Sep 20, 2018

జాతీయ స్థాయికి మించి రాష్ట్రంలో వృద్ధి
              
            రాష్ట్రం ఎన్ని వడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్థిక వృద్ధి రేటులో దూసుకుపోతోంది. జాతీయ వృద్ధిరేటు కంటే రాష్ట్రం ముందుంది. నాలుగేళ్లలో సగటు వృద్ధి రేటు 10.5 శాతం సాధించింది. గత నాలుగేళ్లలో వృద్ధి రేటు సాధించడంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 17.76 శాతంపారిశ్రామిక రంగం 8.49 శాతంసేవల రంగం 9.11 శాతం స్థూల వ్యయం వృద్ధిని కనబరిచాయి. రాష్ట్ర జీడీపీ పెరుగుదలలో మత్స్యరంగం 6.4 శాతం వాటాతో కీలకపాత్ర పోషించింది. రాష్ట్రంలో నిర్మాణరంగం మరింత పుంజుకుంటుందని భావిస్తున్నారు. వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగంలో అంచనాలను మించి వృద్ధి కొనసాగుతోంది. ఈ ఏడాది జాతీయస్థాయిలో వ్యవసాయం వృద్ధి రేటు 2.2 శాతం ఉంటే మన రాష్ట్రం 11 శాతం సాధించింది. తీవ్ర వర్షాభావంలో కూడా వ్యవసాయ దిగుబడులు తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఉపరితల జలాలుభూగర్భ జలాలు సద్వినియోగం అయ్యేవిధంగా చేపట్టిన పనులు విజయవంతం అయ్యాయి. సమర్ద నీటి నిర్వహణ ద్వారా పంటల ఉత్పాదన పెరిగింది.  2 కోట్ల ఎకరాల్లో వ్యవసాయంకోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు జరగాలన్నది ప్రభుత్వ  లక్ష్యం. 33 లక్షల ఎకరాల్లో ప్రస్తుతం సూక్ష్మ సేద్యం చేస్తున్నారు. రాబోయే 7 ఏళ్లలో ఇది కోటి ఎకరాలకు చేరాలని నిర్దేశించారు. ఏడాదికి 10 లక్షల చొప్పున మరో 70 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు పెరగడానికి ప్రణాళికలు రూపొందించారు.  గతంలో రాయలసీమ ఎడారిగా మారుతుందని భయపడేవారు. అనంతపురం నుంచి  వలసలలు పెరుగుతాయని భావించారు. అయితే నేడు  రాయలసీమను ప్రభుత్వం సస్యశ్యామలం చేస్తోంది. చెరువులన్నీ నింపారు.  సీమలో భూగర్భజలాలు పెంచుతున్నాయి. పండ్లతోటల హబ్ గా సీమను మారతోంది.  అనంతపురంలో కియా మోటార్ల కంపెనీ నిర్మాణం జరుగుతోంది. అక్కడ వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. వచ్చే జనవరి నాటికి కియా కార్లు పరుగులుతీసే అవకాశం ఉంది. పారిశ్రామికసేవారంగాలో  రాష్ట్రం వెనుకంజలో ఉండటంతో  గత 4 ఏళ్లుగా ఈ రెండు రంగాలపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది. అన్ని రంగాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగా2029 నాటికి అగ్రగామి రాష్ట్రంగా2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత రాష్ట్రంగా ఏపీ రూపొందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా మౌలిక వసతులు అభివృద్ధి గణనీయంగా జరుగుతోంది. గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ లో తొలి 10 స్థానాల్లో మన రాష్ట్రం ఉండాలన్నది ప్రభుత్వ ధ్యేయం. రెండేళ్లలో 54వ స్థానం నుంచి 31వ స్థానానికి రాష్ట్రం చేరుకుంది.

              తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. జాతీయ సగటు కన్న ఎక్కువగా ఉంది. అయితే పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మాత్రం రాష్ట్రం వెనుకబడి ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,23,664లు ఉండగా, 2017-18లో రూ.1,42,054కు చేరుకుంది.   ఏడాది వ్యవధిలో రూ.18,390 (14.87 శాతం) పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం(రూ. 1,12,764)కన్నా ఇది ఎక్కువ, తెలంగాణ (రూ.1,75,534) కన్నా తక్కువ.   పొరుగు రాష్ట్రాలతో పోల్చితే వెనుకబడి ఉన్నాం. నాలుగేళ్ల కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనేక అవార్డులు సాధించి రికార్డు నెలకొల్పింది. దాదాపు 511 అవార్డులు లభించాయి. సేవా భావంనిజాయితీపారదర్శకత,జవాబుదారీ తనంవినమ్రతసమభావంపట్టుదలఆశాభావంతో కష్టపడిఇష్టపడి పనిచేయవలసిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంది. రాష్ట్రాభివృద్ధిలో అధికార యంత్రాంగానికి కీలక భూమిక. అందువల్లే  ఆర్ధికంగా ఇబ్బందులున్నా ఉద్యోగులకు ప్రభుత్వం 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది.

బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోంది.  ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి దశలలో  ప్రభుత్వం అండగా నిలిచి ఒక చరిత్ర సృష్టించింది. బాల్యంచదువుఉపాధివివాహ దశలు,
సొంత ఇల్లుఆరోగ్యంవృద్ధాప్యం అన్ని దశల్లో చేయూతనిస్తోంది. రూ.50 వేల కోట్లతో 19 లక్షల ఇళ్లు నిర్మిస్తోంది. మరో 5 లక్షల ఇళ్లు అదనంగా నిర్మించాలని నిర్ణయించింది. గ్రామాలలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది.  పట్టణాలలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉంది. చంద్రన్న పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, 6 లక్షల మహిళలకు అన్న అమృత హస్తం పథకం అందిస్తున్నారు.  తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ పథకాన్ని 5 లక్షల 60 వేల మంది ఉపయోగించుకున్నారు. 24.65 లక్షల మంది చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. గిరి గోరు ముద్దలకు రూ.23 కోట్లుసబల పథకానికి రూ.40 కోట్లు ప్రభుత్వం వ్యయం చేస్తోంది. ఎన్టీఆర్ బేబి కిట్స్ 5.21లక్షల మందికి అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా 36 లక్షల మందికి లబ్ది చేకూరింది. 2358 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ అభివృద్ధి చేశారు. 5.62 లక్షల మంది బాలికలకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. 6 లక్షల మందికి ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ లు12 లక్షల మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు అందజేశారు. 100 శాతం విద్యుత్, వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.  రాష్ట్రం 100 శాతం ఓడిఎఫ్ సాధించడం ఒక చరిత్ర. గౌరవప్రదంగా ప్రతి పేదకు ఆహారం అందించే  అన్నా కేంటిన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని ఆకర్షణీయంగా రూపొందించి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 58.15 శాతం పూర్తిచేశారు.  పట్టిసీమ,పురుషోత్త పట్నం ద్వారా పోలవరం ఫలితాలు రైతులకు ముందే అందిస్తున్నాయి.  రాష్ట్రంలో పోలవరంతోపాటు దానికి సమానమైన మరో 57 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. వాటిలో 10 ప్రాజెక్టులను ప్రారంభించారు.  ఈ నెలలో మరో 12 ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివరకు 45 ప్రాజెక్టుల వరకు ప్రారంభిస్తారు. 5 ఏళ్లలోపే ఇన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనం.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...