Sep 3, 2018


ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్య అంశాలు
సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.

v సాగునీరు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, నరేగా పనులను సమీక్షించాం
v నరేగా పనులకు జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పది అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది ఇంకా మెరుగుగా పనులు చేజరుగుతాయి.
v సీమలో కరువు, కోస్తాలో తుఫానులు.. వాటిని అధిగమించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. మంచి ఫలితాలు సాధిస్తున్నాం.
v గోదావరిలో 2018 టిఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. కేవలం 72 టిఎంసిలు మాత్రమే వాడుకుంటున్నాం.
v నదులు అనుసంధానం, చెరువులు నింపడం, వర్షం నీటిని భూగర్భజలాలుగా నిల్వ చేయడం ద్వారా రాష్ట్రం మొత్తంలోని భూమి సాగు చేయడానికి నీరందించే ఏర్పాట్లు చేస్తున్నాం.
v ఒక పద్దతి ప్రకారం పనులు చేపడుతున్నాం. రాయలసీమలో వర్షపాతం తక్కువగా ఉన్నా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయడం, భూగర్భజలాలు పెంచడం ద్వారా అధిగమించాం.
v రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం.
v శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు రెండూ నిండాయి.
v రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ కాకుండా మరో 57 ప్రాజెక్టులు చేపట్టాం. 57 ప్రాజెక్టులు మొత్తం ఒక్క పోలవరంతో సమానం.
v ఇప్పటికే 10 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఈ నెలలో 12 ప్రారంభిస్తాం. డిసెంబర్ నాటికి 45 వరకు ప్రారంభిస్తాం. 12 ప్రాజెక్టులకు టెండర్లు సిద్ధంగా ఉన్నాయి.
v దూర దృష్టితో చేపట్టిన పనుల వల్ల జూన్ నుంచి కృష్ణా డెల్టాలో పంటలు వేశారు. రైతులు ఆర్థిక స్వావలంబన సాధించారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.
v విశాఖకు త్రాగునీరు సమస్య ఉండదు.
v త్రాగునీరు, పరిశ్రమలకు, పంటలకు నీటి సమస్యలేకుండా చేస్తున్నాం.
v స్మార్ట్ వాటర్ గ్రిడ్ తయారు చేయాలని నిర్ణయించాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
v 2 కోట్ల ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యం. ఒక కోటి ఎకరాలు వ్యవసాయానికి, మరో కోటి ఎకరాలు ఉద్యానవన సాగుకు నీరందిస్తాం.
v ఈ ఏడాది మైక్రో ఇరిగేషన్ ద్వారా 7 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. మొత్తం 32 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ద్వారా నీరందించినట్లు అవుతుంది. కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ సాగు చేయిస్తాం. అలా చేస్తే ఒక ఎకరానికి వాడే నీటితో రెండు ఎకరాలను సాగు చేయవచ్చు.
v పోలవరం ప్రాజెక్టుని ఇప్పటి వరకు 73 సార్లు వర్చువల్ గా, 26 సార్లు ప్రత్యక్షంగా సందర్శించాను.
v పోలవరం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. రాష్ట్రానికి జీవనాడి. దీనిని పూర్తి చేయడం నా జీవితాశయం.  వచ్చే మే లోపల పూర్తి చేయాలన్నది లక్ష్యం.
v లక్ష మందికి పైగా ప్రజలు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు.
v 58 శాతం పనులు పూర్తి అయ్యాయి. మట్టి పనులు 77.5 శాతం పూర్తి అయ్యాయి.
v 100 శాతం డయాఫ్రం వాల్ పనులు పూర్తి అయ్యాయి.
v కుడి కాలువ 90 శాతం, ఎడమ కాలువ 63.35 శాతం పూర్తి అయ్యాయి.
v వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలోపల పూర్తి చేస్తాం.
v జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు రూ.5135.87 కోట్లు, తరువాత రూ.9,404 కోట్లు ఖర్చు చేశాం.
v కేంద్రం నుంచి రూ.2,736.96 కోట్లు రావాలి.
v ప్రాజెక్టు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ పంపించాము. వాటిని అమోదించాల్సి ఉంది.
v  భూసేకరణకు 25వేల కోట్లు ఖర్చు అవుతుంది.  పనుల విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. 41.15 మీటర్లు మొదటి దశలో పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం 1851 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. 6418 మంది తూర్పు గోదావరిలో నిర్వాశితులు అవుతారు.  2709 కోట్లు పునరావాసం కోసం ఖర్చు చేశాం. పశ్చిమ గోదావరిలో 100 శాతం భూసేకరణ పూర్తైంది. తూర్పులో సేకరించాల్సిన  55వేల ఎకరాలకు 6370 కోట్లు అవసరమవుతాయి.  తూర్పులో పరిహారం., పునరావాసానికి  21వేల కోట్లు., పశ్చిమలో 6 వేల కోట్లు పరిహారం కోసం ఇవ్వాల్సి ఉంది.  మొత్తం రెండు జిల్లాల్లో 27వేల కోట్లు అవసరం అవుతాయి.
