Feb 3, 2020

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు తీర్మానం



20.01.2020 : మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించింది. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, విశాఖలో సచివాలయం, రాజ్ భవన్, హెచ్‌వోడీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు -2020,  సీఆర్డీఏ రద్దు బిల్లు  పెట్టింది. రెండు బిల్లులు సభలో ఆమోదం పొందాయి. ఉదయం 11 గంటలకు మొదలైన అసెంబ్లీ రాత్రి 11 గంటల వరకు... అంటే సరిగ్గా 12 గంటలపాటు సాగింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ విపక్ష టీడీపీ... మూడు రాజధానులే ముద్దు అంటూ అధికారపక్షం వైసీపీ సభ్యులు హోరాహోరీగా తమ వాదనలు వినిపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్:  రాజధానిని ఎక్కడికీ తరలించడంలేదు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. దీనికి అదనంగా మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నాం. అమరావతి సహజమైన వేగంతో బ్రహ్మాండమైన నగరంగా అభివృద్ధి చెందుతుంది’’. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలా? అవన్నీ పక్కనపెట్టి ఒక్క అమరావతినే నిర్మించాలా?  నా వరకు నాకు రెండూ చేయాలని ఉంది. కానీ, అమరావతిని నిర్మించే ఆర్థిక శక్తి లేదు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తు లేదు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు: జగన్మోహన్‌రెడ్డిగారూ! చిన్నవాడివైనా రెండు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మూడు రాజధానులు ఎక్కడా రాణించలేదు అమరావతిని కొనసాగించాలి. అడుగడుగునా మంత్రులు, అధికారపక్ష సభ్యులు అడ్డు తగిలినా ఆయన తన ప్రసంగం కొనసాగించారు. రాష్ట్రానికి ఒక్క రాజధానే ఉండాలని టీడీపీ సిద్ధాంతమని, అమరావతిని రాజధానిగా నిర్ణయించామని.. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కూడా ప్రశంసించారు. అమరావతికి ఇప్పటి వరకు 130 సంస్థలు వచ్చాయి. నిర్మాణానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. కామధేనువులా ఉపయోగపడుతుంది. ప్రస్తుతమున్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులో కార్యక్రమాలు కొనసాగించుకుంటే.. ఆదాయం వచ్చినప్పుడు శాశ్వత భవనాలు నిర్మించుకోవచ్చు. తానీ భవనాలను టెంపరరీ అనలేదని, ట్రాన్సిట్‌ భవనాలని మాత్రమే అన్నాను.  అది అర్థం కాక తాత్కాలిక రాజధాని అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు.  జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాపై రాజకీయంగా దాడి చేసినా.. నా తర్వాత సీఎం అయినప్పుడు నేను మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేశారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి. చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? రాయలసీమ వాళ్లు 24 గంటలు ప్రయాణం చేసి విశాఖ వెళ్లాలంటే సాధ్యమా?


మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు  బిల్లులకు శాసనసభలో ఆమోదం
20.01.2020 : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏపీలో 3 రాజధానుల బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయి.
v లోకల్ జోన్లు, జోనల్ డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని వికేంద్రీకరణ బిల్లులో ప్రతిపాదించారు.
v పరిపాలన సంబంధిత వ్యవహారాలు మొత్తం విశాఖ నుంచి జరుగుతాయి. రాజ్ భవన్, సచివాలయం, విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు. శాసన కార్యకలాపాలన్నీ అమరావతిలోనే సాగుతాయి. న్యాయ సంబంధిత కార్యకలాపాలు మొత్తం కర్నూల్ నగరం నుంచి జరుగుతాయి.
v న్యాయవ్యవస్థ ఆమోదం తెలిపిన తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన.
v  సీఆర్డీఏ రద్దు బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.  సభ్యులు  ఆమోదం తెలపండంతో బిల్లు పాసయినట్లు  స్పీకర్‌ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. ఎలాంటి ఓటింగ్ లేకుండానే సభలో ఈ రెండు బిల్లు పాస్ అయ్యాయి.
మంత్రి మండలి సమావేశం: రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపు కాలాన్ని ప్రస్తుతమున్న పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కేబినెట్ పెంచింది. ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ పదేళ్లపాటు కౌలు చెల్లించాలనే గత నిర్ణయాన్ని సవరించింది. భూమి లేని పేదలకు పెన్షన్ రూ.2500 నుంచి 5 వేలకు పెంచాలని నిర్ణయం. దీని వల్ల 21 వేల కుటుంబాలకు మేలు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి : శివరామ కృష్ణన్ కమిటీ కూడా, విభజన తర్వాత ఏపీ అభివృద్ధి ఒక చోట కేంద్రీకృతం చేయవద్దని చెప్పింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలు అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో ఆహార దాన్యాగారాలను పాడు చేయొద్దని కమిటీ చెప్పింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మల్టీ క్యాపిటల్ జోన్స్ ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ సూచించారు. చంద్రబాబు నిర్ణయంతో ఆయన నిస్పృహకి గురయ్యారు. 'రాజధానిలో కనీస సౌకర్యాలను కూడా చంద్రబాబు ఏర్పాటు చేయలేకపోయారు. మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కోసం ఎకరానికి 2 కోట్ల చొప్పున లక్ష కోట్ల అంచనాలు వేశారు. 8 కిలో మీటర్ల వ్యాసంలో 53 వేల ఎకరాలలో మౌలిక సదుపాయాల కోసమే లక్ష కోట్లు అవసరం అని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిన సీఎం ఇప్పుడు మాట మార్చారు. 14 వేల కోట్లతో కొత్త సచివాలయం కోసం టెండర్లు పిలిచారు. రాజధాని కోసం ఐదేళ్లలో రూ. 5676 కోట్లు మాత్రమే చంద్రబాబు ఖర్చు పెట్టారు. బకాయిలు రూ. 2297 కోట్లు చెల్లించకుండా చేతులు ఎత్తేశారు. ఏడాదికి 1200 కోట్లు చొప్పున ఖర్చు పెడితే చంద్రబాబు గ్రాఫిక్ రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ళు పడుతుంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి ఐదు రెట్ల వేగంతో పని చేస్తే 20 ఏళ్ళలో పూర్తి అవుతుంది.
కృష్ణా, గుంటూరు జిల్లాలో 33 మంది ఎమ్మెల్యేలలో 29 మందిని ప్రజలు గెలిపించారు. రాజకీయాలలో నిజాయితీ, చిత్తశుద్ది, మంచి చేయాలనే ఆలోచన ఉండాలి. ఆర్థికంగా గడ్డు కాలంలో 8 కి.మీ కోసం లక్ష కోట్లు ఖర్చు చేయడం సమంజసమేనా. అమరావతి అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తాం. దాని టైం దానికి ఇస్తే ఇది మహా నగరం అవుతుంది. మనకు ఉన్న తక్కువ డబ్బుతో రాష్ట్రానికి మేలు చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నాం.
విజయవాడ, గుంటూరులో 2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఇంతకు ముందున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం. రూ.1100 కోట్లు ఇస్తే తాడేపల్లి, మంగళగిరి చక్కగా అభివృద్ధి చెందుతాయి. నా ఇల్లు కూడా అక్కడే ఉంది. కృష్ణా నది మీద వెళుతుంటే పరిస్థితి చూసి నాకు బాధ కలిగి రిటైనింగ్ వాల్‌కి వెంటనే డబ్బులు ఇచ్చాను. ప్రతి జిల్లాలో కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం మీద నాకు ఎలాంటి కోపం, ద్వేషం లేదు. ఆర్థిక వ్యవస్థ అవకాశాల ఆధారంగా నడుస్తుంది. మన వనరులు ఆధారంగా ప్రాధాన్యతలు ఉండాలి. ప్రజల్ని భ్రమల్లో ఉంచాల్సిన అవసరం లేదు. మరో బాహుబలి డైరెక్టర్‌ని భ్రమరావతి చేస్తా అంటూ తీసుకొచ్చి ప్రజలను మోసం చేయలేక నిజం చెబుతున్నా. లక్షా పది వేల కోట్లలో పదో వంతు ఖర్చు చేసినా పదేళ్ళలో అయినా హైదరాబాద్‌తో పోటీ పడగలం. మన పిల్లలకు అప్పుడైనా అవకాశాలు కల్పించగలుగుతాం. ఇక్కడే ఉంటే ఐదేళ్ల తర్వాత మన పిల్లలకు, రాష్ట్రానికి ఏమి అవకాశాలు ఇవ్వగలమో ఆలోచించుకోవాలి. ఇక్కడ చేయడానికి శక్తి చాలదు, అక్కడ చేయకపోతే అవకాశాలు ఏమి ఉండవు. ఐదేళ్ల తర్వాత ఇక్కడే డబ్బు ఖర్చు చేస్తే మన పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పోవాలి. బాధ్యతగా నిర్ణయాలు తీసుకోకపోతే మనం పూర్తిగా నష్టపోతాము. చంద్రబాబుకి తాను కొనుగోలు చేసిన భూముల మీదే ధ్యాసంతా ఉంది. రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడే చట్టాలు చేస్తాం. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలకు అభివృద్ధి చేస్తాము. ఇక్కడ న్యాయం చేస్తూ, మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. రైతులు ఏ విధంగానూ నష్టపోయే పరిస్థితి తీసుకురాము. భూమి లేని పేదలకు 5 వేల పెన్షన్ ఇవ్వడం వల్ల 21 వేల కుటుంబాలకు మేలు కలగనుంది. అసైన్డ్ భూములు అన్నిటికి పట్టా భూములలో సమానంగా పరిహారం, ఫ్లాట్‌లు ఇస్తాం. సహజ సిద్ధంగా జరగాల్సిన అభివృద్ధి అమరావతిలో జరుగుతుంది.

చంద్రబాబు నాయుడు: ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ వెళ్తే ఎలా?   అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప... పాలనా వికేంద్రీకరణ వల్ల అది సాధ్యం కాదు. సభలో నన్ను విమర్శించడానికే సమయం కేటాయించారు. నన్ను విమర్శించినా, ఎగతాళి చేసినా పర్వాలేదు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి. అదే మా సిద్ధాంతం. విభజన చట్టంలో ఒక రాజధాని మాత్రమే ఉండాలని ఉంది. మూడు రాజధానుల గురించి ఎక్కడా లేదు. శివరామకృష్ణన్‌ నివేదికలో కూడా ఎక్కడా మూడు రాజధానులు గురించి చెప్పలేదు. 46 శాతం మంది విజయవాడ-గుంటూరు పాంతంపై మొగ్గు చూపారు. తర్వాత విశాఖ. రాజధానిగా విజయవాడ ఉండకూడదని కమిటీ ఎక్కడా చెప్పలేదు.
తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే మంత్రి బుగ్గన చదివి వినిపించారు. కమిటీ నివేదికలో చివరికి ఏం చెప్పారనేది ముఖ్యం. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెదేపా రాజధానిగా విజయవాడ-గుంటూరును ఎంచుకుంది. ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ పోతారా? ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ మాత్రం పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. చరిత్ర గురించి తెలియని వారు మాత్రమే దిల్లీ, చెన్నై రాజధానులు గురించి మాట్లాడుతున్నారు. దిల్లీ నడిబొడ్డులోనే పార్లమెంటు ఉంది. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి అనేది చేస్తేనే జరుగుతుంది. ‘‘రాజధాని తాత్కాలికం అని ఎప్పుడూ అనలేదు. ట్రాన్సిట్ అసెంబ్లీ అని మాత్రమే చెప్పాను. అసెంబ్లీ భవనం తాత్కాలికం కాదు, విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అని మాత్రమే ఉంది, రాజధానులు అని లేవు. బోస్టన్ కమిటీ రిపోర్ట్ మొత్తం బోగస్. భవిష్యత్‌లో ఐకానిక్ నిర్మాణాలు చేస్తామని చెబితే వైసీపీ వారికి అర్థం కాలేదు.

