Feb 5, 2020

మూడు రాజధానులు – పార్లమెంటులో ప్రకటన



ఛానల్ - టీవీ - ఏపీ 24X7 - తేదీ: 05.02.2020 బుధవారం ఉదయం 7.30 గం.
అంశాలు :   మూడు రాజధానులు – పార్లమెంటులో ప్రకటన

బ్రహ్మం చౌదరి – టీడీపీ
రాష్ట్రం మధ్యలో అమరావతి ఉంది. ఆ రోజు చట్ట సభలలో ప్రాతినిధ్య వహించని సీపీఐ, సీపీఎం, ప్రాతినిద్యం వహించిన వైసీపీ, బీజేపీ కూడా అమరావతిని అంగీకరించాయి. అసెంబ్లీలో అంగీకరించారు. వారు అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి నోటిఫై చేయలేదని, ఒకే సామాజిక వర్గం అనే అంశాలను లేవనెత్తారు. అమరావతిని నోటిఫై చేసింది కేంద్రం. ప్రజల మనసులో కూడా అమరావతి ఉండిపోయింది. వైసీపీ వాళ్లు వారి రాజకీయ లబ్ది కోసం ఇన్ సైడ్ ట్రేడింగ్, నోటిఫై, సామాజిక వర్గం, హైమావతి, ఎడారి, శ్మశానం ....రకరకాల వ్యాఖ్యాలు చేశారు.  అక్కడ నుంచే వారు కూడా పరిపాలన కొనసాగిస్తున్నారు. 50 రోజులుగా ఆందోళన జరుగుతున్నాయి. అమరావతి నోటిఫై అయినట్లు కేంద్రం తెలిపింది. అసెంబ్లీలో తీర్మానం కేంద్రానికి పంపారో లేదో తెలియదు. జీఎన్ రావు గారి కమిటీలోని వాస్తవాలను దాచిపెట్టారు. (రాజశేఖర్ కు కౌంటర్ బాగా ఇచ్చారు.) ప్రజలకు వాస్తవాలు చెప్పడంలేదు.
వైసీపీ కార్యకర్తలను ఆర్కే గారు సీఎం వద్దకు తీసుకువెళ్లారు. పృధ్వీగారు రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. నిన్న రైతులు అని వెళ్లి జగన్ గారికి శాలువ కప్పింది ఆర్కే గారి లాయర్ చౌడిశెట్టి నిర్మల గారు. కొడాలి నాని గారి పక్కన కూర్చున్న వ్యక్తి తాడేపల్లి మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల స్వామి రెడ్డి. తరువాత ఆర్కే గారి బాబాయి భాస్కర రెడ్డి గారు, ఆయన బావమరిది శ్రీనివాస రెడ్డి(వైసీపీ మాజీ జెడ్పీటీసీ తాడేపల్లి మండలం), ఆయన బావమరిది నాగి రెడ్డి గారు, సాంబిరెడ్డి. ఫొటోలతో సహా వారి ఆధార్ కార్డుల చూపిస్తున్నాను.  ఆ పార్టీ కార్యకర్తలను తీసుకువెళ్లి శాలువాలు కప్పితే వారు నిజమైన రైతులా? అక్కడ 30 మంది చనిపోయారు. వారికి ఒక్క గజం భూమిలేదు. వారంతా తాడేపల్లి వాసులు. ఆర్కే కుటుంబ సభ్యులతో సీఎం టీ పార్టీ అది. వెంకటపాలెంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కృపానందం అనే రైతు 25 రోజులు దీక్ష చేశారు. ఆయన చనిపోయిన రోజు కూడా అక్కడ వైసీపీ జెండా ఎగిరింది. ఈ ఆర్కే గానీ, శ్రీదేవి గానీ  కనీసం తొంగికూడా చూడలేదు. వారిలో ఒక్కరు కూడా భూమి ఇవ్వలేదు. వారు రైతులు ఎలా అవుతారు?
రైతులు ఎవరి ఉచ్చులో లేరు.


