Jan 5, 2020

మూడు రాజధానులు

     17.12.2019 ‌: శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి :  దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. మనకూ మూడు ఉంటే తప్పేంటి.? మన ఆలోచనలు మారాలి.  అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చు అని చెప్పారు.
 నారా చంద్రబాబు నాయుడు: అమరావతిని చంపేయాలని చూస్తున్నారు. మూడు రాజధానులకు డబ్బెక్కడిది.? కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై ప్రకటన ఎవరికోసం.? అడ్మినిస్ట్రేషన్‍ను వివిధ ప్రాంతాల్లో పెడితే అభివృద్ధి జరగదు. విజయవాడలో రాజధాని పెడితే అభ్యంతరం లేదని జగన్ అన్నాడు. బంగారు బాతులాంటి రాజధాని అమరావతిపై సీఎం జగన్‌ యూటర్న్. అమరావతి విధ్వంసానికి కుట్ర సాగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గానీ పరిపాలన వికేంద్రీకరణ సరికాదు. వైసీపీకి 151 సీట్లు వచ్చాయని సీఎం జగన్‌కు ఒళ్లంతా గర్వం.
v యనమల రామకృష్ణుడు: ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుంది. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు వద్దని నెల్సన్ మండేలా చెప్పారు. టీడీపీ సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుంటే.. జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటున్నారు. 
v నారా లోకేశ్:  రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. ఎంతైనా వారిది మాట మార్చే, మడప తిప్పే వంశం కదా!
v పంచుమర్తి అనురాధ     : సీఎం జగన్ పిచ్చి పీక్‍కు వెళ్లింది. ఆరు నెలలుగా విశాఖలో ఇన్‍సైడ్ ట్రేడింగ్ జరుగుతోంది.

18.12.2019 : సీఎం 3 రాజధానుల వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. నిరసన ప్రకంపనలు వెల్లువెత్తాయి. రాజధాని రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలిస్తే ఊరుకోం అని చెప్పారు. కోర్టుకు వెళతామన్నారు. ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అన్నారు.
v  19.12.2019 : బంద్ నిర్వహించి,  రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు.  అప్పుడు రాజధాని కోసం కదిలిన వారంతా.. ఇప్పుడు రాజధాని బంద్‌ను విజయవంతం చేసేందుకు కుటుంబాలతో సహా ఆరేళ్ల బుడతడి నుంచి ఆరు పదులు దాటిన వృద్ధుడి దాకా అందరూ రోడ్డెక్కి కదం తొక్కారు. మండే ఎండలో ఎక్కడికక్కడ రోడ్లకు అడ్డంగా బైఠాయించారు. పురుగుమందు డబ్బాలను చేతపట్టుకొని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగుదేశం, సీపీఐ, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
 ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని- పరిపాలనను కాదు... అభివృద్ధిని వికేంద్రీకరించాలి
మూడు రాజధానుల మాటఉపసంహరించుకోవాలి.
ప్రాణాలైనా అర్పిస్తాం. అమరావతిని కాపాడుకుంటాం
     మా త్యాగాలకు విలువ లేదా?
 మేం భూములు ఇచ్చింది ప్రభుత్వానికే గానీ పార్టీలకు కాదు
 పార్టీలతో మాకు సంబంధం లేదు. మాది  రాజధాని పార్టీ మాత్రమే.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఉద్దేశంతోనే రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్‌ తన మనసులో మాట చెప్పారు. మూడు రాజధానులు అనేది ఓ ఐడియా.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి :  అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తాం. రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్‌ చెప్పారు.  విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి. మూడు కాకపోతే 33 రాజధానులు పెట్టుకుంటాం.  రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదు.
మంత్రి అవంతి శ్రీనివాస్: అమరావతికీ ఏ ఇబ్బంది ఉండదు.  అమరావతి కూడా రాజధానిగా కొనసాగుతుంది. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరుగుతుంది. మూడు రాజధానులు వలన రాష్ట్రం అంతా ఒకే సారి అభివృద్ధి చెందుతుంది.
పేర్ని నాని:        విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఉండొచ్చని మాత్రమే జగన్ అన్నారు.  ఉండొచ్చు అనే మాటకు.. ఉంటుంది అనే దానికి తేడా ఉంది.
ఐవైఆర్‌ కృష్ణారావు : విశాఖనే పూర్తిస్థాయి రాజధాని. హైకోర్టు కర్నూలులో ఉంటుంది.  రాజధాని విషయంలో సీఎం జగన్ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. శాసనసభ రాజధానిగా అమరావతి అనే తాయిలం చూపి పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చడం, ఆపై అమరావతిలో అసెంబ్లీ సమావేశాలను కుదించడం లాంటివి క్రమంగా జరుగుతాయి.
కాంగ్రెస్ – తులసి రెడ్డి: హైకోర్టు కర్నూలులో పెడితే మంచిదే. సచివాలయం, అసెంబ్లీ మాత్రం అమరాతిలోనే కొనసాగాలి.
జనసేన – శివశంకర్ : శాసనసభ, సచివాలయం రెండిటిని విడదీయవద్దు. అవి అమరావతిలోనే ఉండాలి. రాజధాని రైతులకు అండగా ఉంటాం. కమిటి నివేదికని ఆమోదించన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటాం.
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు : రాజధానిని అమరావతి నుంచి మార్చడం సాధ్యం కాదు.
సీపీఎం నేత సీహెచ్‌.బాబురావు: నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వకముందే అసెంబ్లీలో సీఎం ప్రకటించడం సరైందికాదు.
సీపీఐ – రామకృష్ణ : రాజధాని అమరావతిలోనే కొనసాగాలి.
విజయవాడ బార్ అసోసియేషన్: ఏపీ రాజధాని, హైకోర్టు అమరావతిలోనే కొనసాగాలి.

