Mar 4, 2024

ASR Nagar : ASR కథ


అంత నిరాడంబరత A. S. Rao గారిది. అయ్యగారి సాంబశివరావు గారికి 1960 లో పద్మశ్రీ, 1974లో పద్మభూషణ్ అవార్డులు వెతుక్కొంటూ వచ్చాయి. కానీ, ఆయన కారు వాడేవాడు కాదు. 'ఎందుకండీ, ఇంకా చేతనౌతుంది, నడచి పోవచ్చు. చాలా దూరం అనుకోండి సిటీ బస్సులు వున్నాయి కదా! ' అనేవారు ఆయన.
ఎవరు ఈ A. S. Rao గారు?

1914 సెప్టెంబర్ 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లు గ్రామం లో జన్మించిన రావు గారికి elementary మరియు middle school లో చదువుకోవడానికి డబ్బులు లేకపోతే ఆయన తల్లి, ఆమె పెళ్లప్పుడు అమ్మ నాన్న లు పెట్టిన ఒక చీర ను పాత గుడ్డలు కొనుక్కొనేవారికి అమ్మి, ఆ డబ్బు ను రావు గారికి ఇచ్చిందట. ఎంతనో తెలుసా? 2 రూపాయలు  ! అప్పులు చేసి, పస్తులుండి చదువే ఆయుధంగా ముందుకు నడచి రావు గారు కాశీ లోని ప్రఖ్యాత Benaras Hindu University లో MSc physics చేరారు. హాస్టల్ సౌకర్యం దొరక్కపొతే, వాళ్ళను వీళ్ళను పావలా, అర్ధరూపాయ అడుక్కోంటూ 8 రూపాయలు అయితే దానితో రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసి MSc పూర్తీ చేసారు.
అపుడు అమెరికా (క్యాలిఫోర్నియా ) లోని Stanford University లో Masters చేయాలని రావు గారి కోరిక. పేదరికం వెక్కిరించింది.
కానీ ఆయన ప్రతిభ ఎవరినో ఆకర్షించింది. ఎవరు వారు?
TATA సంస్థ  40, 000 రూపాయలను ఆయనకు ఇచ్చి Stanford University కి పంపింది. అక్కడ ఆయన మేధస్సుకు అమెరికన్ శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, Masters తరువాత వాళ్ళు " ఇండియా వెళ్ళకండి. ఇక్కడే ప్రొఫెసర్ గా వుంటూ మా వాళ్ళను గైడ్ చేయండి, " అని ఆయనకు నెలకు పెద్ద జీతం ఆఫర్ చేసారు. ఎంతనో తెలుసా?
1, 50, 000 రూపాయలు. కానీ, రావు గారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, " క్షమించాలి. నేను నా మాతృదేశం ఋణం తీర్చుకోవాలి, నన్ను ఇక్కడికి పంపిన TATA సంస్థ కు నా సేవలు అందించాలి, " అన్నారట. భారత్ తిరిగిచ్చాక టాటా వాళ్ళు Tata Institute of Fundamental Research (TIFR ) Mumbai లో ఉద్యోగం ఇచ్చారు. అపుడు ఆయన జీతం ఎంతనో తెలుసా? 300 రూపాయలు! ఎక్కడ 1,50 000 ? ఎక్కడ 300 ? ఈ కాలం లో అయితే ఆయన నిర్ణయాన్ని మనం పిచ్చి అంటాం. అవును మనకు డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ప్రతిష్ట పిచ్చి, సుఖాల పిచ్చి !
ఆయనకు దేశమంటే పిచ్చి, కర్తవ్యం అంటే పిచ్చి, కృతఙ్ఞత అంటే పిచ్చి, నైతిక విలువలంటే పిచ్చి!


ముంబై లో రావు గారి పరిశోధనలు ఏ స్థాయిలో వుండేవంటే, సాక్షాత్తూ Father of Indian Nuclear Programme అని పిలవబడిన Dr. Homi Zahangir Bhabha తానే స్వయంగా ముంబై వెళ్లి రావు గారిని అభినందించి వచ్చారట. తరువాతి రోజుల్లో ఆయన ఎన్నో విభాగాల్లో దేశానికి, సైన్స్ టెక్నాలజీ రంగాల్లో సేవలు అందించి, హైదరాబాద్ లో Electronics Corporation of India Ltd ( ECIL ) ను కూడా స్థాపించారు. 2003 లో హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రి లో చేరినప్పుడు ఒక డాక్టర్ గారు ఆయనకు ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్ అమరుస్తూ వున్నారు. ఆయనకు తెలుసు రావు గారు ఇక కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతారని. అపుడు రావు గారు డాక్టర్ ను దగ్గరికి పిలిచి " నాకు ట్రీట్మెంట్ ఇచ్చి నీవు పైకి లేచేటప్పుడు జాగ్రత్త, పైన వున్న మానిటర్ నీ తలకు తగిలే ప్రమాదముంది " అని అన్నారట. చివరి శ్వాస వరకూ ఇతరుల కష్టం, ఇతరుల బాధ తనవిగా భావించే సున్నితత్వం, మానవత్వం  వారిది. ఇవే కదా ఒక మనిషి character ను నిర్ణయించేది ! 

