Apr 20, 2025

పేదరికంలేని సమాజసృష్టే చంద్రబాబు లక్ష్యం

నేడు 75వ పుట్టినరోజు - వజ్రోత్సవం 

దేశం, రాష్ట్రం అభివ‌ృద్ధి, పేదరికం లేని సమాజ సృష్టి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు లక్ష్యం. తన  47 ఏళ్ల రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా 15వ ఏట కొనసాగుతున్న  చంద్రబాబు ఈ రోజు తన 75వ పుట్టినరోజు (వజ్రోత్సవం) వేడుకలను కుటుంబ సభ్యులో యూరప్‌లో జరుపుకుంటున్నారు.   సమర్థవంతమైన రాజకీయ నేతలు రాజకీయాల్లో విజయం సాధించడంతోపాటు పరిపాలనా సామర్థ్యం కలిగి ఉండి, ఆర్థిక వ్యవస్థను క్రమపద్దతిలో పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించడం  ముఖ్యంగా భావిస్తారు. ఈ మూడు లక్షణాల్లో  చంద్రబాబు తన సమర్థతను ప్రదర్శించి,  శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు.ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఆర్థిక అంశాలపై అవగాహన ఉండాలి. దేశ, విదేశాల్లోని ఆర్థిక సంస్థల నుంచి ఎంతైనా అప్పు తేవచ్చు. అయితే తీసుకువచ్చిన డబ్బుని సమర్థవంతంగా వినియోగించి (మనీ మేనేజ్ మెంట్) ఫలితాలను సాధించాలి. ఆర్థిక వ్యవస్థను అద్వితీయమైన రీతిలో చక్కదిద్దటంలో  దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని చంద్రబాబు ఆదర్శంగా తీసుకున్నారు. సంస్కరణలు, సరళీకరణ విధానాలతో ఆర్థిక వ్యవస్థను అద్భుతమైన రీతిలో చక్కదిద్దడంలో చంద్రబాబు  దిట్ట. సంక్షోభాల్ని సవాలుగా తీసుకుని  ముందుకు వెళ్లడం ఆయనకున్న ప్రధాన లక్షణం. ఆధునికతను అందిపుచ్చుకుని, అటు ఐటీ, ఇటు పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించడంలో, సంపదను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.   పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆయన  స్వర్ణా ఆంధ్ర@2047లో భాగంగా ఆయన ఇప్పుడు  జీరో పావర్టీ - P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్) విధానాన్ని రూపొందించారు.  ఈ విధానంలో మార్గదర్శులు (ఆర్థికంగా సంపన్నులు) బంగారు కుటుంబాల(పేదలు)ను ఆదుకుంటారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.  


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని అందరికంటే ముందుగా గ్రహించి,  ఐటీకి  విశేష ప్రాధాన్యతనిచ్చి లక్షలాది మంది యువతకు బంగారు భవిష్యత్తు కల్పించారు. అన్ని సామాజిక రుగ్మతలకు విరుగుడు ‘విద్య’ ఒక్కటే అని నమ్మి,  ప్రాథమిక విద్య మొదలుకొని సాంకేతిక ఉన్నత విద్య వరకు ఎనలేని ప్రోత్సాహం కల్పించారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ నిపుణులుగా తెలుగువారు ఉండటానికి మూల కారణం చంద్రబాబు. ఇది అందరూ అంగీకరించే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే  చంద్రబాబు నాయుడు ఆధునికతలో దార్శనికులు. సమాజంలో సంపద సృష్టించడంలో ఆరితేరిన ఆర్థిక నిపుణుడు. 

