Sep 20, 2020

చేనేత అభివృద్ధికి కృషి చేసిన‌‌ పుచ్చల సత్యనారాయణ


చేనేత వ‌ర్గానికి చెందిన
  స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు  పుచ్చల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ లో 10-4-1909 సం.లో జన్మించారు. వీరు చిన్నతనం నుండి కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ కమ్యూనిస్టు యోధుడు గా ఎదిగారు. ఆనాటి స్వాతంత్రపోరాటాలలో పాల్గొంటూ 1936 లో ఉప్పాడలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా  ప్రజలను చైతన్య పరచి సంఘసేవలు అందించేవారు. ఆ రోజుల్లోనే కులాంతర వివాహాలను ప్రోత్సహించి సర్వమానవ సమానత్వానికై పాటుబడేవారు.  1955 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట నియోజకవర్గానికి కమ్యూనిస్టు పార్టీ తరుపున  పోటీ చేసిన పుచ్చల సత్యనారాయణ  అఖండ మెజార్టీతో గెలుపొందారు. 1962 వరకు ప్రజానాయకుడిగా తన సేవలు అందించారు.  దేవాంగ కులభూషణుడైన ఆయ‌న‌ ముఖ్యంగా చేనేత పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిది. వారు కమ్యూనిస్టు నాయకుడుగా రష్యా, కెనడా,అమెరికా దేశాలను సందర్శించారు. ఆ సమయంలోనే చేనేత ఉత్పత్తులను ఆయా దేశాలలో ఎక్స్ పోర్ట్ చేయించడంలో ఆయన కృషి మరవలేనిది.  చేనేతవర్గాలపై ఆయన ప్రేమ ఎనలేనిది.అగ్రవర్గాలుగా చెప్పుకునే కొన్ని సామాజికవర్గాలు అభివృద్ధిలో మునుముందుకు దూసుకుపోతున్న తరుణంలో చేనేతవర్గాలు వెనుకబడిపోతున్న తీరును గమనించి విద్యతోనే అభివృద్ధి సాద్యమని గ్రహించి 1976 లో కాకినాడలో పేదవిద్యార్థులకు ఉచిత హాస్టల్ ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు చేయూతనందించారు.

MLA గా వున్న సమయంలోనే వారు చేనేత పరిశ్రమకు అద్దం పట్టేలా చేనేత దర్పణం అనే పుస్తాకాన్ని రచించారు. దానితో పాటు AP సేల్స్ టాక్స్ అనే మరో పుస్తకాన్ని కూడా రచించి ఎన్నో విషయాలు వాటిలో చర్చించారు.  ఇంకా వీరు అనేక సంస్థల్లో సభ్యులుగా వుంటూ తనదైన శైలిలో సేవలు అందిస్తూ అందరి మన్నలను అందుకున్నారు.  కొత్తపల్లి చేనేత సొసైటీ అధ్యక్షుడిగా, జిల్లా ప్లానింగ్ కమిటీ అధ్యక్షుడిగా .... అనేక సంస్థలో  ద్వారా సేవలు అందించారు.  తన చిరస్మరణీయమైన సేవలతో ఎందరికో స్పూర్తిని నింపుతూ తన జీవితమంతా పేదప్రజలకు,చేనేత వర్గాలకు ధారపోసిన ఆ మహానుభావుడు 29-9-1995న కన్నుమూశారు.


చెన్నైలో ఓ చేనేత పేరుతోనే టీన‌గ‌ర్




సర్ పిట్టి త్యాగరాయ శెట్టి  1852 ఏప్రిల్ 27వ తేదీన మదరాసు చాకలిపేటలోని సంపన్న చేనేత కుటుంబంలో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ.వరకు చదువుకున్నారు. తండియారు పేటలో మగ్గాలు పెట్టించి తాను స్వయంగా నేత నేసి, పది మంది చేత నేయించి అనేక బహుమతులు అందుకున్నారు. 1905లో ఆయన పర్యవేక్షణ కింద మదరాసులో చేతితో నాడి విసిరే త్రో షటిల్ మగ్గం స్థానంలో కుచ్చుతో నాడిలాగే షటిల్ మగ్గం రూపు దిద్దుకుంది.  తండ్రి అయ్యప్ప చేస్తున్న తోళ్ళవాప్యారంలోకి దిగి మంచి పేరు గడించారు.


