సచాలయం, మార్చి 20: ఈ నెల 24 నుంచి 27 వరకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ,
శాసనమండలి సభ్యుల క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలోని శాసనసభ స్పీకర్ ఛాంబర్ లో మంగళవారం
ఉదయం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు
నిర్ణయం తీసుకున్నారు. 24వ తేదీ నుంచి 26 తేదీ వరకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. క్రికెట్, బాడ్మింటన్, టెన్నీస్, టగ్ ఆఫ్ వార్, టెన్నికాయిట్, కబాడీ, వాలీబాల్, మ్యూజికల్
చైర్, ఈత, త్రోబాల్ మొత్తం 10 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు. 27న సాంస్కృతిక
కార్యక్రమాలు నిర్వహిస్తారు. సభ్యులు
ఎవరికి ఏ క్రీడలో ప్రావీణ్యం ఉంటే అందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. సమావేశంలో
మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల
రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు,
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు
రవీంద్ర, చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి, విప్ కూన
రవికుమార్, ఇన్ చార్జ్ సెక్రటరీ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
నేను లా కోర్సులో చేరి 40 ఏళ్లు
నాగార్జున యూనివర్శిటీ (ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ)ని 1976, సెప్టెబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రూద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, గాలిగోపురం, కొండపైన పానకాలస్వామి,...
No comments:
Post a Comment