Jan 9, 2018

అనుత్పాధక రాయితీలతో ముప్పు

ఏ ప్రభుత్వమైనా అనుత్పాధక (ఉత్పత్తి ఏమీ జరగని) సబ్సిడీలు అధికంగా ఇవ్వడం మంచిదికాదుఆ రకమైన సబ్సిడీల వల్ల భవిష్యత్ లో సామాజికఆర్థిక వ్యవస్థలకు నష్టం కలుగుతుందిరాష్ట్రంలోని పేద ప్రజలకు తిండిగుడ్డగూడు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా ప్రజల సామాజిక,ఆర్థిక పరిస్థితుల దృష్ట్యావివిధ పథకాల ద్వారా ఓటర్లను ఆకర్షించడానికి ఒక స్థాయి వరకు ఇటువంటి పథకాలను అనుమతించవచ్చుసంక్షేమ పథకాల పేరిట స్థాయికి మించి అశాస్త్రీయంగా వస్తువులునగదు పంపిణీ చేయడం ప్రభుత్వ ఆర్థిక స్థితిని దెబ్బతీయడమేకాక సమాజానికి చెడు సంకేతాలను అందిస్తుంది.ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టడంలో తమిళనాడు ముందుంటుంది.   రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవడంతోపాటు పేదలకు ఉపాధి అవకాశాలువారి జీవనం మెరుగుపడటం కోసం  ఉత్పత్తితో కూడిన సబ్సిడీలు ఇవ్వడం అన్ని విధాల మంచిది వారికి వివిధ రకాల పనులు కల్పించి వస్తు ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పటిష్టపడటంతోపాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలిఆ విధంగా చేస్తే వారికి పని లభిస్తుంది. శ్రమ విలువ తెలుస్తుంది. వస్తు ఉత్పత్తి పెరుగుతుందిఈ రకమైన పథకాలు గతంలో అమలు చేశారు ఇప్పుడూ అమలు చేస్తున్నారుఅటువంటి పథకాలనే విస్తృత స్థాయిలో మరిన్ని ప్రవేశపెట్టాలి గానీ,ప్రజాకర్షణఓట్ల కోసం తక్కువ వయసుకే పెన్షన్ లాంటి హామీలు ఇవ్వడం మంచి పద్దతికాదు. తగిన కారణాలు చూపకుండా అందరినీ ఒకేగాటన కట్టివేసి ఏదో ఒక పేరుతో ప్రభుత్వం  ప్రజలకు  డబ్బు ఇవ్వడం అంటే వారికి సోమరితనం నేర్పినట్లే అవుతుంది.  కష్టపడి పని చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనే తత్వం వారికి నేర్పాలిఉపాధికి అనేక మార్గాలు ఉన్నాయిఉపాధి కల్పించే అంశాలలోవారికి సంపాదన మార్గాలు చూపించడంలో  ప్రభుత్వం సహాయపడాలేగానీవేలం వెర్రిగావిచ్చలవిడిగా సంక్షేమం పేరుతో అధికంగా పథకాలుకార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదుకొన్ని సందర్భాలలో వాటి పేర్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పలేనన్ని ప్రవేశపెడుతుంటారు.
                    ఉదాహరణకు చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడంసబ్సిడీ ఇవ్వడం వంటి చర్యల వల్ల వాటి అమ్మకాలతోపాటు డిమాండ్ పెరుగుతుంది.  ఆ విధంగా ఉత్పత్తి ప్రకియ జరగడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. చేనేత అంటే దానికి అనుబంధంగా 10-15 రకాల వృత్తుల వారు ఉపాధి పొందే అవకాశం ఉందిపత్తి పంట ద్వారా వ్యవసాయదారులునూలు వడకడంఆసు తోడటంపడుగులు చేయడం,రంగుల అద్దకంకుంచెలులాకలు  తయారు చేసేవారు,  మగ్గాలురాట్నాలు వంటివి తయారుచేసే వడ్రంగులు,చివరకు వస్త్రాల అమ్మకం ఇలా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది.  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ రోడ్లుఅంగన్ వాడీ భవనాల వంటి వాటి నిర్మాణంపాఠశాలలుశ్మశానాలు,చెరువులుకాలువలు వంటి వాటి మరమ్మతులు చేపడుతున్నారుఈ పథకం ద్వారా ఒక పక్క గ్రామీణ ప్రాంతాల్లో  మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందిమరో పక్క ఉపాధి లభిస్తోందిగ్రామీణ చిన్నతరహా పరిశ్రమలతోపాటు బుట్టలకుతట్టలకుచీపుర్లకుకొవ్వొత్తులకుచాక్ పీస్ లకు సబ్సిడీ ఇచ్చినా అక్కడ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుందిఉపాధి లభిస్తుంది.  ప్రజాకర్షణ పేరుతో ఒకరికొకరు పోటీపడి ప్రజలకు డబ్బు ఇచ్చే పథకాలు ప్రవేశపెట్టడం ఎంతమాత్రం మంచిదికాదుదానికి బదులు ఓ పలుగుపార ఇవ్వండిమట్టి తవ్వే పని చేసుకొని బతుకుతారుగతంలో ఆదరణ పేరుతో కుల వృత్తులుచేతి వృత్తి పనులకు సంబంధించిన పరికరాలు ఇచ్చారుఇస్త్రీ పెట్టెబార్బర్ షాపు సామాగ్రి, సన్నాయిడోలుచేపలు పట్టే వలలు, కొలివి సామాను,కుండలుబొమ్మలు తయాలరు చేసే సామాగ్రి లాంటి వాటిని ఇచ్చారుఇప్పుడు సామాజిక పరిస్థితులలో మార్పులు వచ్చాయిడ్రైక్లీనర్బార్బర్గాజులుఫ్యాన్సీ షాపులు, బ్యూటీ పార్లర్,  హోటళ్లుచిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికికుటీర పరిశ్రమలకు విస్తృత స్థాయిలో రుణాలు ఇవ్వవచ్చు. చేసే వ్యాపారంఉత్పత్తి ఆధారంగా రూ.10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలుసబ్సిడీలు ఇవ్వడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.  