మహాబీర విత్తనాల ఉపయోగాలు



మహాబీర మొక్క తులసి మొక్కలా కనబడుతుంది. ఐతే, ఈ మొక్క ఆకులు కాస్త పెద్దవిగా ఉంటాయి.  మహాబీర విత్తనాలు మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు మహాబీర విత్తనాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఈ  విత్తనాల్లో క్యాల్షియం, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు వున్నాయి. మహాబీర చెట్టు ఆకుల రసాన్ని చర్మవ్యాధులైన గజ్జి, తామరపై లేపనం చేస్తే తగ్గిపోతాయి. మహాబీర విత్తనాల్లో వున్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కేన్సర్ వంటి వాటిని నిరోధిస్తాయి.

ఈ గింజల్లో డైటరీ ఫైబర్స్, విటమిన్ కె, విటమిన్ ఎ, ఐరన్ & యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు నిర్వహణ, కనిపించే జీవసంబంధమైన వయస్సు తగ్గింపు, రోగనిరోధక శక్తి, మధుమేహం నియంత్రణ మొదలైన ప్రయోజాలున్నాయి. నీటిలో నానబెట్టినప్పుడు, దాని అసలు పరిమాణం కంటే 30 రెట్లు ఉబ్బిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ మృదువైన ఉబ్బిన గింజలు అప్పుడు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి.  అధిక శరీర వేడి నుండి ఉత్పన్నమయ్యే చికాకు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

సోరియాసిస్, ఎగ్జిమా మొదలైన చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఈ గింజలు ఎసిడిటీ/బర్నింగ్ సెన్సేషన్‌ని తగ్గిస్తాయి. మధుమేహ చికిత్సకు మంచిది. మహాబీర విత్తనాలు సులభంగా ప్రేగు కదలికను నిర్ధారించడం ద్వారా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పొట్టలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.
మహాబీర గింజలు  జుట్టు రాలడాన్ని నిరోధించడమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్నందున, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా మధుమేహ సంబంధిత ఆక్సీకరణ ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది.

మహాబీర విత్తనాల పోషక విలువ

మహాబీర గింజలలో బీటా కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్, విటమిన్ ఎ, విటమిన్ కె ఉన్నాయి. ఇందులో పొటాషియం, మాంగనీస్, కాపర్, కాల్షియం, ఫోలేట్స్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి.

గింజలను ఒక గ్లాసు నీటిలో కొన్ని గంటలు నానబెట్టి, మిశ్రమాన్ని త్రాగాలి. ఒక టీస్పూన్ మహాబీర గింజలను 1 గ్లాసు లేదా 200 మి.లీ వేడి నీటిలో 30 నిమిషాలు నానబెట్టి, ఆపై మృదువైన, ఉబ్బిన గింజలను మీరు ఎంచుకునే తయారీలో ఉపయోగించండి. 
4 నుండి 6 గ్రాముల మహాబీర గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినండి.  అల్పాహారం కోసం ఇతర విత్తనాలను కూడా కలిగి ఉన్నాము.

అవిసె గింజలు, సబ్జా విత్తనాలు, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, సీతాఫలం విత్తనాలు కలోంజి  లేదా నిగెల్లా విత్తనాలు కూడా మంచివే. 


Feb 18, 2024

డయాబెటిస్ వారికి 11 ఉత్తమ ఆహారాలు

డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం, రెగ్యులర్ మెడికల్ చెక్-అప్స్, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఉన్న ఆహారాన్నితీసుకోవాలి.గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక వ్యక్తి  రక్తంలో చక్కెర స్థాయిలో ఆహారం ప్రభావం గురించి చెప్పే సంఖ్య. ఇది 0 నుండి 100 మధ్య స్కేల్ కలిగి ఉంది. 100 కు ఉదాహరణ స్వచ్ఛమైన గ్లూకోజ్. తక్కువ GI ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచవు. అధిక GI ఆహారాలు చక్కెర స్థాయిలలో తక్షణ పెంచుతాయి.  50 కన్నా తక్కువ GI విలువ తక్కువగా పరిగణిస్తారు. 50 ‐60 మధ్య GI విలువ సగటుగా పరిగణిస్తారు. 60 పైన జిఐ విలువ ఎక్కువ. 

