Sep 12, 2018


నేడు సీఎం పోలవరం గ్యాలరీ సందర్శన
మంత్రి దేవినేని ఉమ
                    సచివాలయం, సెప్టెంబర్ 11: పోలవరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి గ్యాలరీని బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. గ్యాలరీ వాక్ లో పాల్గొనడం ఓ అద్భుత ఘట్టంగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని, స్థానిక, జాతీయ మీడియాని ఆహ్వనించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద  జరిగే సభలో అన్ని వివరాలు ముఖ్యమంత్రి వివరిస్తారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకు 74 సార్లు వర్చువల్ గా, 26 సార్లు భౌతికంగా ముఖ్యమంత్రి సందర్శించారని చెప్పారు. ఇప్పటి వరకు 58.15 శాతం పోలవరం పనులు పూర్తి అయినట్లు తెలిపారు. మొత్తం రూ.14,600 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.  నాలుగేళ్లలో 9,460 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.  కేంద్రం ఆధీనంలో పోలవరం అథారిటీ నుంచి రూ. 2,736 కోట్లు రావాల్సివుందని చెప్పారు.  ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గట్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డీపీఆర్-2కి పోలవరం అథారిటీ ఆమోదం తెలుపవలసి ఉందన్నారు. గత వారం కేంద్ర ప్రతినిధులు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారని తెలిపారు.  వచ్చేవారం మన అధికారులు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులకు ప్రాజెక్టు వివరాల సమాచారం అందజేస్తారని చెప్పారు. ప్రాజెక్ట్ కు సంబంధించి 45.17 శాతం హెడ్ వర్క్స్, 43.89 శాతం డ్యామ్ పనులు, 36.3 కాంక్రిట్ పనులు, 61.82 శాతం రేడియల్ గేట్ల పనులు పూర్తి అయినట్లు మంత్రి వివరించారు. ఎల్ అండ్ టీ  కంపెనీ ఆధ్వర్యంలో డయాఫ్రమ్ వాల్ పనులు 100 శాతం పూర్తి అయినట్లు చెప్పారు.  58.98 కనెక్టివిటీ పనులు, 71.77 కుడి కాలువ పనులు పూర్తి అయ్యాయన్నారు.
కాపర్ డ్యామ్ పనులు జనవరి కి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సోమవారం రాత్రి కూడా ముఖ్యమంత్రి పోలవరం పనులు సమీక్షించారని చెప్పారు. పోలవరం బహుళార్ధసాధక ప్రాజక్టని, 960 మెగా వాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, 50 లక్షల ఎకరాలకు నీరు అందించడం లక్ష్యం అని వివరించారు. 2019 జూన్, జూలై కల్లా గ్రావిటీ ద్వారా పోలవరం నుండి నీరు ఇస్తామన్నారు.  దేశ చరిత్రలో ఏ ప్రాజెక్టు గురించి కూడా ఇంత పారదర్శకంగా ఆన్ లైన్ లో సమాచారం అందుబాటులో ఉంచలేదని చెప్పారు. 140 రోజుల్లో 1,03,094 మంది రైతులు పోలవరం ప్రాజెక్టుని  సందర్శించారన్నారు.  చంద్రబాబు నాయుడుని  అపర భగీరథుడుగా పేర్కొన్నారు. రూ.16,000 కోట్లు లోటు ఉన్నప్పటికీ పోలవరం పనులను ఇబ్బంది లేకుండా కొనసాగించారని చెప్పారు. పోలవరం నిర్వాసితులను దేవుళ్ళుగా పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వారికి రూ.33,000 కోట్లు చెల్లించాలిని తెలిపారు.  భూమికి భూమి, లక్ష మందికి ఇళ్ళు నిర్మించే పనులు జరుగుతున్నాయని చెప్పారు.

               పట్టిసీమ ప్రాజెక్టు నుండి పోలవరం కుడి కాలువ ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు 42 టీఎంసీల నీరు విడుదలయినట్లు తెలిపారు.  మొత్తం 210 టీఎంసీల నీరు వచ్చినట్లు చెప్పారు. పురుషోత్త పట్నంకు 4 టీంసీలు వెళ్లాయన్నారు. రాయలసీమలోని 4 జిల్లాలకు 92 టీఎంసీ నీరు అందించామని చెప్పారు. జలవనరుల శాఖ ఇప్పటి వరకు రూ.58,000 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి దేవినేని తెలిపారు.

14 నుంచి జలసిరికి హారతి
               ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించినట్లు చెప్పారు. చెరువులు, డ్యామ్ లు, కాలవల వద్ద జలసిరికి హారతి పడతారన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...