక్క సెషన్

ఆర్టికల్ 87 - రాష్ట్రపతి ప్రత్యేక చిరునామా

ఆర్టికల్ 88 - ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అటార్నీ జనరల్ హక్కులు

ఆర్టికల్ 89 - రాజ్యసభ ఛైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్

ఆర్టికల్ 90 - డిప్యూటీ చైర్మన్ పదవిని ఖాళీ చేయడం లేదా తొలగించడం

ఆర్టికల్ 91 - ఛైర్మన్ యొక్క విధులు మరియు అధికారాలు

ఆర్టికల్ 92 - ఛైర్మన్ లేదా డిప్యూటీ ఛైర్మన్లను తొలగించే తీర్మానం పరిశీలనలో ఉంటే అతని అధ్యక్ష పదవి

ఆర్టికల్ 93 - లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్

ఆర్టికల్ 94 - అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్ష పదవి ఖాళీగా ఉంది

ఆర్టికల్ 95 - స్పీకర్‌లో విధులు మరియు అధికారాలు

ఆర్టికల్ 96 - ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే తీర్మానం ఉంటే స్పీకర్ అధ్యక్షత వహించరు

ఆర్టికల్ 97 - ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ మరియు ఛైర్మన్, వైస్ చైర్మన్ యొక్క జీతం మరియు భత్యాలు

ఆర్టికల్ 98 - పార్లమెంట్

ఆర్టికల్ 99 - సభ్యుడి ప్రమాణం లేదా ధృవీకరణ


ఆర్టికల్ 100 - వనరులలో ఓటింగ్ ఖాళీలు ఉన్నప్పటికీ, ఇళ్ల పనితీరుకు శక్తి మరియు కోరం

ఆర్టికల్ 143 - సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అధికారం

ఆర్టికల్ 144 - సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులచే సుప్రీంకోర్టుకు సహాయం

ఆర్టికల్ 148 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా

ఆర్టికల్ 149 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క విధి అధికారాలు

ఆర్టికల్ 150 - యూనియన్ రాష్ట్రాల రచన యొక్క ఆకృతి

ఆర్టికల్ 153 - రాష్ట్రాల గవర్నర్

ఆర్టికల్ 154 - రాష్ట్ర కార్యనిర్వాహక శక్తి

ఆర్టికల్ 155 - గవర్నర్ నియామకం

ఆర్టికల్ 156 - గవర్నర్ పదవీకాలం

ఆర్టికల్ 157 - గవర్నర్‌గా నియమించాల్సిన అర్హతలు

ఆర్టికల్ 158 - గవర్నర్ పదవికి షరతులు

ఆర్టికల్ 159 - గవర్నర్ ప్రమాణం లేదా ధృవీకరణ


ఆర్టికల్ 163 - గవర్నర్‌కు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి

ఆర్టికల్ 164 - మంత్రుల గురించి ఇతర నిబంధనలు

ఆర్టికల్ 165 - రాష్ట్ర అడ్వకేట్ జనరల్

ఆర్టికల్ 166 - రాష్ట్ర ప్రభుత్వ ఆపరేషన్

ఆర్టికల్ 167 - గవర్నర్‌కు సమాచారం ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులు

ఆర్టికల్ 168 - రాష్ట్ర శాసనసభ యొక్క రాజ్యాంగం

ఆర్టికల్ 170 - సమావేశాల నిర్మాణం

ఆర్టికల్ 171 - శాసనమండలి కూర్పు

ఆర్టికల్ 172 - రాష్ట్రాల శాసనసభ వ్యవధి

ఆర్టికల్ 173 - రాష్ట్రాల శాసనసభ సభ్యత్వానికి అర్హతలు

ఆర్టికల్ 174 - రాష్ట్రాల శాసనసభ యొక్క సెషన్ ప్రోగ్రెషన్ మరియు రద్దు

ఆర్టికల్ 176 - గవర్నర్ ప్రత్యేక చిరునామా

ఆర్టికల్ 177 - ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ హక్కులు

ఆర్టికల్ 178 - శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్

ఆర్టికల్ 179 - ఛైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి యొక్క సెలవు లేదా తొలగింపు