1. శనగలుChickpeas (Kabuli Channa): శనగలను ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది చక్కెర స్థాయిలలో వచ్చే చిక్కులను నివారించడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక.

2. బీన్స్ Beans:అలసందలు, సోయాబీన్స్, చిక్కుడు, రాజ్మా, బఠాణీ వంటి అన్ని రకాల బీన్స్- కార్బోహైడ్రేట్లు, లీన్ ప్రోటీన్, ఫైబర్  గొప్ప వనరుగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బీన్స్ ని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

3. బ్రోకలీ Broccoli: బ్రోకలీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఫైబర్ అధికంగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న బ్రోకలీతో పాటు బచ్చలికూర వంటి ఇతర ఆకుకూరలు చక్కెర స్థాయిలను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి,.

4. గోధుమ బ్రెడ్ Whole Grain Bread: ఇది మానవ శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. Whole Grain Bread శోషణ, జీర్ణక్రియకు మంచిది.

5. వోట్మీల్ Oatmeal;ఓట్మీల్ కరిగే ఫైబర్  గొప్ప మూలంగా పనిచేస్తుంది.కడుపులోని ఆహారం నుండి గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ గంటలు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. మంచి అల్పాహారం ఎంపికగా పరిగణిస్తారు.

6. యాపిల్స్ :  రోజుకు ఒక ఆపిల్ వైద్యుడిని దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఆపిల్ అనేక విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉండే గొప్ప మూలం. ప్రతిరోజూ ఒక ఆపిల్‌ను తినాలి. అది తక్కువ GI పోషకాలతో నిండి ఉంటుంది. ఇతర తక్కువ GI పండ్లలో స్ట్రాబెర్రీ, బ్లాక్ జామున్, ఆరెంజ్ మొదలైనవి ఉన్నాయి. 

జామ, బొప్పాయ, నేరేడు పండ్లు తినవచ్చు.

అరటి, మామిడి వంటి పండ్లు అధిక GI పండ్లు. అటువంటి పండ్లను  మితంగా తినాలి.

7. కాకరకాయ Bitter Gourd: రుచిలో చేదు, అయితే కాకరకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడే మూడు క్రియాశీల యాంటీ డయాబెటిక్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. కాకరకాయలో కనిపించే చారంతిన్ అనే సమ్మేళనం గ్లూకోజ్ స్థాయిలను తక్కువగా, చక్కెరను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

8. కోడి గుడ్లు రోజుకు ఆరు వరకు తినవచ్చు. నాన్ వెజ్ ఏదైనా ఓ కప్పు తినవచ్చు. సుగర్ ఉన్నవారికి ఉల్లిపాయలు  ఓ వరం. 

9. పాలకూరతోపాటు అన్ని రకాల ఆకు కూరలు. కాయగూరలు దోస, కీరదోస... వంటివి తినగలిగినవి ఎన్నైనా తినవచ్చు. దంపుడు బియ్యం (బ్రౌన్ రైస్) ఉత్తమం. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తినాలి. 

10.అన్ని రకాల చిరుధాన్యాలతో తయారు చేసే పిండితో చేసిన రొట్టెలు మంచివి. ప్రతి రోజూ ఓ స్పూన్ మెంతుపొడి తింటే మంచిది. 

11. నట్స్, dark chocolate 



Jan 13, 2024

మలబద్ధకం - చికిత్స

 11 చిట్కాలు

మలబద్ధకం అంటే ఒక వ్యక్తికి మలవిసర్జన అవడం  చాలా కష్టం కావటం.  ప్రాసెస్ చేయబడిన మరియు శుద్ధి చేసిన ఆహారపు అలవాట్లు పెరగడంతో, మలబద్ధకం కూడా ప్రబలమైన సమస్యగా మారుతోంది. ఆహారం పెద్ద ప్రేగు గుండా వెళుతుంది, ఇక్కడ నీటిలో ఎక్కువ భాగం గ్రహించి మలం ఏర్పడుతుంది. ఇది శరీరం నుండి బహిష్కరించబడుతుంది మరియు మలబద్ధకం ఉంటే, ఈ మలం బయటకు వెళ్ళడం కష్టం, బాధాకరమైనది మరియు రక్తస్రావం కూడా కావచ్చు.