చంద్రబాబు నాయుడు 28 ఏళ్లకే 1978లో మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యే, వెంటనే మంత్రి అయ్యారు. ఇక రాజకీయాలలో  తిరిగి చూడనేలేదు.అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయంగా ఎదిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు(9 సంవత్సరాలు), నవ్యాంధ్రకు రెండు సార్లు, మొత్తం నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.  పరిపాలనా దక్షుడిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లో  రాజకీయ సమీకరణలను తనకు అనుకూలంగా అత్యద్భుతంగా  మలచుకొని 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువగా వచ్చే ప్రాంతాన్ని ఏపీగా విభజించి, రాజధాని లేని, నిండా అప్పుల్లో మునిగిన ఏపీని అప్పగించారు. అయినా,  చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు ఒక పక్క నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి,  మరో పక్క వినూత్నమైన రీతిలో అభివృద్ధి వ్యూహాలను అనుసరించి సమ్మిళిత వృద్ధి సాధించారు.నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి  భూ సమీకరణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. వేల ఎకరాలు సమీకరించడం మాటలుకాదు. అంత భూమిని రైతులు ఇవ్వడానికి అంగీకరించరు. ఒకవేళ అంగీకరించినా అసలే లోటుబడ్జెట్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితి అందుకు అవకాశం ఇవ్వదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తనదైన తీరులో స్పందించారు. పూలింగ్ ద్వారా భూ సమీకరణ విధానం అతని ఆలోచనే. రైతులకు సమన్యాయం అందించే విధంగా  ఓ కొత్త విధానం మన రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు 25 రెవెన్యూ గ్రామాల (29 గ్రామాలు)కు చెందిన 25,871 మంది రైతులు 32,513 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇంత భూమి ఈ విధంగా సమీకరించలేదు. స్వచ్ఛందంగా కూడా ఇలా ఇంత భూ సమీకరణ చేయవచ్చని చేసి చూపించి చంద్రబాబు ఓ కొత్త వరవడి సృష్టించారు. 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు తన సమర్థతతో దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టినా, 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులుపెట్టినా, జైల్లో పెట్టినా పడిలేచిన కెరటంలా చంద్రబాబు మళ్లీ దూసుకొచ్చారు. సంక్షోభాలను ఎదుర్కోవడం ఆయనకు కొత్తేమీకాదు. తనదైన రాజకీయ వ్యూహాలతో  మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.   రాజధాని అమరావతిలో  అర్థంతరంగా  నిలిపివేసిన నిర్మాణాలను కొనసాగించడానికి పూనుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రాజధాని అమరావతి నిర్మాణ పనులను మే 2న పున:ప్రారంభిస్తారు.  అమరావతిని అన్ని హంగులతో ఓ అద్వితీయమైన మహానగరంగా రూపొందించడానికి  తుళ్లూరు, అమరావతి, తాటికొండ, మంగళగిరి ప్రాంతాల్లో మరో 44 వేల ఎకరాల భూ సేకరించాలన్న ఆలోచనలో  చంద్రబాబు ఉన్నారు.    అపార రాజకీయ, పాలనా  అనుభవంతో  చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిద్దాం. చంద్రబాబుకు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్  - 9440222914

Apr 17, 2025

మంగళగిరి ప్రెస్ క్లబ్ కార్యవర్గం


 మంగళగిరి:మంగళగిరి ప్రెస్ క్లబ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.మంగళగిరి మండలంలో ఉన్న జర్నలిస్టులు అందరూ ఏకమై ‘మంగళగిరి ప్రెస్‌క్లబ్’ పేరుని ఖరారు చేశారు. మంగళగిరి మెయిన్ బజార్‌లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమావేశమై ప్రెస్ క్లబ్ నూతన కమిటీని కూడా గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా వానపల్లి బ్రహ్మనాయుడు(ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్(మహాన్యూస్), కోశాధికారిగా బత్తుల సాంబశివరావు, గౌరవాధ్యక్షులుగా కూరపాటి మురళి రాజు, ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, మట్టుకొయ్య కృష్ణ, బాపనపల్లి శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వుల శ్రీహరి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.మల్లేశ్వరరావు, కార్యదర్శులుగా దొప్పలపూడి రాము, మెడకాయల మస్తాన్, మంచికలపూడి సిరిబాబు, సహాయకార్యదర్శులుగా చెదలవాడ సాయిచంద్, నాయుడు నాగరాజు, గండికోట దుర్గారావులను ఎన్నుకున్నారు. 