20.12.2019: ఏపీ రాజధానిపై అసెంబ్లీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అమరావతి ప్రాంత గ్రామాల్లో వరుసగా మూడోరోజు తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మందడం గ్రామంలో రైతులు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మిగతా గ్రామాల్లోని రైతులు తరలివస్తున్నారు. మరోవైపు తుళ్లూరులో మహిళలు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.
మందడం గ్రామంలో జరిగిన మహాధర్నాలో జనసేన పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్, శివశంకర్ పాల్గొన్నారు.
23.12.2019: రాజధాని గ్రామాల్లో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తుళ్లూరులో మహాధర్నా నిర్వహించారు. 5 రోజులుగా 29 గ్రామాలకు చెందిన పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ ఆందోళనలో పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలకు నల్ల రంగులు వేశారు. రిలే దీక్షలో పాల్గొన్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో రోడ్లపై బైఠాయించి, రోడ్లపైనే వంటా వార్పు చేసి, అక్కడే భోజనాలు చేసి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల వారు రైతులకు మద్దతు తెలపడంతోపాటు ధర్నాలో పాల్గొంటున్నారు. 29 గ్రామాల ముఖద్వారాల్లో పోలీసులు ఉండి ఆధార్ కార్డు ఉంటేనే లోపలకు వెళ్లాలి అంటున్నారు.  వెంకటపాలెం వద్ద రైతులు అలాగే ఆపారు. సీడ్ కేపిటల్ యాక్సె స్ రోడ్డులో శాంతియుతంగా ధర్నా చేయబోతుంటే అడ్డుకున్నారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
23.12.2019 : 25 సంఘాలతో అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటు. అమరావతి రాజధానిగా కొనసాగాలని పోరాటం.

25.12.2019 : రాజధానిలో 9వ రోజు ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. రోజుకో రకంగా వారు నిరసన తెలుపుతున్నారు. మహిళలలో స్పందన తీవ్ర స్థాయిలో ఉంది. ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీల వారు వారిని కలిసి మద్దతు తెలుపుతున్నారు. సీపీఐ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అమరావతి రాజధానికి మద్దతు పలికారు. సీపీఎం పార్టీ కూడా తెలుపుతోంది. వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు సచివాలయం అమరావతిలో ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. హైకోర్టు కర్నూలులో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ చెబుతున్నాయి.
26.12.2019: 13 జిల్లాల్లో ఐకాసలు ఏర్పడ్డాయి, వారంతా ఉద్యమాలు చేస్తున్నారు -
అప్రకటిత ఎమర్జెన్సీ: కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ రాజధాని గ్రామాల్లో వేలాది మంది పోలీసుల మోహరింపు. రాజధాని రైతులు బయటకు రాకుండా పోలీసులు కాపలా-
హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరణ:  అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలని లాయర్లు నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.  అభివృద్ధి వికేంద్రీకరణకు కాదని.. పాలనా వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం. రాజధానిలోనే హైకోర్టు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ ఉండాలి. న్యాయపోరాటానికి మేం సిద్ధం.
రాజధాని రైతులు: పోరాట పటిమ చూపించి అమరావతిని నిలబెట్టుకుంటాం. దక్షిణాఫ్రికాని మోడల్‌గా సీఎం జగన్‌ చూపిస్తున్నారు. అక్కడ నిత్యం ఎంత నర మేధం జరుగుతుందో కూడా చెప్పాలి. రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం. మా ఉసురు పోసుకోకుండా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి.
టీడీపీ నేతల గృహ నిర్బంధం: టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న తదితరుల గృహ నిర్బంధం.
గవర్నర్‌ను కలిసిన రాజధాని రైతులు: అమరావతి రైతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం సమర్పించారు. తొమ్మిది రోజులుగా రాజధానిలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. 175 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారు.