పిల్లలతో పాటు వృద్ధులలో మలబద్ధకం సాధారణం. పెద్దలతో పోలిస్తే పిల్లలు చాలా ఎక్కువ జంక్ ఫుడ్  తింటారు. వయస్సు పెరిగేకొద్దీ, పెద్దలు దంతాలు కోల్పోవడం ప్రారంభిస్తారు మరియు వారు తక్కువ నమలడం వల్ల అజీర్ణం మరియు మలబద్దకానికి దారితీస్తుంది. ఫైబర్, నీరు, కెఫిన్ మొదలైన అన్ని అంశాలతో సహా ఆహారo లో  మార్పుల కలయిక మలబద్దకాన్ని సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

 

1. ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగటం మంచిది. దీనికి కొంచెం బేకింగ్ సోడా జోడించండి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

2. ఉదయాన్నే ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి అల్లం టీ మరొక గొప్ప నివారణ.

3. కొద్దిగా తేనె లేదా చక్కెరతో ఒక గ్లాసు వెచ్చని పాలు మలబద్దకానికి మంచి ఔ షధంగా చెప్పవచ్చు.

4. సునాముఖి ఆకు పొడి మలబద్ధకాన్ని నివారిస్తుంది.  గోరువెచ్చని నీటిలో ఈ ఆకు పొడిని కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

5. నిద్రపోయేటప్పుడు నాభిపై కొన్ని చుక్కల గోరువెచ్చని ఆముదపు నూనెను పూయడం వల్ల ఉదయాన్నే మలం తేలికగా బయటకు పోతుంది. 

6. జామ, నారింజ, ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్, అరటి  తదితర పండ్లు మలం సులభంగా బయటకు వెళ్ళడానికి సహాయపడతాయి.

7. మలబద్ధకం చికిత్సలో ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లేదా బొప్పాయి రసం చాలా ఉపయోగపడుతుంది.

8. మలబద్దకం రాకుండా ఉండటానికి సుమారు 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి..

9. అధిక కొవ్వు, ప్రాసెస్ చేసిన ఆహారాలు,  కెఫిన్ మలబద్దకానికి ప్రధాన కారణాలు. అందువల్ల వాటిని తీసుకోకూడదు.

10.  త్రిఫల సూర్ణంను వెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మలబద్దకాన్ని నివారించవచ్చు.  ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి లక్షణాలను కలిగి ఉంది. ఇది పెద్దప్రేగు మొత్తం ప్రక్షాళనకు సహాయపడుతుంది.

11. పావన ముక్తసనం, యోగా ముద్ర, ధనూర్ ఆసనం, వజ్రాసనం వంటి యోగాసనాలు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.  వీటి ద్వారా పేరుకుపోయిన వాయువును విడుదల చేయడం, మలం బయటకు వెళ్ళడం జరుగుతుంది.

ఈ చిట్కాలను అనుసరించడం తో పాటు మలబద్ధకం నుండి దీర్ఘకాలిక నివారణను అందించడంలో ఆహారం, జీవనశైలి క్రమశిక్షణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకు కూరలు తీసుకోవడం మంచిది.

Jan 3, 2024

జాతి రత్నం సావిత్రిబాయి పూలే


మూఢవిశ్వాసాలతో ఛాందస మత గ్రంథాల నిర్బంధాల మధ్య స్త్రీ కి విద్య అవసరం లేదంటూ నిర్బంధాలు విధించిన ఛాందసవాదుల ను ఎదిరించి తానే విద్యకు శ్రీకారం చుట్టి భారతదేశ తొలి ఉపాధ్యయునిగా ఎంపికై భారత దేశ వ్యాప్తంగా విద్యను స్త్రీలకు అందించిన భారతదేశ జాతిరత్నం సావిత్రిబాయి పూలే అని ప్రముఖవైద్యులు కే వి ఎస్ సాయి ప్రసాద్ అన్నారు.. ది 3-1- 2024 బుధవారం ఉదయం పాత మంగళగిరి పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో మంగళగిరి సాహితీ కళావేదిక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన తొలి భారతీయ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్భంగా మంగళగిరి సాహితీ కళా వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . 190 సంవత్సరాలకు పూర్వం ఆనాటి మత దురంకారులతో అనేక అవమానాలు గురైనా.. మొక్కవోని ధైర్యంతో స్త్రీలు ఎందుకు విద్యను అభ్యసించకూడదు అంటూ తానే విద్యను నేర్చుకుని ఉపాధ్యాయురాలుగా స్త్రీ విద్య వ్యాప్తికి శ్రీకారం చుట్టారన్నారు. నేటి స్త్రీ అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఆదర్శమన్నారు... కానీ నేడు విద్య వింత పొగడలు పోతోందని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటూ ప్రజలకు విద్యను దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే ఆశయాలు స్ఫూర్తినిస్తాయన్నారు.