ఆర్టికల్ 180 - ఛైర్మన్ పదవుల పని మరియు అధికారం

ఆర్టికల్ 143 - సుప్రీంకోర్టును సంప్రదించడానికి రాష్ట్రపతికి అధికారం

ఆర్టికల్ 144 - సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులచే సుప్రీంకోర్టుకు సహాయం

ఆర్టికల్ 148 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా

ఆర్టికల్ 149 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క విధి అధికారాలు

ఆర్టికల్ 150 - యూనియన్ రాష్ట్రాల రచన యొక్క ఆకృతి

ఆర్టికల్ 153 - రాష్ట్రాల గవర్నర్

ఆర్టికల్ 154 - రాష్ట్ర కార్యనిర్వాహక శక్తి

ఆర్టికల్ 155 - గవర్నర్ నియామకం

ఆర్టికల్ 156 - గవర్నర్ పదవీకాలం

ఆర్టికల్ 157 - గవర్నర్‌గా నియమించాల్సిన అర్హతలు

ఆర్టికల్ 158 - గవర్నర్ పదవికి షరతులు

ఆర్టికల్ 159 - గవర్నర్ ప్రమాణం లేదా ధృవీకరణ

ఆర్టికల్ 163 - గవర్నర్‌కు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి

ఆర్టికల్ 164 - మంత్రుల గురించి ఇతర నిబంధనలు

ఆర్టికల్ 165 - రాష్ట్ర అడ్వకేట్ జనరల్

ఆర్టికల్ 166 - రాష్ట్ర ప్రభుత్వ ఆపరేషన్

ఆర్టికల్ 167 - గవర్నర్‌కు సమాచారం ఇవ్వడానికి సంబంధించి ముఖ్యమంత్రి విధులు

ఆర్టికల్ 168 - రాష్ట్ర శాసనసభ యొక్క రాజ్యాంగం

ఆర్టికల్ 170 - సమావేశాల నిర్మాణం

ఆర్టికల్ 171 - శాసనమండలి కూర్పు

ఆర్టికల్ 172 - రాష్ట్రాల శాసనసభ వ్యవధి

ఆర్టికల్ 173 - రాష్ట్రాల శాసనసభ సభ్యత్వానికి అర్హతలు


ఆర్టికల్ 174 - రాష్ట్రాల శాసనసభ యొక్క సెషన్ ప్రోగ్రెషన్ మరియు రద్దు

ఆర్టికల్ 176 - గవర్నర్ ప్రత్యేక చిరునామా

ఆర్టికల్ 177 - ఇళ్లకు సంబంధించి మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ హక్కులు

ఆర్టికల్ 178 - శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్

ఆర్టికల్ 179 - ఛైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవి యొక్క సెలవు లేదా తొలగింపు

ఆర్టికల్ 180 - ఛైర్మన్ పదవుల పని మరియు అధికారం


ఆర్టికల్ 181 - వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించడానికి తీర్మానం లేదు

ఆర్టికల్ 182 - లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్

ఆర్టికల్ 183 - చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ కార్యాలయం నుండి సెలవు లేదా తొలగింపు

ఆర్టికల్ 184 - ఛైర్మన్ పదవి యొక్క విధులు మరియు అధికారాలు

ఆర్టికల్ (185) - సావరిన్ డిప్యూటీ పదవిని తొలగించే తీర్మానం అధ్యక్షత వహించకపోతే

ఆర్టికల్ 186 - ఛైర్మన్, వైస్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ జీతం మరియు భత్యాలు

ఆర్టికల్ 187 - రాష్ట్ర శాసనసభ సచివాలయం

ఆర్టికల్ 188 - సభ్యుల ప్రమాణం లేదా ధృవీకరణ

ఆర్టికల్ 189 - ఇళ్లలో ఓటింగ్ ఖాళీలు ఉన్నప్పటికీ సాధనాలు మరియు కోరం పనిచేసే అధికారం

ఆర్టికల్ 199 - విదేశాలలో సంపద యొక్క నిర్వచనం

ఆర్టికల్ 200 - ఎమ్మెల్యేలపై అనుమతి.