40 సంవత్సరాలు మద్రాసు నగర మేయర్ గా వుండి నగరాభివృద్ధి నిస్వార్థంగా చేసిన కృషికి గుర్తింపుగా కార్పొరేషన్ కార్యాలయం (రిప్పన్ బిల్డింగ్) ముందు త్యాగరాయ శెట్టి విగ్రహం ప్రతిష్టించారు.  ఇది చేనేత వర్గీయులకెంతో గర్వకారణం. ఆయన స్మారకార్థం టి.నగర్ (త్యాగరాయ నగర్) అని పేరు పెట్టడం జరిగింది. 1921లో దివాన్ బిరుదు పొందారు. 1920లో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడై ముఖ్యమంత్రి పదవి  వరించి వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. 1921లో సర్ బిరుదు వచ్చింది చేనేత వారి బిడ్డల విద్యాభివృద్ధికై 1897లో నార్త్ మదరాసు హిందూ హైస్కూలును స్థాపించారు. 1906నాటికి ఉన్నత పాఠశాల అయింది. 1950 నాటికి త్యాగరాయ కళాశాలగా రూపుదిద్దుకుంది.   ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీకి 45,000 రూపాయల విరాళం యిచ్చింది.  1921 లో ఏర్పడిన అఖిల భారత పద్మశాలి సంఘానికి, చేనేత ఉద్యమాలకు పేద చేనేత విద్యార్థులకు ధారాళంగా ధన సహాయం చేసిన ధర్మమూర్తి త్యాగరాయ శెట్టి.    1925, జూన్ 30న త‌న 73వ ఏట‌ ఆయ‌న క‌న్నుమూశారు. ఆయన వారసత్వం పోకుండా కుమారులు కుమార స్వామి శెట్టి, బెంగాల్ రాయ్ శెట్టి చేనేత కాంగ్రెస్ కార్యక్రమాలకు యితోధికంగా సహకరించేవారు. మదరాసులో  నిర్వహించిన పలు కార్యక్రమాలకు, ప్రత్యేకించి 1951 సత్యాగ్రహానికి, చిన్నా పెద్ద మీటింగులకు త్యాగరాయ కాలేజి కేంద్రస్థానంగా నిలిచింది.

- గోలి హనుమంత రావు


Sep 14, 2020

ఐపిసిలో కొన్ని సెక్షన్ లు

  * సెక్షన్ 307 * = హత్యాయత్నం

  * సెక్షన్ 302 * = హత్యకు శిక్ష

  * సెక్షన్ 376 * = అత్యాచారం

  * సెక్షన్ 395 * = దోపిడీ

  * సెక్షన్ 377 * = అసహజ కదలికలు

  * సెక్షన్ 396 * = దోపిడీ      సమయంలో హత్య

  * సెక్షన్ 120 * = కుట్ర

  * సెక్షన్ 365 * = కిడ్నాప్

  * సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం

  * సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం

  * సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు

  * సెక్షన్ 378 * = దొంగతనం

  * సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్

  * విభాగం 191 * = తప్పు లక్ష్యం

  * సెక్షన్ 300 *   =   హత్య

  * సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం

  * సెక్షన్ 310 * = మోసం

  * సెక్షన్ 312 * = గర్భస్రావం

  * సెక్షన్ 351 * = దాడి చేయడానికి

  * సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు

  * సెక్షన్ 362 * = కిడ్నాప్

  * సెక్షన్ 415 * = ట్రిక్

  * సెక్షన్ 445 * = దేశీయ వివక్ష

  * సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి  జీవితంలో పునర్వివాహం

  * సెక్షన్ 499 * = పరువు నష్టం

  * సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.

   మ‌రికొన్ని ముఖ్య‌మైన విష‌యాలు

 (1) సాయంత్రం 6 గం,,తర్వాత    ఉదయం 6గం,, లోపు  మహిళలను అరెస్టు చేయలేము -

  క్రిమినల్ కోడ్, సెక్షన్ 46 ప్రకారం, సాయంత్రం 6 గంటల తరువాత,  ఉదయం 6 గంటలకు ముందు, భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా, ఏ మహిళను అరెస్టు చేయలేరు.  పోలీసులు అలా చేస్తే, అరెస్టు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు.  ఇది ఈ పోలీసు అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు.