ఆ ఇచ్చే రుణాలు ప్రచారార్భాటంగా కాకుండా ఆచరలో సాధ్యమయ్యే విధంగా ఉండాలి.బ్యాంకుల ఇష్టానికి వదిలివేస్తే మంజూరు చేసినవాటిలో సగం కూడా ఇవ్వరుకొన్ని బ్యాంకులు 30 శాతం కూడా ఇవ్వవుఅలా కాకుండా ప్రభుత్వమే హామీ ఉండి రుణాలు ఇప్పిస్తే ప్రయోజనం ఉంటుంది. బ్యాంకుల ద్వారా రుణాలు పొందడానికి పేదలు పడే పాట్లు తగ్గించవలసిన అవసరం ఉంది.  వృత్తుల పరమైనవాటికి అతి తక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వడం ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.
       భూస్వాములువ్యాపారవేత్తలు, అప్పులుపాలైన పేద రైతులను ఒకే గాటన కట్టి రుణమాఫీ చేయడం కూడా సరైన చర్య కాదుఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ (ప్రజలధనం అధికంగా వ్యయమై పేద రైతులతోపాటు ధనవంతులు కూడా లబ్దిపొందుతారుఇటువంటి చర్యలు సమసమాజ నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయి.ప్రభుత్వ ఏ ఆశయం తో ఆ పథకం ప్రవేశపెట్టిందో అది నెరవేదరు.  ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టేటప్పుడు పేదలకుఅట్టడుగు వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగేవిధంగా విధివిధానాలు రూపొందించాలి. దానికంటే వ్యవసాయ ఉత్పత్తులకు  గిట్టుబాటు ధరలు లభించే విధంగా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేసినవారవుతారువ్యవసాయ ఉత్సత్తుల దిగుబడి సమయంలో ధరలు పూర్తిగా పడిపోవడం వల్ల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారుఉదాహరణకు టమోటాలు ప్రస్తుతం కిలో రూ.3 లకు రైతులు అమ్ముకోవలసి వస్తోందికోత కూలి పోతే రైతుకు ఎంత మిగులుతుందో అందరికీ తెలిసిందేఆదే టమోటాను ప్రాసెసింగ్ కు మళ్లిస్తే ధరలు అంతగా పడిపోవు ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికిఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధ్యానత ఇస్తోందిఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడానికి అనేక రాయితీలు ఇస్తోందిఇటువంటి చర్యల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.  పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువుల ద్వారా ఉపాధి అవకాశాలు పొందాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా గతంలో కారుల్లో తిరిగే ధనవంతుల పిల్లలు  కూడా లబ్ది పొందారుఇటువంటి వాటికి అడ్డుకట్టవేయవలసిన అవసరం ఉంది. పండుగల సందర్భంలో పలురకాల వస్తువులతో ఓ సంచి ఇస్తున్నారుసంక్రాంతికి కూడా అలాంటి సంచే ఇచ్చారుదీనిని దృష్టిలోపెట్టుకొని మరో పార్టీ వారు సరుకులతో కూడిన సంచులు కాకుండా సంక్రాతికి ఇంటింటికి ఏకంగా అరిశల ప్యాకెట్ ఇస్తామని హామీ ఇచ్చే ప్రమాదం ఉందిఇవి అంత అవసరమా?ఆలోచించడంమన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 32 కులాలలో యాచక వృత్తి చేసుకునేవారు కూడా ఉన్నారుసామాజికంగాఆర్థికంగా ఆ కులాల వారి బతుకు దుర్భరంగా ఉందితమకు  రూ.25 వేల నుంచి రూ.లక్షల వరకు అప్పు ఇప్పిస్తే చిన్న చిన్న వ్యాపారులు చేసుకొని బతుకుతామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలోనే వారు అధికారులను అడిగారు.  ఈ కులాల వారితోపాటు అలా బతకాడానికి ముందుకు వచ్చేవారికి చిన్ని చిన్న వ్యాపారాలుచేతివృత్తుల ద్వారా జీవించడానికి ఏ ప్రభుత్వమైనా నిజాయితీగా అవకాశం కల్పించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధితోపాటు వారి జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి అవకాశం ఏర్పడుతుందిప్రభుత్వంసమాజ శ్రేయస్సు దృష్ట్యా అశాస్త్రీయ రుణ మాఫీలనుఉచితంగా ఇచ్చేవాటిని తగ్గించవలసిన అవసరాన్ని అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది.  
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jan 6, 2018