ఆర్టికల్ 202 - వార్షిక ఆర్థిక ప్రకటన

ఆర్టికల్ 213 - శాసనసభలో ఆర్డినెన్స్ ధృవీకరించడానికి గవర్నర్ యొక్క అధికారం

ఆర్టికల్ 214 - రాష్ట్రాలకు హైకోర్టు

ఆర్టికల్ 215 - హైకోర్టుల రికార్డు కోర్టు

ఆర్టికల్ 216 - హైకోర్టు రాజ్యాంగం

ఆర్టికల్ 217 - హైకోర్టు న్యాయమూర్తి నియామక విధాన పరిస్థితులు

ఆర్టికల్ 219 - ప్రమాణం మరియు ధృవీకరణ

ఆర్టికల్ 221 - న్యాయమూర్తుల జీతం

ఆర్టికల్ 222 - న్యాయమూర్తులను ఒక కోర్టు నుండి మరొక కోర్టుకు బదిలీ చేయడం

ఆర్టికల్ 223 - ఎగ్జిక్యూటివ్ చీఫ్ జస్టిస్ మూర్తి నియామకం

ఆర్టికల్ 224 - ఇతర న్యాయమూర్తుల నియామకం

ఆర్టికల్ 226 - కొన్ని రిట్‌లను తొలగించడానికి హైకోర్టు యొక్క అధికారం

ఆర్టికల్ 231 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు ఏర్పాటు

ఆర్టికల్ 233 - జిల్లా న్యాయమూర్తుల నియామకం

ఆర్టికల్ 241 - కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు


ఆర్టికల్ 243 - పంచాయతీ మునిసిపాలిటీలు మరియు సహకార సంఘాలు

ఆర్టికల్ 244 - షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన

ఆర్టికల్ 248 - అవశేష శాసన అధికారాలు

ఆర్టికల్ 249 - జాతీయ ప్రయోజనంలో రాష్ట్ర జాబితా విషయానికి సంబంధించి శాసనసభకు పార్లమెంటు అధికారం

ఆర్టికల్ 252 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు సమ్మతితో చట్టాలు చేయడానికి పార్లమెంటు అధికారం

ఆర్టికల్ 254 - పార్లమెంట్ రూపొందించిన చట్టాలు మరియు రాష్ట్రాల శాసనసభ చేసిన చట్టాల మధ్య అస్థిరత

ఆర్టికల్ 256 - రాష్ట్రాలు మరియు యూనియన్ యొక్క బాధ్యత

ఆర్టికల్ 257 - కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలపై యూనియన్ నియంత్రణ

ఆర్టికల్ 262 - అంతర్రాష్ట్ర నదులు లేదా నది లోయలకు సంబంధించిన నీటి వివాదాల తీర్పు

ఆర్టికల్ 263 - అంతర్-రాష్ట్ర అభివృద్ధి మండలి యొక్క రాజ్యాంగం

ఆర్టికల్ 266 - కన్సాలిడేటెడ్ ఫండ్

ఆర్టికల్ 267 - ఆకస్మిక నిధి.

ఆర్టికల్ 269 - పన్నులు వసూలు చేసి యూనియన్ వసూలు చేసినప్పటికీ రాష్ట్రాలకు అప్పగించారు

ఆర్టికల్ 270 - పన్నులు యూనియన్ సేకరించి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడతాయి.


ఆర్టికల్ 280 - ఫైనాన్స్ కమిషన్.

ఆర్టికల్ 281 ​​- ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు.

ఆర్టికల్ 292 - భారత ప్రభుత్వం రుణాలు తీసుకోవడం.

ఆర్టికల్ 293 - రాష్ట్రం ద్వారా రుణాలు తీసుకోవడం.


