Mar 20, 2018

20.03.2018 మంగళవారం – శాసనసభ మీడియా పాయింట్



తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
◆ ప్రత్యేక ప్యాకేజి పాచిపోయిన లడ్డు అన్న పవన్, ఇప్పుడు మళ్లీ ప్యాకేజీ అడుగుతున్నాడు.
◆ స్క్రిప్ట్ BJP ది, యాక్షన్ పవన్ ది.
◆ అవిశ్వానికి మద్దతు కూడగడతాను అన్నాడు, ఇప్పుడు తప్పించుకుంటున్నాడు.
◆ TDP ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది.
◆ పోలవరం అవినీతిని గురించి 4 సం,, నుండి ఎందుకు మాట్లాడలేదు.
◆ దమ్ముంటే అవినీతి నిరూపించండి, చర్యలు తీసుకుంటాము.
◆ మోడీ పన్నిన కుట్రలో పావులు కావద్దు.
◆ నిధులు ఇవ్వమంటే BJP వాళ్ళు మామీద దాడులు చేస్తున్నారు.
◆ BJP కుట్రలు, విద్రోహాలకు పాల్పడుతుంది.
◆ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నంబర్ 1 లో ఉంటే ఇప్పుడు 19 వ స్థానంలో ఉంది.
◆ జగన్ ఆత్మ అయిన విజయసాయిరెడ్డి ప్రధాని, ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
◆ A1, A2 లను తన చుట్టూ త్రిప్పుకోవడంలో లాలూచి ఏమిటి?
◆ ఒక ప్రక్క NDA, BJP లపై అవిశ్వాసం పెడతానంటూ, ప్రధాని కార్యాలయం చుట్టూ తిరగడం ప్రజలను మోసం చేయడం కదా?
◆ వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
◆ 5 కోట్ల ప్రజలు చంద్రబాబు వెంటే ఉన్నారు.
◆ రాష్ట్ర ప్రయోజనాల కోసం అలసి పోకుండా పోరాటం చేస్తున్నాం.
◆ ప్రశాంత్ కిశోరె ఇక్కడ జగన్ కు అక్కడ BJP కి సలహాలు ఇస్తున్నారు.
◆ అక్కడ జరిగేది ఇక్కడ జగన్ కు చేరవేస్తున్నాడు.
◆ PK (ప్రశాంత్ కిషోర్) ఎన్ని సలహాలు ఇచ్చినా పీకేది ఏమి లేదు.
----------------------------------------------------------
20.03.2018  మంగళవారం – మీడియా పాయింట్
పాలకొల్లు MLA డాక్టర్ నిమ్మల రామానాయుడు

◆ పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే, 5 కోట్ల మంది ప్రజలది ఒక తీరు, పవన్ ది ఒక తీరు లాగా ఉన్నది.
◆ పవన్ కు అవగాహన, నిలకడ లేదు.
◆ 2017 మార్చి తరువాత ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమి అని చెప్పి, 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించారు.
◆ పోలవరం ప్రాజెక్ట్ పై విచారణ చేయమని పవన్ అడుగుతున్నారు.
◆ గోదావరి జలాలతి రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయడానికి చంద్రబాబు గారు ప్రతి సోమవారం ను పొలవారం గా మార్చుకున్నారు.
◆ 2019 నాటికి పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు పట్టుదల తో ఉన్నారు.
◆ పవన్ మాటలు రైతులకు నష్టం కలిగిస్తాయి.
◆ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
◆ ఈ విషయాన్ని పవన్ గ్రహించాలి.
◆ దేశంలో 24 జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
◆ పశ్చిమ బెంగాల్ లో తీస్తా అను ప్రాజెక్టును ప్రారంభించి 20 సం,, అయినది. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు.
◆ లక్ష కోట్లు తిన్న A1 ముద్దాయి జగన్, A2 విజయసాయిరెడ్డి ల గురించి పవన్ మాట్లాడారు.
◆ జగన్ కేసులపై ఒక్క మాట కూడా మాట్లాడరు.
◆ ఈ వయస్సులో రాష్ట్రం కోసం చంద్రబాబు ఎంతో కాస్త పడుతున్నారు.
◆ 34 సం,, వయస్సులో లోకేష్ కుటుంబాన్ని వదలి తండ్రితో కలసి శ్రమిస్తున్నారు.
◆ పవన్ ద్వంద వైఖరి అవలంభిస్తున్నారు.
◆ పవన్ KCR కు 6 మార్కులు, చంద్రబాబు కు 2 1/2మార్కులు వేశారు.
◆ 16 వేలకోట్ల రెవిన్యూ లోటు ఉన్నా కనబడనీయకుండా పరిపాలన సాగిస్తున్నారు, అటువంటి చంద్రబాబు కు రెండు మార్కులు ఎలా వేస్తారు.
◆ 26 వేల కోట్ల రైతు రుణాల, 10 వేళా కోట్ల డ్వాక్రా రుణాలు ఫింఛన్ల పెంపు, నిరంతర విద్యుత్తు చంద్రన్న భీమా వంటి పథకాలతో అద్భుత పరిపాలన చేస్తున్నారు.
◆ పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, రెండంకెల వృద్ది తో ముందుకు పోతున్నారు.
◆ పవన్ వాస్తవాలు మాట్లాడాలి, అలా కాకపోతే 5 కోట్ల మంది ఆంధ్రులకు, 15 కోట్ల మంది తెలుగు వారికి దూరమవుతారు.
---------------------------------------------------------
20.03.2018  మంగళవారం – మీడియా పాయింట్
PDF  MLC కత్తి నరసింహ రెడ్డి