మంత్రి  బుగ్గన రాజేంద్రనాధ్ : చంద్రబాబు ప్రభుత్వం జూన్‌లో ఏర్పడింది. రాజధానిని డిసెంబరులో ప్రకటించారు.  రాజధాని ప్రకటనకు ముందే ఇప్పుడు రాజధాని ఉన్న ప్రాంతంలో 4070 ఎకరాలను టీడీపీ నాయకులు, వారి బినామీలు కొనుగోలు చేశారు.  అధికారిక సమాచారం ప్రకారం 4070 ఎకరాలు అని, వాస్తవానికి ఇంతకన్నా పెద్ద మొత్తంలో టీడీపీ నాయకులు, బినామీలు భూములు కొన్నారు.  ఇదంతా 'ఇన్‌సైడర్ ట్రేడింగ్'. ఇలా భూములు కొన్నవారిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, పల్లె రఘునాథరెడ్డి, మురళీమోహన్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, వారి బంధువులు, పుట్టా మహేష్ యాదవ్, లింగమనేని రమేశ్, జీవీ ఆంజనేయులు, వేమూరి రవి కుమార్, వేమూరి ప్రసాద్, యార్లగడ్డ రవికిరణ్, బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారు.  లంక భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు సహా ఏ భూములనూ వదిలిపెట్టలేదు. ఇది రాజధాని నిర్మాణమా, రియల్ ఎస్టేట్ వ్యాపారమా? బ్రిటిష్ పాలనలో కోట్ల రూపాయల పన్ను వసూళ్లు లండన్ తరలించి మహా సౌధాలు నిర్మించుకున్నారు. భారతీయులు కనీస అవసరాలకు నోచుకోక పోరాటం చేయాల్సి వచ్చింది. ఆధునిక కాలంలో పాలకులు అలాంటి పొరపాట్లు చేయకూడదు. శ్రీ కృష్ణ దేవరాయలు హయాంలో ఎక్కడా పెద్ద కోటలు నిర్మించలేదు, కానీ అప్పుడు తవ్విన చెరువులు ఇప్పటికీ ఉన్నాయి.

పయ్యావుల కేశవ్ : అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బినామీ చట్టం కింద బినామీ ఆస్తులను కేంద్ర చట్ట ప్రకారం ప్రభుత్వానికి అటాచ్‌ చేద్దామా? రాజధానిలో ఇల్లు ఉండాలని భూమి కొనడం తప్పా? నా కుమారుల పేరుతోనే అక్కడ భూమి కొన్నాను.  బినామీ పేర్లతో కాదు. మీరు చెబుతున్న బినామీ భూముల జాబితాను కేంద్రానికి పంపి, ఆ భూములు అమ్మి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇవ్వండి.

17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వాళ్లలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు , నిమ్మకాయల చినరాజప్ప, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, రామకృష్ణ ప్రసాద్, బాల వీరంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్ తదితరులు ఉన్నారు.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిన శాసనమండలి చైర్మన్‌
22.01.2020:  పరిపాలన వికేంద్రీకరణ - ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లుతోపాటు సీఆర్డీయే రద్దు బిల్లును మండలి చైర్మన్‌ షరీఫ్‌ మొహ్మద్ అహ్మద్ సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. రూల్‌ 154 ప్రకారం తనకు లభించిన విచక్షణాధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
చైర్మన్‌ నోటి నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఒక మంత్రి సైగ చేయగానే... వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ చైర్మన్‌ వద్దకు వెళ్లి ఆయన వద్ద ఉన్న పేపర్లను లాక్కొని ముక్కలు ముక్కలుగా చించారు. మరో వైపు నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ చైర్మన్‌ సీటు వద్దకు వెళ్లి రెండు చేతులతో ఆయన కదలకుండా కట్టడి చేశారు. ఈలోపు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కొడాలి నాని టేబుల్‌ పైకి ఎక్కి చైర్మన్‌ ముందు ఉ న్న బల్లను చేతులతో చరుస్తూ ఆగ్రహం ప్రదర్శించారు. బల్లపై ఉన్న శాసన మండలి ప్రొసీడింగ్స్‌ పత్రాలను మంత్రి కొడాలి నాని వెనక్కు విసిరేశారు. మంత్రులు మోపిదేవి, బొత్స, పెద్దిరెడ్డి చైర్మన్‌ ముందు నిలబడి వేలు చూపించి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌, బుద్దా వెంకన్న, నాగ జగదీశ్వర్‌, దీపక్‌రెడ్డి తదితరులు చైర్మన్‌కు రక్షణ వలయంగా నిలబడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారికీ, వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. కొద్ది సేపటి తర్వాత టీడీపీ సభ్యులు చైర్మన్‌ను క్షేమంగా ఆయన చాంబర్‌లోకి పంపించారు. ఆ తర్వాత కూడా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. పలువురు వైసీపీ సభ్యులు చైర్మన్‌ను ఆయన పరోక్షంలో పచ్చి బూతులు తిట్టారు.
 ‘ఒరేయ్‌... తరేయ్‌అంటూ రాయడానికి వీల్లేని పదాలనూ ప్రయోగించారు. ఎంఏ షరీఫ్‌ మతాన్ని కూడా ప్రస్తావిస్తూ దూషించారు. చైర్మన్‌ను తిడుతున్న దృశ్యాలను నారా లోకేశ్‌ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా...  మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆయన వద్దకు వచ్చారు. లోకేశ్‌ చేతిలో ఫోన్‌ లాక్కోడానికి ప్రయత్నించారు. మరో ఇద్దరు మంత్రులూ వచ్చి లోకేశ్‌ను చుట్టుముట్టి, ఫోన్‌ లాక్కోవాలని చూశారు. ఈ సందర్భంగా ఆయనను కొట్టినంత పని చేశారు. యనమల రామకృష్ణుడుతోపాటు మరికొందరు ఎమ్మెల్సీలు రక్షణగా రావడంతో... లోకేశ్‌ అక్కడి నుంచి బయటపడ్డారు. సందర్శకుల గ్యాలరీలో ఉన్న శ్రీకాళహసి ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి మండలిలో ఉన్న టీడీపీ సభ్యులను బూతులు తిట్టడం కనిపించింది.

