Mar 6, 2018

హామీలన్నీ అమలు చేయాలి



అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల
             సచివాలయం, మార్చి 6: రాష్ట్ర విభజన చట్టంలో, ఇతరత్రా ఇచ్చిన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఉదయం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం ఆ  హామీని నిలబెట్టుకోవాలన్నారు. మాట నిలబెట్టుకొని ప్రజా కోర్టులో మన్ననలు పొందాలని సూచించారు. తాము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నట్లు తెలిపారు. హామీలను అమలు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.  రాష్ట్రానికి నిధులు అడుగుతున్నామే గానీ రాజకీయం చేయడం లేదని చెప్పారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...