ఆర్టికల్ 300 ఎ - ఆస్తి హక్కుఆర్టికల్ 301 - వాణిజ్య వాణిజ్యం మరియు సంభోగం యొక్క స్వేచ్ఛ

ఆర్టికల్ 309 - రాష్ట్రానికి సేవలందించే వ్యక్తుల నియామకం మరియు సేవా పరిస్థితులు

ఆర్టికల్ 310 - యూనియన్ లేదా రాష్ట్రానికి సేవలందించే వ్యక్తుల పదవీకాలం

ఆర్టికల్ 312 - ఆల్ ఇండియా సర్వీసెస్

ఆర్టికల్ 313 - ట్రాన్సిషన్ కార్పెట్ కేటాయింపులు

ఆర్టికల్ 315 - యూనియన్ స్టేట్ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఆర్టికల్ 316 - సభ్యుల నియామకం మరియు పదవీకాలం ఆర్టికల్ 317 - పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిని తొలగించడం లేదా సస్పెండ్ చేయడం

ఆర్టికల్ 320 - పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టాలు

ఆర్టికల్ 323 ఎ - అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్

ఆర్టికల్ 323 బి - ఇతర విషయాలకు ట్రిబ్యునల్.


ఆర్టికల్ 323 బి - ఇతర విషయాలకు ట్రిబ్యునల్

ఆర్టికల్ 324 - ఎన్నికలను నిర్దేశించడం మరియు నియంత్రించడం ఎన్నికల సంఘంలో ఉంది

ఆర్టికల్ 329 - ఎన్నికల విషయాలలో కోర్టు జోక్యం యొక్క వివరణ

ఆర్టికల్ 330 - లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సీట్ల మూసివేత

ఆర్టికల్ 331 - లోక్సభలో ఆంగ్లో-ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం

ఆర్టికల్ 332 - రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సీట్ల రిజర్వేషన్

ఆర్టికల్ 333 - రాష్ట్ర అసెంబ్లీలో ఆంగ్లో-ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం

ఆర్టికల్ 338 - షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్

ఆర్టికల్ 338 (ఎ) - షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్

ఆర్టికల్ 343 - యూనియన్ యొక్క నిర్వచనం

ఆర్టికల్ 344 - అధికారిక భాషపై పార్లమెంటు కమిషన్ మరియు కమిటీ

ఆర్టికల్ 350 ఎ - ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య యొక్క సౌకర్యాలు

ఆర్టికల్ 351 - హిందీ భాష అభివృద్ధికి సూచనలు

ఆర్టికల్ 352 - అత్యవసర ప్రకటన ప్రభావం

ఆర్టికల్ 356 - రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాలు విఫలమైతే నిబంధనలు

ఆర్టికల్ 360 - ఆర్థిక అత్యవసర పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు

ఆర్టికల్ 368 - రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం మరియు దాని విధానం

ఆర్టికల్ 377 - కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన నిబంధనలు

ఆర్టికల్ 378 - పబ్లిక్ సర్వీస్ కమిషన్


ఐపిసిలో సెక్షన్ ల అర్థం     తెలుసుకోండి

  * సెక్షన్ 307 * = హత్యాయత్నం

  * సెక్షన్ 302 * = హత్యకు శిక్ష

  * సెక్షన్ 376 * = అత్యాచారం

  * సెక్షన్ 395 * = దోపిడీ

  * సెక్షన్ 377 * = అసహజ కదలికలు

  * సెక్షన్ 396 * = దోపిడీ

                       సమయంలో హత్య

  * సెక్షన్ 120 * = కుట్ర

  * సెక్షన్ 365 * = కిడ్నాప్

  * సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం

  * సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం.

  * సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు.

  * సెక్షన్ 378 * = దొంగతనం.

  * సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్.

  * విభాగం 191 * = తప్పు లక్ష్యం.

  * సెక్షన్ 300 *   =   హత్య.

  * సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం.

  * సెక్షన్ 310 * = మోసం

  * సెక్షన్ 312 * = గర్భస్రావం.

  * సెక్షన్ 351 * = దాడి చేయడానికి.

  * సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు.

  * సెక్షన్ 362 * = కిడ్నాప్.

  * సెక్షన్ 415 * = ట్రిక్.

