Sep 19, 2018


సాహస క్రీడలకు ప్రోత్సాహం
యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
            సచివాలయం, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం సాహస క్రీడలకు ప్రోత్సాహిస్తుందని యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ లో బుధవారం రాత్రి మౌంట్ కిలిమంజారో – 2018లో భాగంగా పర్వతారోహణను ముగించుకొచ్చిన  40 మంది విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఈ కార్యక్రమానికి రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మన రాష్ట్ర విద్యార్థి బృందం సెప్టెంబర్ 6న పర్వతారోహణ  మొదలు పెట్టి 16వ తేదీ నాటికి 5,895 మీటర్లు ఎక్కారని చెప్పారు. కర్నూలు నుంచి ఏడుగురు, శ్రీకాకుళం నుంచి ఆరుగురు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి అయిదుగురు చొప్పున, విశాఖ నుంచి ముగ్గురు, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ బృందంలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలను తమజీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...