అనుత్పాధక సబ్సిడీలతో వ్యవస్థకు ముప్పు

Jan 5, 2018

సచివాలయ స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులు

           సచివాలయం, జనవరి 5: సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2017 విజేతలకు  సచివాలయం 3వ బ్లాక్ లోని సంఘం కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, టూరిజం శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలు బహుమతులు అందజేశారు. క్రికెట్, రన్నింగ్, షెటిల్ తదితర పోటీలలో పురుష, మహిళా విజేతలకు ప్రధమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ నూతన రాష్ట్రంలో మొదటి సారిగా నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల క్రీడా పోటీలను విజయవంతం చేసినందుకు  అభినందనలు తెలిపారు. మరో అధికారి ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ విన్నర్స్ గా, రన్నర్స్ గా నిలవడం కంటే పాల్గొనడం ముఖ్యమన్నారు. క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటున్న  మహిళా ఉద్యోగులను ఆయన అభినందించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీ కృష్ణ మాట్లాడుతూ వయసుతో సంబంధంలేకుండా ఉద్యోగులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ పోటీలలో పాల్గొన్నారన్నారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్ స్పిమ్మింగ్-2016లో కాంస్య పతకం సాధించిన కె. వెంకట్రావు, సౌత్ ఏషియన్ వెటరన్ టేబుల్ టెన్నీస్ లో రజత పతకం సాధించిన బి.సుజాతలను సభకు పరిచయం చేశారు. నూతన రాష్ట్రంలో తొలి స్పోర్ట్స్ మీట్ విజయవంతం కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
        సంఘం క్రీడల విభాగం జాయింట్ సెక్రటరీ ఎన్ ఎస్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో, విజయవాడ ఐజీఎం స్టేడియంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు 4 రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో ఉద్యోగులు దాదాపు 700 మంది వరకు పాల్గొన్నట్లు తెలిపారు. సచివాలయం 6 బ్లాకుల్లోని మహిళ, పురుష ఉద్యోగులను 4 గ్రుపులుగా, 31 టీమ్స్ గా విభజించి మొత్తం 61 ఈవెంట్లలో పోటీలు నిర్వహించినట్లు వివరించారు.

17న మంత్రి మండలి సమావేశం

   సచివాలయం, జనవరి 4: సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 3 గంటలకు మంత్రి మండలి సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సచివాలయ నియమ నిబంధనలను అనుసరించి సమయానికి ప్రతిపాదనలు పంపాలని సీఎస్ కోరారు.