  * సెక్షన్ 445 * = దేశీయ వివక్ష.

  * సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి.

               జీవితంలో పునర్వివాహం.

  * సెక్షన్ 499 * = పరువు నష్టం.

  * సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.

   

 కొన్ని  ముఖ్యమైన చట్టాలు:

 (1) సాయంత్రం 6 గంటల  తర్వాత ఉదయం 6 గంటల లోపు  మహిళలను అరెస్టు చేయరాదు. 

క్రిమినల్ కోడ్   సెక్షన్ 46 ప్రకారం   సాయంత్రం 6 గంటల తరువాత, ఉదయం 6 గంటలకు ముందు  ఎంత తీవ్రమైన నేరం చేసినా ఏ మహిళను  పోలీసులు అరెస్టు చేయకూడదు.

ఒక వేళ అలా చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు. 

 (2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ.40 లక్షల వరకు బీమా పొందవచ్చు

పబ్లిక్  లయబిలిటీ పాలసీ ప్రకారం  ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి,  మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే,  వెంటనే గ్యాస్ కంపెనీ నుంచి బీమా రక్షణ పొందవచ్చు.   

  (3) ఇండియన్ సిరీస్ యాక్ట్ 1887 ప్రకారం ఏ హోటల్ లోనైనా మనం  ఉచితంగా నీరు త్రాగవచ్చు,  వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు.

(4) ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం  గర్భిణీ స్త్రీలను ఉద్యోగం నుంచి తొలగించలేరు.

  (5) ఐపీసీ సెక్షన్ 166 ఎ ప్రకారం మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు.


సమచారం అడిగితే లేదు, ఇవ్వము, అందుబాటు లోలేదు అంటున్న అధికారులకు,మీరు తెలుసుకోవాలిసిన అంశాలు.


సమాచారం ఇవ్వకపోతే  ఆ ప్రజా సమాచార అధికారి గారు IPC సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నెరపరిదిలోకి వస్తారు అందువలన స.హ చట్టం కింద దరఖాస్తు దారులు  కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. 


లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించి నందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర,రాష్ట్ర కమీసనర్లు కూడా  సమాచారం ఇవ్వని వారిని  జైలుకు పంపవచ్చు అని చట్టంలో పేర్కొనబడింది.


ఒకవేళ పూర్తి అవగాహనా లేకపోతె క్రింది వివరాలు చూడండి.


సమాచారాన్ని కోరటనికి దరఖాస్తు ఫారం లేదు, కావలసిన సమాచారం  తెల్లకాగితం పై రాసి ipo (ప్రజా సమాచార అధికారికి) అడగవచ్చు. అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు.


“దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు”.


సెక్షన్ 2 (f) ప్రకారం సమాచారం నిర్వచనం.(కార్యాలయాల్లో రికార్డులు,పత్రాలు, మెమోలు,ఈ మైయిల్స్, అభిప్రాయాలు,పుస్తకాలు, ప్రకటనలు,సీడీలు, డివిడిలు,మొదలైనవి).


సెక్షన్ 2 (h) ప్రకారం సమాచార చట్ట పరిధిలోకి వచ్చే కార్యలయలు  (ప్రభుత్వంచే గుర్తింపుబడిన, స్వచ్చంద సంస్థలు).


సెక్షన్2(i) ప్రకారం రికార్డు నిర్వచనం.


సెక్షన్ 2(j) ప్రకారం ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు,

ఏ ప్రభుత్వపు కార్యాలయంలో రికార్డులనైనా దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చు అవసరం అయితే జిరాక్స్ చేసుకోవచ్చు.


సెక్షన్2(j)(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు (ఒక గంటకు రూ5/-).


సెక్షన్ 3 ప్రకారం పౌరులందరికి సమాచారం ఇవ్వాలి. (దరఖాస్తు చేసుకోవడానికి మీ పరిధి కాదు అని ప్రశ్నించడానికి వీలు లేదు).


సెక్షన్4(1)(a) ప్రకారం ప్రతి శాఖ వారు రికార్డు నిర్వహణ.