  (2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ .4 మిలియన్ల వరకు బీమా పొందవచ్చు

  పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం, ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి, మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే, మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు.  గ్యాస్ కంపెనీ నుండి రూ .4 మిలియన్ల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు.  కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయవచ్చు.

  (3) ఏదైనా హోటల్ 5 నక్షత్రాలు అయినా; మీరు ఉచితంగా నీరు త్రాగవచ్చు, వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు -

  ఇండియన్ సిరీస్ యాక్ట్, 1887 ప్రకారం, మీరు దేశంలోని ఏ హోటల్‌కైనా వెళ్లి నీరు అడగవచ్చు, త్రాగవచ్చు,  ఆ హోటల్ యొక్క వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.  హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలు అయితే, వారు మిమ్మల్ని ఆపలేరు.  హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్‌రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే, మీరు చర్య తీసుకోవచ్చు.  మీ ఫిర్యాదు ఈ హోటల్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.

   (4) గర్భిణీ స్త్రీలను తొలగించలేరు -

  ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం, గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా తొలగించలేరు.  గర్భధారణ సమయంలో, యజమాని మూడు నెలల నోటీసు,  ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాలి.  అతను అలా చేయకపోతే, ప్రభుత్వ ఉపాధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు.  ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

  (5) మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు

  ఐపిసి సెక్షన్ 166 ఎ ప్రకారం, మీ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీసు అధికారి నిరాకరించలేరు.  అతను అలా చేస్తే, అతనిపై సీనియర్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, పోలీసు అధికారికి కనీసం * (6) * నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా తొలగింపును ఎదుర్కోవచ్చు.




Sep 7, 2020

అవినీతిపరుల చిట్టా సేకరించే విధానం

ఒక సమాచార దరఖాస్తు ద్వారా ఏ అధికారి వలన అయితే మీకు అన్యాయం జరిగిందో సదరు అధికారి SR(సర్వీస్ రిజిస్టర్) నకలు కాపీ తీసుకోండి.అందులో సదరు అధికారి పుట్టిన గ్రామం మొదలు సదరు అధికారి ఇప్పటిదాకా ఏఏ ప్రాంతాల్లో పనిచేశాడు. అతనిపై జరిగిన విచారణలు ఉన్నతా ధికారులు తీసుకున్న చర్యల వరకు అన్నీ క్షుణ్ణంగా ఉంటాయి.

ఒక ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడు తున్నాడు అంటే అది ఖచ్చితంగా లంచాల రూపకంగా వచ్చే డబ్బు కోసం మాత్రమే.ఇలా లంచాల రూపకంగా సంపాదించిన బ్లాక్ మనీ/నల్ల ధనంను తల్లి/తండ్రి/అన్న/తమ్ముడు/అక్క/బావ/చెల్లెలు/బావమరిది/అత్త/మామా/భార్య తరుపున బంధువులు/కలిసి చదువుకున్న స్నేహితులు/నమ్మదగిన బంధువులు/తమకింద పనిచేసే కిందిస్థాయి సిబ్బంది/తాము పనిచేసే ప్రాంతంలో పరిచయమైన నమ్మదగిన బినామీలు ఇలాంటి వాళ్ళ పేర్లతో ఆస్తులు కొని దాచుకుని ఉంటారు.

ఒక వారం రోజులు టైం కేటాయించుకుని సదరు అధికారి పుట్టిపెరిగిన ప్రాంతము మొదలు/చదువుకున్న ప్రాంతాలు/అత్తగారి ఊరు/పనిచేసిన ప్రాంతాలు అన్నీ తిరిగితే నాలుగు పచ్చనోట్లు కొడితే వీళ్ళ ఆస్తుల చిట్టా చెప్పేవాళ్ళు ఆయా ప్రాంతాల్లో బొచ్చెడుమంది వుంటారు.పనిచేసిన ప్రాంతాల్లో అయితే ఆ మాత్రం పచ్చనోట్లు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు.వీళ్ళ అవినీతి సొమ్ముతో తనకు వాటా ఇవ్వలేదనో/పక్కనోడికి ఇచ్చాడనో/పక్కనోడికి ఎక్కువ వాటా ఇచ్చాడనో అక్కసుతో ఉండేవాళ్ళ సంఖ్య ప్రతీ ఆఫసులో ఎక్కువగానే ఉంటుంది.అక్కడ సమాచారం తీసుకోవడం చాలా ఈజీ.