గుంటూరు, కృష్ణా వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం:  అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ లక్ష్యం - ఉపాధి అవకాశాలు కలిపించేందుకు కృషి. తాత్కాలిక నిర్మాణాలకే రూ.5,800 కోట్లు ఖర్చు.  మరో లక్షా 15 వేల కోట్లు ఖర్చు చేయాలి. తక్కువ ఖర్చుతో ఏపీని అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తిచేయాలంటే బడ్జెట్ సరిపోదు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఆర్థిక వనరులు అడుగంటాయి. రాజధాని కోసం నగరం నిర్మించడం లేదు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగదు. విద్యా, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత. నగరంలోనే రాజధాని. గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ధి పథంలో నడవబోతున్నాయి.
-         పార్థసారథి, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు
మైసూరా రెడ్డి: రాయలసీమ ప్రజలు రాజధాని కోరుకుంటున్నారు. రాజధానిని కోరుకున్న వారికి ఎంగిలి మెతుకులా?  రాజధానిని ముక్కలు చేయాలనుకుంటే రాయలసీమకు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలి - మూడు ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలి - రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం సమానమైన భాగం కాదు - అడగని వాళ్లకు క్యాపిటల్ ఇస్తున్నారు - డబ్బులు లేవనేది అసమర్థ పాలనకు నిదర్శనం -
27.12.2019 : మంత్రి మండలి సమావేశం సందర్బంగా అమరావతి గ్రామాల్లో నిరసన జ్వాలలు. భారీ ఎత్తున ప్రజల నిరసన. 144 సెక్షన్ అమలు. భారీ పోలీస్ బందోబస్తు, పోలీస్ పికెటింగులు, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక దళాలు – కంచెలు – తీగలను రక్షణగా  అడ్డుపెట్టుకొని మంత్రి మండలి సమావేశం.  మందడం ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఇళ్ల మధ్య నుంచి పోలీసులు నెట్టేశారు. మహిళలు కంటనీరు పెట్టుకున్నారు.   ఉద్యమం ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. తిరుపతి, శ్రీకాకుళం జిల్లాలలో కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేశారు.
 అమరావతి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఓ గంటపాటు మౌన దీక్ష చేశారు. కన్నా మౌన దీక్షకు పలువురు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు.
  మంత్రి మండలి సమావేశం: రాజధానిపై అధ్యయనానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (జీసీజీ)ల నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే రాజధానిపై ప్రకటన. సీఆర్డీఏ పరిధిలోని అవినీతిపై విచారణకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుని సమగ్రమైన దర్యాప్తు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై విచారణ చేయించాలని నిర్ణయం. లోకాయుక్త లేదా సీబీఐ లేదా సీఐడీతో విచారణ–– చంద్రబాబు ప్రభుత్వం నిపుణుడైన శివరామకృష్ణ కమిటీ నివేదికను కాదని..నారాయణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ నే పరిగణనలోకి తీసుకుంది.  

Jan 3, 2020

అమరావతి రైతులపై కేసులు


03.01.2020: 
ఆందోళన చేస్తున్న రైతులపై  ఐపీసీ 307, 341, 324, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులపై విచారణకు హాజరుకావాలని చిలకలూరిపేట పోలీసులు రాజధాని రైతులకు నోటీసులు అందించారు.

రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వీడియో ప్రజంటేషన్
v రాజధాని పేరుతో జూదం
v ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మార్చి1, 2014
v మార్చి 28న శివరామకృష్ణణ్ కమిటీ
v సెప్టెంబర్ 4, 2014 కమిటీ నివేదిక రాకుండానే రాజధాని ప్రాంత ప్రకటన
v కమిటీని పూర్తిగా పక్కన పెట్టి తన మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
v ఆగస్టు 27, 2014న శివరామకృష్ణణ్ కమిటీ నివేదిక. దానిని పూర్తిగా పక్కన పెట్టి మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని 25 గ్రామాలతో రాజధాని ప్రకటన.
v డిసెంబర్ 30, 2014న ఏపీ సీఆర్డీఏ చట్టం ఆమోదం.
v మూడు పంటలు పండే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేస్తే  వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యాగారం, పర్యావరణం దెబ్బతింటుందని శివరామకృష్ణణ్ పేర్కొన్నారు.
v రాజధాని ఎక్కడ వస్తుందో తెలిసిన ప్రభుత్వ పెద్దలు సెప్టెంబర్ 4, 2014 కు ముందు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలోని భూములను  రైతుల వద్ద  అతి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు.
v ఇష్టానుసారంగా రాజధాని, సీఆర్డీఏ సరిహద్దులు, అలైన్ మెంట్లు చేశారు.
v లంకలు, పోరంబోకు, ప్రభుత్వ భూములు దోచారు.  సమీకరణకు ఇచ్చి ప్రతిఫలంగా ప్లాట్లు
v రైతులకు ప్లాట్ల కేటాయింపుల్లో కూడా అక్రమాలు. ప్రభుత్వ పెద్దలకు మంచి స్థలాల్లో ప్లాట్లు, రైతులకు రేటు రాని ప్రాంతాల్లో ప్లాట్లు.
v 1975 నాటి అసైన్డ్ లాండ్ చట్టాన్ని గాలికి వదిలారు. బెదిరించి కారు చౌకగా అసైన్డ్ భూములు కొట్టేశారు.
v అవినీతి, పక్షపాతం, అప్రజాస్వామ్యకంగా అమరాతి రాజధాని పునాధులు లేచాయి.
v అంతర్జాతీయ భూ కుంభకోణం
v ప్రభుత్వ పెద్దలు రాజధాని ఎక్కడ పెట్టాలో ముందుగానే నిర్ణయించుకున్నారు. కానీ నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ అని లీకులు ఇచ్చారు. గందరగోళం సృష్టించారు.
v అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలలో చవకగా భూములు కొనుగోలు చేశారు.
v జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 వరకు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది.
v గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదరకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని  ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడరూరల్, చందర్లపాడు మండలాల్లో భూ లావేదేవీలు జరిగాయి.
v గుంటూరు జిల్లాలో 2279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు.
v జూన్ 2014లో 530.69 ఎకరాలు
v జూలైలో 685.34 ఎకరాలు
v ఆగస్టులో 353.03 ఎకరాలు
v సెప్టెంబర్ లో 567.26 ఎకరాలు
v అక్టోబరులో 564.91 ఎకరాలు
v నవంబర్ లో 836.81 ఎకరాలు
v డిసెంబర్ లో 531.90 ఎకరాలు
v మొత్తం 4,069.95 ఎకరాలు కొనుగోలు
v తాడికొండ మండలం కంతేరు గ్రామంలో హెరిటేజ్ కోసం 14.22 ఎకరాలు కొనుగోలు.
v చంద్రబాబు సీఎం అయిన నెల రోజులకే కొనుగోలు చేశారు.
v ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు.
v పయ్యావుల కేశవ్ తమ కుమారుడు విక్రమ సింహ, పయ్యావుల హారిక, పయ్యావుల శ్రీనివాస్ ల పేరుపై రాజధాని ప్రకటనకు ముందే భూములు కొన్నారు.
v తెలంగాణకు చెందిన వ్యాపార భాగస్వామి వేం నరేంద్ర రెడ్డి కూడా వేం ఐశ్వర్యరెడ్డి, వేం కృష్ణ కీర్తి పేర్లపై  15.30 ఎకరాలు కొన్నారు.
v పల్లె రఘునాధ్ రెడ్డి పల్లె వెంకట కృష్ణ, కిషోర్ రెడ్డి పేర్లపై రాజధానిలో  7.5 ఎకరాలు కొన్నారు.
v కొమ్మాలపాటి శ్రీధర్ తన బీనామీ కంపెనీ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద రాజధాని ప్రాంతానికి ఆనుకొని 68.6 ఎకరాలు కొనుగోలు చేశారు.
v లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్ తన కుమార్తె కంభంపాటి స్వాతి పేరుపై రాజధానిలో భూములు కొనుగోలు చేశారు.
v పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు వడ్లమూడు శ్రీహర్ష కుటుంబ సభ్యులు నడుపుతున్నా ఆర్ఆర్ ఇన్ప్రా అవెన్యూ సంస్థ పేరుపై తక్కువ రేటుకు భూములు కొన్నారు.
v యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ రాజధాని ప్రకటనకు ముందు ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు.
v కోడెల శివప్రసాద్ తన బినామీ కంపెనీ  శశి ఇన్ ఫ్రా పేరిట 15.13 ఎకరాలు కొనుగోలు చేశారు.
v పత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుపై కొన్నారు. రాజధాని నగరంలోనే కాదు, సరిహద్దులను ఆనుకొని ఈ భూములు ఉన్నాయి.