18, 19 తేదీల్లో కలెక్టర్ల సమావేశం

సచివాలయం, జనవరి 4: సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజులు కలెక్టర్ల సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(రెవెన్యూ) డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి తమతోపాటు హాజరుకావలసిన అవసరం ఉన్న శాఖాధిపతులను  మాత్రమే ఆహ్వానించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆయన కోరారు.

Jan 3, 2018

ఫిబ్రవరి 15 లోపల మత్స్యకారులందరికీ బయోమెట్రిక్ కార్డులు

సముద్రతీర ప్రాంత రక్షణ కమిటీ సమావేశంలో సీఎస్
      
  సచివాలయం, జనవరి3: సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులందరికీ ఫిబ్రవరి 15వ తేదీ లోపల  బయోమెట్రిక్ కార్డులు ఇవ్వాలని మత్స్య శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జరిగిన  సముద్రతీర ప్రాంత రాష్ట్ర స్థాయి రక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నమోదు చేసిన మత్స్య కారుల వివరాలు, వారి సెల్ నెంబర్లను సముద్రతీర ప్రాంత రక్షణ పోలీసులకు అందజేయమని చెప్పారు. జిల్లా స్థాయిలో జిల్లా తరువాత జిల్లాలో మత్స్యకారులతో సమావేశాలు నిర్వహించమని ఆదేశించారు.  నోటిఫైడ్ ఫిష్ ల్యాండింగ్ పాయింట్స్, బోట్స్ కలర్ కోడింగ్, ఫైబర్ బోట్స్బోట్స్ నిర్వహణ, వాటి మరమ్మతులు, మచిలీపట్నం పాత పోర్ట్ ప్రాంతంలో తీర ప్రాంత పోలీస్ శిక్షణ కేంద్రంకు భూమి కేటాయింపు, ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు, తీరప్రాంత రక్షణ పోలీస్ ప్రధాన కార్యాలయ నిర్మాణం, రాష్ట్ర మేరీటైం బోర్డు, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, జట్టీలు, జట్టీల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులు తదితర అంశాలను చర్చించారు.
రాష్ట్రంలో 974 కిలో మీటర్ల తీర ప్రాంతంలో 9 జిల్లాలు, 64 మండలాలు, మొత్తం 21 తీరప్రాంత రక్షణ పోలీస్ స్టేషన్లు ఉన్నట్లు, వాటిలో ఒక్క స్టేషన్ కు మాత్రమే సొంత భవనంలేదని, 19 స్టేషన్లకు కాంపౌండ్ వాల్స్ నిర్మించివలసి ఉందని అధికారులు వివరించారు. పోలీస్ స్టేషన్ల పరిధిని నిర్ణయించవలసి ఉందని చెప్పారుఏపీ మెరైన్ బోర్డు బిల్-2017ని కేంద్రానికి పంపినట్లు తెలిపారు. హోం శాఖ గత నవంబర్ లో రూపొందించిన జీఓ ప్రకారం జిల్లా స్థాయి తీరప్రాంత రక్షణ  కమిటీలను జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తారన్నారు. తీర ప్రాంత రక్షణ పథకం ఫేజ్ 2 కింద కేంద్ర ప్రభుత్వం 7 జట్టీల నిర్మాణానికి రూ.3.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో  350 నోటిఫైడ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఉన్నాట్లు తెలిపారు. బోట్ లకు కలర్ కోట్ ఉంటే ఏరియల్ సర్వే తేలికవుతుందని చెప్పారు. మొత్తం 33,275 బోట్లలో 32,931 బోట్లకు సంబంధించి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు తెలిపారు.  ఈ సమావేశంలో డీజీపీ ఎం.మాలకొండయ్య, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, విశాఖ పోర్ట్ చైర్మన్ ఎం.టి.కృష్ణ బాబు, కోస్ట్ గార్డ్ కమాండెంట్ ఎస్.ఎస్.సింగ్, ఫిషరీస్ శాఖ డైరెక్టర్ కె.ప్రవీణ్, కెప్టెన్ కె.శ్రీధర్మ, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సుధ కోకా, డాక్టర్ బాలకృష్ణన్, కె.గణేశన్, ఏబీవీ శాయి శ్రీనివాస రావు, ఏఎస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.