ఇక మిగిలింది ఏముంది. అక్రమాస్తుల చిట్టా మొత్తం మూటకట్టి ఏసీబీ DG ఆఫీసుకు పంపడమే.ఏసీబీ వాళ్ళు కచేరీ ఏర్పాటుచేసి అక్రమార్జనలో ప్రతిభ చాటిన ప్రతిభావంతులను సన్మానిస్తారు.

ఎదుటివాళ్ళ అత్యాశ / అవినీతి/అధికార దుర్వినియోగం వల్ల మీకు చచ్చిపోవాలి అన్నంత బాధ కలిగిందా?!?!. ప్రజలు కట్టిన పన్నుల్లోంచి ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం నియమించు కున్న గుమాస్తాలు అనే ప్రభుత్వ ఉద్యోగులు చేసే పనికి ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక వాడవాడో లంచాల కోసం అధికార దుర్వి నియోగం చేస్తే చేతగాని వాళ్ళలా మీరు చావడం ఎందుకు?!?!. నిజంగా మీకు చచ్చేటంత నష్టమో?!?! కష్టమో?!?! సదరు అధికారుల నుండి వచ్చి ఉంటే అలాంటి అధికారుల నుండి నీలా ఇంకే సామాన్యునికి అంతటి కష్టం రాకుండా ధైర్యం చేసి అక్రమాస్తుల చిట్టా బయటికి తీసి ఏసీబీ రైడ్ చేయించు.అలాంటి అవినీతి అధికారులు ఇంటికి పోతే కనీసం నీలా ఇంకొకరు బాధలడకుండా అడ్డుకోగలిగినవాడు అవుతావుకదా?!?!.

ఏసీబీ అధికారులే కాదు  సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం కూడా ఒక అవినీతి అధికారుల అక్రమాస్తుల చిట్టా నిజమా?!?! కాదా?!?! అని మాత్రమే చూస్తుంది. అంతేకానీ అది ఎలా తెచ్చావు?!?!.ఎందుకు తెచ్చావు అని ఎవరూ అడగరు?!?!. అడిగే అధికారం ఎవరికీ లేదు?!?!.అడిగినా చెప్పాల్సిన అవసరం మనకులేదు?!?!

10సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ లో నానా సంకలు నాకి  కొన్ని వేలాది/లక్షలమంది జీవితాలు నాశనము చేసి సంపాదించిన ఇలాంటి వాళ్ళ సొమ్ము మొత్తం రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందైనా మీరు ఏసీబీ అధికారుల చేతుల్లో పోయగలితే వాడికి అంతకు మించిన శిక్ష ఉండదు.బాధితులకు అంతకుమించిన సంతృప్తి ఉండదు.

సెక్రటేరియట్ కు ఫిర్యాదులు చేస్తాము/ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తాము/కలెక్టర్ కు అర్జీలు రాస్తాము/SP కి ఫిర్యాదులు చేస్తాము.   ఇవన్నీ వేస్ట్ అక్రమాస్తులు సమాచార సేకరణ బెస్ట్.

చిత్రగుప్తుడు మనుష్యుల పాపాలు లెక్కపెట్టినట్టు మీరు మీ ప్రాంతంలోని అధికారుల అక్రమార్జన అక్రమాస్తుల వివరాల సేకరణపై దృష్టి పెట్టండి. అది మాత్రమే చేయండి.ఈ క్రమంలో అధికారులు అక్రమా కేసులు పెడతాం/అక్రమ కేసులు పెట్టిస్తాం. జైలుకు పంపుతాం. ఇలాంటి బెదిరింపులు చేస్తారు.వాటికేమీ ఎవ్వరూ భయపడవద్దు.         