 గ్యాలరీలో హైటెన్షన్‌ : అంతకు ముందు గ్యాలరీలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందో! అది ఎక్కడిదాకా వెళుతుందోఅనే హైటెన్షన్‌! చైర్మన్‌ తన నిర్ణయం ప్రకటించకమునుపు... సభ వాయిదా పడిన సమయంలో అధికార, విపక్ష సభ్యులు వీఐపీ గ్యాలరీలో ఇరుపక్షాలకు చెందిన బడా నేతలు కూర్చున్నారు. తొలుత టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు చిన రాజప్ప, బాలకృష్ణ గ్యాలరీలో ఉన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత... అధికార పక్షానికి చెందిన సుమారు పాతికమంది ఎమ్మెల్యేలు అదే గ్యాలరీలోకి వచ్చారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా అక్కడికి వచ్చారు. వచ్చీరాగానే బాలకృష్ణను పలకరించారు. ఆయనతోపాటు సెల్ఫీ దిగారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

జగన్ పై సంపాదకీయాలు



పార్లమెంటులో ఏకంగా 22 మంది ఎంపీలు! కొత్తగా జాతీయ సలహాదారు పోస్టు సహా డజనుకుపైగా అలాంటి పదవులే ఢిల్లీలోనూ, రాష్ట్రంలోనూ! అయినా, జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ పడిపోవడమేగానీ నిలబడుతున్నట్టు కనిపించడం లేదు. జాతీయమీడియాలో వస్తున్న వార్తలు, ఆంగ్ల పత్రికల సంపాదకీయ వ్యాఖ్యలు...జగన్‌ పాలనపై వీలు దొరికినప్పుడల్లా ధ్వజమెత్తుతూనే ఉన్నాయి. ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చి, తొలి అడుగుగా ప్రజావేదికను కూల్చిన నాటినుంచీ తాజాగా రాజధాని మార్పు దాకా ముఖ్యమంత్రి జగన్‌ తీసుకొంటున్న ప్రతి చర్యా వాటి కన్నెర్రకు గురవుతూనే ఉంది. రివర్స్‌టెండరింగ్‌ విధానాన్ని ఆ పత్రిక ఈ పత్రిక అని లేకుండా అన్ని మాధ్యమాలు తూర్పారబట్టాయి. జగన్‌ కక్షసాధింపు వైఖరి.
మూడు రాజధానుల నిర్ణయంతో పరాకాష్ఠను అందుకొన్నదని తమ సంపాదకీయాల్లో ఆందోళనను వెలిబుచ్చాయి. బ్లూంబర్గ్‌ వంటి అమెరికా పత్రికలు సైతం విద్యుత్‌ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తోందని విమర్శించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకొంటూ, ఆయన ఐదేళ్లలో తలపెట్టిన ప్రాజెక్టులను, నిర్ణయాలను పూర్తిచేయడం రాష్ట్రానికే కాదు.. దేశ ప్రయోజనాలకూ మేలు చేస్తుందని ముక్తకంఠం వినిపించాయి. ఈ విషయంలో మీ తండ్రి నుంచి నేర్చుకోండిఅని ముక్తాయించాయి.
 మూడు సరికాదు
‘‘మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదు. భారతదేశానికి అమరావతి వంటి గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని అవసరం’’  - శేఖర్‌ గుప్తా
ప్రతిదీ రద్దే
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకం. తెలుగునాడును ఇంగ్లీషు నాడుగా మారుస్తున్నారు. జగన్‌ సర్కార్‌ పాలనలో రద్దుల పర్వమే కొనసాగుతోంది’’
-          సచ్చిదానందమూర్తి ద వీక్‌ సహ సంపాదకుడు
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా
‘‘రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను ఉపయోగించుకుని శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న చంద్రబాబును అరెస్టు చేయడం పూర్తిగా అనవసరం. ఈ ఘర్షణాయుత రాజకీయాల వల్ల రాష్ట్రం దెబ్బతింటుంది. కక్షసాధింపే జగన్‌ ప్రధాన దృష్టిగా కనిపిస్తోంది. చంద్రబాబు మేధోజనితమైన అమరావతి ఇప్పుడు దయ్యాల నగరంగా మారే ప్రమాదం ఉన్నది. జగన్‌ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలే అమలు చేస్తే ఖజానా గుల్ల అవుతుంది. చంద్రబాబుతో సత్సంబంధాలు పెట్టుకుని రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలనుకున్న ఆయన అసంపూర్ణ కలను జగన్‌ నెరవేర్చాలి’’   (2019 సెప్టెంబర్‌ 12 సంపాదకీయం)
‘‘తరచూ విధాన నిర్ణయాలు మార్చడం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతింటుంది. అమరావతి ప్రాజెక్టు విజయవంతం అయితే దేశవ్యాప్తంగా నగరాల నిర్మాణానికి రైతులు ముందుకు వచ్చేందుకు దోహదం ఏర్పడేది. అమరావతిలో జగన్‌ నిర్మాణాలను పూర్తి చేయాలి. వాటిని అసంపూర్తిగా ఆయన మిగల్చరాదు. ఇది దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపిస్తుంది’’  (2020 జనవరి 20 సంపాదకీయం)
  ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌
‘‘చంద్రబాబు వారసత్వాన్ని జగన్‌ చెరిపివేసే బదులు సుపరిపాలనా ఎజెండాను అమలు చేయాలి. విద్యుత్‌ ప్రాజెక్టుల రద్దు, పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌, అమరావతి లో నిర్మాణాలను వందరోజుల్లోనే నిలిపివేయడం దారుణం. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వెనక్కు వెళ్లడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి మంచి పరిణామం కాదు’’ (2019 సెప్టెంబర్‌ 13 సంపాదకీయం)
‘‘జగన్‌ మద్య అమ్మకంవిధానం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది. మద్యం కొరతగా మారినంత మాత్రాన ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా పోరు. దీని వల్ల చీప్‌ లిక్కర్‌ వినియోగం పెరుగుతుంది’’
(2019 నవంబర్‌ 25 సంపాదకీయం)
‘‘అమరావతి ఆలోచనను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్‌ ఉద్దేశమైతే అది అసమర్థ నిర్ణయం అవుతుంది. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మూడు రాజధానుల మధ్య వందలాది కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీని వల్ల రోజువారీ కార్యకలాపాలు దుర్భరంగా మారుతాయి’’