కార్యవర్గ సభ్యులుగా శిరందాసు విజయ భాస్కర్, విడేల సాయి శ్రీనివాస్, కె.అభిరామ్ కృష్ణారెడ్డి, ఎం. శివనాగి రెడ్డి, బత్తెన శ్రీనివాసరావు, ఆరేపల్లి రాజు, వేముల రాంబాబు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, మద్దెల కిషోర్, ఉద్దంటి రమేష్, పి.రమేష్ కె.వెంకటేష్, శివరాత్రి శ్రీనివాసరావు, బండారు సాంబ, జీవై సాయి కృష్ణ, చిన్ని కాజాలను ఎన్నుకున్నారు. ప్రెస్‌క్లబ్ గౌరవ సలహాదారులుగా కొలికిపూడి రూఫస్, శిరందాసు నాగార్జున, త్రిపురమల్లు సతీష్, ఎన్వీ శివన్నారాయణ, గోరంట్ల లక్ష్మీనారాయణ, శిరందాసు శ్రీనివాసరావు, ఈపూరి రాజారత్నం, ఐ.వెంకటేశ్వరరెడ్డి, అన్నవరపు ప్రభాకర్‌లను ఎన్నుకున్నారు.

జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి

మంగళగిరిలో దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులందరినీ ఏకతాటిపై నడిపించి, ఐక్యంగా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షకార్యదర్శులు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా, ప్రధానంగా ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ ఇన్సూరెన్స్, జర్నలిస్ట్ పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ, ప్రమాద బీమా వంటి ప్రయోజనాలను పొందేందుకు కృషి చేస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రెస్‌క్లబ్ సభ్యులకు సహాయం అందించేందుకు ఒక సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ప్రెస్‌క్లబ్ సభ్యులందరూ తర్వలో మర్యాదపూర్వకంగా కలిసి, తమ సమస్యలను వివరిస్తామని చెప్పారు.

Apr 13, 2025

 

           తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత  నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు ఉద్యోగ జీవితం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచే ప్రారంభమైంది. అలాగే, ఆయన మనవడు నారా లోకేష్ రాజకీయ జీవితం కూడా మంగళగిరి నుంచే ప్రారంభమైంది. సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్  మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం చేశారు. 1947లో ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి అయిన తర్వాత, మద్రాసు సర్వీసు కమిషన్ నిర్వహించిన పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి  ఏడుగురిని మాత్రమే ఎంపిక చేశారు. ఆ ఏడుగురిలో ఎన్టీఆర్ ఉన్నారు. ఆ విధంగా ఆయనకు  అప్పుడు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది.ఆయన దేసంతా సినిమాలపై ఉండటంతో ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేదు.  ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లో నటించేందుకు వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంగళగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1986 ఏప్రిల్ 9న మంగళగిరిలో  ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేసి, తన హయాంలోనే పూర్తి చేయించారు. ఎన్టీఆర్ హయాంలోనే మంగళగిరి సమీపంలోని చిన్న కాకానిలో  యార్లగడ్డ వెంకన్న చౌదరి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు యార్లగడ్డ వెంకన్న చౌదరి రూ. 30 లక్షల విరాళమిచ్చారు. అందుకే దీనికి ఆయన పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిని యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆంకాలజీ లివింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ గా మార్చారు. 1989లో  ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఏర్పడినప్పుడు మొదటి గ్రంథాలయాన్ని ఎన్టీఆర్ మంగళగిరిలోనే ప్రారంభించారు. ఈ విధంగా ఎన్టీఆర్‌కు అనేక విధాల మంగళగిరితో అనుబంధం ఉంది.



ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి కుమారుడు, ఆయన మనవడు నారా లోకేష్ రాజకీయ జీవితానికి పునాది పడింది ఇక్కడే. ఆయన 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి అయినప్పటికీ,  2019 ఎన్నికల్లో  లోకేష్ మొదటిసారిగా మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనుకోకుండా ఎన్నికలకు 20 రోజుల ముందే ఆయన ఇక్కడ పోటీచేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. తక్కువ సమయం ఉండటం వల్ల, ఆ ఎన్నికల్లో ఆయన  5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ఏమాత్రం జంకకుండా, మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళగిరి ప్రజలనే నమ్ముకున్నారు.  ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గంలో  29 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు చేరువయ్యారు. ముఖ్యంగా మంగళగిరిలో పద్మశాలీ సామాజిక వర్గానికి చేనేత కార్మికుల సంఖ్య అధికం. ఆ సామాజిక వర్గంవారే ఇక్కడ అంతకు ముందు నాలుగుసార్లు గెలిచారు.  వారి సంక్షేమం, ఉపాధి కోసం అనేక చర్యలు చేపట్టారు. అలాగే, పేదల కోసం, మహిళల కోసం విద్య, వైద్యం, కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, అన్న క్యాంటిన్.. వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. ఓడిపోయినా నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడిపోలేదు. ఓడిన చోటే గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేశారు. అలాగే, పాదయాత్ర ద్వారా యువశక్తిని కూడగట్టారు.  2024లో ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలోనే లోకేష్ పోటీ చేశారు.5,337 ఓట్ల తేడాతో ఓడిపోయినందున, 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించమని ఆయన కోరారు.  కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ సాధిస్తానని తండ్రి చంద్రబాబు నాయుడుకు చెప్పారు.  కానీ, ఈ నియోజకవర్గ ప్రజలు ఏకంగా 91,413 ఓట్ల మెజార్టీలో గెలిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల కంటే అధిక మెజార్టీ సాధించారు. మెజార్టీలో రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిపారు.  రేపు ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలే నారా లోకేష్‌ని  ముఖ్యమంత్రిని కూడా చేస్తారు.  39 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీకి విజయాన్ని చేకూర్చారు. గతంలో 1983, 1985లో రెండు సార్లు మాత్రమే, అదీ ఎంఎస్ఎస్ కోటేశ్వరారావు గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ టీడీపీ గెలవలేదు. 

ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా లోకేష్ ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ గా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఆ దిశగానే చర్యలు కొనసాగుతున్నాయి. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమం చేపట్టి పేద ప్రజల చిరకాల కలని నిజం చేశారు. పేదలు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారో, అక్కడే వారిని శాశ్విత హక్కుపట్టాలు అందజేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తిపై మూడు వేల మందికి శాశ్వత హక్కును కల్పించారు.  జీరో పావర్టీ -పీ4 విధానాన్ని కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే ప్రారంభించి, మొదటి బంగారు కుటుంబాలను కూడా ఇక్కడివారినే ఎంపిక చేశారు.  మంగళగిరి ప్రజల చిరకాల కోరిక అయిన 100 పడకల ఆస్పత్రికి ఈరోజు నారా లోకేష్ శంకుస్థాపన చేస్తారు.
 
ఇది కూడా తాత ఎన్టీఆర్‌తో ముడిపడిన విషయం. 1986 ఏప్రిల్ 9న మంగళగిరిలో   ప్రభుత్వ హాస్పిటల్‌కి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు.39 ఏళ్ల తర్వాత అదే ఆస్పత్రిని నారా లోకేష్ మంత్రి మండలిని ఒప్పించి వంద పడకల ఆస్పత్రిగా పెంచారు.  తాత ఎన్టీఆర్  చిన్నకాకానిలో ఏ నెలలో, ఎక్కడైతే  యార్లగడ్డ వెంకన్న చౌదరి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారో, అదే ప్రదేశంలో, అదే  ఏప్రిల్ నెలలో ఈరోజు   వంద పడకల ఆస్పత్రికి నారా లోకేష్ శంకుస్థాప చేస్తారు. అయితే, బాధాకరమైన విషయం ఏమిటంటే, మంగళగిరి నియోజకవర్గం బీసీలు, ముఖ్యంగా చేనేత వర్గం పద్మశాలీల చేయిజారిపోయింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కూటమి ప్రభుత్వం వారిలో పలువురికి నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఆ రకంగా వారికి న్యాయం జరుగుతోంది.  అలాగే, వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రిని కూడా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలే ఎన్నుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు. 

శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914






Apr 11, 2025

కోదండరాముడికి పద్మశాలీయులు పట్టువస్త్రాల సమర్పణ


ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ కోదండ రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశాలి ఆడపడుచైన అమ్మవారి తరపున ఈరోజు స్వామివారికి పద్మశాలియ వంశస్థులు పట్టు వస్త్రములు సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య వేద పండితుల మంత్రాల నడుమ బ్రహ్మాండంగా జరిగింది. స్వామివారికి మంగళగిరి మునిసిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవితోపాటు పద్మశాలీ పెద్దలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పద్మశాలి వంశస్థులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ, పద్మశాలి అయిన మనకు ఇటువంటి గొప్ప అవకాశాలు రావడం పూర్వజన్మ సుకృతం అన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి తరఫున మనందరం కలిసి స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కల్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం మన కులానికి మరెన్నో రావాలని అన్నారు. పద్మశాలి అంటే పట్టు వస్త్రాలు నేసే వారు మాత్రమే కాదని, పట్టుదల ఉన్నవారు కూడా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి, పద్మశాలి కార్పోరేషన్ మాజీ చైర్మన్ జింకా విజయలక్ష్మి, బీసీ సంఘం నాయకులు పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.



Apr 10, 2025

కూటమి ప్రభుత్వంలో చేనేత రంగానికి మహర్దశ


వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే  చేనేత రంగానికి ఏపీలో మహర్దశ పట్టనుంది. అనేక ఆటుపోట్లకు తట్టుకుని దేశ వారసత్వ సంపదగా చేనేత నిలిచింది. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత వస్త్ర పరిశ్రమ రాష్ట్రంలో మళ్లీ కళకళలాడే పరిస్థితి రానుంది. చేనేత కార్మికుల చిరకాల డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నాయి. అటు కేంద్రంలోని ఎన్‌డీఏ(జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని  కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ) ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టిపెట్టాయి. ఎన్నికల హామీ మేరకు రోజుకో వరాన్ని  ప్రకటిస్తున్నాయి. అలాగే, చేనేత కార్మిక సంఘాల డిమాండ్లను కూడా పరిగణలోని తీసుకుని చేనేత కుటుంబాల సంక్షేమం కోసం అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు ఏపీ మంత్రి మండలి ఆమోదించింది. దీంతో,  93 వేల చేనేత కుటుంబాలకు, 10,534 మరమగ్గాల యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది.  మర మగ్గాలపై కూడా చేనేత రంగానికి చెందిన కార్మికులే వస్తాలను తయాలు చేస్తారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు రూ.96.76 కోట్లు, పవర్‌లూమ్‌ యూనిట్లకు ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చు రూ.28.16 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుంది. చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు  ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.  అలాగే, బీపీఎల్ (దారిద్ర్యరేఖకు దిగువన) కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కాకుండా,  చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం  అదనంగా రూ.50 వేల ఆర్థిక సహకారం అందజేస్తామని ఇంతకు ముందే ప్రకటించింది. ముడిపదార్థాల సరఫరా పథకం కింద నూలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.