v గుమ్మడి సురేష్ నారా లోకేష్ కు బీనామీగా వ్యవహరించినట్లు సమాచారం.
v దూళిపాళ్ల నరేంద్ర చౌదరి దూళిపాళ్ల వీరవైష్ణవి, బినామి దేవరపు పునియ్య పేరుపై 13.5 ఎకరాలు కొనుగోలు చేశారు. కొండంరాజుపాలెం గ్రామ సమీపంలో ఈ కొనుగోళ్లు జరిగాయి.
v పొంగూరి నారాయణ తన వద్ద పని చేసే ఆవుల మునిశంకర్, రావూరి సాంబశివరావు, పొట్లూరి ప్రమిల, కోటపు వరుణ్ కుమార్ పేరుపైన 52.2 ఎకరాలు కొన్నారు.
v ఇవన్నీ సెప్టెంబర్ 4, 2014 రాజధాని ప్రకటనకు ముందే కొనుగోలు చేశారు.
v రావెల కిషోర్ బాబు విశాఖకు చెందిన మైత్రీ ఇన్ఫ్రా పేరున 40.85 ఎకరాలు కొన్నారు.
v జీవీ ఆంజనేయులు తుళ్లూరు, అమరావతి మండలాల్లో  కొనుగుంట్ల లక్ష్మీ సౌజన్య, కొనుగుంట్ల సత్యనారాయణ పేర్లపై రాజధానిలో 53.48 ఎకరాలు కొన్నారు.
v వేమూరి హరికృష్ణ ప్రసాద్ సోదరుడు వేమూరి రవి కుమార్  తుళ్లూరు, అమరావతి,తాడికొండ మండలంలో 25.68  ఎకరాలు కొనుగోలు. తన భార్య వేమూరి లక్ష్మి, 7 హిల్స్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్  పేరుమీద మరిన్ని భూములు, మొత్తంగా 62.78 ఎకరాలు కొనుగోలు చేశారు.
v రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులు 800 మంది రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు.
v తెలంగాణలోని మరో 60 మంది తెల్లరేషన్ కార్డుదారులు కూడా భూమి కొనుగోలు చేశారు.
v అధికార పార్టీ నేతలు వారి బంధువులు, అనుయాయుల భూములు ల్యాండ్ పూలింగ్ లోకి రాకుండా సరిహద్దులను మార్చారు.
v జూన్ 2015న రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లు
v ఆ తరువాత సుర్బానురాంగ్ ప్లాన్ ప్రకారం 319.5 చదరపు కిలోమీటర్లు రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్. దానిని పరిగణనలోకి తీసుకోలేదు.
v ఫిబ్రవరి 2016 నోటిఫికేషన్ ప్రకారం 217 చ.కి.మీ.
v రాజకీయంగా తమకు అనుకూలమైన వారికి లబ్ది చేకూరేవిధంగా వారి భూములను మినహాయించి పరిధి నిర్ణయించారు.
v రామకృష్ణ హౌసింగ్ కు లబ్ది. కాజ టోల్ గేట్ వద్ద 136.97 ఎకరాలు. సీఆర్డీఏ జోన్ పరిధిలోకి రాకుండా తప్పించారు.
v బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు వీబీసీ ఫర్టిలైజర్స్ కు  చందర్లపేటలో  కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అనుకూలంగా నిర్ణయం.
v సీఆర్డీఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు.
v సీఆర్డీఏ జోన్ ప్రకటనలో కూడా ఎత్తుడగడలు
v సెప్టెంబర్ 22, 2015న జీఓఎంఎస్ – 207 ప్రకారం సీఆర్డీఏ పరిధిని 7068.2 చ.కి.మీ.ల నుంచి  8352.69 చ.కి.మీ.కు పెంచారు.
v ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ల అలైన్ మెంట్లు కూడా తమకు అనుకూలంగా చేసుకున్నారు.
v హెరిటేజ్ ఫుడ్ కొనుగోలు చేసిన భూములు ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్నాయి.
v మురళీ మోహన్ కుంచనపల్లి సమీపంలో కొనుగోలు చేసిన 53.28 ఎకరాలకు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది.
v లింగమనేనితో క్విడ్ ప్రోకో
v లింగమనేని రమేష్ భార్య సుమన, ఇతరులు ప్రశాంతి, స్వర్ణకూమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్ల మీదే కాకుండా లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషన్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్,  లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్, కోదల ఎస్టేట్స్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్ సీటీ ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లుమీద  భూములు కొనుగోలు. ఈ భూములన్నీ రాజధాని నగర పరిధిలోనికి గానీ, సీఆర్డీఏ పరిధిలోనికి గానీ తీసుకురాలేదు. వారి భూములకు పది గజాల దూరంలో రాజధాని సరిహద్దులు నిర్ణయించారు. ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబుకు లింగమనేని గెస్ట్ హైస్.
v 158 ఎకరాలకు సంబంధించి అక్రమాలు జరిగాయి.
v ప్లాట్ల కేటాయింపులో దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు.
v అసైన్డ్ భూముల వ్యవహారంలో భారీ అక్రమాలు. అసైన్డ్ దారులకు బెదిరింపులు. పథకం ప్రకారం ఒకే సామాజిక వర్గంవారు అధికంగా ఈ భూములను  కారు చౌకగా కొనుగోలు చేసి, తరువాత వాటిని పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చారు.
v  నారా లోకేష్ సన్నిహితులు కొల్లి శివరామ్ 47.39 ఎకరాలు, గుమ్మడి సురేష్ 42.92 ఎకరాలు,  బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలు మొత్తంగా 338.88 ఎకరాల అసైన్డ్ భూమి కొనుగోలు చేశారు. ప్లాట్లు పొంది లబ్ది పొందారు.