రిమాండ్ అనేది శిక్ష కాదు.జరిగిన నేరముపై పోలీస్ విచారణ ముగి సేంత వరకు నేరా రోపణ చేయబడిన వ్యక్తి విచా రణకు ఆటంకం కలిగించ కుండా పోలీస్ కస్టడీలో పేట్టుకోవడం మాత్రమే ఆ తరువాత బెయిల్ వస్తుంది.

ఈ అక్రమాస్తులను కనిపెట్టే నీ వేటను నీవు నిరంత రాయంగా చేసు కోవచ్చు. నీవు ఒక్కసారి ఏసీబీ రైడ్ చేయించ గలిగితే చాలు అది ఆ అవినీతి అధికారికి కోలుకోలేని చావుదెబ్బె.

అధికారుల అవినీతికి/అత్యాశకు/అధికార దుర్వినియోగానికి బలై చావడానికి పెట్రోల్ పోసుకునే బాధితులకు/ఆత్మహత్యలు చేసుకునే పిరికివాళ్ళకు ఇదే నా సలహా పోరాడ్డానికి కావాల్సిన ధైర్యం కంటే. చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి.చచ్చే అంతటి ధైర్యం నీలో ఉనప్పుడు ఆ ధైర్యాన్ని అవినీతి అధికారుల అక్రమాస్తులు బయటికి తీసి అటు ప్రభుత్వానికి & ఏసీబీ విభాగానికి ఇటు నీలాంటి నిస్సహాయులకు మంచి జరగడానికి ఉపయోగించండి.          

ఒక పదిమందికి వేటుపడితే ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు మారుతారు.

పవర్ ఆఫ్ ఆర్టీఐ

 


ప్రకృతి వ్యవసాయం

 గ్రామాల డబ్బు గ్రామాల్లోనే ఉండాలి – నగరాల డబ్బు గ్రామాలకు రావాలి

అదే ప్రకృతి వ్యవసాయ ఫలితం

“ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాలి. ఈ తరహా సాగు విధానంతో చిన్నపాటి భూమిలో ఒక కుటుంబంలో నలుగురూ కలిసి పని చేసుకొంటే ఎంత ఆదాయం వస్తుంది అనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం” అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు తెలిపారు. ప్రకృతితో ముడిపడిన ఈ వ్యవసాయం విధానం అవసరం, విశిష్టత గురించి తెలిపే అనుభవం శ్రీ విజయరామ్ గారికి ఉంది అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానం గురించి శ్రీ విజయరామ్ గారు మాట్లాడుతూ “ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే ముందు  నేను ముందు ఆచరించాలి... తర్వాత చెప్పాలి అని కృష్ణా జిల్లాలో ఆరు ఎకరాలు కొని అక్కడ చెరువు తవ్వాను. శ్రీ పాలేకర్ గారు చెప్పే విధానంలో 10 శాతం చెరువు.. 10 శాతం అడవి అంటారు ఎక్కడైనా సరే.. నేను ముందుగా చెరువు తవ్వుకున్నాను. మనం మాగాణులు అంటే చాలా మంచిది అనుకుంటాం. అవి వరికి అనుకూలం. వైవిద్యం అంటే తెలంగాణ, రాయలసీమల్లోనే బతికుంది. మెట్ట సేద్యం మంచిది. ప్రకృతి వ్యవసాయాన్ని మాగాణిలో కూడా మేం రూపొందిస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ ప్రకారం చేసుకోవచ్చు.                                                                            

శ్రీ పాలేకర్ గారు ఒక మాట చెబుతారు – గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉండాలి... నగరాల డబ్బులు గ్రామాలకు రావాలి అంటారు. యూరియా, డి.ఎ.పి. కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, స్పేర్ పార్టులు, డీజిల్ ఆయిల్.. ఇలా ఏదైతేనేం ఒక గ్రామం నుంచి రూ.16 లక్షలు విదేశాలకు వెళ్తున్నాయి. భారత దేశంలో ఇలాంటి గ్రామాలు 6 లక్షలు ఉన్నాయి. రెండవది అందరికి అన్నంపెట్టే రైతుకి అన్నం దొరకడం లేదు. 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