 కేంద్ర ప్రభుత్వ చేనేత ఉత్పత్తులపై విధించే  జీఎస్‌టీని తిరిగి చెల్లించేందు( రీయింబర్స్‌మెంట్) రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ, కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కేంద్రం క్లస్టర్ల విధాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో  ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో  రెండు క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి.  ఈ క్లస్టర్ల కోసం తొలి విడతగా కేంద్రం రూ.5 కోట్లు విడుదల చేసింది. మిగిలినవాటికి మరో రూ.2 కోట్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో రెండు వేలమంది చేనేత కళాకారులకు లబ్ధి కలుగుతుంది. కూటమి ప్రభుత్వం రాయదుర్గంలోని టెక్స్‌టైల్ పార్కుని అభివృద్ధి చేయడంతోపాటు మంగళగిరిలో  తమిళనాడులోని కంచి తరహాలో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మంగళగిరిలోని ఆటోనగర్‌కు ఆనుకుని  10.80 ఎకరాల స్థలాన్ని కూడా  చేనేత జౌళిశాఖ అధికారులు పరిశీలించారు.

తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి చేనేతకు అండగా నిలుస్తోంది. ఎన్టీఆర్ హయాంలోనూ, ఆ తర్వాత  చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  అనేక పథకాలు ప్రవేశపెట్టారు. చేనేత కార్మికులకు  ఉపాధి కల్పన కోసం ఎన్టీఆర్ హయాంలో జనతా వస్త్రాల పథకం ప్రవేశపెట్టారు. చేనేత సహకార సొసైటీలను బలోపేతం చేసి వారికి పని కల్పించారు. ఆప్కో ద్వారా సహకార సంఘాలలో నిల్వలను కొనుగోలు చేయించారు. వారికి ఆరోగ్యభద్రత కార్డులు అందజేశారు. 50 ఏళ్లు దాటిన చేనేత  కార్మికులు లక్షా 11 వేల మందికి రూ.2 వేలు చొప్పున పెన్షన్ అందించారు. నూలు, రంగులు, రసాయనాలపై  సబ్సిడీలు అందించారు. 23వేల మంది చేనేత కార్మికుల రుణాలు చంద్రన్న చేయూత పథకం  ద్వారా రూ.110 కోట్ల వరకు రద్దు చేశారు. పావలా వడ్డీ పథకం ద్వారా 55,500 మంది నేతన్నలకు రూ.26.62 కోట్లు రుణాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 2.5 లక్షల మంది చేనేత కార్మికుల ప్రయోజనం కోసం టీడీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. చేనేత కార్మికుల పొదుపు పథకాన్ని అమలు చేశారు. ప్రాథమిక చేనేత సహకార సంఘ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.12,500లు ఆర్థిక సహాయం అందించారు. ప్రధాన నగరాల్లో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి, కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చారు. మంగళగిరిలో 2024 ఫిబ్రవరిలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా 20 మగ్గాలతో వీవర్స్ శాలను ప్రారంభించారు. ఇక్కడ అధునాతన మగ్గాలతోపాటు కుట్టు శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడివారికి టెక్నాలజీపరంగా సహకరించేందుకు, చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా ముందుకొచ్చింది.  మంగళగిరి చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.   రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి  వీవర్ శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే,  ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలలో టెక్స్ టైల్స్ పార్కులు,  చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు నిర్మించాలని నిర్ణయించింది. అలాగే, మంగళగిరిలో చేనేత కార్మికులకు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. 

చేనేతకు ప్రధాన సమస్య మార్కెటింగ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లోకి మన చేనేత ఉత్పత్తులను చొప్పించాలి. అంది అసంఘటింతంగా ఉన్న ఈ కార్మికులకు సాధ్యంకాదు. చేనేత కార్మికులు తమ వృత్తితో అంత్యంత నైపుణ్యం కలిగినవారే గానీ, వారికి మార్కెటింగ్ తెలియదు. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థని ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్, ఎగ్జిబిషన్ల ద్వారా చేనేత వస్త్రాలకు విస్తృతమైన మార్కెటింగ్‌ని కల్పిస్తే, వారి ఉత్పత్తులు అమ్ముడుపోయి, వారికి ఉపాధి లభిస్తుంది. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెడితే  చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుంది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Apr 4, 2025

65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత దర్శనం

 