Jan 2, 2020

సైబరాబాద్ – అమరావతి



v         ఆ నాడు హైదరాబాద్ కు   హైటెక్ టవర్ నిర్మాణం, మైండ్ స్పేస్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను చంద్రబాబు నాయుడు గారు రప్పించడం వల్ల  సైబరాబాద్ నగర నిర్మాణం జరిగింది.
v         సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి అభివృద్ధి చెందింది. ఆ నాడు  ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ నాడు అక్కడ నుంచి రూ.1.3 లక్షల ఆదాయం వస్తుంది. 13 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఏడాదికి రూ.లక్ష కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి.
v         అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణం, 5వేల ఎకరాలలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరగడంతో ఆదాయం బాగా పెరిగిపోయింది.
v         తెలంగాణ బడ్జెట్‌లో 60 శాతం ఆదాయం అక్కడ నుంచే వస్తోంది.
v         హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాల అభివృద్ధి జరగడం మనం చూస్తూనే ఉన్నాం. వికేంద్రీకరణ పేరుతో వైసీపీ వికేంద్రీకరణకు నిధులు లేకుండా చేస్తోంది.
v         మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం, సింగపూర్ అంకుర పరిశ్రమల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే 2.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి, 10 లక్షల మందికి పరోక్ష ఉపాధి లభించేది.
v         9 ప్రత్యేక నగరాల నిర్మాణం జరిగితే ఏపీ బడ్జెట్‌కి 60 శాతం ఆదాయం అమరావతి నుంచి వచ్చి ఉండేది. 
v         సింగపూర్ అంకుర పరిశ్రమల ఒప్పందం రద్దుతో పెట్టుబడులు వెనక్కు వెళుతున్నాయి.
v         అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్ల పనుల నిలిపివేత కూడా అభివృద్ధికి విఘాతంగా మారింది.
v         సింగపూర్ 50 ఏళ్లకు పూర్వమే 12 వరుసల రోడ్ల  నిర్మాణం చేసింది.


ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి  పరిస్థితులు
              దేశంలో గతంలో ఎన్నడూ జరుగని విధంగా అత్యంత దయనీయ పరిస్థితులలో పార్లమెంటు తలుపులు మూసి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారు. 5 కోట్ల ఆంధ్రప్రజలకు ఇష్టంలేకపోయినా ఆ నాటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపీఏ ప్రభుత్వ రాష్ట్రాన్ని నిట్టనిలువునా రెండుగా చీల్చింది. విభజన ప్రక్రియ, విభజన చట్టం రూపొందించడంలో కూడా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. పార్లమెంట్ ఉభయ సభల్లో సమగ్ర చర్చ జరుగకుండా, ఆంధ్ర ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం ఇవ్వకుండా హడవుడిగా బిల్లును ఆమోదించారు. బీజేపీ నేతలు కూడా బిల్లుకు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రజాప్రతినిధుల మాటలకు విలువలేకుండా చేశారు. వారి డిమాండ్లు వినిపించుకున్న నాధుడు లేడు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారు. రాజధాని లేని, నిండా అప్పులతో మునిగిన రాష్ట్రాన్ని అప్పగించారు. ఆస్తుల పంపకంపై చర్చలేదు. అన్ని విధాల అభివృద్ధి చెందిన, ప్రధాన ఆర్థిక వనరు అయిన హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోతున్న ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగే విధంగా ఒక్క నిర్ణయం తీసుకోలేదు. ఆస్తుల పంపకంలో సమతూకం పాటించలేదు. ఆస్తులు  అవి ఉన్న ప్రాంతం ప్రాతిపదికన కేటాయించారు. అప్పులను మాత్రం జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం విభజించారు. విభజన అనంతరం దేశంలో గుజరాత్ తరువాత మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం  భారీ అప్పులతో ఉంది.
జనాభా ఎక్కువ ఆదాయం తక్కువ వచ్చే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ గా విభజించారు. ఆ నాడు అప్పులతోపాటు రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏపీ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అధిక ఆదాయం సమకూర్చే హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం అయిపోయింది. క్లిష్టపరిస్థితులలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తనపై ప్రజలు ఉంచిన నమ్మకానికి అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి పట్టుదలతో నిరంతరం శ్రమించారు.

నారాయణ కమిటీ



v 2014 జులై 20న నాటి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వక్షతన 9 మంది సభ్యులతో  కమిటీ ఏర్పాటైంది. రాజధాని నిర్మాణం, డిజైన్ అంశాలకు సంబంధించి  సలహాలు ఇవ్వడానికి  ఈ కమిటీని నియమించారు.
v రాజధాని నగరంలో ప్రజలు సౌకర్యవంతంగా జీవించే పర్యావరణ వ్యవస్థ, భూమి, నీరు వంటి సహజ వనరులు సమర్థవంతంగా వినియోగించడం, అన్ని విధాల నగరం అభివృద్ధి, నగర ప్రణాళిక విధానాలు, రవాణా కారిడార్లు, కొత్త రాజధానిలో సమర్థవంతమైన నిర్వహణా వ్యవస్థలు, కేంద్ర నిధులతోపాటు ఇతర మార్గాలలో నిధుల సేకరణ వంటి అంశాలలో సలహాలు ఇవ్వడానికి మాత్రమే ఈ కమిటీని నియమించారు.
v ఈ కమిటీ రాజధాని స్థల ఎంపిక కోసం ఏర్పాటు చేసినది కాదు. ల్యాండ్ పూలింగ్, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వేశారు. వివరాలకు జీఓ నెం.133. (తేది.20.07.2014)ని పరిశీలించవచ్చు.
v ఈ కమిటీ దేశంలోని చంఢీగడ్, నయా రాయపూర్, నవీ ముంబయితో సహా పుత్రజయ, ఆస్టిన్, దుబాయి, సింగపూర్‌ తదితర ప్రాంతాలలో పర్యటించి అక్కడి రాజధాని ప్రాంతాలను అధ్యయం చేసింది.