రాజశేఖర్ – వైసీపీ
కేంద్ర సమాధానం స్పష్టంగా ఉంది. బీజేపీ కేంద్ర నాయకులు ఏమి చెప్పారో సమాధానం కూడా పార్లమెంటులో అదే ఉంది. కేంద్రం జోక్యం చేసుకోదని జీవీఎల్ గారు చాలా సార్లు చెప్పారు. అధికారికంగా స్పష్టంగా చెప్పారు. పార్లమెంటులో స్పష్టమైన తరువాత ఇప్పటికైనా టీడీపీ గానీ, ఇతర పార్టీలు గానీ పద్దతి మార్చుకోవాలి. బీజేపీ కూడా కేంద్రం, రాష్ట్ర పార్టీ నాయకత్వం సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. రాజధాని రైతులను ఇంకా మోసం చేయడం మానుకోవాలి. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. భవిష్యత్ లో కూడా కేంద్రం వైఖరి ఇలానే ఉంటుంది.
జీఎన్ రావు, బోస్టన్, మంత్రుల కమిటీల సూచనల మేరకే నిర్ణయాలు తీసుకున్నాం. బీజేపీ వారు విమర్శలకు మాత్రమే పరిమితమవుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి వారు కృషి చేయడంలేదు. కేంద్రంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. శివరామకృష్ణణ్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. నారాయణ కమిటీ నివేదికను మాత్రమే ప్రదేశ పెట్టారు.
రైతులు చంద్రబాబు నాయుడు ఉచ్చులో నుంచి బయటకు రావాలి. ఆయన గ్రాఫిక్ చూపించి రైతులను మోసం చేశారు. మళ్లీ మోసం చేయడానికి చూస్తున్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యవసాయం చేసుకుంటే చేసుకోండని సీఎం రైతులకు చెప్పారు. బాల్ వారి కోర్టులోనే ఉంచారు. రైతులు టీడీపీ, ఇతర పార్టీల కబంధ హస్తాల నుంచి బయటపడాలి.
రెడ్డి సమాజిక వర్గంలో రైతులు ఉండరా?
పార్టీలు సిద్ధాంతాలు మాకు అవసరంలేదు. ప్రజా సమస్యలే మాకు ముఖ్యం.

ఎంఏ గఫూర్ –సీపీఎం
ప్రశ్నకు రాతపూర్వక సమాధానం మాత్రమే ఇచ్చారు. చర్చ జరగలేదు. రాతపూర్వక సమాధానం క్లుప్తంగా ఇస్తారు. బీజేపీ తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. కిషన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంశం, అయినా పరిశీలిస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర యూనిట్ మొత్తం అమరావతి ఉండాలని చెప్పారు. బీజేపీకి రెండు నాలుకలు ధోరణి అలవాటే. కన్నా ఒక మాట చెప్పారు. జీవీఎల్ ఒకటి చెబుతారు. ప్రజలను ఫూల్ చేయడానికా? బీజేపీ ఒకే నిర్ణయానికి రావాలి. రెండు నాలిక ధోరణితో రాష్ట్రాన్ని  నాశనం చేస్తున్నారు. ఈ ప్రపంచంలో జగన్ ఇంకొకరి మాట వింటారని నేను అనుకోవడంలేదు. కేంద్రం అధికారయుతంగానైనా జోక్యం చేసుకోవాలి. లేదా కోర్టుకు వెళ్లాలి. వైసీపీకి నైతిక అధికారం లేదు. విజయవాడలో రాజధాని అనేదానికి అంగీకరించారు. రాష్ట్ర రాజధానిని మారుస్తామని ఎన్నికల ప్రణాళికలో లేదు. ఎమ్మెల్యేల బలం ఉండవచ్చు నైతికంగా బలంలేదు. ఏ ముఖ్యమంత్రి అయినా అలా ప్రవర్తించలేదు. చంద్రబాబు నాయుడుని ఆ రోజు బలపరచలేదు. ఈ రోజు బలపరచలేదు. రాజధాని మీ సొంతమా? అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమంటే చేయలేదు. రాజధాని పార్టీ విషయం కాదు. ప్రజల విషయం. అధికారం ఇచ్చింది వాస్తవం. మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం మంచిపద్దతి కాదు. మీ ముఖ్యమంత్రి ఎవరితో కలవరు. ఏ పార్టీతో మాట్లాడరు. రాజశేఖర రెడ్డి రోజుకు వెయ్యి మందిని కలిసేవారు. రాష్ట్రంలో మళ్లీ చిచ్చు పెడుతున్నారు. మీ మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తారు? రైతులతో మాట్లాడండి. కౌన్సిల్ లో మెజార్టీ లేదు. దానిని ఒప్పుకోరు. దూకుడుగా పోయారు. కోర్టులో కేసు.  తీర్మానం కేంద్రానికి పంపలేరు. కౌన్సిల్ లో మీకు మెజార్టీలేదని తెలుసు కదా.  బీజేపీ మెజార్టీ వచ్చేంతవరకు ఆగారు. మీరు కూడా ఆ రకంగా చేసి ఉండాల్సింది.