సెక్షన్ 4(b) ప్రకారం స్వచ్చందముగా వెల్లడించవలసిన సమాచారం ఎవరు ఆడగక ముందే ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.


సెక్షన్ 4(1)(c)(d) ప్రకారం నిర్ణయాలు వాటికీ కారణాలు చెప్పకరలేదు, (సమాచారం ఎందుకు అని చెప్పక్కరలేదు)


సెక్షన్4(2) ప్రకారం వీలయినంత ఎక్కువుగా స్వచ్చందంగా ఇవ్వవలసిన సమాచారం.


సెక్షన్4(4) ప్రకారం స్థానిక భాషలో ఇవ్వాలి.


సెక్షన్5(1),(2) ప్రకారం ప్రజాసమాచార అధికారులు (ipo ) అప్పిలేట్ అధికారుల నియామకం.


సెక్షన్-6(1) ప్రకారం

సమాచార హక్కు దాఖలు విధానం.


సెక్షన్6(2) ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు.


సెక్షన్ -6(3) ప్రకారం కోరిన సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ (సమాచారం మరో కార్యాలయానికి పంపావలసిన బాద్యత అధికారులదే).


సెక్షన్-7(1) ప్రకారం 30రోజుల లోపు సమాచారం ఇవ్వవలసిందే...


వ్యక్తి జీవితానికీ స్వేచ్ఛ సంభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.


సెక్షన్7(3)(a) ప్రకారం సమాచార రుసుము (కోర్టు సంబంచిన మాత్రం రూ25/- మిగతా శాఖ వారికి రూ10/- మాత్రమే చెల్లించాలి.


ఏ రూపంలో చెలించాలంటే

(1) నగదు రూపంలో,

(2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు,

(3) డిమాండ్ డ్రాఫ్టు,

(4) కోర్టు ఫీ స్టాంపు వేయాలి,

(5)బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుం.ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి.


విలయినంతగా పోస్టల్ ఆడర్లు మాత్రమే రుసుముగా చెల్లించాలి.


(ప్రతి పేజీకి, ఏ-4 రూ 2/- చెప్పున, సీడికి రూ100/- చెప్పున, ప్లాపికి రూ50/- చెప్పున, డీవీడీ కి 200 చెలించాలి.

కోర్టు లో ప్రతి పేజీకి రూ 5/- చెప్పున చెల్లించాలి).


సెక్షన్ 7(1) ప్రకారం దరఖాస్తు గడువు 30 రోజులు


సెక్షన్7(6) ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితముగా ఇవ్వాలి.


సెక్షన్8(1) ప్రకారం సమాచారం మినహహింపులు (డాక్టర్ పెసెంట్ కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చిన మందులు, మనిషికి ఉన్న వ్యాధులు, దేశరక్షనకు సంబంచించిన ఒప్పందాలు)


సెక్షన్8(2) ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే   మినహాయింపులు వర్తించవు.


సెక్షన్18(1) ప్రకారం కమీషన్లకు పిర్యాదు


సెక్షన్19(1) ప్రకారం మొదటి అప్పీలు 


సెక్షన్19(3) రెండవ అప్పీలు, 90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ అప్పీల్ చేసుకోవాలి.సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు.


సెక్షన్19(1) ప్రకారం కమీసన్ల  నిర్ణయాలు.


సెక్షన్-19(8)(b) ప్రకారం ధరాఖస్తుదారు తనకు కలిగిన ఆర్థిక పరమైన కష్టనష్టలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి సక్రమంగా ఉంటే  నష్టపరిహారం మంజూరు చేయాలి.


సెక్షన్20(1) ప్రకారం సమాచారం ఇవ్వకపోతే  (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ 250 చొప్పున రూ 25,000 వరకు జరిమానా.


సెక్షన్20(2) ప్రకారం క్రమక్షణ చర్యలకు సిపారసు గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల పొరనికి వెళ్ళవచ్చు.


ఐపీవో (ipo) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిషనర్ లేకుంటే  డైరెక్టుగా న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.