Mar 5, 2018

19 అంశాలు కేంద్రం పరిష్కరించాలి



ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్
            సచివాలయం, మార్చి 5: రాష్ట్ర విభజన చట్టంలోని వాటితోపాటు హామీ ఇచ్చిన 19 అంశాలను కేంద్రం పరిష్కరించాలని శాసనసమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద సోమవారం ఉదయం ఆయన మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ వినూత్నరీతిలో ప్రసంగించారని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వ తీరుని ఆయన అభినందించారన్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఖరిని దృష్టిలోపెట్టుకొని పాదయాత్రకంటే శాసనసభ పవిత్రమైనదన్నారు. ఏ సమస్యనైనా సభలో చర్చించి పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో ప్రతిపక్షంవారు పునరాలోచించుకోవాలన్నారు.
తానూ దళిత కులానికి చెందినవాడినేనని, ఉన్నత కులాలవారు ఎవరూ తనని ఎప్పుడు తక్కువగా చూడలేదని డొక్కా తెలిపారు. ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలసి పనిచేశానని, వాళ్లు ఇంట్లో మనిషిలా, సొంత తమ్ముడిలా చూసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడిలా గౌరవిస్తారన్నారు. లోకేష్ బాబు అన్నగా భావిస్తారని చెప్పారు.

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...