v    పోలవరంపై సెప్టెంబర్ 5 కేంద్ర కమిటీ వస్తోంది. ఇప్పటికే వారు అడిగిన అన్ని వివరాలు అందిస్తున్నాం.
v రాష్ట్రం మొత్తంపై ఇరిగేషన్ ప్రాజెక్టులపై 15,365 కోట్లు ఖర్చు చేశాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.
v వర్షాలు 2 నెలలు అటూ ఇటూ అయినా నీటి భద్రత కల్పిస్తొం.
v అన్ని చెరువులకు నీళ్లు నింపడానికి, భూగర్భ జలాలు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం.
v గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు, ఎన్టీఆర్, వెంగళరావు ప్రారంభించిన ప్రాజెక్టులు, నేను ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాను. అదనంగా రిజర్వాయర్లు నిర్మించాం.
v జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్  వెంకటేశ్వరరావు, ఆ శాఖ సిబ్బంది ఉమ్మడి కృషి ఫలితంగా ఇవన్నీ సాధించాం. వారిని అభినందిస్తున్నాను.
v ప్రారంభంలో ప్రాజెక్టుల వద్ద బస్సులలో పడుకున్నాం.
v చాలా మంది ఎగతాళి చేశారు. అడ్డం తగిలారు. కాలువలకు గండి కొట్టారు. వాటన్నిటినీ అధిగమించాం.
v ప్రకృతి అనుకూలించకపోయినా, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పనులు ఆపడంలేదు. కొనసాగిస్తున్నాం. కేంద్రం నిధులు ఇస్తే ఇంకాస్త వేగంగా పనులు జరిగేవి.
v పట్టిసీమని 10 నెలలో పూర్తి చేశాం.
v ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే కరువు ఉండదు.
v జలసిరికి హారతి కార్యక్రమం 17, 18, 19 తేదీలలో నిర్వహిస్తాం. శాసనసభ సమావేశాల వల్ల ఈ కార్యక్రం వాయిదా పడింది.
v పెట్రోల్ ధర సెంచరీ  చేస్తారు.
v నోట్ల రద్దు వల్ల ప్రజలు అందరూ ఇబ్బందులుపడ్డారు.
v నేను రూ.500, రూ.2000 నోట్లు రద్దు చేయమని చెప్పాను. డిజిటల్ కరెన్సీ వినియోగం పెంచమని చెప్పాను. డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగితే మోసాలు తగ్గుతాయి.
v ఆధార్ భీమ్ యాప్ ప్రదేశపెట్టింది మనమే. క్యూఆర్ కోడ్ ఇచ్చిన మొదటి రాష్ట్రం కూడా మనదే.
v బ్యాంకుల్లో ఫ్రాడ్ జరుగుతోంది. వాటిపై నమ్మకం పోయింది.
v ఎన్డీఏ వచ్చిన తరువాత గ్రోత్ ఆగిపోయింది.
v స్విస్ బ్యాంకుల్లో మన దేశ డబ్బుని ఏడాది లోపల తెస్తామని చెప్పారు.
v హైకోర్టుని డిసెంబర్ కు సిద్ధం చేస్తాం.
v రాష్ట్రంలో మలేరియా తగ్గింది.
v ఉల్లిని నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు అందుబాటులో ఉంచుతాం.
v ఫైబర్ గ్రిడ్ వినూత్న  ప్రాజెక్ట్. దీని కంటెంట్ అందరికి ఉపయోగపడుతోంది. క్లారిటీ ఉంది. ఇప్పటికి 4,85,000 కనెక్షన్లు ఇచ్చారు. అక్టోబర్ కు 10 లక్షల కనెక్షన్లు ఇస్తారు. డిసెంబర్ నాటికి కోటి కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం.
v ప్రభుత్వ ఆస్పత్రులలో ఉత్తమ సేవలు అందజేయడం వల్ల రోగుల సంఖ్య పెరుగుతోంది.  బెండ్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం.
v సీపీఎస్  అన్ని రాష్ట్రాలలో ఉంది. పూర్తి స్థాయిలో  పరిశీలించి నిర్ణయం తీసు కోవాలి
v మీడియా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, చీఫ్ ఇంజనీర్  వెంకటేశ్వరరావు, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...