రామకోటయ్య – బీజేపీ
ఏప్రిల్ 23, 2015న అమరావతి రాజధానిగా ఏపీ గెజిట్ నోటిఫికేషన్.
పార్లమెంటులో  ఎంతవరకు ప్రశ్న అడిగారో అంతవరకు సమాధానం చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రాల కు అధికారం ఉంది. 2015లోనే ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వారికి 151 సీట్లిచ్చారు ప్రజలు. ఈ విషయంలో కేంద్రం కలుగజేసుకుంటే ఏపీపై కేంద్రం పెత్తనం అని రాస్తుంది మీడియా. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక రాజధాని అన్నారు. అలాగే తాత్కాలిక రాజధాని అవుతుంది. పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయం చేస్తున్నారు. ఎవరు ఏం చేయగలుగుతున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు గండిపేట నుంచి చేశారు. ప్రజలు ఓటు ద్వారా సరైన నిర్ణయం తీసుకోకపోవతే రాజకీయ నాయకుల విన్యాసాలు ఇలాగే ఉంటాయి.
ఒక ప్రేలాపన చేసినప్పుడు దానికి విధివిధానాలు ఉంటాయి. అమరావతి మాకు ముఖ్యం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టంగా చెప్పారు. వైసీపీ వారు మాత్రం కేంద్రం ఆశీస్సులు మాకు ఉన్నాయని చెబుతున్నారు. ప్రజలు నమ్మకంతో అవకాశం ఇచ్చారు. దీనిని అవకాశం తీసుకొని విశాఖపట్నం, యలమంచిలిలో పెడతామంటే ప్రజలు మౌనంగా రోధిస్తారు. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు ఫిబ్రవరి 26 వరకు కార్యాలయాలు మార్చవద్దని హైకోర్టు చెప్పింది.
సీఎం జేఏసీని పిలవకుండా వారికి అనుకూలంగా ఉన్న కొందరు రైతులను పిలిచి వారికి హామీలు ఇచ్చారు. జేఏసీ నేతలను పిలవాలి. లేదా వారి వద్దకు వెళ్లి మాట్లాడాలి. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతోనే మాట్లాడటంలేదు. అనుకూలమైనవారితో మాట్లాడితే ప్రయోజనం ఉండదు.

బొలిసెట్టి సత్యనారాయణ – బీజేపీ
సమాధానంలో క్లారిటీ ఉంది. అక్కడ చర్చ జరగలేదు.  మా ప్రభుత్వం వద్ద అమరావతి కేపిటల్ అని ఉంది. 3 రాజధానులు మీడియాలో చూశాం అన్నారు. ఏక పక్షంగా జగన్ రాజధానిని మార్చవచ్చా? టెక్నికల్ గా కరెక్టే. మోరల్ గా ఆలోచన చేయాలి. రాజధాని ఇక్కడే ఉంటుందని మీరు హామీ ఇస్తారా? అని చంద్రబాబు నాయుడుని 2015లోనే పవన్ ప్రశ్నించారు. జగన్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల
ఏపీ గ్రోత్ దెబ్బతింటుంది. నిత్యానంద రాయ్ అమిత్ షా కాదు, మోదీ కాదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి ప్రశ్నిస్తే కుదరదని, కేంద్రంతో సంప్రదించాలని చెబుతారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నేను కూడా ఆరోపించాను. దానిమీద విచారణ జరిపించండి. రాజు మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతే ఎలా? సీఎం ప్రజలకు ఏది మంచిదైతే అదే చేయాలి. చంద్రబాబు నాయుడుని, పవన్ ని టార్గెట్ చేస్తూ చేయకూడదు.