(2020 జనవరి 23 సంపాదకీయం)
 ఎకనమిక్‌ టైమ్స్‌
‘‘జగన్‌ ప్రభుత్వానిది తిరోగామ దృక్పథం. అమరావతి ప్రాజెక్టును రద్దు చేయడం దేశంలో పట్టణాభివృద్ధినే దెబ్బతీసే విధానం. ఇంకా యువకుడైన జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబు చేపట్టిన ఐటీ హబ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి చేపట్టిన యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వంటి ప్రాజెక్టులను అఖిలేశ్‌ ఎలా పూర్తి చేశారో తెలుసుకోవాలి. ఒక వినూత్న పద్ధతిలో భూసేకరణ జరిపిన చంద్రబాబు కృషిని కొనసాగించి అమరావతి రాజధాని నగరం దేశానికే ఆదర్శంగా మార్చి ఉండాల్సింది. జగన్‌ విధ్వంసక పంథాలో సాగుతున్నారు. చంద్రబాబు నిర్మించిన అధునాతన కన్వెన్షన్‌ సెంటర్‌ సహా రూ. 50వేల ప్రాజెక్టులను నిలిపివేశారు. ఇది చెత్త రాజకీయం’’  (2019 నవంబర్‌ 15 సంపాదకీయం)
‘‘మౌలికసదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కేంద్రం క్రియాశీలక పాత్ర పోషించాలి. విద్యుత్‌ ప్రాజెక్టుల రద్దు, అమరావతి ప్రాజెక్టు రద్దు వంటి అవివేకమైన నిర్ణయాలు జగన్‌ సర్కార్‌ అమలు చేయకుండా జోక్యం చేసుకోవాలి’’ (2019 సెప్టెంబర్‌ 3 సంపాదకీయం)
‘‘ఆంధ్రా సీఎం.. అమరావతిని చంపొద్దు. రాజకీయ కక్ష సాధింపుకోసం రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయవద్దు. దేశంలో పెట్టుబడుల వాతావరణానికి హాని కలిగించవద్దు. దేశంలో అభివృద్ధికి కేంద్రాలుగా కొత్త నగరాలు ఏర్పడాలి. అలా ఏర్పడుతున్న ఒక నగరాన్ని వధించడం క్షమించరాని, బాధ్యత రహితమైన చర్య’’
 (2019 సెప్టెంబర్‌ 12 సంపాదకీయం)
‘‘ఉద్యోగాలను స్థానికులకే రిజర్వు చేయడమనేది ఘోరమైన ఆలోచన. ఒకే భారత దేశం..ఒకే మార్కెట్‌ ఉండాలన్న ఉద్దేశంతోనే జీఎస్టీని ప్రవేశపెట్టారు. కానీ జగన్‌ సర్కార్‌ ఈ ఆలోచనను చంపేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ ప్రాతిపదికను కూడా ఈ నిర్ణయం కాలరాచింది. ఇది ఒక ప్రమాదకరమైన నిర్ణయం’’  (2019 జూలై 24 సంపాదకీయం)
బిజినెస్‌ స్టాండర్డ్‌
జగన్‌ తన చపలచిత్త స్వభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గండి కొడుతున్నారు. ఇంధన ప్రాజెక్టులను రద్దు చేయడం అంతర్జాతీయంగా వివాదాలకు కారణమవుతుంది.  (2019 నవంబర్‌ 26 సంపాదకీయం)
‘‘నిర్మాణమవుతున్న రాజధాని ప్రాజెక్టును రద్దు చేసి మూడు రాజధానులను ప్రకటించడంలో ఎలాంటి హేతుబద్ధత లేదు. దీని వల్ల మూడు రాజధానుల చుట్టూ తిరగడానికి ప్రజలకు భారీ ప్రయాణ ఖర్చులు భరించాల్సి వస్తుంది. సమగ్రాభివృద్ధి దెబ్బతింటుంది. రియల్‌ఎస్టేట్‌ ప్రయోజనాలు నెరవేర డం మినహా జరిగేది ఏమీ లేదు. ఇప్పటివరకూ జగన్‌ తీసుకున్న నిర్ణయాలన్ని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసేవే. రైతులకు జరిగిన నష్టాన్ని, పరిహారాన్ని జగన్‌ ఎలా చెల్లిస్తారు? చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాల కూల్చివేత వంటి చర్యలు వ్యాపార సంస్థలను నిరుత్సాహపరుస్తాయి’’  (2020 జనవ రి 24 సంపాదకీయం)
ద టెలిగ్రాఫ్‌
‘‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మీడియాకు పూర్తి స్వేచ్చ ఉండాలి. వాటిపై కేసులు పెట్టేందుకు అధికారులను ప్రోత్సహించడం సరైంది కాదు. ఇప్పటికే అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సూచికల్లో దేశం ఎంతో వెనుకబడి ఉంది. నియంతృత్వ పోకడలను వెంటనే మానుకోవాలి’’
 (2019 నవంబర్‌ 15 సంపాదకీయం)
 ద హిందూస్థాన్‌ టైమ్స్‌
‘‘రాజకీయ కారణాలతో అమరావతి ప్రాజెక్టుపై శీతకన్ను వేయడం సరైంది కాదు. భారీ ఎత్తున ప్రజాధనం వృధా అయ్యేందుకు జగన్‌ బాధ్యత వహించాలి. అమరావతి కోసం సేకరించిన భూమి ఏమవుతుందో చెప్పాలి. తన వ్యక్తిగత ఆకాంక్షలకోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీయరాదు’’
 (2019 సెప్టెంబర్‌ 12 సంపాదకీయం)
బ్లూంబర్గ్‌ (అమెరికా)
‘‘లక్షలాది కోట్ల మేరకు పెట్టుబడులతో సాగుతున్న విద్యుత్‌ ప్రాజెక్టులు, అమరావతి ప్రాజెక్టులను రద్దు చేసి, పోలవరం రీటెండరింగ్‌కు వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌ లోనే కాదు, మొత్తం దేశంలోనే పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుంది’’   (2019 నవంబర్‌ 27 సంపాదకీయం)
ద హిందూ
‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న అవకతవక నిర్ణయాలు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. వొడాఫోన్‌ సంస్థ దేశంలో కొనసాగడం కష్టమైంది. సింగపూర్‌ కన్సార్టియం అమరావతి నుంచి వెనక్కు వెళ్లింది. ఇంధన ప్రాజెక్టులు ఉనికికోసం పోరాడుతున్నాయి’’ (2019 నవంబర్‌ 14 సంపాదకీయం)
ద హిందూ బిజినెస్‌ లైన్‌
‘‘మూడు రాజధానుల ఆలోచన అమలు అంత తేలిక కాదు. రైతుల ఆందోళనను పట్టించుకోవాలి. అమరావతి దెబ్బతినకుండా చూసుకోవాలి’’   (2019 డిసెంబర్‌ 21 సంపాదకీయం)
ద ట్రిబ్యూన్‌ (చండీగఢ్‌)
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్నే లక్ష్యంగా పెట్టుకుని నిర్ణయాలు జరుగుతున్నాయి. కీలకమైన ప్రాజెక్టులను రద్దు చేయడం, చంద్రబాబును అరెస్టు చేయడం సరైంది కాదు. మూడువేల కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రయాణించొచ్చు కానీ, పరిపాలన లో మాత్రం ప్రజాస్వామ్య బద్ధంగా ప్రయాణించాలి’’


ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న శాసన మండళ్లు

       రాష్ట్రం మండలి
        సభ్యుల సంఖ్య
1
ఆంధ్రప్రదేశ్‌   
58
2
ఉత్తరప్రదేశ్‌   
100
3
మహారాష్ట్ర    
78
4
కర్ణాటక       
75
5
బీహార్‌
75
6
తెలంగాణ    
40




v భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం శాసన మండలి ఏర్పాటు చేశారు.
v ఆర్టికల్ 171 ప్రకారం శాసన మండలి సభ్యులు శాసనసభ సభ్యులకు మూడవ వంతు మించి ఉండరాదు. ఆ ప్రకారం ఏపీ మండలి సభ్యుల సంఖ్య 58.
v జూలై 1, 1958న దీనిని ఏర్పాటు చేశారు.
v మే 31, 1985న రద్దు చేశారు.
v మార్చి 30, 2007న పునరుద్దరించారు.
v ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పార్టీల బలాబలాలు..
v టీడీపీ: 28  -  వైసీపీ: 9  - స్వతంత్రులు :3 - పీడీఎఫ్‌: 5 – నామినేటెడ్ :8  బీజేపీ: 2 - ఖాళీలు: 3 - మొత్తం: 58
v టీడీపీ నుంచి శివనాథరెడ్డి, పోతుల సునీత వైసీపీకి మద్దతు ఇచ్చారు. డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పార్టీకి దూరంగా ఉన్నారు.  
v టీడీపీకి మద్దతు పలికేవారు 34 మంది.    




       

1.     కౌన్సిల్స్‌ను రద్దు చేసి తిరిగి ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీలలో తీర్మానం చేసిన రాష్ట్రాలు
        1. అస్సాం
        2. మధ్యప్రదేశ్‌
        3. పంజాబ్‌
        4. తమిళనాడు
        5. పశ్చిమ బెంగాల్‌

2.    కొత్తగా కౌన్సిల్‌ పెట్టుటకు తీర్మానం చేసిన రాష్ట్రాలు
        6. ఢిల్లీ
        7. హిమాచల్‌ప్రదేశ్‌
        8. ఒడిషా
        9. రాజస్థాన్‌
        10. ఉత్తరాఖండ్‌
గమనిక : 10 రాష్ట్రాలు కౌన్సిళ్లు కావాలని కేంద్రాన్ని కోరుతుంటే, ఏపీ కౌన్సిల్‌ రద్దు తీర్మానాన్ని కేంద్రం ఎలా ఆమోదిస్తుంది?

v అస్సాం కౌన్సిల్ బిల్లు 2013 ని రాజ్యసభలో డిసెంబర్ 3, 2013న ప్రవేశ పెట్టారు.
v మధ్య ప్రదేశ్  కౌన్సిల్ ఏర్పాటుకు 1967లో శాసనసభలో రిజల్యూషన్ పాస్ చేశారు. ఇది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది.
v పంజాబ్ లో కౌన్సిల్ ని జనవరి 1, 1970న రద్దు చేశారు.
v తమిళనాడు కౌన్సిల్ 1861లో ఏర్పాటు చేశారు. 1986లో రద్దు చేశారు. దానిని మళ్లీ పునరుద్దరించాలని ఫిబ్రవరి 20, 1989న, జూలై 26, 1996న, 2012లో  శాసనసభలో రిజల్యూషన్స్  ఆమోదించారు. దానిని రాజ్యసభ ఆ బిల్లుని డిఎంకె వ్యతిరేకించింది.
v పశ్చిమ బెంగాల్ లో 1969లో కౌన్సిల్ ని రద్దు చేశారు. 42 ఏళ్ల తరువాత జనవరి 20, 2013న దానిని పునరుద్దరించాలని శాసనసభలో తీర్మానం చేశారు.
v ఒడిషాలో కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సెప్టెంబర్ 7, 2018న రిజల్యూషన్ ఆమోదించారు.