◆ రాష్ట్రంలో 250 గ్రామీణ పశువైద్య శాలలను అప్ గ్రేడ్ చేయమని, 1200 పశు వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఈ విషయమై సభలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాము. సంబంధిత మంత్రి సానుకూలంగా స్పందించారు, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
◆ 01.09.2004 తరువాత ఎయిడెడ్ కాలేజీలు, పాఠశాలల సిబ్బందికి పాత, కొత్త పెన్షన్ విధానంలోని ఏ విధానంలోనూ పెన్షన్ వర్తింపచేయడం లేదు. వారికి కూడా పెన్షన్ వర్తింప చేయాలి.
◆ ఈ నెల 22 న విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం చేపట్టారు.
◆ పార్లమెంట్ సాక్షిగా ఆ నాడు మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
◆ తెలుగుదేశం పార్టీ కూడా సహకరించి ఇందులో పాల్గొనాలని కోరుతున్నాం.
◆ తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నటులు, నటీమణులు కూడా ఆందోళన కార్యక్రమమునకు మద్దతు ఇవ్వాలి.
◆ తమిళనాడు లో జల్లికట్టు సమస్యపై తమిళ సినీ ప్రముఖులు మాట్లాడి కేంద్రం పై వత్తిడి తెచ్చారు.
◆ ఇప్పుడు మన సినీ పరిశ్రమ కూడా ముందుకు రావాలి.
--------------------------------------------------------
20.03.2018  మంగళవారం – మీడియా పాయింట్
దక్షిణ విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

◆ బీజేపీ కి అవిశ్వాసం అంటే భయం ఎందుకో తెలియటం లేదు.
◆ ప్రజల్లో బీజేపీ పై అవిశ్వాసం వచ్చింది...
◆ ప్రతి విషయం లో డివైడ్ అండ్ రూల్ పాలసీ లో బీజేపీ ఉంది.
◆ ఔట్ డేటెడ్ జగన్ ని పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసి  బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్నారు..
◆ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ని ప్రశ్నించండి..
కష్టపడి పని చేస్తున్న చంద్రబాబు గారిని కాదు..
◆ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కృషి చేస్తున్న సీఎం ని అనటం సరికాదు..
◆ పవన్ కళ్యాణ్ బీజేపీ ని నమ్మితే ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు..
◆ స్వతంత్ర ఉద్యమంలో BJP పాత్ర ఏమి లేదు.
◆ స్వాతంత్ర్య ఉద్యమం సమయంలో RSS కూడా రెండు దేశాలు కావాలని చెప్పారు, దానిని గాంధీ గారు వ్యతిరేకించారు. అటువంటి BJP  ఇప్పుడు స్వచ్ఛ భారత్ పేరుతో గాంధీ గారి  ఫోటో పెట్టుకుంటుంది.
◆ మతతత్వం ఉన్న పెద్దలు అధికారంలో ఉంటే దేశానికి చేటు అని గాంధీజీ గారు చెప్పారు.
రాష్ట్ర పాలన గాడి తప్పించాలని కుట్ర చేస్తున్నారు.
◆ జగన్ ను, పవన్ ను BJP వాడుకొంటుంది.
◆ మీరు ప్రశ్నించే ప్రతి ప్రశ్నను BJP ని వేయండి.
◆ ఇండిపెండెన్స్ డే ని బ్లాక్ డే గా జరుపుకొంది, 2017 లో మీరట్ లో జనవరి 30 గాంధీ వర్ధంతి ని డప్పులతో ఘనంగా BJP జరుపుకొంది.
-------------------------------------------------------------
20.03.2018  మంగళవారం – మీడియా పాయింట్
అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల  ఆనంద రావు