పూల విక్రమ్ – సీనియర్ జర్నలిస్ట్
గల్లా జయదేవ్ గారు ప్రశ్న మరికొంత బెటర్ గా వేస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను. పార్లమెంటులో కేంద్ర మంత్రి అసలు విషయం దాచి, లేని విషయం చెప్పారు. మూడు విషయాలు స్పష్టమయ్యాయి. అమరావతి నోటిఫై అయిందని వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని తెలిసింది. బీజేపీ రాష్ట్ర నాయకులు గంభీరమైన ప్రకటనలు చేశారు. వారి కేంద్ర నాయకత్వం వద్దకు వెళ్లి తీవ్రతని వారి దృష్టికి తీసుకువెళ్లడంలో పూర్తి వైఫల్యం. పవన్ వెళ్లినా ఏమీ జరగలేదని తెలిసింది. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రం నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. 
రైతులను సీఎం వద్దకు తీసుకురావడం అనేది రాజకీయం వ్యవహారం. వైసీసీ తప్ప మిగిలిన పార్టీలు రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి ఇష్టపడటంలేదు. అయితే రైతులకు భరోసా ఇచ్చిన ఇతర పార్టీలు  బీజేపీ, జనసేన రాజకీయ కార్యక్రమాలు ఏమీ లేకపోవడం ఆశ్ఛర్యంగా ఉంది. సీపీఐ, సీపీఎంలు కూడా రావడంలేదు.  రైతుల మానాన రైతులను వదిలివేశారు.  కోర్టులు చెప్పినా వారు వినిపించుకోవడంలేదు. వారి దారిలో వారు వెళుతున్నారు.


Feb 4, 2020

రాజధాని విషయంలో మా జోక్యం ఉండదు : కేంద్రం స్పందన


v  04.02.2020:  లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఏక్కడ పెట్టుకోవాలనే అధికారం రాష్ట్రానికే ఉంటుంది. అందులో మా జోక్యం ఉండదు. 2015లో అమరావతిని ఏపీ రాజధానిగా నోటిఫై చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని మీడియా రిపోర్ట్ చూశాం.

Feb 3, 2020

పార్లమెంటులో అమరావతి, మండలి!