భారత దేశానికి ఈ ప్రపంచంలోనే ఇప్పటికీ అతి గొప్ప స్థానం ఉంది. గురు స్థానంలో ఉంది. ఎందుకు అంటే 75 శాతం జీవ వైవిద్యం భారత దేశానికి భగవంతుడు ఇచ్చి, మిగిలిన దేశాలకు 25 శాతం ఇచ్చాడు. ఇక్కడున్నది సమ శీతోష్ణస్థితి. కాలానికి తగ్గట్టు పండ్లు, ఫలసాయాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇది మీకు బయట దేశాల్లో చూసుకుంటే విపరీతమైన చలి లేదా విపరీతమైన ఎండ.  శ్రీ పాలేకర్ గారు గత 38 సంవత్సరాలుగా 40 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. అందులో నేను ఒక్కడిని. 40 లక్షలు అనుకున్నా కూడా చాలా పెద్ద సంఖ్యలా కనబడుతుంది గానీ, దేశ జనాభాతో మనం చూస్తే ఒక్క శాతం లేదు. శ్రీ పవన్ కల్యాణ్ గారు నాతో మాట్లాడినప్పుడు ఇది నేను రాజకీయాల గురించి చేయడం లేదు. ఇది నా బాధ్యత అన్నారు. 

భారతదేశంలో ఇప్పటి వరకు శ్రీ పాలేకర్ గారు తెలుగు రాష్ట్రాలకు చాలా ఎక్కువ సమయం ఇచ్చారు. కానీ ప్రకృతి వ్యవసాయంలో భారత దేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. కారణం ఏంటంటే గోవుని పూజించే స్వాములు, పీఠాధిపతులు, వారి ఆశ్రమాలన్నీ అక్కడ ఎక్కువ. తమ భక్తులకు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. అలాంటి బాధ్యత ఇక్కడ స్వాములంతా తీసుకోవాలి. 

ఈ భూమ్మీద వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. మనిషి లేకుండా ఎప్పటి నుంచో ఈ భూమ్మీద ఉన్నాయి ఇవి. మనిషి అవసరం వాటికి ఎక్కడా లేదు. కానీ వాటి అవసరం మనిషికి ఉంది. వీటిని పెంచి పోషించేది ఈ ప్రకృతి వ్యవసాయం మాత్రమే.  శ్రీ పవన్ కల్యాణ్ గారు లాంటివారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ముందు ఉంటుందని నమ్ముతున్నాను. అందరికీ విషతుల్యం కాని ఆహారం ఇవ్వాలి. మా తాత ఉన్నప్పుడు ఇన్ని క్యాన్సర్ ఆసుపత్రులు లేవు. నాన్న ఉన్నప్పుడు ఇన్ని లేవు. మనం ఉన్నప్పుడు ఇన్ని వచ్చాయి. మన కొడుకులు, మనవళ్లు వచ్చే సరికి పరిస్థితి ఏమవుతుంది అనే భయం ఉంది. అందరికీ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలగాలి” అన్నారు.

Sep 5, 2020

ఒకే ఒక్క పోలీస్ - ఉమేష్ చంద్ర IPS

నీతినిజాయితీకి మారు పేరు

 ఎంతో మందికి స్ఫూర్తి ...

ఇప్పటి కీ ఆయనే అందరికీ మార్గదర్శకం..

చదలవాడ ఉమేష్ చంద్ర

పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ళ రోమాలు నిక్కబొడుస్తాయి .. రక్తం పోటెత్తుతుంది, కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు,

 మహా అయితే హైదరాబాద్ అమీర్ పేట, ఎస్.ఆర్.నగర్ ఏరియాల్లో ఉండేవాళ్ళకి

ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గరఅని అడ్రస్ లాండ్ మార్క్ గా చెప్పడానికి తెలుసేమో " !

 మరి ఎవరీ ఉమేష్ చంద్ర ?

నక్షలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటి ఇజాలకు తన పోలీసిజం రుచి చూపించిన ఒక్క మగాడు ..

దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపం 

మనకు తెలుగు సినిమాలలో చాలా మంది పులులు సింహలు ఉన్నారు, కానీ నిజజీవితంలో కడప పులిఅని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర..

ఆయన అమర మరణం చెంది నేటికి 17 సంవత్సరాలు .. ఆయన కథేంటో చూద్దాం ..

ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966 న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు.

1991లో IPS కి ఎన్నికై, 1991-92 లో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు, మొదట 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ASP గా పని చేశారు. వరంగల్లులో పనిచేసిన కాలంలో జనజాగృతిఅనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు,

దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్లు గ్రామాల్లో పాతుకుపోయిన నక్షలిజాన్ని రూపుమాపడానికి కృషిచేస్తూ మొదటి పోస్టింగుతోనే

నక్షల్స్ కు బద్దవిరోధి అయ్యారు.తరువాత కడప జిల్లాలో ఫాక్షనిజంతో కరుడుగట్టిన పులివెందుల ఏరియాకి గా బదిలీ చేయబడ్డారు, అక్కడ పనిచేసింది కేవలం 4 నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు.

 మనం కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిజాన్ని పులివెందుల్లో చూపించారు, చిన్న చిన్న గుండాల నుండి బడా బడా ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్రలేకుండా చేసారు, అర్ధారాత్రులు, తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్లుగా అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు, మామూలుగా సినిమా హీరోల పైన, రాజకీయనాయకుల పైన పాటలు వ్రాస్తారు.అలాంటిది పోలీసు అధికారి పై పాటలు వ్రాసారు.

అదికూడా కేవలం నాలుగు నెలల కొంచెం సమయంలోని ఆయన చేసిన పనికి ఈ ఒక్కటి చాలు ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన పనులు అక్కడ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియడానికి

ఫిబ్రవరి 1995 లో వరంగల్లు ప్రత్యేక విధుల అధికారిగా నియమితులయ్యారు, ఈసారి నక్షలిజం పై విరుచుకుపడ్డారు, వరంగల్లులో తొలిసారిగా ప్రజలు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు.

ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ ని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపించారు

ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు.

 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. తరువాత జూన్ 1997 న కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా బదిలీ అయ్యారు, ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచిచేసింది, ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేసారు, ఆయన బదిలీ అయి వెళుతున్న రోజు ప్రజలు ఆయనికి పలికిన వీడ్కోలు అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ ఎక్కడా ఏ పోలీసు అధికారికి జరగలేదు

ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న హైదరాబాదు యస్సార్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు,  డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు.

ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.