◆ 10 సం,, కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్కాం లతో అసహనానికి గురైనారు. ఇప్పుడు మోడీ అహంకారం వలన అసహనానికి గురిఅవుతున్నారు.
◆ ఏ అద్వానీ గారు దేశంలో BJP బలపడడానికి కారణమయ్యారో ఆయన నమస్కారం పెడితే కూడా మోడీ పట్టించుకోకుండా వెళ్ళాడు.
◆ కుదిరితే ప్యాకేజి ఇద్దాం, లేకపోతే బెదిరిద్దాం అన్నట్లుగా BJP ఆలోచిస్తుంది.
◆ తమిళ తంబీలతో కావాలని BJP పార్లమెంట్ లో  ఆందోనలను చేపిస్తుంది...
◆ హోదా మీద ప్రధానికి  అవగాహాన లేదు అని కిషన్ రెడ్డి అంటున్నారు... అవగాహన లేని ప్రధాని ఈ దేశానికి అవసరమా???..
◆ ఆర్ ఎస్ ఎస్ దేశ వ్యాప్తంగా ఉన్న  దళితులను, ముస్లిం లను  ఇబ్బందికి గురిచేస్తున్నారు....
◆ 36 పార్టీలతో పొత్తు పెట్టుకొని, అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నాగుపాము తన గుడ్లు తిన్నట్లుగా ప్రాంతీయ పార్టీలని ఎదగకుండా చేస్తుంది.
◆ హోదా సెంటిమెంటా, మోడీ అహంకారమా. 2019 ఎన్నికలలో ఏదీ గెలుస్తుందో చూద్దాం.
◆ BJP అంటేనే RSS ప్రభుత్వం.
TDP NDA నుండి బయటకు వచ్చిన రోజునే BJP పతనం ప్రారంభమైనది.
-------------------------------------
20.03.2018  మంగళవారం – మీడియా పాయింట్
గజపతినగరం MLA   డాక్టర్ కొండపల్లి అప్పల నాయుడు 
◆ చంద్రబాబు ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని 3 వ సారి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
◆ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంపీలు పోరాడుతుంటే రాజకీయాల్లో ఓనమాలు దిద్దని పవన్ మాట్లాడుతుంటే అశ్చ్యర్యం వేస్తుంది.
◆ ప్యాకేజి సరిపోతుంది అని పవన్ మాట్లాడటంతోనే తన చిత్తశుద్ధి ఎంటో అర్థం అవుతుంది.
◆ పవన్ కళ్యాణ్ అవగాహన తో మాట్లాడాలి.
◆ అవగాహన లేని మాటలతో,చర్యలతో
పోరాటాన్ని నిర్వీర్యం చేసేలా పవన్ వ్యవహరించద్దు.
◆ రాజకీయ అవగాహన లేని పవన్ చంద్రబాబు కు మార్కులు వేస్తారా?
◆ పవన్ ఫికెల్ మైండెడ్ ఫెల్లో అని ప్రజలు అతనికి జీరో మార్కులు వేశారు.
◆ జగన్ కి వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వళ్ళించినట్లుంది.
------------------------------------------------
20.03.2018  మంగళవారం – మీడియా పాయింట్
TDP MLC బాబు రాజేంద్రప్రసాద్.
◆ అన్ని వర్గాల వారు ప్రత్యేక హోదా మద్దతు ఇస్తుంటే సినీ పరిశ్రమ ఎందుకు ముందుకు రావడం లేదు..
◆ జల్లికట్టు కట్టు ఉద్యమాన్ని తమిళ సినీ పరిశ్రమ ముందుండి నడిపించింది..
◆ తెలుగు చిత్ర పరిశ్రమకి చావ చచ్చిపోయిందా???
◆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కవిత, కేటీఆర్ అందరూ మద్దతు ఇస్తుంటే మీకు ఏమి అయ్యింది...
◆ అవార్డులు రాకపోతే లొల్లి లొల్లి చేస్తారు......
◆ ఆంధ్ర ప్రజలకు నిధులు రావటం లేదు మీకు కనపడటం లేదా?
◆AC రూములలో కులుకుతూ కూర్చుంటారా?
◆ తమిళ నటి నటులను చూసి అయినా తెలుగు సినీ పరిశ్రమ బుద్ది తెచ్చుకోవాలి.....
◆ ఆంధ్రా గడ్డలో పుట్టిన ఒక్క హీరో అయినా రాష్ట్రం విడిపోయిన తరువాత ఈ గడ్డ మీదకి వచ్చారా....???
◆ తెలుగు సినీ పరిశ్రమ డైరెక్టర్లు హీరోయిన్ బొడ్డులు,జగణాలు గురించి వర్ణించటానికి తప్ప దేనికి పనికి రారు...
◆ మీరేమైనా హాలీవుడ్ నటులంతా గొప్పవాళ్ళా? అంతా ఏజ్ బార్ అయిన వాళ్లే.
◆ తెలుగు సినీ కళాకారులను వెలివేయడానికి 5 కోట్ల ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారు.
*****************************

No comments:

Post a Comment

నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు

నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని  1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...