65 ఏళ్లు దాటిన వృద్ధులకు  తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడి ఉచిత దర్శనం.  రెండు స్లాట్‌లు కేటాయించారు.   ఒకటి 10 AM, మరొకటి 3 PM.   మీరు ఫోటో IDతో పాటు వయస్సు రుజువు సమర్పించాలి.  S1 కౌంటర్‌కి నివేదించాలి.   వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుండి ఆలయం  కుడి గోడకు రహదారిని దాటండి.   మీరు ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.   ఉత్తమ సీట్లు అందుబాటులో ఉన్నాయి.   కూర్చున్న తర్వాత, వేడి వేడి సాంబార్ అన్నం, పెరుగు, అన్నం, వేడి పాలు ఇస్తారు.  ఇదంతా ఉచితం.   ఆలయ నిష్క్రమణ ద్వారం వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది.   వీక్షించినప్పుడు అన్ని ఇతర పంక్తులు నిలిపివేస్తారు.   ఎటువంటి ఒత్తిడి లేదా బలవంతం లేకుండా సీనియర్ సిటిజన్లు మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు.   దర్శన క్యూ తర్వాత మీరు 30 నిమిషాలలోపు దర్శనం నుండి నిష్క్రమించవచ్చు.    TTD హెల్ప్‌లైన్ తిరుమల 08772277777


Apr 3, 2025

మంత్రి వర్గం మొబైల్ నంబర్లు


1. ఎన్ .చంద్రబాబు నాయుడు,ముఖ్యమంత్రి
     మొబైల్ :  99635-10004/ 97057-10004

2. కె. పవన్ కళ్యాణ్,    ఉప ముఖ్యమంత్రి
    మొబైల్ :  93813-09696     pawan.k786@gmail.com

3. ఎన్. లోకేష్ : 0863-2499999   lokeshnara@gmail.com

4. కె. అచ్చెన్నాయుడు : 94401- 96777    katchannaidu@gmail.com

5. కొల్లు రవీంద్ర  :  99851-22254     kolluravindra@gmail.com

6. నాదెండ్ల మనోహర్   :  98490-00006    nadendalamanohar@gmail.com

7. పి.నారాయణ  :  98481-72501  narayanaponguru@gmail.com

8. వంగలపూడి అనిత  :  80994-88888/ 90955-48888
    anithavangalapudi@gmail.com

9. సత్యకుమార్ యాదవ్  :   98105-09999/  74829-99999
    satyaosd@gmail.com

10. ఎన్. రామానాయుడు : 92477-31129  ramanaidunimmala@gmail.com

11. ఎన్.ఎం.డి.ఫరూక్  : 98496-99920  ministerfarook@gmail.com

12. ఎ.రామనారాయణరెడ్డి : 98490- 48855/94412-20555
     ananmramanarayanareddy139@gmail.com

13. పయ్యావుల కేశవ్ : 98480-32984   payyavulakeshav@gmail.com

14. ఎ. సత్య ప్రసాద్  : 99120-77777/96764-47777
     anaganimla@hotmail.com

15. కె. పార్ధసారధి  : 98483-04112/ 96983-59999
    nitinkrishna1811@gmail. com

16. డి. వీరాంజనేయస్వామి : 98491-94903 doctorswamydola@mail.com

17. జి. రవికుమార్  : 98485-25717 gravikumarmlaaaddanki@gmail.com

18. కందుల దుర్గేష్ : 91128-99999   lakshmidurgesh@gmail.com

19. జి.సంధ్యారాణి  : 94916-99633   sandhyatdp@gmail.com

20. బి.సి. జనార్ధనరెడ్డి  : 94944-94944/94410- 43333
      bcjreddy2@gmail.com

21. టి.జి. భరత్ : 98483-59999 tgbharath@hotmail.com

22. ఎస్.సవిత : 94406-10201/ 83091-70485
     savithahpe1@gmail.com

23. వాసంశెట్టి సుభాష్ : 95344-44999 subashforrcp@gmail.com

24.  కొండపల్లి శ్రీనివాస్  : 91771-12349  skondapalli9@gmail.com

25. ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి  : 63610-27470  prasadreddy3@gmail.com