మంగళగిరి సాహితీ కళావేదిక కో కన్వీనర్ రేఖా కృష్ణార్జున్ రావు మాట్లాడుతూ నాటి దుర్భర పరిస్థితుల్లో సావిత్రిబాయి పోరాటాన్ని వివరిస్తూ వర్తమానంలోనే దుస్థితికి చైతన్య లోపమే కారణం అని దీనిని మనం అధిగమించాలన్నారు.నవ యువ కవి గోలి మధు మాట్లాడుతూ విద్యా ప్రాధాన్యతను గుర్తించి ప్రతి మహిళ విద్యా వంతురాలు కావాలని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఆమె చేసిన, నేడు బ్రష్టు పట్టిన కార్పొరేట్ విధానానికి వ్యత్యాసాన్ని గుర్తించి ఈ పరిస్థితులు మారాలన్నారు. బుద్ధభూమి మాస పత్రిక వర్కింగ్ ఎడిటర్ గోలి సీతారామయ్య ప్రసంగిస్తూ సావిత్రిబాయిపూలే సేవలను తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన వారి కృషి గొప్పదని అన్నారు.కార్యక్రమంలో ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి డాక్టర్ సాయి ప్రసాద్ , ప్రముఖులు పూలమాలవేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శిరందాసు నాగార్జున, అవ్వారు శ్రీనివాసరావు,సందుపట్ల భూపతి, ఆకురాతి రత్నరావు, మహమ్మద్ యూసఫ్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, చిలక వెంకటేశ్వరరావు, కంచర్ల క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తున్నాం

ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్

గుంటూరు, జనవరి 2: ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఖాతాదారుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నట్లు గుంటూరు ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ తెలిపారు. ఖాతాదారులు కార్యాలయానికి రాకుండా నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించుకొనే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకొచ్చినట్లు చెప్పారు. బృందావన్గార్డెన్స్ పి ఎఫ్ కార్యాలయంలో మంగళవారం జర్నలిస్టులు, ఖాతాదారులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమం లో ఆయన ప్రసంగించారు. ఖాతాదారులకు ఇ-మెయిల్, ఎక్స్, కుకు., వాట్సాప్ 9494657469 వంటి ప్రచారసాధనాలు, గ్రీవెన్స్సెల్ ద్వారా సేవలందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ప్రతినెల 15వతేదీ లోపు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగి, కార్మికుల జీతాల నుంచి మినహాయించిన సొమ్ముతోపాటు తమ వాటా ధనాన్ని కూడా పిఎఫ్ కార్యాలయానికి జమ చేయాలన్నారు. దీనిలో ఎవరికి మినహాయింపు లేదన్నారు. చెల్లింపులు ఆలస్యమైతే 33 నుంచి వంద శాతం జరిమానా, 12 శాతం వడ్డీ వసూలు చేస్తామని, కొన్ని సందర్భాలలో శిక్షలు విధిస్తామని ప్రాంతీయ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ హెచ్చరించారు. అసిస్టెంట్ కమిషనర్ జెఆర్ మాధవ శంకర్ మాట్లాడుతూ కనీసం 20 మంది సిబ్బంది పనిచేసే సంస్థలు పిఎఫ్ పరిధిలోకొస్తాయన్నారు. నెలకు రూ. 15 వేల పైన వేతనం పొందే కార్మికుడు, ఉద్యోగి బేసిక్, డిఎ మొత్తంపై యజమాని నుంచి షేర్ధనం పొందిన వారికి హయ్యర్ (అధిక) పెన్షన్ మార్గదర్శకాలు వర్తిస్తాయన్నారు. ఒకవేళ పెన్షనర్ అకాల మరణం చెందితే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ లభిస్తుందని తెలిపారు.

 టెలికం జిల్లా సలహా కమిటీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో పత్రికల్లో పనిచేస్తున్న 58 ఏళ్ళు నిండిన వారు సత్వరమే పెన్షన్ పొందటానికి పిఎఫ్ సిబ్బంది సహకరించాల న్నారు. ఈ సందర్భంగా కమిషనర్, సహాయ కమిషనర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కె శరచ్చంద్రజ్యోతిశ్రీ, కందిమళ్ళ వెంకట్రావు, శిరందాసు నాగార్జున, షేక్ రాజా తదితరులు పాల్గొన్నారు.