Sep 4, 2020

తెలుగంటే

 తెలుగంటే...గోంగూర

తెలుగంటే...గోదారి

తెలుగంటే...గొబ్బిళ్ళు

తెలుగంటే...గోరింట

తెలుగంటే...గుత్తోంకాయ్

తెలుగంటే...కొత్తావకాయ్

తెలుగంటే....పెరుగన్నం

తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం

తెలుగంటే...పోతన్న

తెలుగంటే...బాపు

తెలుగంటే...రమణ

తెలుగంటే...అల్లసాని పెద్దన

తెలుగంటే...తెనాలి రామకృష్ణ

తెలుగంటే...పొట్టి శ్రీరాములు

తెలుగంటే...అల్లూరి సీతారామరాజు

తెలుగంటే...కందుకూరి వీరేశలింగం

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...శ్రీ శ్రీ

తెలుగంటే...వేమన

తెలుగంటే...నన్నయ

తెలుగంటే...తిక్కన

తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...క్షేత్రయ్య

తెలుగంటే...శ్రీనాధ

తెలుగంటే...మొల్ల

తెలుగంటే...కంచర్ల గోపన్న

తెలుగంటే....కాళోజి

తెలుగంటే...కృష్ణమాచార్య

తెలుగంటే...సిద్ధేంద్ర

తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకార్ణి

తెలుగంటే...రాణీ రుద్రమదేవి

తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు

తెలుగంటే...రామలింగ నాయుడు

తెలుగంటే...తిమ్మనాయుడు

తెలుగంటే...రామదాసు

తెలుగంటే...ఆచార్య నాగార్జున

తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం

తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి

తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి

తెలుగంటే...సింగేరి శంకరాచార్య

తెలుగంటే...అన్నమాచార్య

తెలుగంటే...త్యాగరాజు

తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన

తెలుగంటే...విశ్వేశ్వరయ్య

తెలుగంటే...చిన్నయ్య సూరి

తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగంటే...పీవీ నరసింహారావు

తెలుగంటే...రాజన్న

తెలుగంటే...సుశీల

తెలుగంటే...ఘంటసాల

తెలుగంటే...రామారావు

తెలుగంటే...అక్కినేని

తెలుగంటే...సూర్యకాంతం

తెలుగంటే...ఎస్.వీ.రంగారావు

తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు

తెలుగంటే...పండుమిరప

తెలుగంటే...సంక్రాంతి

తెలుగంటే...సరోజిని నాయుడు

తెలుగంటే....భద్రాద్రి రామన్న

తెలుగంటే...తిరుపతి ఎంకన్న

తెలుగంటే...మాగాణి

తెలుగంటే...సాంబ్రాణి

తెలుగంటే...ఆడపిల్ల ఓణి

తెలుగంటే...చీరకట్టు

తెలుగంటే...ముద్దపప్పు

తెలుగంటే...ఓంకారం

తెలుగంటే...యమకారం

తెలుగంటే....మమకారం

తెలుగంటే...సంస్కారం

తెలుగంటే...కొంచెం ఎటకారం

తెలుగంటే...పట్టింపు

తెలుగంటే...తెగింపు

తెలుగంటే....లాలింపు

తెలుగంటే...పింగళి వెంకయ్య

తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు

తెలుగంటే....టంగుటూరి ప్రకాశం

తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగంటే...భాస్కరుడు

తెలుగంటే...దేవులపల్లి

తెలుగంటే...ధూర్జటి

తెలుగంటే...తిరుపతి శాస్త్రి

తెలుగంటే...గుఱ్ఱం జాషువ

తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ

తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య

తెలుగంటే...కోరాడ రామచంద్రకవి

తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం

తెలుగంటే...మల్లన్న

తెలుగంటే...నండూరి

తెలుగంటే...పానుగంటి

తెలుగంటే...రామానుజం

తెలుగంటే...రావి శాస్త్రి

తెలుగంటే...రంగనాధుడు

తెలుగంటే...కృష్ణదేవరాయలు

తెలుగంటే...తిరుపతి వెంకటకవులు

తెలుగంటే...విశ్వనాథ

తెలుగంటే...నన్నే చోడుడు

తెలుగంటే...ఆరుద్ర

తెలుగంటే...ఎంకి

తెలుగంటే...ఆదిభట్ల

తెలుగంటే...గాజుల సత్యనారాయణ

తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ

తెలుగంటే...ఆర్యభట్టు

తెలుగంటే...త్యాగయ్య

తెలుగంటే...కేతన

తెలుగంటే...వెంపటి చిన సత్యం

తెలుగంటే...ఉషశ్రీ

తెలుగంటే...జంధ్యాల

తెలుగంటే...ముళ్ళపూడి

తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం

తెలుగంటే...తిలక్

తెలుగంటే...అడివి బాపిరాజు

తెలుగంటే...జక్కన

తెలుగంటే...అచ్చమాంబ

తెలుగంటే...దాశరథి

తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర

తెలుగంటే...ముక్కుపుడక 

తెలుగంటే...పంచెకట్టు

తెలుగంటే...ఇంటిముందు ముగ్గు

తెలుగంటే...నుదుటిమీద బొట్టు

తెలుగంటే...తాంబూలం

తెలుగంటే...పులిహోర

తెలుగంటే....సకినాలు

తెలుగంటే....మిర్చి బజ్జి

తెలుగంటే...బందరు లడ్డు

తెలుగంటే....కాకినాడ ఖాజా

తెలుగంటే.....జీడిపాకం

తెలుగంటే...మామిడి తాండ్ర

తెలుగంటే...రాగి ముద్ద

తెలుగంటే...జొన్న రొట్టె

తెలుగంటే...అంబలి

తెలుగంటే...మల్లినాథ సూరి

తెలుగంటే...భవభూతి

తెలుగంటే...ప్రోలయ నాయకుడు

తెలుగంటే...రాళ్ళపల్లి 

తెలుగంటే...కట్టమంచి

తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట

తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ

తెలుంగు ఆణమంటే తెలంగాణ

తెలుగంటే..... నీవు నేను మనం

జై తెలుగు తల్లీ