Sep 24, 2018


పెట్టుబడులు రాబట్టడంలో
 తండ్రికి తగ్గ తనయుడు
     సమర్థవంతంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం
        వేదికను ఉపయోగించుకున్న లోకేష్
         
             
             
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తండ్రి నారా చంద్రబాబు నాయుడుకు తగిన కుమారుడని నిరూపించుకున్నారు. చైనాలోని టియాన్జిన్ వేదికగా సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాలను ఆయన చక్కగా వినియోగించుకున్నారుతండ్రి మాదిరిగానే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సాంకేతిక వినియోగం, సరళతర వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గురించి వివరించి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు వివరించారు.  అసెంబ్లీ ఆఫ్ సిటీ లీడర్స్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నూతన ఆవిష్కరణల ప్రోత్సాహానికి తీసుకోవలసిన చర్యలు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచ వ్యాప్తంగా డెలివరీ, సమాచార సేకరణ కోసం డ్రోన్ల వినియోగం, మెరుగైన సమాజం కోసం సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ....తదితర అంశాలపై జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ మూడు రోజుల్లో ఆయన అక్కడ అంతర్జాతీయంగా మ్యాప్ కంటెంట్, ట్రాకింగ్, లొకేషన్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ సేవలు అందిస్తున్న హియర్ టెక్నాలజిస్ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ మెలోడీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ లీడర్ షిప్ ఫెలో ప్రోగ్రామ్ కు చెందిన జయంత్ నారాయణ్,  ఏఐఐబి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్  వాన్ ఆమ్స్‌ బర్గ్‌, స్టీల్, పెట్రోలియం, కెమికల్స్, కోల్, ఇండస్ట్రీయల్ ప్రొడక్ట్స్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియాకి చెందిన జిఎస్ గ్లోబల్ ప్రెసిడెంట్ సీయాహాంగ్,   హెచ్ పి కంపెనీ చీఫ్ ఆర్కిటెక్ట్ క్రిక్ వంటి వారితో వ్యక్తిగతంగా  సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను, అందుబాటులో ఉన్న వనరులు, విద్యుత్, మౌలిక సదుపాయాలతోపాటు భారీ ఎత్తున స్థాపించే కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, కల్పించే సౌకర్యాలు వివరించారుపెట్టుబడులు పెట్టడానికి తమ రాష్ట్రానికి రావలసిందిగా వారిని ఆహ్వానించారు.

                 19వ తేదీని ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  సన్ రైజ్ రాష్ట్రంగా, తూర్పు ముఖ ద్వారంగా ఉంటూ దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. పెట్టుబడులకు గేట్ వే ఆఫ్ ఇండియాగా మారుతోంది.  అనేక అంశాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక సదుపాయాల కల్పన, స్థిరమైన రెండంకెల ఆర్థిక వృద్ధి రేటును సాధించడంలో దేశంలో ముందుంది. అమరావతికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ అందించింది. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం జరుగుతోంది.  రాష్ట్రలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంట భూగర్భంలో, సముద్ర జలాల్లో సంపద ఉంది.   6 పోర్టులు ఉన్నాయి. మరో 6 పోర్టులు నిర్మించనున్నాం.  ఆటోమొబైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.  కొరియాకి చెందిన అతి పెద్ద కార్ల కంపెనీ కియా రాష్ట్రాలో ఉత్పత్తి యూనిట్ ని నెలకొల్పింది. ఇసుజు, హీరో మోటార్స్, అపోలో టైర్స్, అశోక్ లైల్యాండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాన్డ్యూయెంట్ లాంటి కంపెనీలు వచ్చాయి.  పలు  ఎలక్ట్రానిక్ కంపెనీలు రావడంతో  దేశంలో తయారు అవుతున్న 100 సెల్ ఫోన్లలో 30 ఆంధ్రప్రదేశ్ లోనే తయారవుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యత కలిగిన యువతీ,యువకులకు కొందవలేదు. ఇన్నోవేషన్ వే ఆఫ్ లైఫ్ గా(నూతన ఆవిష్కరణలు జీవితంలో ఒక భాగంగా) మార్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా ఫలితాలు సాధిస్తున్నాం. ఐఓటి పరికరాలు వినియోగించి రియల్ టైం లో సమాచారం తెలుసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల శాఖల మధ్య పోటీ పెరిగింది. దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన రియల్ టైం  డేటా అందరికీ అందుబాటులోకి వచ్చింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించి ల్యాండ్ రికార్డులకు భద్రత కల్పిస్తున్నాం. ఈ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల్లో ఎల్ఈడి లైట్ల పర్యవేక్షణ కోసం సిసిఎమ్ఎస్ టెక్నాలజీ వినియోగిస్తున్నాం.  సెన్సార్ల ద్వారా నీటి నాణ్యతను, డ్రోన్లు, లైడార్ టెక్నాలజీ అనుసంధానంతో రోడ్ల నాణ్యత తెలుసుకుంటున్నాం. రాష్ట్రంలో 100 ఎకనామిక్ సిటీలు అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 4వ పారిశ్రామిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతోంది. బిగ్ డేటా, ఇండస్ట్రీయల్ రివల్యూషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర అంశాల అమలులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారం కావాలని సమావేశానికి హాజరైన వ్యాపార దిగ్గజాలను కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక పాలసీలు, రాయితీలు, రియల్ టైం గవర్నెన్స్, నైపుణ్యత మానవవనరుల లభ్యత, భూగర్భ సంపద, 21 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు ... వంటి అంశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి, అక్కడ సాంకేతిక వినియోగం గురించి తమకు తెలుసునని, త్వరలో రాష్ట్రాన్ని సందర్శించి పెట్టుబడులు పెడతామని, తమ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పలువురు పారిశ్రామికవేత్తలు లోకేష్ కు హామీ ఇచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొదటిసారిగా త్వరలో ఇండియాలో ఒక సెంటర్ ను  ఏర్పాటు చేయబోతోంది. ముంబై కేంద్రంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్రోన్స్, బ్లాక్ చైన్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ని ఏర్పాటు చేస్తారు. 4వ పారిశ్రామిక విప్లవానికి చేయూతనిచ్చేవిధంగా దీనిని రూపొందిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆంధ్రప్రదేశ్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఫోరం సభ్యులు లోకేష్ కు చెప్పారు. ఆ విధంగా మంత్రి లోకేష్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేవిధంగా  సద్వినియోగం చేసుకున్నారు.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...