v 30-01-2020 :
నవ్యాంధ్రకు మూడు రాజధానులు, అప్రజాస్వామికంగా శాసన మండలి రద్దు అంశాలను ప్రస్తావించినప్పుడు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తమను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారని తెలుగుదేశం రాజ్యసభాపక్ష నేత కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న సందర్భంగా గురువారం పార్లమెంటు లైబ్రరీ భవనంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, టీడీపీపీ నేత గల్లా జయదేవ్‌, లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు, కనకమేడల, వివిధ పార్టీల సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రాంతీయ చిచ్చు పెట్టిన జగన్‌ ప్రభుత్వ ఏకపక్ష, అప్రజాస్వామిక ధోరణి గురించి ఈ భేటీలో ప్రస్తావిస్తున్నప్పుడు.. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తమ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారని తెలిపారు. మా నేత చంద్రబాబును, మమ్మల్ని తూలనాడుతూ వాగ్వాదానికి దిగి, రభస చేయాలని ప్రయత్నించడంతో ఇతర పార్టీల సీనియర్‌ ఎంపీలంతా వారిని అడ్డుకున్నారు. అయినా వారు తగ్గకపోవడంతో రాజ్‌నాథ్‌సింగ్‌ అసహనం వ్యక్తంచేశారు. టీడీపీ ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు మీరు అడ్డుతగలొద్దు.. మీ సమయం వచ్చినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండన్నారు. అయితే అక్కడితో వారు ఆగలేదు. శాసనమండలి రద్దు అంశంపైనా పార్లమెంటులో చర్చకు అవకాశమివ్వాలని మేం కోరుతుండగా.. మళ్లీ వారు అడ్డుకోవాలని చూశారు. రెండోసారి రాజ్‌నాథ్‌ జోక్యం చేసుకున్నారు. టీడీపీ ఎంపీలు మాట్లాడేటప్పుడు అడ్డుతగలడం మంచిది కాదని గట్టిగా చెప్పడంతో వారు తోకముడిచారుఅని వివరించారు. రాజధాని కోసం చేపట్టిన చలో అసెంబ్లీసందర్భంగా. తనను కూడా పోలీసులు అమానవీయంగా, చట్టవిరుద్ధంగా కొట్టి, గాయపరిచి వేధించారని, అక్రమంగా కేసులు పెట్టారని.. దీనిపైనా చర్చిస్తామని జయదేవ్‌ తెలిపారు.

బీసీజీ ఫీజు రూ.5.95 కోట్లు



ఈసీజీ తీయించుకున్నంత ఈజీగా బీసీజీ అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించింది. సుమారు రూ.5.95 కోట్లు పుచ్చుకున్న ఈ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరంఅని కేవలం ఐదు వారాల్లో తేల్చింది. మన రాష్ట్రం, దేశానికి చెందిన జీఎన్‌ రావు, ఇతర నిపుణులతో కూడిన కమిటీ తన నివేదిక సమర్పణకు మూడు నెలలకుపైగా సమయం తీసుకోగా... అమెరికాలోని బోస్టన్‌ కేంద్రంగా పని చేసే బీసీజీ కమిటీ మాత్రం ఈ పనిని చాలా తేలిగ్గా, మెరుపు వేగంతో పూర్తి చేసింది.
 పిచ్చోడి పని... అంటూ!
ప్రపంచంలో 32కుపైగా గ్రీన్‌ఫీల్డ్‌ సిటీలు (నూతన నగరాలు) నిర్మించినప్పటికీ... వాటిల్లో చైనాలోని షెంజన్‌, భారతదేశంలోని నవీ ముంబై మాత్రమే విజయవంతమయ్యాయని బీసీజీ పేర్కొంది. ‘‘వాటికి అనేక కారణాలున్నాయి. ఇప్పటికే రాజధాని ఉన్న నగరాలు అవి. మన రాష్ట్రానికి రాజధాని లేదు’’ అని వ్యాఖ్యానించింది. బహుశా... రాజధానిలో భాగమైన నగరాలు కాబట్టే నవీ ముంబై, షెంజన్‌ సక్సెస్‌ అయ్యాయన్నది బీసీజీ ఉద్దేశం కావొచ్చు. కానీ... అమరావతినే రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తున్నారనే విషయాన్ని విస్మరించడం గమనార్హం.  ఇక... ఏ గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ ఎందుకు విఫలమైందో కూడా ఒక వాక్యంలో వివరించింది. అందులో... ఆస్ర్ట్రేలియాలోని మోనార్టో గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ గురించి చెబుతూ, ‘‘అడిలైడ్‌కు 160 కిలోమీటర్ల దూరం. ఒక తిక్కలోడు అక్కడి నుంచి ప్రభుత్వాన్ని మార్చడం వల్ల విఫలమైంది’’ అని తెలిపింది. అంటే.. ఆ తిక్కలోడు రాజధానిని మార్చకపోతే గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా మోనార్టో విజయవంతమయ్యేదేమో! ఏపీలో అమరావతినే రాజధానిగా నిర్మిస్తున్నారు. అందువల్ల, విఫలమయ్యే అవకాశముండదనే విషయాన్నీ విస్మరించారు.