రాజధాని అమరావతి – మూడు రాజధానులు



            రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఎటువంటి వివాదాలకు తావులేకుండా అమరావతిని ఎంపిక చేశారు. దానిని ప్రతిపక్షం, అధికార పక్షం, అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నియమించిన శివరామకృష్ణణ్  కమిటీ ముందు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి అత్యధిక మంది ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని కావాలని కోరారు. మొత్తం 4,728 మంది తమతమ అభిప్రాయాలు తెలియజేయగా, వారిలో 2191 మంది విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని గత ప్రభుత్వం శాసనసభలో అమరావతిని రాజధానిగా తీర్మానించింది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీజేపీతోపాటు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చంద్రబాబు నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది.   ఈ పరిస్థితులలో ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి వినయంగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నవరత్నాలు, ప్రత్యేక హోదా సాధిస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి గెలిచాడు. గెలిచిన తరువాత అతని కుట్రని, కక్షని, కుళ్లుని బహిర్గతం చేస్తూ విశ్వరూపంతో రాక్షస పాలనకొనసాగిస్తున్నాడు. విచిత్రంగా, వికృతంగా తుగ్లక్ లా రాజధానిని మూడు ముక్కలు చేయడానికి పూనుకున్నాడు. ఐక్యంగా ఉన్న రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి  ప్రాంతీయ తత్వాన్ని ప్రేరేపిస్తున్నాడు. 29 గ్రామాలకు చెందిన 28,538 మంది రైతులు ముందుకు వచ్చి 34,395 ఎకరాలు రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని తమ ప్రాంతంలో వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెంది, తమ బిడ్డల భవిష్యత్ బాగుంటుందన్న ఆశతో రైతులు భూములు ఇచ్చారు.  ఇప్పుడు ఆ రైతులను ఈ ప్రభుత్వం వేధించడం మొదలు పెట్టింది. మంత్రుల చేత వారిని అవహేళన చేసే విధంగా మాట్లాడిస్తున్నాడు. చారిత్రకంగా ఎంతో పేరు కలిగిన ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రాంతాన్ని కూడా కించపరిచే విధంగా ఎడారి, శ్మశానం అని మాట్లాడిస్తున్నాడు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని ఆందోళన చేస్తున్న మహిళలు, రైతులపైన అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. మహిళలని కూడా చూడకుండా పోలీసుల చేత కొట్టిస్తున్నాడు. నియంతలా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశాడు. భయానక వాతావరణం సృషించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిగా అమరావతిని కోల్పోవడం అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకంటే దురదృష్టకరమైనది మరొకటి ఉండదు.
                      ఇప్పటికే ఇక్కడ నిర్మించిన సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టు భవనాలు, రోడ్లు, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం, 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలకు 5,024 ఫ్లాట్లు,  నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలను చూసి ఈ ప్రాంత రైతులు తమ కలలు ఫలిస్తున్నాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆనందించారు. ఎన్నికల ముందు వరకు అమరావతిలో 29 గ్రామాలతోపాటు విజయవాడ-గుంటూరు మధ్యన నిర్మాణ రంగం ఊపందుకుంది. లక్షల మంది నిర్మాణ నిపుణులు, కార్మికులతో ఈ ప్రాంతం అంతా కళకళలాడుతూ ఉండేది. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు రంగంలో వందల భవనాల నిర్మాణం జరుగుతూ ఉండేది. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల నిర్మాణం పూర్తి అయి తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.  అమృత యూనివర్సిటీతోపాటు మరికొన్ని ప్రైవేటు సంస్థల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.   రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇంజనీర్లు, నిర్మాణ రంగ నిపుణులు, కూలీలు ఇక్కడ  ఉపాధి పొందారు. దాదాపు పది వేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి ఎంతో అభివృద్ధి చెందుతోంది. కొత్త ప్రభుత్వం ఒక్కసారిగా పనులు నిలిపేయడంతో నిపుణులు, కార్మికులు ఎటువారు అటు వెళ్లిపోయారు. మన రాష్ట్రం వారు కూడా పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఆ ప్రభావం ప్రైవేటు రంగంలోని నిర్మాణాలపై పడింది. ఆ రంగం కుదేలైపోయింది. దానికి చావు దెబ్బతగిలింది.  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు ఒక్కొక్కరుగా వెనక్కు వెళ్లిపోతున్నారు.  అన్ని రకాలుగా ఈ ప్రాంతం అథోగతిలోకి కూరుకుపోయింది. అన్ని రకాల వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయింది. ప్రజల జీవనం అతలాకుతలం అయిపోయింది.  ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.  చట్టబద్దతలేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీఎన్ రావు, బోస్టన్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు ఇచ్చిన తూతూమంత్రం నివేదికలతో రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నట్లు ప్రకటించి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించింది.
                పరిపాలనా రాజధాని విశాఖలో పెట్టడం వల్ల అక్కడి వాతావరణ పరిస్థితులతోపాటు ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. హుధూద్ తుపాను వల్ల విశాఖకు రూ.22వేల కోట్లు నష్టం వాటిల్లింది. నీటి లభ్యత లేదు. వాతావరణ పరిస్థితులతోపాటు  సముద్ర తీరం, నక్సల్స్ ప్రాభావం ఉన్న రాష్ట్రాలకు దగ్గరగా ఉండటం,  ఇతర రక్షణ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. రాజధాని అనేది శాశ్వితమైనది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చేది కాదు.  ఎన్నో అంశాలను దృష్టిలోపెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అమరావతిని ఆ విధంగానే నిర్ణయించారు. అభివృద్ధి వికేంద్రీకరణను దృష్టిలోపెట్టుకొని చూసినా ఇప్పటికే విశాఖ ప్రాంతం ఉక్కు ఫ్యాక్టరీ, నేవీ, పోర్ట్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు  ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి వాటితో ఎంతో అభివృద్ధి చెందింది. సచివాలయం కూడా అక్కడ పెడితే జన సాంద్రత పెరిగిపోయి ప్రజల జీవనానికి ఇబ్బందులు ఎదురవుతాయి. విశాఖలో ఉన్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వ భారీ సంస్థలు కృష్ణా, గుంటూరు జిల్లాలలో లేవు. రాజధాని ఇక్కడే అటు ఆరు జిల్లాలు, ఇటు ఆరు జిల్లాలతో రాష్ట్రానికి మధ్యలో కొనసాగిస్తే ఈ ప్రాంతం దానంతటదే అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై పెట్టడానికి అవకాశం ఉంటుంది. విశాఖలో సచివాలయం పెట్టడం వల్ల రాయలసీమ వాసులకు హైదరాబాద్ ను మించిన దూరం అవుతుంది. హిందూపురం నుంచి హైదరాబాద్ కు 464 కిలో మీటర్లు, విశాఖకు 915 కిలో మీటర్లు. కుప్పంకు 950 కిలోమీటర్లు.  రాయలసీమ జిల్లావాసులకు సచివాలయం దూరాభారం అవుతుంది. వారికి ఇదో కొత్త సమస్య వచ్చి పడింది. ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా అన్నివిధాల సౌకర్యవంతంగా ఉన్న అమరావతి నుంచి సచివాలయాన్ని మార్చడం సమంజసం కాదు. ఈ మార్పు వల్ల అనేక చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.
                 నెల రోజులకు పైగా అఖిల పక్షం ఆధ్వర్యంలో  రైతులు, ప్రజలు చేస్తున్న ఆందోళనలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వ ధోరణిలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘జగన్మోహన్‌రెడ్డిగారూ! చిన్నవాడివైనా రెండు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మూడు రాజధానులు ఎక్కడా రాణించలేదు. అమరావతిని కొనసాగించాలి’’ అని వేడుకున్నా వినలేదు. శాసనసభలో 175 స్థానాలకు వారికి 151 స్థానాలు ఉండటంతో ఆ బిల్లులు ఆమోదం పొందాయి. శాసన మండలిలో 53 స్థానాలకు  టీడీపీకి 29 మంది సభ్యులు ఉండటం, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు మద్దతు, అది పెద్దల సభ అయినందున అక్కడ ఆ బిల్లులను చర్చించి సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా బిల్లులు ఆమోదం పొందడానికి అయ్యే ఆలస్యాన్యి వైసీపీ వారు భరించలేకపోయారు.   ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏకంగా జనవరి 27న శాసన మండలినే రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేసింది.  
-----------------------------