ఏమిటి ప్రాతిపదిక?
సాధారణంగా ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత ప్రభుత్వాలు అవి అధ్యయనం చేయాల్సిన అంశాలు, నివేదికలు ఎప్పటిలోగా ఇవ్వాలి అనే అంశాలతో నోటిఫికేషన్లు ఇస్తాయి. జీఎన్‌ రావు కమిటీ విషయంలో ఇలాంటి జీవో ఒకటి వెలువడింది. కానీ, బీసీజీ కమిటీ వ్యవహారం అంతా రహస్యంగానే సాగింది. అసలు ఇలాంటి కమిటీ ఒకటుందని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలిచ్చే బాధ్యత అప్పగించారని ఎవ్వరికీ తెలియదు. డిసెంబరు రెండో వారంలో ఒక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ ఒక సమావేశంలో చెప్పిన తర్వాతే బీసీజీవిషయం బయటపడింది. చివరికి... బీసీజీ నివేదిక పీఠికలో గత ఏడాది అక్టోబరు 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎఫ్సీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) కోసం నోటిఫికేషన్‌ ఇచ్చిందని, నవంబరు 27న ఎల్‌ఓఏ (ఒప్పంద పత్రం) జారీ చేయడం ద్వారా తనను ఎంపిక చేసిందని తెలిపింది. రాజధాని అంశంపై తగు సూచనలివ్వాల్సిందిగా బీసీజీ కమిటీని తాము కోరినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ, నిర్దిష్టంగా రాజధాని వికేంద్రీకరణపై అధ్యయనం చేయాల్సిందిగా తమను కోరినందునే దానిపై సూచనలిస్తున్నట్లు బీసీజీ తన తుది నివేదికలో స్పష్టంగా పేర్కొంది! అంటే... ప్రభుత్వం ముందుగానే రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చి, అదేమాటను నిపుణుల కమిటీలతో చెప్పించడమే లక్ష్యంగా అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది.

నిశ్శబ్ద పరిశీలన, అధ్యయనం’!
సర్వసాధారణంగా ప్రభుత్వం ఏదైనా అంశంపై అధ్యయనానికి ఏర్పాటు చేసే కమిటీలు... ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించి, సంబంధిత వ్యక్తులు, నిపుణులతో చర్చించడం రివాజు. పాత రికార్డులను పరిశీలించడం, సమావేశాలను నిర్వహించడం కూడా సహజం. జీఎన్‌ రావు కమిటీ తూతూమంత్రంగానైనా ఈ పని చేసింది. బీసీజీ సంస్థ ఆ మాత్రం కూడా చేయలేదు. రాష్ట్ర ప్రణాళికా శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు, సంస్థల వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న మెటీరియల్‌ను తీసుకుని కట్‌ అండ్‌ పేస్ట్‌చేసి, అక్కడక్కడా కొద్దిపాటి మార్పు చేర్పులతో నివేదిక రూపొందించింది. కొన్ని విదేశీ నగరాలతో పోల్చడం ద్వారా అంతర్జాతీయ కలరింగ్‌ఇచ్చింది. గత ఏడాది నవంబరు 27న బీసీజీని ఎంపిక చేయగా... తర్వాత 2 వారాలకే మధ్యంతర నివేదికను ఇచ్చింది. ఆ తర్వాత మూడు వారాల్లోపే తుది నివేదికనూ సమర్పించేసింది. అమరావతికి ముంపు బెడద ఉందంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలకు సాధికారత చేకూర్చేందుకుఅన్నట్లుగా మద్రాస్‌ ఐఐటీ దీనిపై నివేదిక ఇచ్చిందంటూ బీసీజీ ఓ మాట చెప్పింది. కానీ... అలాంటి నివేదిక ఏదీ తాము ఇవ్వలేదని ఐఐటీ మద్రాస్‌ రాజధాని ప్రాంత రైతులకు ఈ-మెయిల్‌లో బదులిచ్చింది. మరోవైపు... అనంతపురంలో వాహన విడి భాగాలు, గోదావరి జిల్లాల్లో ఆహార ప్రాసెసింగ్‌... అంటూ జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలనూ రచించింది.నిజానికి... ఆయా ప్రణాళికలన్నీ గత ప్రభుత్వ హయాంలో మొదలైనవే, ఏదో ఒక దశ వరకు వచ్చినవే! వెరసి... ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారాన్నే కాపీ చేసి, పాత ప్రణాళికనే వల్లె వేసి ఐదు వారాల్లో ఈజీగా ఇచ్చేసిన బీసీజీ నివేదిక ఖర్చు రూ.5.95 కోట్లు!