జగన్ ఒక్క దెబ్బతో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాడు: మోహన్ దాస్ పాయ్


12.11.2019 :
v అమరావతి రాజధాని స్టార్టప్ ఏరియా కాంట్రాక్టును ఆంధ్రప్రదేశ్ రద్దు చేసుకుని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ ను దెబ్బతీశారు. ఈ రోజు సింగపూర్ ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజక్టును రద్దు చేసుకోవడం మీద వచ్చిన ప్రకటన అనంతరం ఆయన ఇలా స్పందించారు. సింగపూర్ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా ఈ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసేందుకు ఏర్పాటయిన సింగపూర్ కన్సార్షియమ్ పరసర్పరాంగీకరాంతోనే కాంట్రాక్టును రద్దు చేసుకున్నాయని సింగపూర్ ట్రేడ్ రిలేషన్స్ మంత్రి ఎస్ ఈశ్వరన్ పేర్కొన్నా అది అంత సుహృద్బావ వాతావరణంలో జరిగి ఉంటుందని ఎవరూ అనుకోరు.ఎందుకంటే, కన్సార్టియమ్ కొన్నిమిలియన్ల డాలర్లను కోల్పోయిందని మంత్రి స్పష్టంగా రాశారు.
v ఈ నేపథ్యంలో పాయ్ తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి స్టార్టప్ ఇన్ ఫ్రా వర్క్ రద్దుచేసుకుంది. సింగపూర్ సంస్థ వెనక్కి వెళ్లిపోయింది. ఇదే మాత్రం మంచిది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ కు దుర్వార్త. హరాకిరి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సింగిల్ హ్యాండెడ్ గా ఎపి మీద ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీశారు. ఉద్యోగాలు దెబ్బతిన్నాయి. అభివృద్ధి పోడిపోయింది. ఇక ఇన్వెస్టర్ ఇందుకు అక్కడ పెట్టుబడులు పెడతారు. దురదృష్టం. అని ఆయన వ్యాఖ్యానించారు.
16.08.2019
v కర్నాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, పలు కంపెనీల స్వతంత్ర డైరెక్టర్,  ఆర్యన్ క్యాపిటల్ అధినేత, అక్షయపాత్ర సహ వ్యవస్థాపకుడు  మోహన్ దాస్ పాయ్ ట్వీట్‌ :
v ఏపీ ప్రభుత్వం పీపీఏల సమీక్షపైన తీసుకున్న నిర్ణయాలపైన ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జపాన్ కంపెనీలు లేఖ రాసిన తర్వాత అయినా నిర్ణయం మార్చుకోవాల్సింది. ప్రభుత్వమే ఈ విధంగా వ్యవహరిస్తే ఏపీకీ పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమలను దెబ్బ తీసి ఏపీని కుప్ప కూల్చేలా వ్యవహరిస్తున్నారు. ఏపీ భవిష్యత్ ను ముఖ్యమంత్రి జగన్ నాశనం చేస్తున్నారు.
v కేంద్ర ప్రభుత్వం..జపాన్ కంపెనీలు సైతం.. ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించినప్పటి నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తొలుత కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తరువాత నేరుగా కేంద్ర మంత్రి దీని పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పవర్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి.
v జపాన్ కంపెనీలు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాసింది. ఏపీ ప్రభుత్వం లో పీపీఏల మీద సమీక్ష చేస్తే వ్యాపార పరంగా ఇబ్బందులు వస్తాయని అభ్యంతరం వ్యక్తం చేసింది.