అమరావతి నిర్మాణం జరిగితే ప్రయోజనాలు



v అమరావతి మహానగరంలో అంతర్భాగంగా ప్రభుత్వ పరిపాలన నగరం, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, ఆటల, మీడియా, పర్యాటక మొత్తం 9 నగరాలు నిర్మించాలన్నది లక్ష్యం. ఈ నగరాల వల్ల 13 జిల్లాల యువతకు ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉండేవి.
v అమరావతి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తుంది.
v 13 జిల్లాల యువతకు ఉద్యోగాలు కల్పించగలుగుతుంది.
v ఇక్కడ నుండి వచ్చే ఆదాయం రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ఉపయోగించవచ్చు.
v  సైబరాబాద్ లా సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి
v  అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్లు నిర్మిస్తే ఆ రోడ్ల వెంట ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం.
v  సింగపూర్ అంకుర పరిశ్రమల ప్రాజెక్ట్ నిర్మాణం అయి ఉంటే 2.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి - 10 లక్షల మందికి పరోక్ష ఉపాధి వచ్చి ఉండేది.
v   అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ (సింగపూర్‌ కన్సార్షియం) ఒప్పందం రద్దు వల్ల నష్టాలు. 2.5 లక్షల ఉద్యోగాలు, రూ.50 వేల కోట్లు పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.
v  రాజధాని అమరావతి నిర్మాణం జరిగితే మొత్తం 21,46,690 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
v అన్నీ సవ్యంగా జరిగితే ఇక్కడ వివిధ విద్యాలయాల్లో 50 వేల మంది విద్యార్థులు ఉండేవారు. వారి వల్ల ఎంతో ఆదాయం వచ్చేది.



అమరావతి మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ



24.01.2020
v ప్రజారాజధాని అమరావతిలోని 29 గ్రామాలతోపాటు తుళ్లూరు మండలం పెదపరిమి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలను కలిపి అమరావతి మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఏఎండీఏ) లేదా అమరావతి కేపిటల్‌ సిటీ మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఏసీసీఎంసీ).
v సీఆర్డీయే చట్టాన్ని రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీని తెరపైకి తెచ్చే ప్రయత్నం.
v అమరావతి కేపిటల్‌ సిటీ మునిసిపల్‌ కార్పొరేషన్‌(ఏసీసీఎంసీ)లో చేర్చేందుకు గ్రామస్థులు అంగీకరించారుఅని తీర్మానం సిద్ధం.
v గ్రేటర్‌ అమరావతి నగరపాలక సంస్ధ ఏర్పడితే తాడికొండ, తుళ్లూరు మండలాలు రద్దు అవుతాయి.
v మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కూడా రద్దు అవుతుంది.

సీఆర్డీఏ రద్దు బిల్లును సస్పెండ్‌ చేయాలని హైకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు



21.01.2020:  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఏపీసీఆర్డీయే) చట్టం-2014ను రద్దు చేస్తూ ఏపీ శాసనసభ ఆమోదించిన బిల్లును సస్పెండ్‌ చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
v సీఆర్డీయే చట్టం-2014ను రద్దు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధమని, ఏకపక్షమని విజయవాడకు చెందిన శీలం మురళీధరరెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.
v అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా మరో మార్గాన్ని వెతుక్కోవడమంటే రాజధాని రైతుల న్యాయబద్ధమైన ఆకాంక్షను ఉల్లంఘించడమే.
v ల్యాండ్‌పూలింగ్‌ స్కీమ్‌ కింద భూములిచ్చిన రైతులకు తగిన న్యాయం చేయాలి.
v రాజధానిలో నిలిపివేసిన నిర్మాణ పనులను పునఃప్రారంభించాలి.
v సీఆర్డీయే చట్టం రద్దుకు సంబంధించిన బిల్లు అమలు కాకుండా నిలుపుదల చేయాలి. ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుని అభ్యర్థించారు.
v గతంలో జరిగిన ఒప్పందం మేరకు రైతులకు ప్లాట్లను అభివృద్ధిచేసి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
v ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. మంత్రి వర్గం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.
v రాజధాని మార్చాలంటే కేంద్రప్రభుత్వాన్ని సంప్రదించాలి.
v ప్రజాధనంతో 50 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో సీఆర్డీయే చట్టం రద్దు చేయడం తగదన్నారు.
v చట్టం రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.
హైకోర్టు ధర్మాసనం
v 23.01.2020: రాజధాని అమరావతి వ్యాజ్యాలపై  విచారణ కోసం హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి నేతృత్వంలో  జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ సత్యనారాయణలతో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. అమరావతి, సీఆర్డీఏ అంశాలతో ముడిపడిన పిటిషన్లను ఈ ధర్మాసనం  విచారిస్తుంది.
v 8 పిటిషన్లపై విచారణ:  సీఆర్‌డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ - సమగ్రాభివృద్ధి బిల్లులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లతోపాటు రాజధాని తరలింపు ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలను వ్యతిరేకిస్తూ దాఖలైన మొత్తం 8 పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
త్రిసభ్య ధర్మాసనం హెచ్చరిక
v రాజధాని మార్పు పేరిట ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశారు.
v తమ ఆదేశాలను అతిక్రమిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. తమ మాటను ధిక్కరిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు. బాధ్యులైన వారి నుంచి ఖర్చు వసూలు చేయిస్తాం.
v పాలనా వికేంద్రీకరణ - సమగ్రాభివృద్ధి, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలి. శాసనసభ, శాసన మండలి బిజినెస్‌ రూల్స్‌ ను కూడా మా ముందుంచాలి.
v మూడు రాజధానులనిర్ణయంలో కీలకమైన నిపుణుల కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, హైపవర్‌ కమిటీల నివేదికలను పిటిషనర్లకు అందజేయాలి
v రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహిత్గీ : సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల వరకు గడువు ఉంటుంది. బిల్లులు చట్టరూపం దాల్చకుండానే విచారణ జరపడం సరికాదు. వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆ అభ్యర్థనతో ధర్మాసనం ఏకీభవించింది.
v  పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అశోక్‌ భాన్‌ : ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విశాఖకు తరలించాలని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉండగానే తరలింపు జరిగిపోతుంది. అందువల్ల కార్యాలయాలను తరలించకుండా అడ్డుకోవాలని అభ్యర్థించారు.  
v  ధర్మాసనం: ఆ వ్యవహారాన్ని మేం చూసుకుంటాం.ఆ రెండు బిల్లుల విషయంలో శాసన మండలి సెలెక్ట్‌ కమిటీ ఏం చేస్తుందో చూద్దాం! తదుపరి విచారణను ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేస్తున్నాం. ఈలోపు ప్రభుత్వం కార్యాలయాల తరలింపు విషయంలో తదుపరి చర్యలకు దిగితే... అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మాకు అధికారాలు లేవనుకోవద్దు! ఒకవేళ మా మాటను ధిక్కరించి కార్యాలయాలను తరలిస్తే... వాటిని వెనక్కి రప్పిస్తాం. ఇందుకయ్యే ఖర్చును బాధ్యులైన వారి నుంచి వసూలు చేయిస్తాం!. ప్రభుత్వం తదుపరి చర్యలకు దిగితే ఎప్పుడైనా మేం జోక్యం చేసుకుంటాం.